పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. దోసిట్లో నక్షత్రాలు గురించి వినీల్ అభిప్రాయం:

    03/09/2013 3:00 am

    సుబ్బూ…చిన్నవీ, చిక్కనైనవీ..చాలా బాగున్నాయీ నక్షత్రాలు.

  2. క్షణికమైన భయం మాటున వొదిగి గురించి అపూర్వ అభిప్రాయం:

    03/08/2013 10:22 pm

    ప్రతీకలను వాడుతూ వ్రాసిన ఈ కవితలో చాలాచోట్ల గ్యాప్ / ఖాళీలు ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. వాటిని నింపుకోవడం కొంచెం (ఆలోచన) శ్రమించాల్సిందేనేమో? బహుశ పాఠకులకి వదిలేసారా? లేక చదువరులకు వదిలేసారా అని సందేహం!

    ఆకలి పేగుకు
    అబద్దాల బిర్యానీ రుచించదు
    సాకుల పరదాను చించి
    గొంతు చించుకొని అరుస్తుంది

    ఈ పాదాలు నన్ను అయోమయంలో పడేసాయి. ఎందుకంటే ఆకలిగా వున్నవారు ఆబగా తినడానికే చొరవచూపుతారుకదా! ఇక్కడ “రుచించదు” అని విరుద్దమైన పదాన్ని ఎందుకు వాడారా అని?

    జాన్ గారి నేపద్యంలో బైబిలు ప్రతీకలు కనిపిస్తుంటాయి. ఇక్కడ కొన్ని ప్రతీకలు, కొంత రాజకీయాలు, కొంత వ్యక్తిగతం కనిపిస్తున్నాయనిపిస్తుంది. జాన్ గారో మరెవరైనానో వివరిస్తే బాగుంటుంది తెలుసుకోవడానికి.

  3. అర్జున గురించి Jai అభిప్రాయం:

    03/08/2013 9:33 pm

    ఈదే కధ ఎవరైనా రాసి పంపించారనుకోండి ఈమాట సంపాదకులు ఏమంటారో. జయప్రభ గారి పేరు లేకపోతే దీనికి వాళ్ల దగ్గర్నుంచి ఎలాంటి స్పందన వస్తుందో? అహ అసలు మాట వరసకి అడుగుతున్నాను లెండి. చివర్లో మలుపులేదు కధలో కొత్తదనం లేదు అంటారా లేకపోతే పైన ఒకాయన అన్నట్టూ “ఇది కధా” అంటారా?

  4. దోసిట్లో నక్షత్రాలు గురించి Phanindra అభిప్రాయం:

    03/08/2013 4:38 pm

    సుబ్బు గారూ,

    చాలా రోజులయ్యింది మీ కవితలు చదివి. ఈ రోజు అనుకోకుండా చూశాను. సుతిమెత్తగా మనసుకి హత్తుకునేలా ఉన్నాయి. అభినందనలు.

    ఫణీంద్ర

  5. పిఠాపురంలో నా మొదటి మజిలీ గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:

    03/08/2013 12:55 pm

    > శ్రీనాధుడి “రోజులలో అన్నవరం కొండ అంత ప్రాచుర్యంలో లేదేమో.”

    వేమూరిగారు: అవును. ఆ దేవుడికీ, ఆయన పేరుతో చేసే వ్రతానికి కూడా! ఆ దేవుడూ, ఆ వ్రతం ఈనాటి గుజరాత్ ప్రాంతంనుంచి మీ ఊరు దగ్గరకి చేరడం జరిగింది. ఈ ప్రాచుర్యమంతా గత 150-200 ఏళ్ళలోపు జరిగింది. పిఠాపురం రాజులకి కచ్ ప్రాంతంలోని రాజవంశీకులతో సంబంధ బాంధవ్యాల వల్ల (విజయనగరం రాజులకి రేవా (మధ్యప్రదేశ్) , వారణాసిలతో సంబంధం ఉన్నట్లు) ఆ దేవుడు ఇక్కడికి వచ్చాడని ఒక కథనం.

  6. రంగనాధునివా రాతిబొమ్మవా గురించి rajesh అభిప్రాయం:

    03/08/2013 10:27 am

    పద్మావతి గారు చాలా బాగా పాడారు. రచన కూడా చాలా చాలా చాలా చాలా బాగుంది. శ్రీ దేవి గారికి కృతజ్ఞతలు.

  7. ప్రతిమా నాటకం: ఒక సన్నివేశం గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:

    03/08/2013 9:57 am

    re: http://www.eemaata.com/em/issues/201303/2071.html/7/#comment-49825

    మురళీధరరావుగారు: “చతుర్భాణిని తెలుగులోకి అనువదించడం జరిగింది” లేదా, “చతుర్భాణిలోని నాలుగు భాణాలనూ తెలుగులోకి అనువదించడం జరిగింది” – అని ఉండాలి.

    నా వాక్యాన్ని సరిదిద్దినందుకు కృతజ్ఞతలు! ఆ నాలుగు భాణాల గురించి బాగా తెలిసి కూడా వాక్యాన్ని నిర్లక్ష్యంగా రాసినందుకు నా క్షమాపణలు.

    భవదీయుడు, శ్రీనివాస్

  8. నా స్వేచ్ఛాగానంలోని బంధాలు గురించి rajesh అభిప్రాయం:

    03/08/2013 9:53 am

    చాలా బాగుంది! యువత ఎవ్వరికి ఖాళీ లేదా? ఇంత అద్బుతమైన వ్యాఖ్యనాలు చూడడానికి. దౌ ర్భా గ్యం!

  9. పిఠాపురంలో నా మొదటి మజిలీ గురించి మృత్యుంజయ వర్మ కామరుషి అభిప్రాయం:

    03/08/2013 8:08 am

    మేము కాకినాడ విడిచి సుమారు 60 ఏళ్ళు కావస్తుంది. కాకినాడ వివరాలు చదివి పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి చాలా ఆనందించేము. కృతజ్ఞతలు.

  10. క్షణికమైన భయం మాటున వొదిగి గురించి Poornima Siri అభిప్రాయం:

    03/08/2013 5:24 am

    అబద్దాల వంతెనపై నడుస్తూ
    లాలించడానికో వెన్నెల మొక్కను
    కిటికీకి తగిలించాలనుకుంటాం!
    పాలించడానికో సూర్య కిరణాన్ని తెంపి
    గుమ్మానికి తోరణం కట్టాలనుకుంటాం!

    నిజమే బాగుంది కానీ ..
    కొన్ని నిజాలు జీర్ణించుకోవడం కష్టం…