పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. అంబఖండి నుంచి అట్లాంటా దాకా… గురించి dasam venkata rao అభిప్రాయం:

    02/23/2013 9:21 am

    శ్రీ వేంకటేశ్వర రావు గారు – మీ వ్యాసం చదివి చాలా సంతోషించాను. చాలా బాగుంది. ఇంకా ఆనాటి సాహితీకారులతొ మీ పరిచయాలు వ్యాసాలుగా వ్రాయండి. ఈ తరం వారికి ఉపయోగకరంగా ఉంటుంది.
    ధన్యవాదాలు.

  2. తుఫాను ముగిసింది గురించి ravi అభిప్రాయం:

    02/22/2013 8:57 pm

    మీరు చెప్పే ఆ కవిత్వ మూలాల్లోకి బహుశా నేను పోలేనేవో భూషణ్ గారు. నాకు కవిత్వం కొద్దో గొప్పో తెలుసు. కవిత్వం తెలుసంటే నాకు తెలుగు తెలుసని కాదు, నాకు బతుకు తెలుసని, అంతే. అనుమానం లేదండీ నాకు తెలిసిన తెలుగు పన్నెండో తరగతి వరకు నేను చదువుకున్న తెలుగే, అది కూడా లీలా మహల్ల్లో ఆంగ్ల సినిమా లేకపోతేనే, ఉంటే మా తెలుగు లెక్చరర్లు అదృష్టవంతులు. ఎందుకంటే మేవు క్లాస్ కి వస్తే పాపం వాళ్ళు చాలా దిగులు పడే వాళ్ళు. మా తెలుగు అంతవరకే పరిమితం. కాకపోతే బతుకు చాలా విస్తృతం కదండీ. కొందరు బతుకు ఒక వైపునే చూడగలరు, కానీ ఆ కొండనీ ఆ లోయనీ రెండిటినీ చూడగలగటం అందరకీ కుదరదు కదా.

    నేను ఇంతకు ముందు వ్రాసిన కవితలు కానీ, ఒకే ఒక కథ కానీండి, అది నాకు తెలుగు తెలుసు అని వ్రాసింది కాదండీ భూషణ్ గారు. బతుకు తెలుసని వ్రాసినవండీ అవి. అయ్యో నాకు తెలుగులో ఓనమాలు, ఇవి కూడా తప్పుగా వ్రాస్తున్నాను, తెలియవండి. కానీ నాకు తెలిసింత వరకు నేను తప్పు కావచ్చు, కవితగానీ, కథగానీ భాషలోనించి రాదండి, అనుభవంలోనించి వస్తుంది, బతుకులోనించి వస్తుంది.

    అమ్మా, కడుపులో ఎండకాస్తున్నట్టుందమ్మా అని వ్రాశాడు నామినీ ఒక కథలో. మిరక్కాయలు (మీరు మిరపకాయలు అంటారేవో) పచ్చడితిని, ఆ పిలగాడు బయట ఎండ కాసినట్టే ఆ కడుపులో మంటని అమ్మా కడుపులో ఎండకాసినట్టుందమ్మా అని చెప్తాడు అమ్మకి. ఇది తెలుగు భాష తెలుసు కాబట్టి రాదు, ఇది అనుభవం నించి వస్తుంది, ఇది బతుకునించి వస్తుంది. నాకు తెలియదండీ నాకు మాత్రం ఇంతగొప్ప వాక్యం, భాష మాత్రమే తెలిసిన వాళ్ళు వ్రాయలేరు, బతుకు తెలిసిన వాళ్ళు మాత్రమే వ్రాయగలరు. అమ్మా కడుపులో ఎండకాస్తున్నట్టుందిమా. కడుపులో ఎండకాస్తున్నట్టుందట. మీరు తప్పు పట్టదలచుకుంటే మొత్తం పచ్చనాకు సాక్షినే తప్పు పట్టేయ్యగలరు మీరు. ఇది ఎందుకు చెబుతున్నానంటే, రచయిత వ్యక్తిగత జీవితం వాళ్ళ రచనలకి మూలం భూషణ్ గారు. తెలిసీ తెలియని అనుభవాల్ని, అనుభవం కాని బతుకుని కవిత్వీకరించడం కన్నా అబద్దం వుందా?

    రవికిరణ్ తిమ్మిరెడ్డి

  3. గుర్రం జాషువా పాపాయి పద్యాలు గురించి murali అభిప్రాయం:

    02/22/2013 4:11 pm

    నెల క్రితమే పుట్టిన మా చిన్నారిని చూస్తూ ఘంటసాల గారి మధుర స్వరం లో జాషువా గారి పాపాయి పద్యాలు వినడం ఓ మధురానుభూతి.

  4. కొత్త మలుపు గురించి ప్రసాద్ అభిప్రాయం:

    02/21/2013 4:54 pm

    అబ్బ! కధ ఎంత బాగుందో! ఇన్నాళ్ళూ చదవలేదు. ఇప్పుడే చదివాను. చాలా చాలా బాగుంది.

    అదే, నేనే, ఆ కొడుకుని అయి వుంటే, తల్లిని చెంప దెబ్బ కొట్టిన ఆ తండ్రికి వెంటనే ఒక పెద్ద చెంప దెబ్బ ప్రదానం చేసే వాడిని. దరిద్రపు తండ్రులు. ఇలాంటి వాళ్ళు వుంటే ఎంతా, వూడితే ఎంతా?

    ఆ తల్లి చాలా ఆత్మ గౌరవంతో ప్రవర్తించింది. కొడుకు కూడా బాగానే ప్రవర్తించాడు. వాళ్ళ పరిథిలో వాళ్ళు చక్కగా ప్రవర్తించారు.

    ఇలాంటి తండ్రి మా వూళ్ళో కూడా ఒకడు వున్నాడు. కొడుకు చేత బలవంతంగా, “నాన్న గారండీ” అని పిలిపించు కుంటాడు. తన తల్లి, కంది పప్పు కింద పారబోస్తే, అది భార్య ఎత్త లేదని, ఆ భార్య చేత తన తల్లికి సాస్టాంగ ప్రమాణాలు చేయిస్తాడు. కొడుకు ఇండియా అమ్మాయినే (తెలుగమ్మాయీ, బ్రాహ్మల అమ్మాయీ అయి వుండాలి) పెళ్ళి చేసుకోవాలని తండ్రి నిర్ణయం. ఆ కొడుకు ఇంచక్కా ఒక అమెరికా అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. తల్లికి కూడా ఇండియా అమ్మాయి కోడలుగా రావాలని కోరిక వుంది గానీ, కొడుకు ఇష్టంతో అంగీకరించి, కొడుకు ఇష్ట ప్రకారమే జరగాలని కోరుకుంటుంది. ఎటొచ్చీ, ఏ పరిస్థితి లోనూ భర్తని వదిలేసే ధైర్యం మాత్రం లేదు. ఇంకా భవిష్యత్తులో ఏం జరుగుతుందా అని చూస్తున్నాను.

    పిల్లల వివాహ విషయాల్లో, తల్లిదండ్రులకు సలహాలు ఇచ్చే అర్హతే తప్ప, ఎటువంటి నిర్ణయం చేసే హక్కూ లేదు. ఆ విషయం వాళ్ళు త్వరగా గుర్తించాలి. వివాహం అనేది పూర్తిగా చేసుకునే వాళ్ళ ఇష్టం గానూ, నిర్ణయం గానూ వుండాలి. అది ఇష్ట పడని తల్లిడండ్రులను అవతలకు విసిరి పారెయ్యాలి చాలా సులభంగా. బుద్ధి లేని మనుషులు.

    కధ చాలా బాగుంది.

    ఇక చిన్న చిన్న విషయాలు.

    రాహుల్‌, తండ్రితో జ్యోత్స్న గురించి, ” చూడ్డానికి బాగా ఉంటుంది.” అని అనడం, చాలా ఎబ్బెట్టుగా వుంది. అసలలాంటి మాటలు ఆ కొడుకు అనకూడదు.

    సూట్‌కేసు రెడీగా పెట్టుకున్న సరోజ, “ఏమిటండీ? ఇప్పుడు కూడా ఇలా మాట్లాడితే ఎలా?” అని అనడం అర్థం లేని విషయం. ఆ ధూర్తుడు ఏమంటాడో సరోజకి బాగా తెలుసు. తెలిసుండీ, ఆ మాటలు ఆ పాత్ర అనకూడదు.

    ప్రసాద్

  5. బర్సాత్‌ మే బిల్లి గురించి lyla yerneni అభిప్రాయం:

    02/21/2013 2:14 pm

    Ernest Hemingway – The short Stories ( The first Forty-Nine Stories With A Brief Preface By The Author), first Scribner’s paperback edition 2003 has this story, “Cat in The Rain”

    I like both Hemingway’s version and Kanakaprasad’s, independently. When I hold a nicely published book, read a good story, – I want to write one, myself.

    People who think short stories are all lazy reading and easy writing, and 🙂 essay writing is for hot shot scholarly dudes, – They don’t even know what they are talking about. In fact the opinions some express after reading some short stories, tell me they don’t even know the ABCD s of reading.

    Thanks
    lyla

  6. అనువాదంలో మెలకువలు గురించి bhagath అభిప్రాయం:

    02/21/2013 12:35 pm

    could you please say where can i buy ఊమర్ ఖయ్యం తెలుగు రుబాయీ book? i am living in karim nagar.

  7. గురువు గురించి Perumalla అభిప్రాయం:

    02/21/2013 11:23 am

    చాలా బాగుంది. కవిత అంటే ఇలా ఉండాలి.

  8. తుఫాను ముగిసింది గురించి Bhavani అభిప్రాయం:

    02/21/2013 4:29 am

    కవిత్వ మూలాలు కనుక్కోవడం అంత సులభం కాదు. వస్తువు ఏదైనా కవిత్వం రాయడం ముఖ్యం. దేని మీద కవిత్వం రాయాలో కవికి ఇతరులు ట్యూషన్ చెప్పే అవసరం లేదు. దేని మీద పడితే దాని మీద రాయడానికి కవిత్వం ఆవు వ్యాసం కాదు కదా.

    ఈ అభిప్రాయంలో కవి నిరంకుశత్వం పట్ల సమర్థన కనిపిస్తోంది. విమర్శ సరే, పాఠకుల అభిప్రాయాన్ని కూడా సహించలేని వారు ఈ కాలంలో కూడా వున్నారా అని ఆశ్చర్యం కలిగింది నాకు.

  9. ఈ సంచిక గురించి… గురించి తమ్మినేని యదుకుల భూషణ్. అభిప్రాయం:

    02/21/2013 2:45 am

    ఎన్నో విలువైన రచనలున్న విశేష సంచిక మీద పాఠకుల/రచయితల స్పందన అరకొరగా ఉండటానికి కారణాలు అనేకం. ముఖ్యంగా, మనకు ఒక విషయం మీద సవ్యంగా ఆలోచించి సమగ్రంగా రాయడానికి, చర్చించడానికి వలసిన వాతావరణం లేదు. దాన్ని సృష్టించుకోవడం ఒక రోజులో అయ్యే పని గాదు. అటువంటి వాతావరణం ఏర్పడటానికి , ఎన్నో పత్రికలు/ఎందరో వ్యక్తులు పూనుకొంటే కనీస పక్షం ఒక దశాబ్దం పట్టవచ్చు.

    వ్యాసం రాయడం అందునా జనరంజకంగా రాయడం అంత సులభం కాదు. పత్రికల్లో వ్యాసాల సంఖ్య బాగా పెరగాలి. అప్పుడు గాని పాఠకుల్లో వ్యాసాల పట్ల అభిరుచి కలగదు. కవిత్వం పేరిట అడ్డమైన చెత్త పోగు చేసే ప్రయత్నాన్ని అడ్డుకోవాలి. ప్రక్రియా పరమైన అయోమయాన్ని విమర్శ ద్వారా నిర్దాక్షిణ్యంగా ఎదుర్కోవాలి, వ్యాసం కావలసిన సరుకును కవితలో చుట్టి కవి బాధ పడి, ప్రపంచాన్ని బాధ పెట్టే ప్రయత్నాలను మొగ్గలోనే తుంచివేయాలి. ఆంధ్ర దేశం నుండి వస్తున్న పత్రికల సంపాదకులతో గోష్ఠి ఏర్పరచి దినపత్రికల్లో వార్తాకవిత్వాన్ని, గాలి పోగు చేసే అస్తిత్వ వాద సాహిత్యవ్యాసాలు ప్రచురించే స్థలంలో చక్కని వ్యాసాలు ప్రచురించవలసిన చారిత్రిక అవసరం ఉందన్న విషయాన్ని వారి తలకెక్కేలా బోధ పరచాలి. నిజానికి మన భాషలో ఒక చక్కని వ్యాసం చదివి ఎంత కాలమైందో!!

    మన దోషమల్లా ఆధునికతను సరిగా అర్థం చేసుకొని, ఆహ్వానించక పోవడంలోనే ఉంది. మన భాషలో ఎన్ని రంగాల్లో ఎంత మంది మేధావులు లేరు?? వారిలో వ్యాస రచనకు పూనుకొనే మహానుభావులు ఎందరు?? ప్రతి ఒక్కరు కవిత్వంలో దూకి కుప్పి గంతులు వేసేవారే. సంపాదకులు పూనికతో తమకు తెలిసిన శాస్త్ర నిపుణులతో పలు విషయాలపై చక్కని వ్యాసాలు రాయించాలి. ఈమాట వరకు కనీసం ఇంతకాలం వచ్చిన వ్యాసాల్లో ఉత్తమ వ్యాసాలను ఎంపిక చేసి ఒక పుస్తకంగా తీసుకు రావచ్చును. ప్రతి సంవత్సరం వచ్చిన వ్యాసాల్లో ఉత్తమ వ్యాసాన్ని నిర్ణయించి ప్రకటించి వ్యాసకర్తను తగురీతిన గౌరవించ వచ్చు. చీకటిని తిడుతూ కూర్చోక ఒక చిరు దీపం వెలిగించే ప్రయత్నం ఎవరైనా చేయవచ్చును.

    తెలుగునాట పుట్టిన మేధావి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గతంలో, గద్య వ్యాప్తికి కంకణ బద్ధుడై, పద్యాలు తన పత్రికలో ప్రచురించనని ప్రతిజ్ఞ పట్టారు. ఈనాటి పత్రికాధిపతులు ఒక దశాబ్దం ఆ పని చేస్తే దేశం బాగుపడుతుంది. కవులు కవిత్వం పేరిట వారు పోగు చేసే చెత్త, దాని కోసం వారు చేసే దివాలా కోరు ఉద్యమాలు అన్నీ మూలాన పడి, అందరూ కాస్త చదవడం, రాయడం మొదలు పెట్టి గద్య వ్యాప్తికి తోడ్పడతారు. నడక వచ్చాకే నాట్యం, సవ్యంగా గద్యం రాయడం వస్తే కవిత్వంలో దోషాలన్నీ కుదురుకుంటాయి. గద్యం, పద్యం మూడు పూవులూ ఆరు కాయలుగా వర్ధిల్లుతాయి. అందరికీ బ్రహ్మానందం సిద్ధిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు.

    తమ్మినేని యదుకుల భూషణ్.
    ఆఖరు మాట: ఈ సంచికలో కేవలం వ్యాసాలు మాత్రమే ఉంటే నేను మరింత సంతసించే వాణ్ణి.

  10. తెలుగు లలిత సంగీతంలో “రజనీ” గంధం గురించి జనార్దన శర్మ అభిప్రాయం:

    02/21/2013 1:31 am

    ఆ మహనీయుని పాటలు, సంగీతము వినే భాగ్యమే తప్ప ఆయన గురించి ఇన్ని విషయాలు అసలు తెలియవు నాకు. వారికి సమకాలీనులము అని చెప్పుకోవడానికి మనందరం ఎంతో గర్వించవలసిన ప్రతిభ వారిది.

    ఎన్నెన్నో విశేషాలను తెలియపరచినందుకు ధన్యవాదాలు. పైన ఉదహరించిన పాటలలో అనేక పాటలు నాకు చాలా ఇష్టమైనవి. వాటన్నిటిలోనూ వీరి కృషి ఉందని తెలిసి ఆనందముగా ఉంది.