ఈ సందర్భంలో మరొక మాట చెప్పాలనిపిస్తోంది. పాలగుమ్మిగారి పాట వీణ మీటితే ఈమని తరలి వచ్చింది ఆమని – సరిగా ఈమనిగారి వీణావాదనకి ఒక మంచి ప్రశంస.
చాలా తెలుగువారిలాగే, ఈమనిగారు కూడా అరవ రాజకీయాలకి బలై పోవటం చాలా బాధగా ఉంది. సాయి బ్రహ్మానందంగారు ఎవరిదో వాయిద్యం బాగుందని వింటున్నానని (2008లో) రాశారు. వీణవాయిద్యాన్ని వినిపించే అవకాశం పక్షపాతం లేకుండా అందరికీ కలిగిస్తే, మీరు, మనము ఇంకా చాలా మంచి కచేరిలు వినగలము. అది ఈ రోజుల్లో కరువైపొయింది.
ఈమని గారి కచేరీలు ప్రత్యక్షంగా చూడగలిగే అదృష్టం నాకు కలిగింది. మాది కాకినాడ దగ్గర రామచంద్రపురం. కాకినాడ, ద్రాక్షారామం వచ్చినప్పుడల్లా ఈమనిగారు మా ఊరిలో కూడా కచేరీ చేసేవారు. వారి కచేరీ గురించి కాని, వాదన గురించి కాని రాసే అంత అర్హత నాకు లేదు. కాని, ఒక్కటి తప్పక చెప్పాలి. వారి కచేరీ వింటూ చాలా ఎమోషనల్ అయిపోయేదాన్ని. ఇప్పటిలాగా రికార్డ్ చేసుకొనే సదుపాయం ఉంటే ఎంత బాగుండేది అని ఇప్పుడు బాధపడుతుంటాను. వారి కచేరీలో నాకు బాగా గుర్తుండిపోయిన, మనసుకి బాగ హత్తుకుపొయిన సంగతి ఏంటంటే, ఈమనిగారు ఒక గాజుగ్లాస్ తీసుకొని, దానిని వేలితో కొట్టి, ఆ శబ్దాన్ని వీణమీద పలికించారు. అలాగే, చాలా శబ్దాలను పలికించడం అన్నది ఇప్పటికీ నేను మర్చిపోలేనిది.
త: త: గారు వాసాగారి కచేరి గురించి రాశారు. నేను ఆ గొప్ప విద్వాంసుని వాదన వినలేకపోయాను. కాని, నా పూర్వజన్మ సుకృతంచేత వారి వారసురాలైన శ్రీమతి ఆనందరాజ్యలక్ష్మిగారి శిష్యరికం చేస్తూ వారి వాదనను ఎంతో వివరంగా వినగలుగుతున్నాను.
ఈమనివారివలే, వాసాగారి లాగానే మా గురువుగారు కూడా చాలా కల్మషం లేకుండా కేవలం సంగీతం కోసమే సంగీతాన్ని / వీణని పలికించేవారగుటం వలని, వారు హైదరాబాద్ వంటి మహాపట్టణంలో ఉన్నా వారి పేరు వేరే వారి పేరులాగ వినిపించటం లేదు.
ఏది ఎమైనా, ఈమనిగారి రికార్డ్స్ ఎమైనా దొరికితే, ఈమాటలో ఇవ్వండి. బహుశా ఈమని కళ్యాణిగారు ఏమైన సాయం చేస్తారా?
లైలాగారికి, దగ్గుపాటిగారికి వారి అభిప్రాయములకై కృతజ్ఞతలు. దీనివల్ల కొందఱైనా ఈ కాలంలో పద్య కవిత్వంపై ఆదరం చూపుతున్నారని స్పష్టమైంది. లైలాగారు లేవనెత్తిన అంశాలకు ఈ క్రింద వివరణ లిస్తున్నాను.
1. అమరకోశమనేది సుప్రసిద్ధమైన శ్లోకరూపంలో ఉండే సంస్కృతనిఘంటువు. ఇందులో పదిహేను వందల శ్లోకాలున్నవి. సంస్కృతం నేర్చుకొనేవారు మొట్టమొదట కంఠస్థం చేసే గ్రంథమిది. తెలుగు పట్టుబడాలన్నా ఇది నేర్చుకొనవలసిందే.
3. ‘విద్యుల్లతికను మేఘుఁడు హృద్యంబుగఁ బొదివినట్టు లెదలోఁ బొదివెన్’ అన్న భావం పునరుక్తం కాలేదు. అది ఖండికలో ఒకే ఒకసారి వెలిబుచ్చబడింది. ఈ పద్యంలో మఱొక విశేషం ఉంది. ప్రాసస్థానంలో ద్య అను సంయుక్తమైన శబ్దము, ద తో గాఢంగా కూడుకొన్న య ఒత్తు, ఆ గాఢాలింగనదృశ్యాన్ని వ్రాత ద్వారా, శబ్దం ద్వారా మనకు ప్రత్యక్షీకరిస్తున్నవి. పైగా పద్యంలో ప్రాసస్థానంలో, అంటే రెండవస్థానంలో ఉండే ఈ సంయుక్తాక్షరం, అది ఇర్వురు వ్యక్తుల మధ్య కూడిన గాఢాలింగనం అనే విషయాన్నీ సూచిస్తున్నది. ఇటువంటి కావ్యగుణానికి ‘ఔదార్య’మని పేరు.
4. శుకరాయబారాలు, హంసరాయబారాలు చర్వితచర్వణములే. అందులో నూతనత్వ మేముంది?
‘Where there is risk is there the reward’ దూతి నీవిధంగా పంపి అతని బలహీనతను కూడ ప్రత్యక్షంగా నిరూపించి అతనిని ప్రసన్నం చేసికొనడంలో క్రొత్తదనముంది. ఈ పథకానికి అనుగుణంగా నాయికాదూతికల మనఃస్థితులు ఈ ఖండికలో నిరూపింపబడ్డవి.
“సుందరదూతికాకృతియు..” అనే పద్యంలో దౌత్యాని కర్హమైన గుణవిశేషములు, అందులో గూఢంగా నిక్షిప్తమై యున్న పథకం వివరింపబడింది. కాని ఇందులో గల ప్రమాదం తరళికకు స్ఫురించకుండా ఉండలేదు. అందుచేతనే, ఆమె ‘ఏమె! జ్యోత్స్నాభిసారికాకృతినిఁ బూని..’ అన్న పద్యంలో ఈ పథకంలో గల ప్రమాదాన్ని నర్మగర్భితంగా వెలిబుచ్చింది. దానికి ‘అతని రాతిడెందము..’ అన్న పద్యంలో ముఖ్యంగా ‘నీదు మేలు గాదటె చెలి నాదు మేలు?’ అన్న వాక్యం ఆమెకు కొంత ఊరట కల్గించింది. పైగా, ‘ఐన మఱవకుము మననెయ్యంపు మాట!’ అన్న పద్యంలో పైమాటకు కట్టుబడి ఉండమని నాయిక దూతికను మెత్తగా హెచ్చరించింది. మొత్తానికి దూతికయందు నాయికకు అపనమ్మకం కంటె నమ్మకమే కాస్త అధికంగా ఉందనే అనుకోవాలి. దూతిక కూడ మానవసహజమైన లోభమునకు అతీతురాలు గాదనే విషయం ‘అదటున నాతఁ డా యువతి నక్కునఁ జేర్పఁగ …’ అన్న పద్యంలో వ్యక్తీకరింపబడింది. ఇది దౌత్యం చేసినందున దూతిక కబ్బిన విశేషఫల మనుకుంటే నష్టంలేదు. కాని దూతిక స్వార్థపరురాలు గాదు. ఈ విషయం ‘అట్లు పారవశ్యము నంది ..’, ‘అట్టు లుద్బుద్ధచిత్తయై..’ అన్న పద్యాల్లో వ్యక్తమైంది. తరళిక ఆమె అందచందాలు, విధేయత్వము తెలిసినది కావుననే ఆమె నీ కార్యమునకు నియోగించిన దని దీనివల్ల స్పష్టమౌతున్నది.
శ్రీమతి ఆకొండి (ముద్దు) వెంకట లక్ష్మి గారికి
నమస్కృతులతో,
వ్యాసాన్ని ఆసాంతం చదివి మీ స్పందనను ఎంతో ఆదృతిపూర్వకంగా వ్రాసినందుకు కృతజ్ఞుణ్ణి. మీరడిగిన ప్రశ్నలకు వివృతి:
1) గాయన – గాయక శబ్దాలు రెండూ ఏకార్థకపదాలే. అయితే, స్థూలదృష్టికి నిఘంటువులు – గాయనుడు = గానోపజీవి, సంగీతాన్ని వృత్తిగా స్వీకరించినవాడు అని; గాయకుడు = గానకర్త, శాస్త్రీయంగా పాడే కళాకారుడు అన్న అర్థభేదాలను పరిగణించినట్లు కనబడుతుంది. అందుకు కారణమేమిటో ఆలోచించాలి. కవిప్రయోగాలు మాత్రం పర్యాయకృతంగా ఉన్నాయి. లాక్షణికులు కూడా ఈ వ్యత్యాసాలను పాటించలేదు.
ఏకశ్చేద్గాయకః స స్యాద్యమలకౌ స్మృతౌ
మిలిత్వా బహుభిర్యస్తు గీతం గాయతి గాయకః.
అని సోమదేవుని అభిలాషితార్థచింతామణి.
తొలినాటి సంస్కృతాంధ్ర కవులు “గాయన” శబ్దాన్ని ఎక్కువగా అభిమానించారు. “నానాగాయనగాయనీమణుల గానం బుర్వి నాలింపమో!” అని వసుచరిత్ర.
ప్రాచీనకవిప్రయోగాలలో “గాయక” శబ్దం అతివిరళం. ఆధునికప్రయోగాలే ఎక్కువ.
2) వచక్నుని కుమార్తె వాచక్నవి. ఆమె బ్రహ్మవాదిని, విదుషీతల్లజ కావటం వల్ల అనంతరకాలంలో వాచక్నవి అంటే విద్వాంసురాలు అని అర్థం ఏర్పడింది. వ్యుత్పత్త్యర్థాన్ని బట్టి చూసినా విదుషి అనే. సంస్కృతంలో వాచక్నవి అనే కవయిత్రి పేరు కూడా ప్రసిద్ధం. మానవల్లి రామకృష్ణకవి గారు ఆమెను గుఱించి పలువ్యాసాలలో ప్రస్తావించారు.
No doubt. No doubt it is beautiful. But then, the poet used it a few times too many, in too small a space of a poetry piece. Still, I suppose, when he is making such a good case, why complain about such sparkly recapitulations.
Don’t you think the heroine took too big a risk, in choosing this particular messenger/ambassador? I mean, it is not as innocuous as choosing a parrot, swan or a cloud. Why in the world did she do that? Still thinking about the plot,
శారద గారి అనువాదాలు, అనువదించడం కోసం వారు ఎంచుకునే కధలు, బాగుంటాయి.
ఈ కధ నాకు నచ్చలేదన్నానే కానీ అనువాదం బావులేదనలేదు. ఇదో వ్యాపకం/ఆసక్తి అని నాకు తెలుసును.
తెలుగులో సైన్సు/సైన్సు ఫిక్షన్ తక్కువ ఉంది కాబట్టి సైన్సు, సాహిత్యం రెండూ తెలిసిన వారు అలాంటివి సులువైన భాషలో రాస్తే బాగుంటుందని, ఉపయోగకరంగా ఉంటుందని నాకు తోచిన సలహా ఇచ్చేనండి. ఇంద్రాణి చెప్పింది కదా అని ఆవిడ గానీ ఇక్కడ రాసే ఇతరులు కానీ వెంటనే కాగితాలు కలాలు తీసుకుని రాసేస్తారని నేనేమీ అనుకోవడం లేదండి.
మీరు రాసే అభిప్రాయంలో ఇతరులు రాసిన రాతలను పేర్కొనడం ఏమీ బాగోలేదండి. బాగులేదని రాసిన వారు విలన్లేమీ కాదండి. అయినా కధ శారద గారు రాయలేదు కదండి.
మీకు కధ కధగా నచ్చిందని రాశారు. చిరునవ్వు కూడా తెప్పించిందన్నారు కాబట్టి ఆ చల్లని మాటలు మాత్రం రాసి ఊరుకుంటే బాగుండేదేమో అని నాకు అనిపించిందండి.
నాకు ఈ “చప్పగా, అనువాదం, లెక్కల పాఠం మరియు సైన్సు వ్యాసాలు / సైన్సు ఫిక్షను” గురించి తెలిసినట్టులేదు. అందుకే కథ కథగా బాగా నచ్చింది. శారదగారు న్యూక్లియర్ శాస్త్రరంగంలో పరిశోధకురాలిగా పనిచేస్తూ ఉండవచ్చు, కాబట్టి సైన్సు వ్యాసాలు / సైన్సు ఫిక్షను మాత్రమే వ్రాయాలని లేదుగా. ఎన్నో వ్యాపకాలలో ఇదొకటి అనుకోవచ్చుగా. నా వరకు నాకు కథ బాగా వుంది. చివర్లో చిరునవ్వు తెప్పించింది. ఇంకా చెప్పాలనుంది కానీ నా అనుభవం, వయసు సాహిత్యపరంగా అంత సాహసం చేయనివ్వడంలేదు.
మహామహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రి గురించి chudamani అభిప్రాయం:
06/17/2013 6:59 am

06/17/2013 6:57 am

దోసిట్లో నక్షత్రాలు గురించి కొత్త రవికిరణ్ అభిప్రాయం:
06/17/2013 5:21 am
చాలా కాలం తర్వాత యాదృచ్ఛికంగా, ఎత్తిన తల దించి చూసుకుంటే దోసిట్లో నక్షత్రాలు కనిపించి మనసును మెరిపించాయి. నక్షత్రాలు చూపినందుకు ధన్యవాదాలు సుబ్బూ..
చతురదూతిక గురించి దేశికాచారి అభిప్రాయం:
06/16/2013 11:20 am
లైలాగారికి, దగ్గుపాటిగారికి వారి అభిప్రాయములకై కృతజ్ఞతలు. దీనివల్ల కొందఱైనా ఈ కాలంలో పద్య కవిత్వంపై ఆదరం చూపుతున్నారని స్పష్టమైంది. లైలాగారు లేవనెత్తిన అంశాలకు ఈ క్రింద వివరణ లిస్తున్నాను.
1. అమరకోశమనేది సుప్రసిద్ధమైన శ్లోకరూపంలో ఉండే సంస్కృతనిఘంటువు. ఇందులో పదిహేను వందల శ్లోకాలున్నవి. సంస్కృతం నేర్చుకొనేవారు మొట్టమొదట కంఠస్థం చేసే గ్రంథమిది. తెలుగు పట్టుబడాలన్నా ఇది నేర్చుకొనవలసిందే.
2. పద్యాదిలో వ్యంజనముపై సంధివశమున వచ్చిన అచ్చుకే యతి చెల్లింపవలసి యుండగా, అట్లుగాక వ్యంజనమిత్రమైన యక్షరమునకు యతి చెల్లించుట ‘అఖండయతి’ అనబడును.
3. ‘విద్యుల్లతికను మేఘుఁడు హృద్యంబుగఁ బొదివినట్టు లెదలోఁ బొదివెన్’ అన్న భావం పునరుక్తం కాలేదు. అది ఖండికలో ఒకే ఒకసారి వెలిబుచ్చబడింది. ఈ పద్యంలో మఱొక విశేషం ఉంది. ప్రాసస్థానంలో ద్య అను సంయుక్తమైన శబ్దము, ద తో గాఢంగా కూడుకొన్న య ఒత్తు, ఆ గాఢాలింగనదృశ్యాన్ని వ్రాత ద్వారా, శబ్దం ద్వారా మనకు ప్రత్యక్షీకరిస్తున్నవి. పైగా పద్యంలో ప్రాసస్థానంలో, అంటే రెండవస్థానంలో ఉండే ఈ సంయుక్తాక్షరం, అది ఇర్వురు వ్యక్తుల మధ్య కూడిన గాఢాలింగనం అనే విషయాన్నీ సూచిస్తున్నది. ఇటువంటి కావ్యగుణానికి ‘ఔదార్య’మని పేరు.
4. శుకరాయబారాలు, హంసరాయబారాలు చర్వితచర్వణములే. అందులో నూతనత్వ మేముంది?
‘Where there is risk is there the reward’ దూతి నీవిధంగా పంపి అతని బలహీనతను కూడ ప్రత్యక్షంగా నిరూపించి అతనిని ప్రసన్నం చేసికొనడంలో క్రొత్తదనముంది. ఈ పథకానికి అనుగుణంగా నాయికాదూతికల మనఃస్థితులు ఈ ఖండికలో నిరూపింపబడ్డవి.
“సుందరదూతికాకృతియు..” అనే పద్యంలో దౌత్యాని కర్హమైన గుణవిశేషములు, అందులో గూఢంగా నిక్షిప్తమై యున్న పథకం వివరింపబడింది. కాని ఇందులో గల ప్రమాదం తరళికకు స్ఫురించకుండా ఉండలేదు. అందుచేతనే, ఆమె ‘ఏమె! జ్యోత్స్నాభిసారికాకృతినిఁ బూని..’ అన్న పద్యంలో ఈ పథకంలో గల ప్రమాదాన్ని నర్మగర్భితంగా వెలిబుచ్చింది. దానికి ‘అతని రాతిడెందము..’ అన్న పద్యంలో ముఖ్యంగా ‘నీదు మేలు గాదటె చెలి నాదు మేలు?’ అన్న వాక్యం ఆమెకు కొంత ఊరట కల్గించింది. పైగా, ‘ఐన మఱవకుము మననెయ్యంపు మాట!’ అన్న పద్యంలో పైమాటకు కట్టుబడి ఉండమని నాయిక దూతికను మెత్తగా హెచ్చరించింది. మొత్తానికి దూతికయందు నాయికకు అపనమ్మకం కంటె నమ్మకమే కాస్త అధికంగా ఉందనే అనుకోవాలి. దూతిక కూడ మానవసహజమైన లోభమునకు అతీతురాలు గాదనే విషయం ‘అదటున నాతఁ డా యువతి నక్కునఁ జేర్పఁగ …’ అన్న పద్యంలో వ్యక్తీకరింపబడింది. ఇది దౌత్యం చేసినందున దూతిక కబ్బిన విశేషఫల మనుకుంటే నష్టంలేదు. కాని దూతిక స్వార్థపరురాలు గాదు. ఈ విషయం ‘అట్లు పారవశ్యము నంది ..’, ‘అట్టు లుద్బుద్ధచిత్తయై..’ అన్న పద్యాల్లో వ్యక్తమైంది. తరళిక ఆమె అందచందాలు, విధేయత్వము తెలిసినది కావుననే ఆమె నీ కార్యమునకు నియోగించిన దని దీనివల్ల స్పష్టమౌతున్నది.
సంగీత సాహిత్య శ్రీనివాసుడు గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:
06/15/2013 12:54 pm
శ్రీమతి ఆకొండి (ముద్దు) వెంకట లక్ష్మి గారికి
నమస్కృతులతో,
వ్యాసాన్ని ఆసాంతం చదివి మీ స్పందనను ఎంతో ఆదృతిపూర్వకంగా వ్రాసినందుకు కృతజ్ఞుణ్ణి. మీరడిగిన ప్రశ్నలకు వివృతి:
1) గాయన – గాయక శబ్దాలు రెండూ ఏకార్థకపదాలే. అయితే, స్థూలదృష్టికి నిఘంటువులు – గాయనుడు = గానోపజీవి, సంగీతాన్ని వృత్తిగా స్వీకరించినవాడు అని; గాయకుడు = గానకర్త, శాస్త్రీయంగా పాడే కళాకారుడు అన్న అర్థభేదాలను పరిగణించినట్లు కనబడుతుంది. అందుకు కారణమేమిటో ఆలోచించాలి. కవిప్రయోగాలు మాత్రం పర్యాయకృతంగా ఉన్నాయి. లాక్షణికులు కూడా ఈ వ్యత్యాసాలను పాటించలేదు.
ఏకశ్చేద్గాయకః స స్యాద్యమలకౌ స్మృతౌ
మిలిత్వా బహుభిర్యస్తు గీతం గాయతి గాయకః.
అని సోమదేవుని అభిలాషితార్థచింతామణి.
తొలినాటి సంస్కృతాంధ్ర కవులు “గాయన” శబ్దాన్ని ఎక్కువగా అభిమానించారు. “నానాగాయనగాయనీమణుల గానం బుర్వి నాలింపమో!” అని వసుచరిత్ర.
ప్రాచీనకవిప్రయోగాలలో “గాయక” శబ్దం అతివిరళం. ఆధునికప్రయోగాలే ఎక్కువ.
2) వచక్నుని కుమార్తె వాచక్నవి. ఆమె బ్రహ్మవాదిని, విదుషీతల్లజ కావటం వల్ల అనంతరకాలంలో వాచక్నవి అంటే విద్వాంసురాలు అని అర్థం ఏర్పడింది. వ్యుత్పత్త్యర్థాన్ని బట్టి చూసినా విదుషి అనే. సంస్కృతంలో వాచక్నవి అనే కవయిత్రి పేరు కూడా ప్రసిద్ధం. మానవల్లి రామకృష్ణకవి గారు ఆమెను గుఱించి పలువ్యాసాలలో ప్రస్తావించారు.
ఏల్చూరి మురళీధరరావు
చతురదూతిక గురించి lyla yerneni అభిప్రాయం:
06/14/2013 5:47 pm
“విద్యుల్లతికను మేఘుఁడు
హృద్యంబుగఁ బొదివినట్టు లెదలోఁ బొదివెన్”
No doubt. No doubt it is beautiful. But then, the poet used it a few times too many, in too small a space of a poetry piece. Still, I suppose, when he is making such a good case, why complain about such sparkly recapitulations.
Don’t you think the heroine took too big a risk, in choosing this particular messenger/ambassador? I mean, it is not as innocuous as choosing a parrot, swan or a cloud. Why in the world did she do that? Still thinking about the plot,
లైలా
పై గదిలో ప్రేమికుడు గురించి indrani Palaparthy అభిప్రాయం:
06/14/2013 1:15 pm
వినయ్ కుమార్ గారు:
శారద గారి అనువాదాలు, అనువదించడం కోసం వారు ఎంచుకునే కధలు, బాగుంటాయి.
ఈ కధ నాకు నచ్చలేదన్నానే కానీ అనువాదం బావులేదనలేదు. ఇదో వ్యాపకం/ఆసక్తి అని నాకు తెలుసును.
తెలుగులో సైన్సు/సైన్సు ఫిక్షన్ తక్కువ ఉంది కాబట్టి సైన్సు, సాహిత్యం రెండూ తెలిసిన వారు అలాంటివి సులువైన భాషలో రాస్తే బాగుంటుందని, ఉపయోగకరంగా ఉంటుందని నాకు తోచిన సలహా ఇచ్చేనండి. ఇంద్రాణి చెప్పింది కదా అని ఆవిడ గానీ ఇక్కడ రాసే ఇతరులు కానీ వెంటనే కాగితాలు కలాలు తీసుకుని రాసేస్తారని నేనేమీ అనుకోవడం లేదండి.
మీరు రాసే అభిప్రాయంలో ఇతరులు రాసిన రాతలను పేర్కొనడం ఏమీ బాగోలేదండి. బాగులేదని రాసిన వారు విలన్లేమీ కాదండి. అయినా కధ శారద గారు రాయలేదు కదండి.
మీకు కధ కధగా నచ్చిందని రాశారు. చిరునవ్వు కూడా తెప్పించిందన్నారు కాబట్టి ఆ చల్లని మాటలు మాత్రం రాసి ఊరుకుంటే బాగుండేదేమో అని నాకు అనిపించిందండి.
ఇంద్రాణి.
పై గదిలో ప్రేమికుడు గురించి వినయ్ కుమార్ అభిప్రాయం:
06/14/2013 9:31 am
నాకు ఈ “చప్పగా, అనువాదం, లెక్కల పాఠం మరియు సైన్సు వ్యాసాలు / సైన్సు ఫిక్షను” గురించి తెలిసినట్టులేదు. అందుకే కథ కథగా బాగా నచ్చింది. శారదగారు న్యూక్లియర్ శాస్త్రరంగంలో పరిశోధకురాలిగా పనిచేస్తూ ఉండవచ్చు, కాబట్టి సైన్సు వ్యాసాలు / సైన్సు ఫిక్షను మాత్రమే వ్రాయాలని లేదుగా. ఎన్నో వ్యాపకాలలో ఇదొకటి అనుకోవచ్చుగా. నా వరకు నాకు కథ బాగా వుంది. చివర్లో చిరునవ్వు తెప్పించింది. ఇంకా చెప్పాలనుంది కానీ నా అనుభవం, వయసు సాహిత్యపరంగా అంత సాహసం చేయనివ్వడంలేదు.
టోపీలు పెట్టబడును గురించి వినయ్ కుమార్ అభిప్రాయం:
06/14/2013 8:40 am
ముద్దు వెంకట లక్ష్మి గారు: నాకు తెలిసిన విధంగా మీకు వివరణ ఇస్తాను.
కాగితాలమీద కలల పంట గోచరం — రచయితకి నచ్చిన విషయం ప్రచురించబడుతుంది. (పది మందికి తెలుస్తుంది).
నేల రాలిన కల్లలు అగోచరం — అది ప్రచురించబడడానికి ముందు వ్రాసిన కాగితాలు నచ్చక మడిచి నేల మీద పడవేయడం. (అది ఎవరికీ తెలియదు కదా).
ఆకుపై నిలిచిన వానచినుకులు గురించి ARIF TMD అభిప్రాయం:
06/14/2013 5:29 am
చాల చాల అందంగా వుంది. వైరముత్తు గారికి నమస్కారాలు.