పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. మనకు తెలియని మన త్యాగరాజు -1 గురించి sravan bharadwaja అభిప్రాయం:

    10/15/2012 3:49 pm

    Excellent writing! Better late than never. I love Tyagayya’s compositions and I somehow still fail to understand as to why a Teluguite never embraces Tyagayya as easily as he does when it comes to Annamayya and Sri RamaDasu. May be it’s time we’ve made a movie on him that can encompass all his life’s mysteries. Thank you once again for writing this wonderful article and I believe Eemata is doing a FINE job indeed!

  2. మస్తానీ గురించి pavan santhosh surampudi అభిప్రాయం:

    10/14/2012 10:29 am

    బాజీరావు-మస్తానీల అపురూప ప్రణయగాథ ఉత్తరభారతదేశవాసులకు పరిచయం ఉన్నంత దక్షిణాత్యులకు తెలియదు. కాని ఇదొక అపూర్వగాథ. అతను యుద్ధరంగంలో పోరాడిన ప్రతి పోరూ గెలిచిన జగదేక వీరుడు ఆమె అలౌకిక సౌందర్యం మూర్తీభవించిన అతిలోకసుందరి. నిజానికి ఈ గాథ షాజహాన్ ముంతాజ్ ల ప్రణయాన్ని మించి ప్రాచుర్యం పొందవలసింది. ఇద్దరి పరిణయాన్నీ చాలా చక్కగా వర్ణించారు.

  3. స్మరణ: కథ నచ్చిన కారణం గురించి pavan santhosh surampudi అభిప్రాయం:

    10/14/2012 10:19 am

    కథ నచ్చిన కారణం అనగానే కాస్త విశ్లేషణ ఊహించుకుని ఉస్సూరన్నాను చివరికి. ఈ వ్యాసం పేరే నన్నలా తప్పుదోవ పట్టించింది. కథాపరిచయం అంటే సరిపోయేది.

  4. రచయితలకు సూచనలు గురించి pavan santhosh surampudi అభిప్రాయం:

    10/14/2012 10:11 am

    గత కొన్నాళ్ల నుండి ఈమాట చూస్తున్నాను. తెలుగు ప్రింట్ మీడియాలో గాని అంతర్జాలంలొ కాని ఈమాటకి సరితూగగల సాహిత్య పత్రిక లేదని నా అభిప్రాయం. ప్రత్యేకంగా నాకు ఇది ఒక నిధిలా ఉంది. పాత సంచికల ఖజానా ఎంత చదివినా మరిన్ని ఆణిముత్యాలు దొరికి నన్ను మురిపిస్తొంది.
    వేనవేల ధన్యవాదాలతో,
    సూరంపూడి పవన్ సంతొష్,
    తాడేపల్లిగూడెం.

  5. అలనాటి పాట: ఊర్మిళాదేవి నిద్ర గురించి G.L.N.Murthy అభిప్రాయం:

    10/13/2012 11:46 am

    ఈ పాటలు నా చిన్నతనంలో వింటూ యుండేవాడిని.కానీ సాహిత్యం తెలిసేది కాదు.సాహిత్యం తెలిసినపుడు పాడడం తెలియలేదు.ఇప్పుడు రెండూ శ్రవణానందకరంగా వినడం ఎంతో ఆనందాన్నికలిగిస్తోంది.ఈ విధంగా ఇటువంటి పాటలు భద్రపరచి ముందు తరాల వారికి అందిస్తూన్న శ్రీ పరచూరి వారు ఎంతైనా అభినందనీయులు. వారికి నా అభినందనలు-గంటి లక్ష్మీ నరసింహమూర్తి-(బెంగుళూరు).

  6. చెట్టు కింది మనుషులు గురించి indrani Palaparthy అభిప్రాయం:

    10/12/2012 1:16 pm

    Prasad garu:

    Its just based on my observation,about such poorest of the poor.

    No inner/hidden meanings.

    Thanks & Regards
    Indrani Palaparthy.

  7. అలనాటి పాట: ఊర్మిళాదేవి నిద్ర గురించి sridevi అభిప్రాయం:

    10/11/2012 12:05 pm

    మా అమ్మ ఈ పాట గురించి ఎంతో చెప్పేది. ఈ పాత వింటె మా అమ్మే గుర్తుకు వచ్చింది మీకు ఎలా thanks చెప్పాలో తెలీడం లేదు. కస్తురి రంగ పాట మా అమ్మ ఎంత బాగ పాడేదొ. మీకు ఎన్నిసార్లు thanks చెప్పినా సరిపోదు. పరుచూరి శ్రీనివాసు గారి email గాని phone number గాని వీలైతే చెప్పరా pl.

    sridevi

  8. రచయితలకు సూచనలు గురించి ఆకుండి శైలజ అభిప్రాయం:

    10/11/2012 11:37 am

    పత్రిక ను మీ స్వీయ పుత్రిక లా తీర్చిద్దినందుకు ప్రధమంగా ఆభినందనలు. మా తండ్రి గారైన స్వర్గీయ ఆకుండి రాజేశ్వరరావు గారి కధలు ఆలనాటి భారతి, ఆంధ్ర పత్రిక(1960-70) మధ్య కాలంలో ప్రచురించబడి యున్నాయి. వాటిని మీ పత్రికలో పాఠకుల కొరకు ప్రచురించడం సాధ్యపడుతుందా… సాధ్య పడితే తెలియ చేయగలరు.

    శైలజ ఆకుండి.

  9. సుప్తశిల – నాటక పుస్తకం గురించి jagadeeshwar reddy gorusu అభిప్రాయం:

    10/02/2012 12:24 pm

    తిలక్‌గారి ‘సుప్తశిల’ నాటిక ప్రతి చూడగానే ప్రాణం లేచి వచ్చింది. అది నాటకమా? రమణీయ అద్భుత దృశ్య కావ్యం. దీన్ని చదివినప్పుడు కలిగిన అనుభూతే గతంలో శ్రవణ నాటికగా వినప్పుడూ కలిగింది. అహల్యగా శారదా శ్రీనివాసన్‌గారి నటన నభూతో నభవిష్యతి. ఎన్ని సార్లు విన్నా గానీ, ‘ఈ మాట’లో పెట్టిన ఈ సుప్తశిల ప్రతిని చదివేసరికి మనసంతా మబ్బు పట్టేసినట్టు అయింది. తిలక్‌ లాంటి కవి మళ్లీ పుట్టగలడా అనిపించింది.
    – గొరుసు

  10. ఒక సరళ నిర్వచనం గురించి NARAYANA అభిప్రాయం:

    10/01/2012 9:54 pm

    ఆదిత్య గారు,

    ఎంతో ఓపికగా నా కవితను సమీక్షించడమే కాక, మరొక చక్కని కవితను ఉదాహరణగా ఇచ్చారు. ధన్యవాదాలు. చక్కని చిక్కని ఉపమానాలను పదచిత్రాల పూర్వకంగా బాగా అల్లింది. నేను తప్పకుండా మీరు చెప్పిన విషయాలను పరిశీలిస్తాను.

    ధన్యవాదాలు.
    నారాయణ.

    గౌతం గారు,

    మీ తెలుగు భాషాభిరుచికి జోహార్లు. మీ అభిరుచికి ఈమాట ఒక మంచి వేదిక. ఫేసుబుక్కులో మీరు కేవలం లింక్ (URL) ని మాత్రమే షేర్ చేసుకుంటారు కాబట్టి ఈమాటకు మరియు రచయిత (లేదా) కవి కి ఏమీ అసౌకర్యం ఉండదనే అనుకుంటున్నాను.

    ధన్యవాదాలు,
    నారాయణ.