పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. బొంబాయిలో తెలుగు కార్యక్రమాలు గురించి ప్రసాద్ అభిప్రాయం:

    09/08/2012 1:17 pm

    అయ్యయ్యో, పాపం! అంత పెద్ద వయసు కూడా కాదు ఆయనది. వృద్ధాప్యంలో వున్న ఆయన తల్లి ఎంతగా దుఃఖిస్తారో! అయ్యో!

    ప్రసాద్

  2. బొంబాయిలో తెలుగు కార్యక్రమాలు గురించి మోహన అభిప్రాయం:

    09/08/2012 12:03 pm

    హితుడు, స్నేహితుడు రోహిణీప్రసాద్ గారి ఆకస్మిక మరణము విభ్రాంతి కలిగించినది. హిందూస్తాని సంగీతముపైన, గాయకులపైన సామాన్య పాఠకలోకానికి అర్థమయ్యేటట్లు వ్యాసాలను వ్రాసినారు వారు. విజ్ఞాన శాస్త్రాన్ని విజ్ఞులకు మాత్రమేకాక జనసామాన్యానికి తెలుగులో అందజేయాలని కృషి చేసినారు వారు. కుటుంబరావుగారి శతజయంత్యుత్సవ సందర్భముగా వారిని డిట్రాయిటులో ఒక మారు కలిసి సంభాషించినది నా మధుర స్మృతులలో ఒకటి. వారితో కలిసి ఒక వ్యాసము వ్రాయాలని అనుకొన్నఆశ ఈడేరక ఆలాగే ఉండి పోయినది. వారి ఆత్మ శాంతిల్లు గాక! విధేయుడు – మోహన

  3. మనం అనుసరించలేకపోయిన భద్రిరాజు కృష్ణమూర్తి గురించి indrani Palaparthy అభిప్రాయం:

    09/08/2012 11:29 am

    ఇప్పుడే ఈ బ్లాగులో రోహిణీ ప్రసాదు గారి గురించి ఈ విషాద వార్త చదివాను.నమ్మలేక పోతున్నాను. మీరు ఎవరైనా నిర్ధారించగలరా?

    ఇంద్రాణి పాలపర్తి.

  4. తథాస్తు గురించి ప్రసాద్ అభిప్రాయం:

    09/08/2012 11:03 am

    “ఆర్థిక పరిస్థితులు మనుషుల జీవితాన్ని, వాళ్ళ ప్రవర్తనను ఎంతగా శాసిస్తాయో ..” అన్నారు. అవును, కరెక్టే.
    అయితే, ఇది ఒక ” ఒక మంచి ఉదాహరణ” అని ఒప్పుకోలేక పోవడానికి కారణం, రచయిత, భర్త పాత్ర చేత భార్య పాత్రకి లెంప కాయ వేయించడమే. అలా కాకుండా, ఆ భర్త పాత్ర, తన భార్య మాటలకి ఆలోచనలో పడి వుంటే, ఈ కధ తప్పకుండా, ఒక ” ఒక మంచి ఉదాహరణ” అయి వుండేది.

    ప్రసాద్

  5. బొంబాయిలో తెలుగు కార్యక్రమాలు గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:

    09/08/2012 10:40 am

    ఈమాట పాఠకులకి, సంపాదవర్గానికి:

    ఈమాట కోసం ఎన్నో రచనలు చేసి పాఠక వర్గం అభిమానం చూరగొన్న శ్రీ కొడవటిగంటి రోహిణీప్రసాద్ ముంబాయిలో ఈరోజు కన్నుమూసారని తెలపటానికి చింతిస్తున్నాను. అనేక వెబ్ పత్రికలు, అచ్చుపత్రికల్లో శ్రీ రోహిణీప్రసాద్ రాసిన సంగీతం, సైన్సు సంబంధమైన అనేక విషయాలతో కూడిన విజ్ఞానదాయకమైన రచనలు పాఠకులకి పరిచయమే! కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీ రోహిణీప్రసాద్ ఆకస్మిక మరణం మిత్రులకి, పాఠకులకి బాధాకరమైన విషయమే!

    నాకు ఒక మంచి మిత్రుడు, ఈమాటకి ఒక గొప్ప రచయిత మరింకలేరు!!!

    విష్ణుభొట్ల లక్ష్మన్న
    Lucky.Vishnubhotla@Globalfoundries.com

  6. ఉరుము ఉరిమి… గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:

    09/08/2012 10:24 am

    ‘భానుమతిగారి కథలను గుర్తుకు తెచ్చారు
    ఒక మంచి కథను చదివిన అనుభూతిని మిగిల్చారు’ – మంగు శివ రాం ప్రసాద్ , (విశాఖపట్టణం)

    * భానుమతి గారి కథలు నాక్కూడా చాలా ఇష్టమండి, శివరాం ప్రసాద్ గారూ!
    మీ ప్రశంసకి నా మనః పూర్వక ధన్యవాదాలు తెలియ చేసుకుంటూ..
    నమస్సులతో-
    ఆర్.దమయంతి.

  7. గానవిద్యా వారిధి: డా. శ్రీపాద పినాకపాణి గురించి Gopal Nemana అభిప్రాయం:

    09/08/2012 2:01 am

    మా బ్రహ్మానందం ఈ వ్యాసాన్ని బ్రహ్మాండంగా వ్రాసి నన్ను బ్రహ్మానందభరితుణ్ణి చేసేడు. వ్రుద్ధుడినీ, వైద్యుడినీనైన నాకు పినాకపాణిగారి కచ్చేరీలు ఆలిండియా రేడియోలోనూ, అప్పుడప్పుడూ విజయవాడ కేంద్రం నించీ ప్రసారాలూ వినడం గుర్తు కొస్తున్నాయి. ఆప్పట్లో ఆయనకి సంగీతం వ్రుత్తీ, వైద్యం హాబీ అనుకునేవారు. ఈ వ్యాసంలో మళ్ళా ఆయన గొంతుక వినిపించడం అద్రుష్టమే. ఆయనని శతాయుష్కునిగా చూడడమూ అదృష్టమే.

  8. తథాస్తు గురించి Gowri Kirubanandan అభిప్రాయం:

    09/07/2012 9:37 pm

    తమిళ రచయిత సుబ్రమణ్య రాజుగారు వ్రాసిన ఈ కథ, ఆర్థిక పరిస్థితులు మనుషుల జీవితాన్ని, వాళ్ళ ప్రవర్తనను ఎంతగా శాసిస్తాయో ఒక మంచి ఉదాహరణ.

  9. నేను నిన్ను ప్రేమిస్తున్నాను గురించి PJB Israel అభిప్రాయం:

    09/07/2012 1:48 pm

    ఛాలా చాలా అద్భుతంగా ఉంది !!!

  10. గానవిద్యా వారిధి: డా. శ్రీపాద పినాకపాణి గురించి Srinivas Vuruputuri అభిప్రాయం:

    09/07/2012 10:59 am

    తః తః గారికి నమస్తే. రాగ భావం అనే మాట ఉంది అని గూగుల్ చెబుతోంది. 🙂

    శ్రుతి పత్రికలో “సాహిత్యం-సంగీతం” విషయమై ఓ వ్యాసం రాసారు. అందులోంచి:

    “Once sahitya is introduced, it is a musician’s duty to render it correctly, do justice to its structure and harmonise the sahitya bhava with the raga bhava. The mere fact that this is not being done by many musicians does not invalidate the general point that such harmony enhances musical enjoyment…”

    – శ్రీనివాస్