పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. అంబఖండి నుంచి అట్లాంటా దాకా… గురించి Shyam అభిప్రాయం:

    01/03/2013 5:57 pm

    వెంకటేశ్వర్రావుగారూ,

    నారాగారి గురించి మీ జ్ఞాపకాలు చాలా బాగా రాసేరు. అలాగే మీకు తెలిసిన లిటెరరి ఫిగర్స్ అందరి తోనూ కనీసం కొందరితోనైనా మీ అనుభవాలూ-జ్ఞాపకాలూ రాస్తే బావుంటుంది అని నా అభిప్రాయం.వీలయినంత తొందరగా రాయడం మంచిదేమో అన్పిస్తోంది.
    అభినందనలతో,
    శ్యాం

  2. ఒక నేను, కొన్ని నువ్వులు గురించి lilly అభిప్రాయం:

    01/03/2013 3:45 am

    బాగుంది కాని అంతా ఒకే కథ లా ఉంటే బాగుండేది

  3. God on the Hill, Goddess on the Plain, and the Space In-Between: Tirupati, South India గురించి K.V.S. Ramarao అభిప్రాయం:

    01/03/2013 3:33 am

    Truly fascinating subject and angle. It is striking that virtually every aspect of this God is very unusual: I don’t think there is another god whose name includes “Eswara” who is not a form of Shiva but Vishnu; whose relatives also have unusual names like Govinda Rajulu and Padmavathi; whose story is very mundane, involving debts and interest; who hasn’t done anything praiseworthy like the other gods – punishing demons, showing supernatural abilities etc., As the author of this article says, there isn’t any study of how, from perhaps the 1st century A.D, this temple has evolved into such a wealthy, powerful attraction for kings and commoners alike over the centuries. Works like this article shed some light on this highly mysterious subject.

  4. గాడ్ ఆన్ ది హిల్ – టెంపుల్ పోయమ్స్ ఆఫ్ తిరుపతి: ఒక మెచ్చుకోలు గురించి Mohana అభిప్రాయం:

    01/02/2013 12:06 pm

    అన్నమాచార్యులపైన వారి కీర్తనలపైన అట్టి వాటిని అందరికీ ఆంగ్లములో అందుబాటు చేయలని నారాయణారావుగారు చేసిన కృషి నిజముగా అభినందనీయము. దానిపైన సంక్షిప్తముగా తన అభిప్రాయాలను తెలిపిన బ్రహ్మానందముగారికి అభినందనలు. అన్నమాచార్యుల సారస్వతము అందరికీ చేరినది. వాటి ఆంగ్లానువాదము తెలుగురాని సంగీత సాహిత్యాభిమానులకు కూడ ఎక్కువగా ఉపయోగ పడుతుంది. పుస్తకములో మాతృకలను కూడ ఇవ్వవలసినదనే అభిప్రాయమును నేను కూడ అంగీకరిస్తాను. నాలుక తిరగకున్నా మూలము ఎలాగుంటుందో అన్నది వాటివల్ల తెలిసికోవచ్చును.

    నేను ఒకప్పుడు ఒక పరిశోధనను ఆంగ్లములో వ్రాసి ఒక రష్యన్ విజ్ఞానపత్రికకు పంపాను, వాళ్లు దానిని రష్యనులో అనువాదము చేసి ప్రచురించారు. ఆరు నెలల తరువాత దానిని మళ్లీ ఆంగ్లములో సోవియెట్ ఫిజిక్స్ అనువదించినది. నా ఆంగ్ల మూలమును , ఈ ఆంగ్ల ప్రతిని చదివితే అక్కడక్కడ నాకు నవ్వు వచ్చింది. అందుకే ఈ వ్యాసములోని ఆంగ్లానువాదములను తెలుగులోకి మళ్లీ అనువదిస్తే ఎలాగుంటుందో అనే భావన కలిగింది. దాని ఫలితమే క్రింది అనువాదాలు. తప్పులన్ని నావే, ఆ అన్నమాచార్యులది కాదు, ఈ నారాయణరవుది కాదు 🙂 నవ్వి ఆనందించండి.

    1) మనుగడ యిది ఆటాయెను నిత్యము
    కనబడనిది కనుగొనుటే సత్యము

    వచ్చుట యది నిజముగదా
    వెళ్లుట యది నిజముగదా
    రాకలకు పోకలకు
    నడుమ రక్తి గట్టు ఆట
    కందోయికి ముందున్నది
    కడు విశాల విశ్వమ్మది
    చిట్టచివర నుండు నిజము
    చిట్టచివర నుండు నిజము
    (ఆరు మాత్రలతో)

    2) ఎఱ్ఱని పువ్వుల కామిని పెదవుల
    నల్లన నల్లని కస్తురి మఱకలు

    ప్రియునికి పంపిన యనంగ లేఖల
    నయమగు ప్రణయపు టక్షర పంక్తులు

    వెన్నెల పులుగుల కన్నులు కలికికి
    కన్నుల కొనలో నెఱ్ఱని చారలు
    నాథుని యెదలో గ్రుచ్చిన చూపుల
    మరల్చ నెత్తుట తడి యయె గన్నులు

    ప్రియునికి పంపిన యనంగ లేఖల
    నయమగు ప్రణయపు టక్షర పంక్తులు
    (నాలుగు మాత్రలతో)

    3 )హాయిహాయిగ హొయలు మించగ నాథు వలపుల నింపెను
    తీయతీయగ మాటలాడుచు తల్లి నిద్దుర వోయెను
    పగటి ఘడియలు సాగె నింకను నామె కన్నుల తెఱవదు
    వెలుగు నిండిన మొగముపై బలు కురులు చెదరుచు నాడెను
    (మిశ్రగతి)

    4) అలలు తగ్గగా మునిగెద నందువు
    కలదే యంత మనంతమగు మతికి

    దప్పి తీర నిజ మెఱిగెద నందువు
    దప్పిక తీరునె సత్యము తెలియునె

    కలదే యంత మనంతమ్మునకును

    భావి నెఱిగి యా భూతము మఱతువె
    రేపు తెలియదే నిన్న మఱువవే

    కలదే యంత మనంతమ్మునకును

    కొండలరాయని నిశ్చలమతితో
    యండ జేరు యా నిండు భక్తి యది
    కలలో గూడ యూహకు నందదు

    కలదే యంత మనంతమ్మునకును
    (ఎనిమిది మాత్రలతో)

    5) చెప్పవే వానితో నాజూకుగా నుండ
    ఆషాఢభూతి నే నసలు గాదనుచు

    ఒక మాట కొక మాట బదులు చెప్పక తాను
    దూతితో సందేశమును పంపరాదే
    గుర్రుగుర్రని నన్ను చూచు టెందులకే
    సిగ్గుతో తలవంచి నిలువ డెందులకో

    చెప్పవే వానితో నాజూకుగా నుండ

    అట్టహాసము చేసి బెదిరించకను తాను
    చిరునవ్వుతో సద్దు చేయకుండగ నౌనె
    ఆడు మాడుము యంచు ఆదేశ మివ్వకను
    బ్రేమతో నన్నక్కు జేర్చుకో రాదే

    చెప్పవే వానితో నాజూకుగా నుండ

    రతికేళితో నన్ను రంపు జేయక తాను
    ప్రక్కలో పండుకొని కౌగిలించిన చాలు
    వాడు కొండల రాయ డలమేలు మంగ నే
    నొక చిన్న స్పర్శ చా లది నాకు మిన్న
    (ఐదు మాత్రలతో)

    విధేయుడు – మోహన

  5. ఈ సంచిక గురించి… గురించి Krishna Rao Maddipati అభిప్రాయం:

    01/01/2013 1:19 pm

    ‘నువ్వు పెట్టేదొకందుకైతే నేను తినేదొకందుకు’ అనే సామెత గుర్తొచ్చింది. ఆయన చెప్తూనే ఉన్నాడు. మనం వింటున్నది మరొకందుకు!

    కీర్తిశేషులు వల్లంపాటి వెంకటసుబ్బయ్య గారు కొన్నాళ్ళ క్రితం డిట్రాయిట్ వచ్చిన సందర్భం లో చెప్పిన సంగతి ఇది: “ఆ మధ్య ఒక రచయిత తను రాసిన కథల మీద అప్పుడే ఒక M. Phil. వచ్చేసింది, ఇంకా మీ పుస్తకాల మీద ఎవరూ పని చేస్తున్నట్టు లేదే. ఎవరైనా ఒక Ph D చెయ్యొచ్చు అన్నాడు. శుభం, కానీ ఈ సలహా మాత్రం ఎవరికీ ఇవ్వొద్దు అన్నాను. నా అదృష్టం బాగుండి అతను ఇంకా ఎవరిదగ్గరా ఆమాట అన్నట్టు లేదు.”

    సాహిత్య పరిశొధనల మీద తెలుగు నాట ఉన్న అవగాహన ఎప్పుడు మారిందో తెలియదు గానీ, నారాయణరావు గారు ఇంగ్లీషులో చెప్పింది తెలుగులోకి అనువాదం చెయ్యడం వల్ల ఏమైనా బాగుపడుతుందేమోనని ఆశ! (ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అందరూ ఇంగ్లీషు పండితులే కాబట్టి, తెలుగులో ఉంటే పరభాషా వ్యామోహంతో చదువుతారేమో!)

    తెలుగులో ఏ సాహిత్య పత్రికా చెయ్యని (చెయ్యలేని) పని ఈ మాట ద్వారా చేసినందుకు సంపాదక వర్గానికి అభినందనలు, అభివందనలూను!

    మద్దిపాటి కృష్ణారావు

  6. వంశీవనము (హాలుని గాథాసప్తశతి నుండి కొన్ని పద్యములు) గురించి మాగంటి వంశీ మోహన్ అభిప్రాయం:

    01/01/2013 12:26 pm

    వారడిగిన దానికి న్యాయం చేయలేకపోయినా, మిక్కిలి దయతో వారి వ్యాసంలో నా చిత్రానికి చోటు కల్పించిన శ్రీ జెజ్జాల కృష్ణమోహనరావు గారికి శతసహస్ర కృతజ్ఞతలతో …అంతకుమించి వారి వ్యాసానికి పెట్టిన పేరులో నా పేరు ఇమిడ్చినందుకు మరిన్ని కృతజ్ఞతలతో

    భవదీయుడు
    మాగంటి వంశీ మోహన్

  7. కోనసీమ కథలు: రెండో రుమాలు గురించి Y.Uma Maheswaa Rao అభిప్రాయం:

    01/01/2013 6:18 am

    కథ చాలా బాగుంది.కథా కథనం ఎంతో బిగితో అల్లారు. జీవిత సత్యాలు ఒక్కొక్కసారి మన మనసుల్ని తడునుతాయి. మీ కథ కూడా మనసుని తడిమింది.

    కృతజ్ఞతలతో
    ఉమ యారాశి

  8. మంత్రి – మహిషం గురించి K V Sarma J అభిప్రాయం:

    01/01/2013 12:39 am

    “మహిష శతకం” మీద ఈమాట వారు ప్రచురించిన ఈ శీర్షిక చదివాక చాల రోజులుగా వాంఛేశ్వర కవి రచించిన శతకం సంస్కృతంలో వెతుకుతున్నాను. ఆఖరికి ఈ రోజు ఒక ప్రచురణ దొరికింది.

    ఈమాట వారు ఈ ప్రచురణను ఉపయోగించి ఈ శీర్షిక పూర్తి చెయ్య ప్రార్థన.

  9. స్వప్నభంగం గురించి dr. bandi satyanarayana అభిప్రాయం:

    12/29/2012 12:24 am

    రవిశంకర్ గారు, కవిత సూటిగ చక్కగ చాలా బాగుంది.

  10. కిటికీ గురించి తృష్ణ. అభిప్రాయం:

    12/27/2012 7:11 am

    అనువాదం చాలా బావుంది శారద గారూ.