మీరు, “రెండో సూచన గురించి నా అభిప్రాయం వేరు. ఈ కథలో వేరా మాటలతో కంటే తన “బాడీ లాంగ్వేజి” తో సమర్ధవంతగా అబధ్ధాలు ఆడుతుంది. ఫ్రాంక్టన్ గురించి ఒక “విషాదకరమైన” విషయాన్ని చెప్తున్నప్పుడు ఆమెలాటి అల్లరి పిల్ల “నవ్వుతూనో, అల్లరిగానో ” చెప్పదు. మొహాన్ని జాలిగా పెట్టి వినేవాళ్ళని నమ్మిస్తుంది!” అని అన్నారు.
అవును, కరెక్టే. నేనా విధంగా ఆలోచించలేదు. పాఠకులకి ఇంకాస్త స్పష్టత కలిగించే విధంగా మాత్రమే ఆలోచించాను. ఒక వేళ, “అని చెప్పింది జాలిగా.” అనే బదులు, “అని చెప్పింది జాలిగా, మనసు లోని నవ్వుని కంటి రెప్పల కిందే దాచేసుకుంటూ.” అని వుంటే, చదివే పాఠకులకి ఇంకా ఎక్కువ స్పష్టత కలిగిస్తుందని అనిపించింది. ఇదేమంత పెద్ద విషయమేమీ కాదు కూడా.
ప్రసాద్
చాలా సంతోషం శారద గారూ!! మీ చేయబోయే అనువాదాల కోసం ఎదురుచూస్తాను. ఈ కధలో వేరా అటు ఆ తన ఆంటీ అయిన సేపుల్టన్ తోనీ ఇటు తన ఇంటికి వచ్చిన మిస్టర్ నటెల్ తోనీ సమానంగానే అభినయించింది. ఆ అమ్మాయి వయసునీ ఆ అమ్మాయి కధలు రాస్తుందన్న చివరి వాక్యాన్నీ కలిపి పాఠకులు వేరా పాత్ర ని పట్టుకోవాలన్న మాట. ఇంగ్లీషు కధా విధానం అంతా అలవోకగా ఆ కధా రచయిత చేసే సూచన మీదా అందులోని క్లుప్తత మీదాఆధార పడి ఉంటుంది. అన్నీ “వివరించడం ” తెలుగు కధల లక్షణం. పాఠకుల ఊహకి ఏమీ వదిలి పెట్టకుండా అన్నీ చెప్పేయాలన్న లౌల్యం తెలుగు లోని రచయితల కీ, అన్నీ విడమరిచి తెలుసుకోవాలన్న తొందర తెలుగు కధల్ని చదవడానికి అలవాటు పడిన పాఠకులకీ ఉంటుంది. అలాంటి తరహా మనకి పాశ్చాత్య రచయితలలో కనిపించదు. ఇక్కడ అనువాదపు కధని తెలుగు లో చదవడం వరకు మాత్రమే పాఠకులు చేయగలరు. కానీ వారి కధల్లోని సాంస్కృతిక వాతావరణం మనకన్నా పూర్తిగా భిన్నమైనది గనక దానికి సంబంధించిన విషయాలు ఎప్పుడూ వేరుగా ఉంటాయని కూడా అనువాద కధల్ని చదివే పాఠకులు గుర్తుంచుకోవలసిన స్థితి తప్పదన్నమాట !! అప్పుడు మాత్రమే ఆ కధ మన ఊహకి చిక్కుతుంది.
ప్రసాద్ గారు అనువాదం లో సూచించిన వాక్యం బాగుంది. అయితే సాధారణం గా అనువాద ప్రక్రియ లో ఎప్పుడూ ఒక్కో వాక్యాన్ని రెండు మూడు రకాలుగా రాసే వీలుంటుంది. అక్కడ అనువాదం చెసే వాళ్లకి వాక్య రచనలో స్వేచ్చ ఎంత ఉంటుందో ఇబ్బందీ అంతే ఉంటుంది . ఒక సారి తెలుగు వాక్యం సహజం గా ఉబికి రాగా ఒక్కోసారి అసలు కధలోని వాక్యపు ప్రభావం బుధ్ధి మీద జిడ్డు లాగా పట్టుకుని వదలదు 🙂 అలాంటప్పుడు బయటివాళ్ళు చేసే సూచన ఎక్కువ ఉపకరిస్తుంది. ఇది అనువాద ప్రక్రియలో చాలాసార్లు అనువాదకులని తిప్పలు పెట్టె అంశం! మహా చేయి తిరిగిన అనువాదకులకైనా కూడా ఈ ఇబ్బంది తప్పనిదే !! అయినా అన్నీ అసలు భాషలోంచే అందరూ చదవలేరు గనక అనువాదాలు అక్కరకొస్తాయి పాఠకులకి. వాటి పరిమితులతో సహా పాఠకులు వాటిని చదువుతూ ..భిన్న కల్పనలనీ భిన్న ఇతివృత్తాలనీ తెలుసుకోగలుగుతారు. అందుకు వారధి మన శారద గారు. ఇంకా ఇతరులూను.
రమ.
“ఈమాటకు మాత్రమే కాదు, తెలుగు సాహిత్యానికీ ఇది పెద్ద పిడుగుపాటు. ఈమాటకు ఆయన లేని లోటు ఇంకెవరూ, ఇంకెప్పటికీ పూడ్చలేనిది.”
ఒక్క మాటలో ఆయనను కోల్పోయిన లోటు, నష్టం తీవ్రతగురించి చెప్పేశారు.
ఆయన రాసిన సైన్స్ వ్యాసాలు కొన్ని పుస్తకాల రూపంలో అందుతున్నాయి. భారతీయ సంగీతరీతులు, సంగీతజ్ఞులు, లలిత, చిత్ర సంగీతంపై ఆయన ఈమాట.కామ్‌లో ప్రచురించిన వెలకట్టలేని రచనలను ఒక పుస్తకం రూపంలోకి తెచ్చే విషయాన్ని మీరు ఆలోచించగలరా?
నెట్‌లో ఆయన రచనలు చూడడానికి, చదవటానికీ నేటికీ అనేక పరిమితులున్నాయి. మరింతమందికి ఆయన ఆలోచనలు అందాలంటే ఈ సైట్‌లో ఉన్న రచనలు ముద్రణ రూపం దాల్చవలసిన అవసరం ఎంతైనా ఉంది.
After so many days I found “Eemaata. com” surprised myself that you are doing a good job by giving more information about our culture and mythology. Really I am blessed when i read “Manu Charithra.” Sir I have a request. pl. give prose version of manu charithra. it helps to understand well. pl. do not forget it. not only that book, but also poetry version should be simplified in prose. I hope that you would take my request into consideration.
రమ గారూ,
మీరన్నట్టు నాకిది హారర్/సస్పెన్సూ కంటే హాస్య కథగా అనిపించింది. అనువాద కథల గురించి మీ సూచనకి ధన్యవాదాలు. ఇంకా నాకు ఆస్ట్రేలియన్ రచయిత్రి ఏమీ విటింగ్, న్యూజీలాండ్ రచయిత్రి కేథరీన్ మేన్స్ ఫీల్డ్ కథలు అనువదించాలని ఆశగా వుంది. అవికూడా ప్రయత్నిస్తాను.
@కల్యాణ్ @శర్మ@వనజ గారూ,
ధన్యవాదాలు.
@ప్రసాద్ గారూ
ఫ్రెంచి విండోలు దాదాపు తలుపులంత పెద్దగా వుండి వాటిల్లోంచి రావటానికీ పోవటానికీ వీలుగా వుంటాయి.
అనువాదం గురించి మీ మొదటి సూచనతో అంగీకరిస్తాను.
రెండో సూచన గురించి నా అభిప్రాయం వేరు.
ఈ కథలో వేరా మాటలతో కంటే తన “బాడీ లాంగ్వేజి” తో సమర్ధవంతగా అబధ్ధాలు ఆడుతుంది. ఫ్రాంక్టన్ గురించి ఒక “విషాదకరమైన” విషయాన్ని చెప్తున్నప్పుడు ఆమెలాటి అల్లరి పిల్ల “నవ్వుతూనో, అల్లరిగానో ” చెప్పదు. మొహాన్ని జాలిగా పెట్టి వినేవాళ్ళని నమ్మిస్తుంది!
@గాయత్రి గారూ,
ఇలాటి కథల్లో క్లుప్తత వల్ల ఎక్కువ అందం వస్తుందండీ! ఎక్కువ వివరిస్తే కథలో బిగువు చెడి పోతుంది.
రాగాలకు వర్షం కురుస్తుందంటారు. కవితకు, కాదు, గీత రచనకు కూడా వాన పడుతుందనే ఆశ ఆకాంక్ష కొత్తగా ఉంది. ఎవరో కవి అన్నదానికి ఇంకొన్ని లైన్లు కూర్చి ఇది రాయడానికి స్ఫూర్తినిచ్చింది.
“జ్వలిస్తే గ్రీష్మం
కురిస్తే వర్షం
‘చలి’స్తే శిశిరం
విరిస్తే వసంతం”
చెట్లు నాటుతే శుభం
ఉన్నవి నరికితే క్షామం
ఉల్లాసపరుస్తే కవిత్వం
లేకపోతే నీరసం!
========
విధేయుడు
_శ్రీనివాస్
హృదయ ప్రధానమైన సంగీతం గురించైనా, మేధ ప్రధానమైన సైన్సు గురించైనా ఒకటి ఎక్కువ ఇంకొకటి తక్కువ అని కాకుండా, రెంటినీ, తెలుగులో, సరళంగా, సాధారణ పాఠకులకి అర్థమయ్యేలా, ఆసక్తి కలిగించేలా వ్రాసే అతి తక్కువ మంది రచయితల్లో ఒకరైన శ్రీ రొహిణీ ప్రసాద్ గారు ఇక లేరన్న వార్త చాలా విచారకరం. చదివింపజేసే విషయాలతో, ఆలోచింపజేసే అంశాలతో తెలుగు పాఠకలోకాన్ని పరిపుష్టం చేసే కలం ఆగిపోవడం పెద్ద లొటు. వారి రచనలు అభిప్రాయాలు చదివే చోట ఈ వార్తను చదవడం, ఈ మాటలు “ఈ మాట” లో వ్రాయడం కష్టంగా ఉంది. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం.
==========
విధేయుడు
_శ్రీనివాస్
రొహిణీ ప్రసాద్ గురించి మొన్ననే అనుకున్నాను ఆయన రచనలూ అభిప్రాయలూ కనిపించడం లెదేమని. ఆయన లేరన్నది పెద్ద వెలితి. ఇంత చిన్నతనం లో యెందుకు వెళ్ళిపొయారాయన ఆయన ఆంధ్ర విశ్వ కళా పరిషత్ లొ విద్యార్ధిగా హాస్టల్ గది లొ సితారు వాదన గుర్తొస్తొంది. అవును “ఈమాటకు ఆయన లేని లోటు ఇంకెవరూ, ఇంకెప్పటికీ పూడ్చలేనిది.”
తః తః
కిటికీ గురించి ప్రసాద్ అభిప్రాయం:
09/12/2012 12:26 pm
శారద గారూ,

కిటికీ గురించి rama bharadwaj అభిప్రాయం:
09/12/2012 12:22 pm

కొడవటిగంటి రోహిణీప్రసాద్ (1949-2012) గురించి కె.రాజశేఖర రాజు అభిప్రాయం:
09/12/2012 5:08 am
ఆలస్యంగా స్పందిస్తున్నందుకు క్షమించాలి.
“ఈమాటకు మాత్రమే కాదు, తెలుగు సాహిత్యానికీ ఇది పెద్ద పిడుగుపాటు. ఈమాటకు ఆయన లేని లోటు ఇంకెవరూ, ఇంకెప్పటికీ పూడ్చలేనిది.”
ఒక్క మాటలో ఆయనను కోల్పోయిన లోటు, నష్టం తీవ్రతగురించి చెప్పేశారు.
ఆయన రాసిన సైన్స్ వ్యాసాలు కొన్ని పుస్తకాల రూపంలో అందుతున్నాయి. భారతీయ సంగీతరీతులు, సంగీతజ్ఞులు, లలిత, చిత్ర సంగీతంపై ఆయన ఈమాట.కామ్‌లో ప్రచురించిన వెలకట్టలేని రచనలను ఒక పుస్తకం రూపంలోకి తెచ్చే విషయాన్ని మీరు ఆలోచించగలరా?
నెట్‌లో ఆయన రచనలు చూడడానికి, చదవటానికీ నేటికీ అనేక పరిమితులున్నాయి. మరింతమందికి ఆయన ఆలోచనలు అందాలంటే ఈ సైట్‌లో ఉన్న రచనలు ముద్రణ రూపం దాల్చవలసిన అవసరం ఎంతైనా ఉంది.
నాకు నచ్చిన పద్యం: ఊరుద్యుతి వర్ణన గురించి A.Kurumaiah అభిప్రాయం:
09/11/2012 11:13 pm
After so many days I found “Eemaata. com” surprised myself that you are doing a good job by giving more information about our culture and mythology. Really I am blessed when i read “Manu Charithra.” Sir I have a request. pl. give prose version of manu charithra. it helps to understand well. pl. do not forget it. not only that book, but also poetry version should be simplified in prose. I hope that you would take my request into consideration.
కిటికీ గురించి శారద అభిప్రాయం:
09/11/2012 8:49 pm
రమ గారూ,
మీరన్నట్టు నాకిది హారర్/సస్పెన్సూ కంటే హాస్య కథగా అనిపించింది. అనువాద కథల గురించి మీ సూచనకి ధన్యవాదాలు. ఇంకా నాకు ఆస్ట్రేలియన్ రచయిత్రి ఏమీ విటింగ్, న్యూజీలాండ్ రచయిత్రి కేథరీన్ మేన్స్ ఫీల్డ్ కథలు అనువదించాలని ఆశగా వుంది. అవికూడా ప్రయత్నిస్తాను.
@కల్యాణ్ @శర్మ@వనజ గారూ,
ధన్యవాదాలు.
@ప్రసాద్ గారూ
ఫ్రెంచి విండోలు దాదాపు తలుపులంత పెద్దగా వుండి వాటిల్లోంచి రావటానికీ పోవటానికీ వీలుగా వుంటాయి.
అనువాదం గురించి మీ మొదటి సూచనతో అంగీకరిస్తాను.
రెండో సూచన గురించి నా అభిప్రాయం వేరు.
ఈ కథలో వేరా మాటలతో కంటే తన “బాడీ లాంగ్వేజి” తో సమర్ధవంతగా అబధ్ధాలు ఆడుతుంది. ఫ్రాంక్టన్ గురించి ఒక “విషాదకరమైన” విషయాన్ని చెప్తున్నప్పుడు ఆమెలాటి అల్లరి పిల్ల “నవ్వుతూనో, అల్లరిగానో ” చెప్పదు. మొహాన్ని జాలిగా పెట్టి వినేవాళ్ళని నమ్మిస్తుంది!
@గాయత్రి గారూ,
ఇలాటి కథల్లో క్లుప్తత వల్ల ఎక్కువ అందం వస్తుందండీ! ఎక్కువ వివరిస్తే కథలో బిగువు చెడి పోతుంది.
వర్ష రచన గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:
09/11/2012 5:51 pm
రాగాలకు వర్షం కురుస్తుందంటారు. కవితకు, కాదు, గీత రచనకు కూడా వాన పడుతుందనే ఆశ ఆకాంక్ష కొత్తగా ఉంది. ఎవరో కవి అన్నదానికి ఇంకొన్ని లైన్లు కూర్చి ఇది రాయడానికి స్ఫూర్తినిచ్చింది.
“జ్వలిస్తే గ్రీష్మం
కురిస్తే వర్షం
‘చలి’స్తే శిశిరం
విరిస్తే వసంతం”
చెట్లు నాటుతే శుభం
ఉన్నవి నరికితే క్షామం
ఉల్లాసపరుస్తే కవిత్వం
లేకపోతే నీరసం!
========
విధేయుడు
_శ్రీనివాస్
గానవిద్యా వారిధి: డా. శ్రీపాద పినాకపాణి గురించి Bharani అభిప్రాయం:
09/11/2012 4:56 pm
సంగీత సౌరభం పుస్తకం ఎక్కడ దొరుకునో దయ చేసి చెప్పగలరు, వ్యాసము చాల బావుంది.
బొంబాయిలో తెలుగు కార్యక్రమాలు గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:
09/11/2012 12:48 pm
హృదయ ప్రధానమైన సంగీతం గురించైనా, మేధ ప్రధానమైన సైన్సు గురించైనా ఒకటి ఎక్కువ ఇంకొకటి తక్కువ అని కాకుండా, రెంటినీ, తెలుగులో, సరళంగా, సాధారణ పాఠకులకి అర్థమయ్యేలా, ఆసక్తి కలిగించేలా వ్రాసే అతి తక్కువ మంది రచయితల్లో ఒకరైన శ్రీ రొహిణీ ప్రసాద్ గారు ఇక లేరన్న వార్త చాలా విచారకరం. చదివింపజేసే విషయాలతో, ఆలోచింపజేసే అంశాలతో తెలుగు పాఠకలోకాన్ని పరిపుష్టం చేసే కలం ఆగిపోవడం పెద్ద లొటు. వారి రచనలు అభిప్రాయాలు చదివే చోట ఈ వార్తను చదవడం, ఈ మాటలు “ఈ మాట” లో వ్రాయడం కష్టంగా ఉంది. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం.
==========
విధేయుడు
_శ్రీనివాస్
ఎండ గురించి papa rao pendikatla అభిప్రాయం:
09/11/2012 8:45 am
కొండల్లో పడివున్న బాలుణ్ణి!
ఇక్కడ బాలుడెవ్వరు?
ఏటవాలు కిరణాలు అస్తమించే సూర్యుడికి గుర్తు
అర్థం కాలేదు
కొడవటిగంటి రోహిణీప్రసాద్ (1949-2012) గురించి తః తః అభిప్రాయం:
09/11/2012 2:24 am