చలం పుస్తకాలు, అవి సమాజం లో కలిగించిన సంచలనం మాట ఎలా ఉన్నా, ఆయన కూదా సగటు మాగవాడిలాగానే ప్రవర్తించాడు. భార్య అందరినీ, పుట్టింటిని, బంధువులని వదులుకుని తనకోసమే ఉంటే ఆయన మాత్రం శృంగారం, అదీ ఇదీ అంటూ ఇతర స్త్రీల వెనక తిరిగాడు. చివరికి ఆవిడ మనస్తాపం చెంది చనిపోయింది కాని, అసలు ఈ రాతలు చదివి ఆవిడే విముక్తి అనుకుంటూ ఇల్లు వదిలి వెల్లిపోయి ఉంటే ఎలా ఉండేదో?
రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి
తిమ్మరసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తి
మా చెవులు రింగుమని మారుమ్రోగేదాక
నీపాటలే పాడుతాం, నీ ఆటలే ఆడుతాం
జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి ……
*** http://www.youtube.com/watch?v=JtTQPhR44Z8
***
మంచి పండితులు, రచయిత, సాహితీవేత్త, విశ్వనాథ వారికి పరమ ఆప్తులు అయిన శ్రీ జువ్వాడి గౌతమరావు గారు కాలధర్మం చెందారని విని విచారిస్తున్నాను.
విశ్వనాధవారు తమ “భ్రష్ట యోగి” ఖండకావ్యాన్ని ప్రేమతో గౌతమరావుగారికి అంకితమిస్తూ “తొలుతటి జనుస్సులందలి చెలిమికాడు” గా అభివర్ణించారు. విశ్వనాథ సాహిత్యపీఠం గౌరవాధ్యక్షులు డా. వెలిచాల కొండలరావు గారు తమ సంపాదకత్వంలో వెలువరించిన ఎందరో విద్వాంసుల వ్యాసాల సంకలనం “Viswanatha – A literary Legend“ అనే గ్రంధాన్ని శ్రీ గౌతమరావు గారికి అంకితం ఇచ్చి, వారు కదలలేని అస్వస్థతతో ఉండటంతో ఈ సభను కరీంనగర్ లో ఏర్పాటు చేసారు. ప్రధమ ప్రతిని గౌతమరావుగారి ఇంటికి వెళ్లి అచేతనంగా ఉన్న వారి చేతులకు తాకించి వారి దగ్గర ఈ గ్రంధాన్ని ఉంచారు. ఇది జరిగింది ఈ సంవత్సరం జూన్ ఆరవ తేదీన. కొండలరావుగారితో కరీంనగర్ వెళ్ళిన వాళ్ళలో నేనొకడిని. వారిని ఆ స్థితిలో చూడటం మమ్మల్నందరినీ కలచి వేసింది. వారి స్మృతికి జోహార్లు.
raanaare gaarU,If that is your resource, I can safley say that there is no doubt you are mistaken.For authenticating my explanation, let me say that I come from a family of Sanskrit teachers/ lecturers and am married into another similar family. I learnt Sanskrit as a language in high school and continued on to junior and degree college as second language.I sounded a wee bit skeptical earlier only because you seemed to have spent considerable time and effort on your research for the article and you seem to be in touch with knowledgeable people. Also, many bloggers seem to have better authority than me. I wondered why anyone wouldn’t point out such an elementary misunderstanding unless it has some percentage of truth to it somewhere.Regards,lalitha.p.s. రమా అన్నది స్త్రీలింగ శబ్దం.
నిన్న కరీంనగరం లో తన 83వ ఏట జువ్వాడి గౌతమ రావు గారు కాలం చేశారు అన్న విషయాన్ని ఈమాట వారికి తెలియజేస్తున్నాను.
విశ్వనాధ సత్యనారాయణ గారికి సన్మిత్రుడూ, రామాయణ కల్పవృక్షానికి నిత్యమూ సాగిలిపడి మొక్కిన భక్తుడూ, విశ్వనాధ సత్యనారాయణ గారి రచనలకి తన జీవిత పర్యంతమూ అండదండలని అందించినవారూ జువ్వాడి గౌతమరావు గారు. గౌతమరావు గారి చేతి రాత చాలా పొందికైనదీ అందమైనదీను. సత్యనారాయణ గారి రచనలకి లేఖకుడుగా కూడా గౌతమరావు గారు ప్రసిధ్ధులు. ఆయన గళం సహకరించినంత కాలం ఆయన సత్యనారాయణ గారి పద్యాలని తన చక్కని గొంతుతో చదివేవారు. ఆయన తెలుగు, సంస్కృతం, ఇంగ్లీషు భాషలతోనూ, ఆయా భాషలలో వచ్చిన సాహిత్యాలతోనూ సుష్తుగా పరిచయం ఉన్నవారు . కేవలం నేను కోరిన కారణానికి మృచ్చకటికం నాటకాన్ని సంస్కృతం నించి తెలుగు లోకి అనువాదాన్ని చేసి ఆ అనువాదాన్ని నాకు స్వదస్తూరితో రాసి పంపించినవారు.
1929, ఫిబ్రవరి 1న ఆయన జన్మించారు. రామమనోహర్ లోహియాకి కూడా ఆయన అత్యంత సన్నిహితుడు. తెలుగునాట రాజకీయ సభలలో, లోహియా ఉపన్యాసాలని ఆయన తెలుగులోకి వ్యాఖ్యానం చేస్తూ ఉండేవారు! రాజకీయంగా సోషలిస్టూ, సాహిత్య పరంగా విశ్వనాధ సత్యనారాయణ గారికి ఆప్తుడు మిత్రుడు భక్తుడూ సోదరుడిగా అన్నీ తానే అయిన వారు జువ్వాడి గౌతమ రావుగారు. సత్యనారాయణ గారి కల్పవృక్షాన్ని తెలుగునాట ప్రచారం చేయడానికి దాని రహస్యాలని మాట్లాడడానికీ తెలుగునేల నాలుగు చెరగులా ఆయన సదా ముందుండి నడిచినవారు. అధికార అనధికార పబ్లిసిటీ మేనేజరు అన్నమాట గౌతమరావు గారు రామాయణ కల్పవృక్షానికి.
తెలుగు సాహిత్యం విషయంలో ఆయనకి చాలా నిశ్చితాభిప్రాయాలు ఉండేవి. ఆయనకి కొందరు రచయితలు ఎంతగా నచ్చేవారో మరి కొందరు అతి ముఖ్యమైన కవిరచయితలు సైతం పెద్దగా మనసు కెక్కేవారు కారు. సాహిత్యం విషయంలో అంతటి నిక్కచ్చి మనిషి ఆయన. జీవితంలో కూడా నచ్చని వాటి విషయంలో శషభిషలు లేకుండా తన అభిప్రాయాలని చెప్పే స్వభావం కలిగిన వారు!!
నా “ది పబ్ ఆఫ్ వైజాగ పట్నం” కవితా సంకలనాన్ని నేను జువ్వాడి గౌతమరావు గారికి అంకితం చేశాను. కల్పవృక్షానికి అంతటి భక్తుడైన ఆయన నా కవిత్వం పట్ల కూడా అంతే మక్కువని చూపడం నాకు గర్వకారణంగా భావిస్తాను.
ఈమాటలో ఈ వ్యాఖ్యానం చూసి ఆశ్చర్యపోయాను. “Macintosh ఉపయోగించే పాఠకులకి యూనికోడ్ తెలుగు కనిపించకపోవడం ఈ అపవాదుకి బలం చేకూర్చింది.”. నేను ఈమాటని ఎప్పడినుంచో చదువుతున్నాను. నేను నా website లో తెలుగు Typing లింక్లో తెలుగు టైపు చేసుకోదలచిన వారికోసం 5 రకాల కీబోర్దులను వుంచడం జరిగింది. Inscript, varitype, sreelipi, DOE, Phonetic రకాలు. అలాగే రమణీయ అనే తెలుగు యూనికోడ్ ఫాంట్ వుంచడం జరిగింది. కావలసిన వారు వాడుకోవచ్చును.
I really appreciate for the information. I worked in Tamil Nadu for eight years and i used to go to Tanjore frequently.Two or three times i visited Thiruvayyar and paid respects to Tyagaraja swamy but none of our Tamil Nadu friends told me about Mrs Nagaratnamma.
You have given very good information.Thank you
jawaharlal
జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 3 గురించి BVS PRASAD అభిప్రాయం:
08/30/2012 1:15 am
నాకూ జ్యోతిష్యం లో ఆసక్తి ఉంది. ఇంతకాలం మీ బ్లాగ్ ఎలా మిస్ అయ్యనా అనిపిస్తొంది. చాలా మంచి సమాచారము అందించారు. ధన్యవాదములు. దయచేసి రాస్తూ ఉండండి.
ఇటు నేనే – అటు నేనే గురించి తః తః అభిప్రాయం:
08/29/2012 11:54 pm
‘ఇటు నేనే – అటు నేనే’ చదివిన వారందరికీ కృతజ్ఞతలు. అభిప్రాయాలు తెలియజేసిన వారికి మరిన్ని.
తః తః
చలంతో రజని ముఖాముఖి గురించి Tulasi Dadi అభిప్రాయం:
08/29/2012 4:23 pm
చలం పుస్తకాలు, అవి సమాజం లో కలిగించిన సంచలనం మాట ఎలా ఉన్నా, ఆయన కూదా సగటు మాగవాడిలాగానే ప్రవర్తించాడు. భార్య అందరినీ, పుట్టింటిని, బంధువులని వదులుకుని తనకోసమే ఉంటే ఆయన మాత్రం శృంగారం, అదీ ఇదీ అంటూ ఇతర స్త్రీల వెనక తిరిగాడు. చివరికి ఆవిడ మనస్తాపం చెంది చనిపోయింది కాని, అసలు ఈ రాతలు చదివి ఆవిడే విముక్తి అనుకుంటూ ఇల్లు వదిలి వెల్లిపోయి ఉంటే ఎలా ఉండేదో?
ఈమాట జులై 2012 సంచికకి స్వాగతం! గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:
08/29/2012 2:14 am
అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియ చేసుకుంటూ..ఇదిగో ఈ మాట లో ఈ పాటను అందిస్తూ..
జై తెలుగు తల్లి!
మా తెలుగు తల్లికి మల్లెపూదండ
మా కన్నతల్లికి మంగళారతులు,
కడుపులో బంగారు కనుచూపులో కరుణ,
చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి.
గలగలా గోదారి కదలిపోతుంటేను
బిరాబిరాక్రిష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయీ
మురిపాల ముత్యాలు దొరులుతాయి.
అమరావతినగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములొ తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలచి వుండేదాకా
రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి
తిమ్మరసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తి
మా చెవులు రింగుమని మారుమ్రోగేదాక
నీపాటలే పాడుతాం, నీ ఆటలే ఆడుతాం
జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి ……
***
http://www.youtube.com/watch?v=JtTQPhR44Z8
***
ఈమాట జులై 2012 సంచికకి స్వాగతం! గురించి C.S.Rao అభిప్రాయం:
08/26/2012 7:39 pm
మంచి పండితులు, రచయిత, సాహితీవేత్త, విశ్వనాథ వారికి పరమ ఆప్తులు అయిన శ్రీ జువ్వాడి గౌతమరావు గారు కాలధర్మం చెందారని విని విచారిస్తున్నాను.
విశ్వనాధవారు తమ “భ్రష్ట యోగి” ఖండకావ్యాన్ని ప్రేమతో గౌతమరావుగారికి అంకితమిస్తూ “తొలుతటి జనుస్సులందలి చెలిమికాడు” గా అభివర్ణించారు. విశ్వనాథ సాహిత్యపీఠం గౌరవాధ్యక్షులు డా. వెలిచాల కొండలరావు గారు తమ సంపాదకత్వంలో వెలువరించిన ఎందరో విద్వాంసుల వ్యాసాల సంకలనం “Viswanatha – A literary Legend“ అనే గ్రంధాన్ని శ్రీ గౌతమరావు గారికి అంకితం ఇచ్చి, వారు కదలలేని అస్వస్థతతో ఉండటంతో ఈ సభను కరీంనగర్ లో ఏర్పాటు చేసారు. ప్రధమ ప్రతిని గౌతమరావుగారి ఇంటికి వెళ్లి అచేతనంగా ఉన్న వారి చేతులకు తాకించి వారి దగ్గర ఈ గ్రంధాన్ని ఉంచారు. ఇది జరిగింది ఈ సంవత్సరం జూన్ ఆరవ తేదీన. కొండలరావుగారితో కరీంనగర్ వెళ్ళిన వాళ్ళలో నేనొకడిని. వారిని ఆ స్థితిలో చూడటం మమ్మల్నందరినీ కలచి వేసింది. వారి స్మృతికి జోహార్లు.
సి.ఎస్ .రావ్
ఈమాట జులై 2012 సంచికకి స్వాగతం! గురించి కామేశ్వరరావు అభిప్రాయం:
08/26/2012 2:52 am
కల్పవృక్షపు మరో పండుటాకు రాలిపోయింది 🙁
Sixty Years of Telugu Poetry : A telugu retrospective గురించి Ivay అభిప్రాయం:
08/25/2012 5:43 pm
raanaare gaarU,If that is your resource, I can safley say that there is no doubt you are mistaken.For authenticating my explanation, let me say that I come from a family of Sanskrit teachers/ lecturers and am married into another similar family. I learnt Sanskrit as a language in high school and continued on to junior and degree college as second language.I sounded a wee bit skeptical earlier only because you seemed to have spent considerable time and effort on your research for the article and you seem to be in touch with knowledgeable people. Also, many bloggers seem to have better authority than me. I wondered why anyone wouldn’t point out such an elementary misunderstanding unless it has some percentage of truth to it somewhere.Regards,lalitha.p.s. రమా అన్నది స్త్రీలింగ శబ్దం.
ఈమాట జులై 2012 సంచికకి స్వాగతం! గురించి jayaprabha అభిప్రాయం:
08/25/2012 1:13 am
ఈమాట సంపాదకులకీ, పాఠకులకీ,
నిన్న కరీంనగరం లో తన 83వ ఏట జువ్వాడి గౌతమ రావు గారు కాలం చేశారు అన్న విషయాన్ని ఈమాట వారికి తెలియజేస్తున్నాను.
విశ్వనాధ సత్యనారాయణ గారికి సన్మిత్రుడూ, రామాయణ కల్పవృక్షానికి నిత్యమూ సాగిలిపడి మొక్కిన భక్తుడూ, విశ్వనాధ సత్యనారాయణ గారి రచనలకి తన జీవిత పర్యంతమూ అండదండలని అందించినవారూ జువ్వాడి గౌతమరావు గారు. గౌతమరావు గారి చేతి రాత చాలా పొందికైనదీ అందమైనదీను. సత్యనారాయణ గారి రచనలకి లేఖకుడుగా కూడా గౌతమరావు గారు ప్రసిధ్ధులు. ఆయన గళం సహకరించినంత కాలం ఆయన సత్యనారాయణ గారి పద్యాలని తన చక్కని గొంతుతో చదివేవారు. ఆయన తెలుగు, సంస్కృతం, ఇంగ్లీషు భాషలతోనూ, ఆయా భాషలలో వచ్చిన సాహిత్యాలతోనూ సుష్తుగా పరిచయం ఉన్నవారు . కేవలం నేను కోరిన కారణానికి మృచ్చకటికం నాటకాన్ని సంస్కృతం నించి తెలుగు లోకి అనువాదాన్ని చేసి ఆ అనువాదాన్ని నాకు స్వదస్తూరితో రాసి పంపించినవారు.
1929, ఫిబ్రవరి 1న ఆయన జన్మించారు. రామమనోహర్ లోహియాకి కూడా ఆయన అత్యంత సన్నిహితుడు. తెలుగునాట రాజకీయ సభలలో, లోహియా ఉపన్యాసాలని ఆయన తెలుగులోకి వ్యాఖ్యానం చేస్తూ ఉండేవారు! రాజకీయంగా సోషలిస్టూ, సాహిత్య పరంగా విశ్వనాధ సత్యనారాయణ గారికి ఆప్తుడు మిత్రుడు భక్తుడూ సోదరుడిగా అన్నీ తానే అయిన వారు జువ్వాడి గౌతమ రావుగారు. సత్యనారాయణ గారి కల్పవృక్షాన్ని తెలుగునాట ప్రచారం చేయడానికి దాని రహస్యాలని మాట్లాడడానికీ తెలుగునేల నాలుగు చెరగులా ఆయన సదా ముందుండి నడిచినవారు. అధికార అనధికార పబ్లిసిటీ మేనేజరు అన్నమాట గౌతమరావు గారు రామాయణ కల్పవృక్షానికి.
తెలుగు సాహిత్యం విషయంలో ఆయనకి చాలా నిశ్చితాభిప్రాయాలు ఉండేవి. ఆయనకి కొందరు రచయితలు ఎంతగా నచ్చేవారో మరి కొందరు అతి ముఖ్యమైన కవిరచయితలు సైతం పెద్దగా మనసు కెక్కేవారు కారు. సాహిత్యం విషయంలో అంతటి నిక్కచ్చి మనిషి ఆయన. జీవితంలో కూడా నచ్చని వాటి విషయంలో శషభిషలు లేకుండా తన అభిప్రాయాలని చెప్పే స్వభావం కలిగిన వారు!!
నా “ది పబ్ ఆఫ్ వైజాగ పట్నం” కవితా సంకలనాన్ని నేను జువ్వాడి గౌతమరావు గారికి అంకితం చేశాను. కల్పవృక్షానికి అంతటి భక్తుడైన ఆయన నా కవిత్వం పట్ల కూడా అంతే మక్కువని చూపడం నాకు గర్వకారణంగా భావిస్తాను.
ఆయన మృతి సాహితీ రంగానికి గొప్ప లోటు.
జయప్రభ.
ఈమాట కొత్త వేషం గురించి Appaji Ambarisha Darbha అభిప్రాయం:
08/24/2012 6:07 am
ఈమాటలో ఈ వ్యాఖ్యానం చూసి ఆశ్చర్యపోయాను. “Macintosh ఉపయోగించే పాఠకులకి యూనికోడ్ తెలుగు కనిపించకపోవడం ఈ అపవాదుకి బలం చేకూర్చింది.”. నేను ఈమాటని ఎప్పడినుంచో చదువుతున్నాను. నేను నా website లో తెలుగు Typing లింక్లో తెలుగు టైపు చేసుకోదలచిన వారికోసం 5 రకాల కీబోర్దులను వుంచడం జరిగింది. Inscript, varitype, sreelipi, DOE, Phonetic రకాలు. అలాగే రమణీయ అనే తెలుగు యూనికోడ్ ఫాంట్ వుంచడం జరిగింది. కావలసిన వారు వాడుకోవచ్చును.
విద్యాసుందరి గురించి jawaharlal అభిప్రాయం:
08/24/2012 5:26 am