పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. నిష్కృతి గురించి MURTHY.V. అభిప్రాయం:

    01/11/2013 3:02 am

    కథ చాల బాగుంది. ఈ కథ అందరిని ఆలోచింప చేస్తుంది. వస్తువులు కన్న మనసే అత్యుత్తమమైనది. అనువాదం చేసిన వారికి అభినందనలు.

  2. కోనసీమ కథలు: రెండో రుమాలు గురించి MURTHY.V. అభిప్రాయం:

    01/11/2013 2:31 am

    కథ చాల బాగుంది. శ్రీను పాత్ర మన అనుభవములొ తారసపడని వారు వుండరు. కధ రాసిన సాయి బ్రహ్మనందం గారికి కృతజ్ఞతలు.

  3. పులి వేట గురించి మోహన అభిప్రాయం:

    01/10/2013 11:18 am

    మంచి అనువాదము.

    లూనా ఈ మధ్య ఒక ఆల్జీరియన్ విమానంలో పదకొండు మైళ్ళు ప్రయాణం చేసింది.

    పదకొండు మైళ్లా, లేక పదకొండు వందల లేక వేల మైళ్లా? విధేయుడు – మోహన

    [ఆంగ్ల మూలం ప్రకారం పదకొండు మైళ్ళే. – సం.]

  4. రాగలహరి: ఆభేరి గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:

    01/09/2013 10:07 am

    సుబ్బారావు గారు:

    మీకు కొన్ని తెలుగు/హిందీ పాటల స్వరాలు తెలుసని అవి మీరు కీబోర్డ్ మీద వాయిస్తారనీ చెప్పారు కదా! అవి ఏ నొటేషన్‌లో రాసారో అదే నొటేషన్ వాడండి. సాధారణంగా ఒక పాటకి ఏ స్కేల్ వాడాలో నిర్ణయం అయిన తరవాత (ఉదాహరణకి C స్కేల్ అంటే మన పద్ధతిలో శృతి 1 అన్నమాట!) పాట ఏ రాగంలో బాణి కట్టారో తెలిస్తే ఏ స్వరాలు వాడాలో, ఏవి వాడకూడదో తెలిసినట్టే కదా!కొన్ని పాటలకి రాగం ఆధారంగా బాణీలు కట్టరు. అలాంటప్పుడు కీబోర్డ్ మీద కొంత ప్రయత్నిస్తే ఏ స్వరాలు వాడచ్చో తెలుస్తుంది. ఇందులో కొంత శ్రమ ఉన్నా నాకు తెలిసి ఇదే మంచి పద్ధతి!

    కీబోర్డ్ మీద షడ్జమం నుంచి పై షడ్జమం వరకు 12 స్వరాలను కోమల (అంటే చిన్న) తీవ్ర (పెద్ద) స్వరాల కింద విడగొడితే ఒక్క స, ప స్వరాలకి తప్ప మిగిలిన ఐదు స్వరాలకి మొత్తం పది స్వరాలు వస్తాయి (ఒక్కో స్వరానికి రెండు స్థాయిలు కదా!). ఈ పన్నెండు స్వరాలను పాటకి తగ్గట్టుగా ఉపయోగిస్తారు. పై అంతరంలోనూ కింది అంతరంలోనూ కూడా ఇదే పద్ధతి.

    ఇంకా వివరాలు కావాలంటే నన్ను ఈ క్రింది ఈమైల్ లో కలవండి.

    Lucky.Vishnubhotla@Globalfoundries.com

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  5. పులి వేట గురించి బులుసు సుబ్రహ్మణ్యం అభిప్రాయం:

    01/09/2013 8:03 am

    సున్నితమైన హాస్యం, చాలా బాగుందండి.

  6. God on the Hill, Goddess on the Plain, and the Space In-Between: Tirupati, South India గురించి Mohana అభిప్రాయం:

    01/08/2013 2:37 pm

    విష్ణువుకు ఉండే పేరులలో చివర ఈశ్వరుడు లేక ఈశ అనె పదముతో పేరులు ఉన్నాయి – హృషీకేశ, జగదీశ్వర, వ్రజేశ (బ్రజేశ్‌), ద్వారకీశ, ఇత్యాదులు. కంచిలో జగదీశ్వరాలయము, ఉడుపిలో అనంతేశ్వరాలయము మధ్వాచార్యులకు అతి ప్రీతికరమైనది, వారు ఇక్కడే పరమపదించారని కూడ ఒక కథ ఉన్నది, ఈ గుడిలో ముఖ్య దైవము విష్ణువు ఆఱవ అవతారమైన పరశురాముడు, కేరళలోని త్రిపుణిత్తురాయందలి పూర్ణత్రయేశాలయము విష్ణ్వాలయములే. ఈ “ఈశ్వరాలయములను” గురించి నాకు కొన్ని విషయాలను తెలిపిన “ముగ్గుల” లక్ష్మీదేవిగారికి కృతజ్ఞతలు.

    విధేయుడు – మోహన

  7. రాగలహరి: ఆభేరి గురించి k v subbarao అభిప్రాయం:

    01/07/2013 2:08 pm

    Thanks. It’s a great service.
    Kindly let me know how to write musical notes for songs. What is the technique ?
    I byhearted notes for some telugu / hindi songs and I enjoy them on keyboard.
    I took training of keyboard for one or two months.
    Thank you once again.

  8. పుస్తక పరిచయం: వేమూరి వెంకటేశ్వర రావు ‘అమెరికా అనుభవాలు’ గురించి Rao Vemuri అభిప్రాయం:

    01/07/2013 1:46 pm

    రాజేష్
    మీ సూచనకి ధన్యవాదాలు.
    పుస్తకం ప్రచురణ కర్తలైన ఎమెస్కో వారిని, కినిగె వారిని సంప్రదించి చూస్తాను. వారిరువురు ఒప్పుకుంటే తప్పకుండా అలానే చేద్దాం.

    వేమూరి

  9. ఘంటసాల గొంతులో జీవించిన ఉదయశ్రీ పద్యాలు గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:

    01/07/2013 11:52 am

    కృష్ణ గారికి:
    ఈ వ్యాసం నచ్చినందుకు సంతోషం! పంపిన వ్యాసానికి ఆడియో లింక్స్ ఇచ్చి పంపాను. ఈమాట సంపాదకులు పద్యాలను ఎం. పి. 3 ఫార్మాట్ లో మార్చి పాఠక – శ్రోతల సౌకర్యం కోసం వ్యాసానికి జతపరిచేరు. కాబట్టి, అభినందనలు సంపాదకులకి కూడా చెందుతుంది!

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  10. పులి వేట గురించి bhaskar అభిప్రాయం:

    01/07/2013 10:25 am

    సరదాగ వుంది.