మోహన గారికి : నిజమే, గణతంత్ర రాజ్యం చూసినప్పుడు నేనూ ఆ ముక్క అనుకున్న… కథాకాలం గురించి. అయినా, అసలు కథ ఎప్పుడు రాయబడ్డది, ఎక్కడ ప్రచురితమైంది వంటి వివరాలు కూడా జతచేయవచ్చేమో అనుకుంటాను (ఆ వివరాలు తెలిస్తే!)… రచయిత గురించి కొన్ని వాక్యాల పరిచయం ఎలాగో ఇక్కడ పెడుతున్నారు కనుక.
జంపాల గారు చూపించిన లోపం నిజమైనదే. మొదటి రామాయణాన్ని కావ్య రామాయణం అనడం ద్వారా ఈ లోపాన్ని పరిహరించొచ్చు ననుకుంటాను. ఏమైనా వాల్మీకి రామాయణానికి రెండు రకాల పఠన మార్గాలున్నాయని చెప్పడం నా ఉద్దేశం.
ఇక పోతే కకార అకారాలు క, కకార ఆకారాలుకా — అని చెప్పే పద్ధతీ, కకు దీర్ఘం ఇస్తే కా, కకు కొమ్మిస్తే కు — అని చెప్పే పద్ధతీ, వేరు వేరు కాలాలకి చెందినవని నేను అనడంలో ఒక ఆంతర్యం వుంది. నేను గవర్నమెంట్ బళ్ళో చదువుకోలేదు. ఇంట్లో చదువుకున్నాను. మా ఇంటికీ బడికీ దూరం తక్కువే, కాని కాలం తేడా ఎక్కువ. నేను ఇరవయ్యో శతాబ్దంలోకి కొంచెం ఆలస్యంగా వొచ్చాను. — నారా
ఆంధ్ర ప్రజానీకానికి మధుర గాయకునిగా శ్రీ పి.బి.శ్రీనివాస్ సుపరిచితులు. ఆయనను ‘ ప్రతివాద భయంకర శ్రీనివాసుగా ‘ కొంతమంది మాత్రమే ఎఱుగుదురు. వారి వంశము ప్రతివాద భయంకర వంశముగా ప్రాచుర్యము నొందిన వివరణ ఆసక్తిదాయకముగా నుంది. శ్రీ శ్రీనివాస్ గారు కవి అని, కొన్ని వృత్తాలు సృజించారని తెలిసినా ఇన్ని వివరాలు నాకు తెలియవు. ఒక మహనీయుని ప్రస్తుతించే టప్పుడు మరెంత మందో స్తవనీయులను కూడా స్మరించుకోవడము జరుగుతుంది. శ్రీ ఏల్చూరి మురళీధర రావు గారి వ్యాసములో కూడా ఆ సత్ఫలసిద్ధి సమకూడింది.
వ్యాసకర్త శ్రీ ఏల్చూరి మురళీధర రావు గారి విజ్ఞానము, పాండిత్యము , పరిశీలనా పరిశోధన దీక్షలు, ప్రస్ఫుటము. సంస్కృతాంధ్రా భాషలలో కోవిదులైన వారు కవిపుంగవులు. ఇట్టి పండితులను చూస్తూంటే తెలుగు ప్రశస్తికి లోటు లేదని తృప్తి కలుగక మానదు. శ్రీ శ్రీనివాస్ గారికి చక్కని నివాళి నొసిగిన శ్రీ ఏల్చూరి మురళీధర రావు గారికి అభినందనలతో బాటు ధన్యవాదములు.
అట్లాంటా వెళ్ళినా ఈమాటలో కనిపిస్తూనే ఉన్నార్లే అని సర్ది చెప్పుకొంటూంటే మళ్ళీ ఇంకో గుడ్‌బై ఏమిటీ? చికాగోనుంచి వెళ్లకుండా ఆపలేనివాళ్లం ఇప్పుడుకూడా ఆపలేంకానీ సంపాదకత్వం ఆపినా రాయటం ఆపకండి. మీ నంబర్ వన్ అభిమానిని ఓదార్చలేక నేను ఇబ్బందిపడాలి. ఎదురు చూస్తూ ఉంటాం.
ఉదాహరణకి, రామాయణానికి వాల్మీకి అలాంటి వాడు. ఇదే పుస్తకం భక్తిగ్రంథంగా చదివితే దానికి కర్త ఇంకొక వాల్మీకి అవుతాడు. అంటే కిరాతుడు ఋషిగా తయారయిన వాల్మీకి అవుతాడు. అంటే పుస్తకానికి అర్థం మారితే దానితో పాటు కర్త కూడా మారతాడు. ఈ రకంగా చూస్తే కవిని గురించిన కథ పుస్తకంలో భాగం. ఆ కథ కర్తృత్వంతో పాటు ఆ పుస్తకానికి వుండవలసిన స్థాయిని, ఆ పుస్తకాన్ని చదవవలసిన విధానాన్ని కూడా చెప్తుంది.
పైన “రామాయణానికి వాల్మీకి అలాంటి వాడు. ” తరువాత ఉండవలసిన వాక్యం తప్పిపోయినట్లు అనిపిస్తుంది.
తెలుగులో గుణింతం చెప్పేటప్పుడు కకారఅకారాలు క, కకారఆకారాలు కా, కకారఇకారాలు కి, కకారఈకారాలు కీ అని చెప్పేవారు. (రాయడం అలవాటు చెయ్యడానికి, కకు దీర్ఘం ఇస్తే కా, కకు కొమ్మిస్తే కు, కకు గుడిస్తే కి అని చెప్పడం తరవాత కాలంలో
ఈ రెండు పద్ధతులూ వేరు వేరు కాలాలవి అనటానికి ఆధారమేమిటి?
సంగీత సాహిత్య శ్రీనివాసుడు గురించి తృష్ణ. అభిప్రాయం:
05/04/2013 1:35 am
ఎన్నో తెలియని విశేషాలతో ఇంత చక్కని వ్యాసాన్ని అందించినందుకు ధన్యవాదాలు మురళీధరరావుగారూ.
వదిన గురించి Sowmya అభిప్రాయం:
05/04/2013 1:15 am
మోహన గారికి : నిజమే, గణతంత్ర రాజ్యం చూసినప్పుడు నేనూ ఆ ముక్క అనుకున్న… కథాకాలం గురించి. అయినా, అసలు కథ ఎప్పుడు రాయబడ్డది, ఎక్కడ ప్రచురితమైంది వంటి వివరాలు కూడా జతచేయవచ్చేమో అనుకుంటాను (ఆ వివరాలు తెలిస్తే!)… రచయిత గురించి కొన్ని వాక్యాల పరిచయం ఎలాగో ఇక్కడ పెడుతున్నారు కనుక.
మన సాహిత్యంలో కవులు, పుస్తకాలు గురించి Velcheru Narayana Rao అభిప్రాయం:
05/03/2013 11:56 pm
జంపాల గారికి మరో మాట.
చేకొని రాయనిబాచడు
కాకాలు గుణంచు పిన్న కాలము నాడే
లా కేత్వ మియ్యనేరడు,
దా కును కొమ్మియ్య డట్టి దాతలు గలరే
అనే చాటు పద్యం ఎప్పటిదో నాకు తెలియదు. కాని అప్పటికే లేఖన పద్ధతిలోగుణింతం చెప్పే అలవాటు వుంది. — నారా
మన సాహిత్యంలో కవులు, పుస్తకాలు గురించి Velcheru Narayana Rao అభిప్రాయం:
05/03/2013 11:45 pm
జంపాల గారు చూపించిన లోపం నిజమైనదే. మొదటి రామాయణాన్ని కావ్య రామాయణం అనడం ద్వారా ఈ లోపాన్ని పరిహరించొచ్చు ననుకుంటాను. ఏమైనా వాల్మీకి రామాయణానికి రెండు రకాల పఠన మార్గాలున్నాయని చెప్పడం నా ఉద్దేశం.
ఇక పోతే కకార అకారాలు క, కకార ఆకారాలుకా — అని చెప్పే పద్ధతీ, కకు దీర్ఘం ఇస్తే కా, కకు కొమ్మిస్తే కు — అని చెప్పే పద్ధతీ, వేరు వేరు కాలాలకి చెందినవని నేను అనడంలో ఒక ఆంతర్యం వుంది. నేను గవర్నమెంట్ బళ్ళో చదువుకోలేదు. ఇంట్లో చదువుకున్నాను. మా ఇంటికీ బడికీ దూరం తక్కువే, కాని కాలం తేడా ఎక్కువ. నేను ఇరవయ్యో శతాబ్దంలోకి కొంచెం ఆలస్యంగా వొచ్చాను. — నారా
సంగీత సాహిత్య శ్రీనివాసుడు గురించి Gannavarapu Narasimha Murty అభిప్రాయం:
05/03/2013 11:35 pm
ఆంధ్ర ప్రజానీకానికి మధుర గాయకునిగా శ్రీ పి.బి.శ్రీనివాస్ సుపరిచితులు. ఆయనను ‘ ప్రతివాద భయంకర శ్రీనివాసుగా ‘ కొంతమంది మాత్రమే ఎఱుగుదురు. వారి వంశము ప్రతివాద భయంకర వంశముగా ప్రాచుర్యము నొందిన వివరణ ఆసక్తిదాయకముగా నుంది. శ్రీ శ్రీనివాస్ గారు కవి అని, కొన్ని వృత్తాలు సృజించారని తెలిసినా ఇన్ని వివరాలు నాకు తెలియవు. ఒక మహనీయుని ప్రస్తుతించే టప్పుడు మరెంత మందో స్తవనీయులను కూడా స్మరించుకోవడము జరుగుతుంది. శ్రీ ఏల్చూరి మురళీధర రావు గారి వ్యాసములో కూడా ఆ సత్ఫలసిద్ధి సమకూడింది.
వ్యాసకర్త శ్రీ ఏల్చూరి మురళీధర రావు గారి విజ్ఞానము, పాండిత్యము , పరిశీలనా పరిశోధన దీక్షలు, ప్రస్ఫుటము. సంస్కృతాంధ్రా భాషలలో కోవిదులైన వారు కవిపుంగవులు. ఇట్టి పండితులను చూస్తూంటే తెలుగు ప్రశస్తికి లోటు లేదని తృప్తి కలుగక మానదు. శ్రీ శ్రీనివాస్ గారికి చక్కని నివాళి నొసిగిన శ్రీ ఏల్చూరి మురళీధర రావు గారికి అభినందనలతో బాటు ధన్యవాదములు.
గన్నవరపు నరసింహ మూర్తి
వదిన గురించి జంపాల చౌదరి అభిప్రాయం:
05/03/2013 7:44 pm
బాగుంది.
పై గదిలో ప్రేమికుడు గురించి జంపాల చౌదరి అభిప్రాయం:
05/03/2013 7:37 pm
అనువాదం బాగుంది.
కతికితే అతకదు గురించి జంపాల చౌదరి అభిప్రాయం:
05/03/2013 7:30 pm
ఫలహారాలు తినటం కూడా కతకటంకింద వస్తుందని శాస్త్రిగారు మర్చిపోయారు. పాపం, అందుకే అతకలేదు మరి.
Good Bye. గురించి జంపాల చౌదరి అభిప్రాయం:
05/03/2013 7:21 pm
అట్లాంటా వెళ్ళినా ఈమాటలో కనిపిస్తూనే ఉన్నార్లే అని సర్ది చెప్పుకొంటూంటే మళ్ళీ ఇంకో గుడ్‌బై ఏమిటీ? చికాగోనుంచి వెళ్లకుండా ఆపలేనివాళ్లం ఇప్పుడుకూడా ఆపలేంకానీ సంపాదకత్వం ఆపినా రాయటం ఆపకండి. మీ నంబర్ వన్ అభిమానిని ఓదార్చలేక నేను ఇబ్బందిపడాలి. ఎదురు చూస్తూ ఉంటాం.
మన సాహిత్యంలో కవులు, పుస్తకాలు గురించి జంపాల చౌదరి అభిప్రాయం:
05/03/2013 7:14 pm