దంత్యవర్ణ లేఖనచిహ్నాల విషయమై నేను వ్రాసినది స్పష్టంగా లేదేమో అని మళ్ళీ వ్రాస్తున్నాను: శ్రీ రావూరి దొరసామిశర్మ గారు, శ్రీ అబ్బరాజు హనుమంతరాయ శర్మ గారు వంటి కొందరు విద్వాంసులు ఈ దంత్యవర్ణ లేఖనచిహ్నాలను నియతంగా పాటించేవారు. రావూరి వారైతే ఉత్తరాలలో కూడా ఆ చిహ్నాలను నిలిపేవారు. శ్రీ శ్రీనివాస్ గారు రావూరి వారి శిష్యత్వం మూలాన ఏది వ్రాసినా, అచ్చువేసినా ఆ చిహ్నాలను ఉంచేవారు. నేను వారి పద్యాలను ఉదాహరించినపుడు ఆ విధంగానే వారి పద్ధతిలోనే ఆ గుర్తులుంచాలని ప్రయత్నించి, నా కంప్యూటర్లో సాధ్యం కాక వాటిని విడిచివేశాను – అని.
శ్రీ మోహనరావు గారి తర్కసంగతి ప్రకారమే ఆధునిక ముద్రాపకులు, లేఖకులు దంత్యవర్ణాల చిహ్నాలను పాటించటం లేదు. మనమూ మానివేశాము. బ్రౌను దొర బహుశః శబ్దస్వరూపం తెలియాలనే ఉద్దేశంతో వాటిని నిలిపి ఉండాలి. అయితే, ఆ నియమాన్ని సర్వత్ర పాటించటం సాధ్యం కాదని ఆయనే గ్రహించారనుకొంటాను. చిన్నయసూరి చూపినట్లు “అకట! పాండురాజయశ మెన్నవైతి” అన్నప్పుడు రాఘవపాండవీయంలోని పింగళి సూరన ప్రయోగంలో “జ” వర్ణం దంత్యమూ, తాలవ్యమూ రెండూ అయింది. అటువంటి అర్థద్వయప్రయోగానికి లేఖనచిహ్నం లేదు. బహుజనపల్లి వారు చూపినట్లు విజయవిలాసంలో చేమకూర వేంకటకవి “పంచదారవు గదే” అన్నప్పుడు “చ” వర్ణం దంత్యమూ, తాలవ్యమూ రెండూ అయింది. దానికి లేఖనచిహ్నం లేదు. ఈ విధమైన విరోధాలను పరిహరించే సూత్రం లేనందువల్ల బ్రౌను తర్వాతివారు ఆ లేఖనాన్ని మానివేశారు. “చందస్త్వ” శబ్దభవమైన “చాదస్తం”లో “చా” తాలవ్యంగానే వినబడుతున్నది. ఒక తరం మునుపు చేదస్తం అని వ్రాసేవారు. అదీ తాలవ్యమే. దంత్యోచ్చారణం అసలు లేదు. దీనిని వైకృతమంటే దంత్యంగా పరిగణించటం ఇష్టం లేక శబ్దరత్నాకరం గ్రామ్యంగా స్వీకరించింది. ఈ విషయంలో కొంత సందిగ్ధత ఉన్నమాట నిజం. కొందరు చదువుకున్నవారు కూడా శ్రీ మోహనరావు గారన్నట్లు దంత్య తాలవ్యాలను యథేచ్ఛగా పలుకుతున్నారు.
మొత్తానికి శ్రీనివాస్ గారు ఈ నియమాన్ని పాటించేవారు అన్నది మాత్రమే నేను చెప్పదలచినది. “ఉదాహరణ”ను యాథాతథ్యంతో ఇవ్వలేకపోయాను.
టివిలో, చలనచిత్రాలలో, పాటలలో కొందరు దంత్యములను తాలవ్యములుగా పలుకుతారు, అది వేరే విషయము అనుకోండి 🙂
మోహనగారూ,
అదే అసులు విషయం! 🙂 మీరన్నట్టు సందర్భాన్ని బట్టి చ, జ లు దంత్యాలా తాలవ్యాలా అన్నది కచ్చితంగా తెలుస్తుంది (చాలా చాలా అరుదైన సందర్భాలలో తప్ప). కాబట్టి వాటికి వేరే చిహ్నాలు అవసరం లేదు. నాకయితే కాస్త చిరాకే అనిపిస్తాయవి. బ్రౌన్‌కి తెలుగు పరాయిభాష కాబట్టి అతనికి తెలియక స్పష్టత కోసం బహుశా ప్రత్యేక చిహ్నాలు వాడి ఉండవచ్చు. అయితే, ఇప్పడు మనమందరం కూడా తెలుగుకి పరాయివాళ్ళమే అయిపోతున్నాం కదా, అంచేత స్పష్టత కోసం అవి ఉంటేనే మంచిదేమో! టీవీలూ చలనచిత్రాలవరకూ అక్కర లేదు, ఇలాంటి విషయాల్లో అందరం అప్పుడప్పుడు పప్పులోకాలేస్తూనే ఉంటాం. ఉదాహరణకి, పైన వ్యాఖ్యలో ఈమాట సంపాదకులు “ఇజీనారం”లో ఉన్నది దంత్యమని పొరబడినట్టు! 🙂
[* తెలియక చేసిన తప్పు కాదండీ. అది ఇజీనారమని తెలుసండీ. దంత్య జీ ఉదా. కోసం ప్రాసలో హడావిడిగా రాసిన పదం. ఇజీనారస్తులు నొచ్చుకోకండి – సం.
** పదం ఎలా కనిపిస్తే బాగుంటుంది? అని మేము తరచూ ఆలోచిస్తుంటాం. ఉదా. ఎక్స్పెక్‌టేషన్ అంటే బాగుంటుందా, ఎక్స్‌పెక్టేషన్ అంటేనా, ఎక్స్పెక్టేషన్ అంటేనా? సంస్కృతాంగ్ల పదాల చివరలో సున్నా బదులు మ్ వాడడం, భూరుహం బదులు భూరుహమ్, కాలం బదులు కాలమ్, — ఇలాగా. ఇంకా ఒక నిర్దిష్టమైన నియమం అంటూ ఏమీ లేదు కానీ ప్రయత్నిస్తున్నాం. దంత్య చ,జల చిహ్నాలు వాడడం ఈ ప్రయత్నంలో ఒక భాగం. ఇలా చిహ్నాలు వాడడం ద్వారా అవేమీటో తెలియని వారిలో కుతూహలం కలిగించే అవకాశం కూడా ఉంది కదా. – సం.]
ఈమాటలో రాసే వారిలో కనీసం అర డజను మంది సైన్సు/ఇంజినీరింగ్ పీహెచ్.డీలు ఉండి ఉంటారు నాకు తెలిసి. వీరంతా అప్పుడప్పుడూ సైన్సు,ఇంజినీరింగ్ కి సంబంధించిన వ్యాసాలు రాస్తే బాగుంటుంది.
ఇంద్రాణి అభిప్రాయంతో నేను ఏకీభవిస్తాను. ఈమాటను తప్పకుండా చదవాలి అని అనుకునేటట్లు చేసినది శ్రీ కొడవళ్ళ వ్యాసాలు. ఆయన రాయక పోవటం నాకు కోపాన్ని తెప్పిస్తోంది.
It is not my intention to hijack the thread on PBS. అసలు దంత్య చ, జ లకు ప్రత్యేక చిహ్నములు ఎందుకు వాడాలి? చ, జ, చు, జు, చొ, జొ, చౌ, జౌ లు ఉండే అచ్చ తెలుగు పదాలలో ఉంటే అవి దంత్యాలే కదా? సి పి బ్రవున్ వంటి వాళ్లు ఉపయోగించినంత మాత్రాన అందరూ అవి వాడాలా? Is it not implicitly understood? టివిలో, చలనచిత్రాలలో, పాటలలో కొందరు దంత్యములను తాలవ్యములుగా పలుకుతారు, అది వేరే విషయము అనుకోండి 🙂 విధేయుడు – మోహన
జ్వరంతో బాధపడుతూ నేను అనుకున్నది పూర్తిగా రాయలేకపోయాను, ముందు మెయిల్లో.
విద్యార్దిని అంటే నేను ఇప్పుడు చదువుకుంటున్నానని కాదు. దానికున్న విస్తృతార్ధంలో వాడాను. ఈమాటలో రాసే వారిలో కనీసం అర డజను మంది సైన్సు/ఇంజినీరింగ్ పీహెచ్.డీలు ఉండి ఉంటారు నాకు తెలిసి. వీరంతా అప్పుడప్పుడూ సైన్సు,ఇంజినీరింగ్ కి సంబంధించిన వ్యాసాలు రాస్తే బాగుంటుంది.
మీరు, నా ఉత్తరం చదివిన ఇతరులు స్పందిస్తారని ఎదురు చూస్తున్నాను.
(ఇంకో రెండు పేరాలు రాసి, అవసరం లేదని తీసివేసి ఇది పంపుతున్నాను. 🙂 )
you can use any computer, tablet or pad but to properly display ౘ, ౙ గుణింతాలు it must have Windows 8 OS.
– నేను ఆయా గుణింతాలు నిజంగా ఎలా ఉంటాయో ఎప్పుడూ చూడలేదు కానీ, నా ఉబంటూ ఆపరేటింగ్ సిస్టం లో ఆయా గుణింతాలు బాగానే కనిపిస్తున్నాయి. కనుక, కేవలం విండోస్ 8 లోనే కనిపిస్తాయి అనలేము ఏమో అనుకుంటూన్నాను. ఇంతకీ, నాకు విండోస్లో ఎలాగ కనిపిస్తుందో తెలియదు కనుక – ఉబుంటూ రెండరింగ్ లో తేడా ఉందా? అన్నది మాత్రం నాకు తెలియదు!
[మీరన్నది నిజమే. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ లో 8లో మాత్రమే… అని అనాలి. ఈమాట పాఠకుల్లో ఇంచుమించు 80% విండోస్ వాడతారు. అందువల్ల నా వ్యాఖ్య కేవలం ఆ ఒ.ఎస్. కి సంబంధించింది మాత్రమేగా గమనించగలరు. – సం.]
అవిస్మరణీయ గాయనులు, సాహిత్యసౌహిత్యమూర్తి శ్రీ శ్రీనివాస్ గారిపైని గౌరవంతో నీరవమైన నా రవాన్ని ఆదరించిన మీ అందరికి నమస్సుమనోంజలి!
శ్రీ ఏల్చూరి: క్షమించండి. ‘నీరవమైన నా రవాన్ని’ మీ ఇతర ప్రయోగాల లాగా అందంగా లేదు. కె వి రెడ్డి స్వర్గతులైనపుడు నరసరాజు [విజయ చిత్రలో నేమో] తన నివాళిని విశ్వనాథ పద్యభాగం ‘గళస్థ గాద్గదికము నా పనికి చాలక చేసెడు’ని గుర్తు చేసుకుంటూ ముగించినది తలుచుకుంటే ఇప్పటికీ నా కన్ను నీరొలికిస్తుంది.
ప్లే బ్యాక్ సింగర్ పి. బి. ఎస్. గురించి umamaheswara rao m అభిప్రాయం:
05/10/2013 7:28 am
రచయితలకు, చాలా చక్కని వ్యాసం. ఒక చిన్న వివరం కావాలి. ప్రేమించి చూడు సినిమాలో ANR పాటలు PBS పాడడంలో రహస్యం చెప్పగలరా!
జాతర గురించి N.Venkateswararao అభిప్రాయం:
05/10/2013 4:04 am
మీ కవిత అరణ్య కాండలా ఉంది
సంగీత సాహిత్య శ్రీనివాసుడు గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:
05/10/2013 2:23 am
అందరికి నమస్కృతులతో,
దంత్యవర్ణ లేఖనచిహ్నాల విషయమై నేను వ్రాసినది స్పష్టంగా లేదేమో అని మళ్ళీ వ్రాస్తున్నాను: శ్రీ రావూరి దొరసామిశర్మ గారు, శ్రీ అబ్బరాజు హనుమంతరాయ శర్మ గారు వంటి కొందరు విద్వాంసులు ఈ దంత్యవర్ణ లేఖనచిహ్నాలను నియతంగా పాటించేవారు. రావూరి వారైతే ఉత్తరాలలో కూడా ఆ చిహ్నాలను నిలిపేవారు. శ్రీ శ్రీనివాస్ గారు రావూరి వారి శిష్యత్వం మూలాన ఏది వ్రాసినా, అచ్చువేసినా ఆ చిహ్నాలను ఉంచేవారు. నేను వారి పద్యాలను ఉదాహరించినపుడు ఆ విధంగానే వారి పద్ధతిలోనే ఆ గుర్తులుంచాలని ప్రయత్నించి, నా కంప్యూటర్లో సాధ్యం కాక వాటిని విడిచివేశాను – అని.
శ్రీ మోహనరావు గారి తర్కసంగతి ప్రకారమే ఆధునిక ముద్రాపకులు, లేఖకులు దంత్యవర్ణాల చిహ్నాలను పాటించటం లేదు. మనమూ మానివేశాము. బ్రౌను దొర బహుశః శబ్దస్వరూపం తెలియాలనే ఉద్దేశంతో వాటిని నిలిపి ఉండాలి. అయితే, ఆ నియమాన్ని సర్వత్ర పాటించటం సాధ్యం కాదని ఆయనే గ్రహించారనుకొంటాను. చిన్నయసూరి చూపినట్లు “అకట! పాండురాజయశ మెన్నవైతి” అన్నప్పుడు రాఘవపాండవీయంలోని పింగళి సూరన ప్రయోగంలో “జ” వర్ణం దంత్యమూ, తాలవ్యమూ రెండూ అయింది. అటువంటి అర్థద్వయప్రయోగానికి లేఖనచిహ్నం లేదు. బహుజనపల్లి వారు చూపినట్లు విజయవిలాసంలో చేమకూర వేంకటకవి “పంచదారవు గదే” అన్నప్పుడు “చ” వర్ణం దంత్యమూ, తాలవ్యమూ రెండూ అయింది. దానికి లేఖనచిహ్నం లేదు. ఈ విధమైన విరోధాలను పరిహరించే సూత్రం లేనందువల్ల బ్రౌను తర్వాతివారు ఆ లేఖనాన్ని మానివేశారు. “చందస్త్వ” శబ్దభవమైన “చాదస్తం”లో “చా” తాలవ్యంగానే వినబడుతున్నది. ఒక తరం మునుపు చేదస్తం అని వ్రాసేవారు. అదీ తాలవ్యమే. దంత్యోచ్చారణం అసలు లేదు. దీనిని వైకృతమంటే దంత్యంగా పరిగణించటం ఇష్టం లేక శబ్దరత్నాకరం గ్రామ్యంగా స్వీకరించింది. ఈ విషయంలో కొంత సందిగ్ధత ఉన్నమాట నిజం. కొందరు చదువుకున్నవారు కూడా శ్రీ మోహనరావు గారన్నట్లు దంత్య తాలవ్యాలను యథేచ్ఛగా పలుకుతున్నారు.
మొత్తానికి శ్రీనివాస్ గారు ఈ నియమాన్ని పాటించేవారు అన్నది మాత్రమే నేను చెప్పదలచినది. “ఉదాహరణ”ను యాథాతథ్యంతో ఇవ్వలేకపోయాను.
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు
సంగీత సాహిత్య శ్రీనివాసుడు గురించి కామేశ్వరరావు అభిప్రాయం:
05/10/2013 1:51 am
మోహనగారూ,
అదే అసులు విషయం! 🙂 మీరన్నట్టు సందర్భాన్ని బట్టి చ, జ లు దంత్యాలా తాలవ్యాలా అన్నది కచ్చితంగా తెలుస్తుంది (చాలా చాలా అరుదైన సందర్భాలలో తప్ప). కాబట్టి వాటికి వేరే చిహ్నాలు అవసరం లేదు. నాకయితే కాస్త చిరాకే అనిపిస్తాయవి. బ్రౌన్‌కి తెలుగు పరాయిభాష కాబట్టి అతనికి తెలియక స్పష్టత కోసం బహుశా ప్రత్యేక చిహ్నాలు వాడి ఉండవచ్చు. అయితే, ఇప్పడు మనమందరం కూడా తెలుగుకి పరాయివాళ్ళమే అయిపోతున్నాం కదా, అంచేత స్పష్టత కోసం అవి ఉంటేనే మంచిదేమో! టీవీలూ చలనచిత్రాలవరకూ అక్కర లేదు, ఇలాంటి విషయాల్లో అందరం అప్పుడప్పుడు పప్పులోకాలేస్తూనే ఉంటాం. ఉదాహరణకి, పైన వ్యాఖ్యలో ఈమాట సంపాదకులు “ఇజీనారం”లో ఉన్నది దంత్యమని పొరబడినట్టు! 🙂
[* తెలియక చేసిన తప్పు కాదండీ. అది ఇజీనారమని తెలుసండీ. దంత్య జీ ఉదా. కోసం ప్రాసలో హడావిడిగా రాసిన పదం. ఇజీనారస్తులు నొచ్చుకోకండి – సం.
** పదం ఎలా కనిపిస్తే బాగుంటుంది? అని మేము తరచూ ఆలోచిస్తుంటాం. ఉదా. ఎక్స్పెక్‌టేషన్ అంటే బాగుంటుందా, ఎక్స్‌పెక్టేషన్ అంటేనా, ఎక్స్పెక్టేషన్ అంటేనా? సంస్కృతాంగ్ల పదాల చివరలో సున్నా బదులు మ్ వాడడం, భూరుహం బదులు భూరుహమ్, కాలం బదులు కాలమ్, — ఇలాగా. ఇంకా ఒక నిర్దిష్టమైన నియమం అంటూ ఏమీ లేదు కానీ ప్రయత్నిస్తున్నాం. దంత్య చ,జల చిహ్నాలు వాడడం ఈ ప్రయత్నంలో ఒక భాగం. ఇలా చిహ్నాలు వాడడం ద్వారా అవేమీటో తెలియని వారిలో కుతూహలం కలిగించే అవకాశం కూడా ఉంది కదా. – సం.]
ఆకుపై నిలిచిన వానచినుకులు గురించి srinivas.Katragadda అభిప్రాయం:
05/09/2013 9:51 pm
పదాల కలయిక అద్భుతముగా సృజించిన మీకు శిరసు వంచి అభినందనలు తెలియజేస్తున్నాను.
పై గదిలో ప్రేమికుడు గురించి తః తః అభిప్రాయం:
05/09/2013 4:53 pm
ఇంద్రాణి అభిప్రాయంతో నేను ఏకీభవిస్తాను. ఈమాటను తప్పకుండా చదవాలి అని అనుకునేటట్లు చేసినది శ్రీ కొడవళ్ళ వ్యాసాలు. ఆయన రాయక పోవటం నాకు కోపాన్ని తెప్పిస్తోంది.
తః తః
సంగీత సాహిత్య శ్రీనివాసుడు గురించి మోహన అభిప్రాయం:
05/09/2013 4:38 pm
It is not my intention to hijack the thread on PBS. అసలు దంత్య చ, జ లకు ప్రత్యేక చిహ్నములు ఎందుకు వాడాలి? చ, జ, చు, జు, చొ, జొ, చౌ, జౌ లు ఉండే అచ్చ తెలుగు పదాలలో ఉంటే అవి దంత్యాలే కదా? సి పి బ్రవున్ వంటి వాళ్లు ఉపయోగించినంత మాత్రాన అందరూ అవి వాడాలా? Is it not implicitly understood? టివిలో, చలనచిత్రాలలో, పాటలలో కొందరు దంత్యములను తాలవ్యములుగా పలుకుతారు, అది వేరే విషయము అనుకోండి 🙂 విధేయుడు – మోహన
పై గదిలో ప్రేమికుడు గురించి indrani Palaparthy అభిప్రాయం:
05/09/2013 4:37 pm
శారద గారు:
జ్వరంతో బాధపడుతూ నేను అనుకున్నది పూర్తిగా రాయలేకపోయాను, ముందు మెయిల్లో.
విద్యార్దిని అంటే నేను ఇప్పుడు చదువుకుంటున్నానని కాదు. దానికున్న విస్తృతార్ధంలో వాడాను. ఈమాటలో రాసే వారిలో కనీసం అర డజను మంది సైన్సు/ఇంజినీరింగ్ పీహెచ్.డీలు ఉండి ఉంటారు నాకు తెలిసి. వీరంతా అప్పుడప్పుడూ సైన్సు,ఇంజినీరింగ్ కి సంబంధించిన వ్యాసాలు రాస్తే బాగుంటుంది.
మీరు, నా ఉత్తరం చదివిన ఇతరులు స్పందిస్తారని ఎదురు చూస్తున్నాను.
(ఇంకో రెండు పేరాలు రాసి, అవసరం లేదని తీసివేసి ఇది పంపుతున్నాను. 🙂 )
ఇంద్రాణి.
సంగీత సాహిత్య శ్రీనివాసుడు గురించి Sowmya అభిప్రాయం:
05/09/2013 4:17 pm
– నేను ఆయా గుణింతాలు నిజంగా ఎలా ఉంటాయో ఎప్పుడూ చూడలేదు కానీ, నా ఉబంటూ ఆపరేటింగ్ సిస్టం లో ఆయా గుణింతాలు బాగానే కనిపిస్తున్నాయి. కనుక, కేవలం విండోస్ 8 లోనే కనిపిస్తాయి అనలేము ఏమో అనుకుంటూన్నాను. ఇంతకీ, నాకు విండోస్లో ఎలాగ కనిపిస్తుందో తెలియదు కనుక – ఉబుంటూ రెండరింగ్ లో తేడా ఉందా? అన్నది మాత్రం నాకు తెలియదు!
[మీరన్నది నిజమే. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ లో 8లో మాత్రమే… అని అనాలి. ఈమాట పాఠకుల్లో ఇంచుమించు 80% విండోస్ వాడతారు. అందువల్ల నా వ్యాఖ్య కేవలం ఆ ఒ.ఎస్. కి సంబంధించింది మాత్రమేగా గమనించగలరు. – సం.]
సంగీత సాహిత్య శ్రీనివాసుడు గురించి తః తః అభిప్రాయం:
05/09/2013 3:58 pm

నమస్సులతొ
తః తః