వ్యాసం చాలా బాగుందండి. సంగీతం గురించి నాకు ఎక్కువ తెలియదు కానీ విని ఆనందిస్తుంటాను. అభేరి రాగం నాకు చాలా ఇష్టమైన రాగాల్లో ఒకటి. ముఖ్యంగా ఈ త్యాగరాజ కృతి.
ఆ మధ్య వచ్చిన ఆనంద్ తెలుగు సినిమా వంటి ఇంగ్లీష్ కధ. డబ్బున్నవాళ్లు దరిద్రులకు డబ్బున్నవాళ్లమీద వుండే అభిప్రాయాలను డబ్బుతోనే సరిచేస్తారని మరోసారి నిరూపించిన మరో కథ. అనుసృజన ఉత్తమ శ్రేణిది.
A touching story with a heart-warming breath of humour. To be good, a story need not be about human suffering only; it can be about even a slightly out-of-the normal and playful heroism also. One’s respect for a great author cannot extend to belittling others!
‘భాషలు వేరైనా భారతీయత ఒక్కటే’ – అని చాటి చెప్పిన భాషా మహర్షి – మర్రీ ఎమెనో!
****
ఈమాట లో – ఈ ఇంటర్వూ – చదువరులను చురుగ్గా చదివిస్తుంది. చివరకు చిత్రమైన అనుభూతిని కలిగిస్తుంది. ఒక ఆశ్చర్యం, ఆనందం, ఉత్సుకత, ఉద్వేగం — ఈ భావ వర్ణాలన్నీ కలసి, ఇంద్రధనస్సయి, కళ్ళముందు నిలిచినట్టుంటుంది. ఇంకా చెప్పాలీ అంటే, భాషాభిమానం గల వారి మనసుల మీద పన్నీటి జల్లుల్ని ని కురిపిస్తుందంటే… అస్సలుకి అతిశయోక్తి లేదు.
భాష కి గిరి గీయడమంటే, మన ఎదుగుదలని మనం అడ్డుకోవడమే అని అంటాడు ఒక రచయిత. ఏ పరిధులు లేకుంటె.. ఆకాశమే కదా హద్దు విద్య నేర్చుకునేందుకు? – అందుకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తాడు ఈ శాస్త్రవేత్త. ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని భాషలున్నా.. – తూరుపు నించి కాంతి వచ్చినట్టు… భాషా శాస్త్రానికి వెలుగు భారత దేశం నించి వచ్చిందంటూ మన భాష ప్రాముఖ్యతని, ప్రాభవాన్ని నలుదెసలా చాటి చెప్పిన ప్రజ్ఞావంతుడు, ప్రతిభాశాలి – ఇంతకీ ఎవరీ మర్రీ బీ. ఎమెనో?
ఎవరంటే : “ఎక్కడో కెనడాలో పుట్టి, ఇంగ్లాండూ అమెరికాలలో చదువుకుని, అమెరికాలో పనిచేస్తూ… భాషా పరిశోధన కోసం భారత దేశం వచ్చి, మన జన జీవన స్రవంతిలో కలిసిపోయి, దక్షిణ భారతీయ భాషలూ, శబ్దాలూ,శబ్ద వ్యుత్పత్తులపై (Linguistics, phonetics and Etymology) పరిశోధన చేసి, వాటిని వెలుగు లోకి తెచ్చిన ‘భాషామహర్షి ‘ఎమేనో గారిని పునఃపరిచయం చేయగలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను.” అంటూ మాధవ్ గారు మనకు పరిచయం చేస్తున్నప్పుడే… మనకనిపిస్తుంది!.. ఎమెనో గారి గురించి – ఇంకా తెలుసుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. ఉత్స్చాహం ఉర్రూతలూగుతుంది. మనకి తెలీకుండానే.. మనమూ ఎమెనో కెదురుగా కూర్చుండిపోతాం. మాధవ్ గారు అడుగుతున్న ప్రశ్నల్నీ, ఎమెనో జవాబుల్నీ ప్రత్యక్షంగా వింటూ వుండిపోతాం.
కారణం ఇందులో ని ప్రధానాంశం – మన భారతీయ భాష కి సంబంధించిన అంశం కాబట్టి!
విశేషమేమిటంటే..మన దేశానికొచ్చి, మన భాషా జ్ఞానాన్ని సముపార్జించిన పండితుడు – ఒక విదేశీయుడు కావడం ఎంతైనా అబ్బురం, అపూర్వం కదా! ఆ శాస్త్రజ్ఞుడే ఈయన – ఎమెనో! (Murray Barnson Emeneau)
@ ఎమెనో పరిశీలనలో వెళ్ళడయిన కొన్ని నిజాలు:
*భారతదేశం చాలా పెద్ద దేశం. దాని అస్తిత్వానికి శాంతియుత జీవనం చాలా అవసరం.
* ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సాంఘిక సంక్షేమ పథకాలూ, ఉచిత వైద్య వసతుల వల్ల ఈ తెగలు అంతరించి పోకుండా ఉన్నాయి. కానీ ఈ తెగలవారి పిల్లలు అందరిలానే నూతన విద్యావిధానాలలో ప్రవేశించడంతో, వారి సొంత భాషల్ని క్రమేణా కోల్పోతున్నారు. ఎవరూ వాటి రక్షణ గురించి శ్రద్ధ చూపలేదు. ఈ మధ్యనే శ్రీ పేరి భాస్కరరావు చాలా శ్రమతో ఈ భాషల్ని కంప్యూటరైజ్ చేస్తున్నారని విన్నాను
* ఆంత్రొపాలజిస్టులలో ఒక వాడుక ఉంది “నథింగ్ ఎవెర్ గెట్స్ లొస్ట్ ఇన్ ఇండియా” అని. (ఇది ఒక రకంగా నిజమే కదా!) చూడండి! ఎవరూ మాట్లాడక పోయినా సంస్కృతం మూడువేల ఏండ్లగా బ్రతికేవుంది. కానీ ఈ మౌఖిక భాషలు అలా ఉండలేవు అని నా భయం.
* భారత దేశంలో ప్రతీ భాషపై ఇతర భాషల ప్రభావం ఉంది. అనేక భాషలున్న దేశంకదా!
* చాలామంది భారతీయులు రెండుకంటే ఎక్కువ భాషలు మాట్లాడగలరు. కొంతమంది 10, 12 భాషల దాకా!’
@ మన దేశ ప్రజలని, ప్రభుత్వాన్నీ ఆలోచింప చేసే వ్యాఖ్య ఇది : సంస్కృతం ఇంకా బ్రతికి ఉండటానికి కారణం జన బాహుళ్యానికి అది ఇంకా కావలసి రావడమే. వాటికన్ ఎప్పుడైతే దైవ ప్రార్ధన వాడుక భాషలో చేయవచ్చని చెప్పిందో యూరోపులో లాటిన్ అప్పుడే అంతరించింది. హిందువులు ఇంకా అటువంటి నిర్ణయం తీసుకోలేదు. “The culture of India is not the culture of west. What gets lost is different in these two worlds” … గత శతాబ్దంలో ఈ భాషల రక్షణకై చాలా కృషి జరిగింది. కానీ ఇంకా చాలా జరగాల్సి ఉంది. ముఖ్యంగా మధ్య భారతం, నర్మదా, గోదావరీ పరీవాహక ప్రాంతాల్లో ఇంకా అనేక భాషలు ఈనాటికీ పరిశోధింప బడలేదు.
@ ఎవరూ కాదనలేని నిజాలివి:
*ధనార్జనే ముఖ్యం అనుకుంటే ఇవేవీ ముఖ్యం కాదు. కానీ, ‘మనిషి అతని మేధ పనిచేసే తీరును అర్ధం చేసుకుంటే గానీ సంపూర్ణమైన ప్రగతి రాదు. అది జ్ఞాన సముపార్జన వల్లే సాధ్యం. ‘
*వర్ణ వ్యవస్థలో, హిందూ బ్రాహ్మణుల కర్తవ్యం అదే కదా! విజ్ఞానాన్ని సముపార్జించడమూ, ముందు తరాలకి అందజేస్తూ సంస్కృతిని పరిరక్షించడమూనూ!
@మన ఐక్యతకి – ఆయన చెప్పిన భాష్యం: ‘భాషలు వేరైనా భారతీయత ఒక్కటే! ‘ ఇది ఎలా అంటే, ‘ఒకే మనిషి వేరు వేరు దుస్తుల్లో ప్రత్యక్షం అయినట్లన్నమాట’ (చదువుతుంటే, దేశ భక్తి పొంగుకు రాదూ?)
@ఆ మహర్షి సూక్తులు:
*’శ్రమ యేవం జయతే!’ – కష్టించి పని చేయమని చెబుతాను.
*’ కాంతి తూరుపు నుండి వస్తుంది. భాషాశాస్త్రంలో వెలుగు – భారతదేశంనుంచి వచ్చింది.’ ( వినంగానే నా మాతృభూమి నన్ను స్పరించినట్టైంది. ఆ ఆనందంతో నా కళ్ళు నాకు తెలీకుండానే చెమ్మగిల్లాయి! )
ఇంటర్వ్యూ చివర్లో… ‘భారతదేశ భాషాభివృద్ధికి ఎనలేని కృషిచేసి, కాలగర్భంలో కలిసిపోతున్న మన భాషాసంస్కృతిని రక్షించుకోవాల్సిన అత్యవసరాన్ని గుర్తుచేసి, మన సంస్కృతీ పురోగమనానికి ఎంతో మేలు చేసిన ఆ మహామనీషికి శతకోటి నీరాజనాలర్పిస్తూ వెనుదిరిగాను.’ – అని అంటూ ముగిస్తారు మాధవ్ మాచవరం.
చదివిన దాంట్లో – నాకు బాగా గుర్తుండిపోయిన విష్యాలు మాత్రమే నేనిక్కడ పేర్కొనడం జరిగింది. కానీ, నిజానికి – ఇంటర్వ్యూ లో ఇంకా ఎన్నో, ఎన్నెన్నో ఆసక్తి కరమైన సంగతులు, విలువైన మాటలు, సమాచార భోగట్టాలు, పరిశీలనాత్మకమైన అంశాలూ… ఇలా చాలానే వున్నాయి. అంతా చదివేశాక – మన దేశాన్ని, మనల్నీ, నిలువుటద్దంలో చూసుకుంటున్నట్టు.. భాషలన్నీ జీవనదులై మనలోంచి ప్రవహిస్తున్నట్టు.. భావన కలుగుతుంది.
ఏ ఉత్తమ సాహిత్యపు ఆశయమైనా ఒకటే – మనిషిని చైతన్య పరచడం. ఏ శాస్తజ్ఞుని పరిశోధనా సారాంశ మైనా ఒకటే – ఉన్నత జీవన ప్రమాణాలను అందివ్వడం. – అందుకు సాక్ష్యం గా నిలుస్తుంది ఈ శాస్త్రజ్ఞునితో జరిపిన ఇంటర్వ్యూ! .
మాధవ్ గారూ! ఇంత మంచి ఇంటర్ వ్యూని ఈ మాట పాఠకుల కోసం ప్రత్యేకంగా అందించినందుకు – నా హృదయ పూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను.
సౌమ్య గారూ! ‘పాఠకుల అభిప్రాయలు’లో మీ లేఖ – నన్నీ ఇంటర్వ్యూని చదివించిన కారణ మైనందుకు … మీకునూ నా ధన్యవాదాలు!
వ్యాసాలు అంత జన రంజకంగా ఉండవు అనేది అంత నిజమనిపించదు, కొంచం స్టార్టింగ్ ట్రబుల్ తప్పకుండా ఉంటుంది నాలాంటి వాళ్లకి, కాని మొదలు పెట్టేక ఆపలేము, nothing less than a story or fiction, either English or Telugu. చడవాలని ఉండాలేకాని
రాగలహరి: ఆభేరి గురించి indrani Palaparthy అభిప్రాయం:
06/27/2013 10:16 am
లక్ష్మన్న గారు:
వ్యాసం చాలా బాగుందండి. సంగీతం గురించి నాకు ఎక్కువ తెలియదు కానీ విని ఆనందిస్తుంటాను. అభేరి రాగం నాకు చాలా ఇష్టమైన రాగాల్లో ఒకటి. ముఖ్యంగా ఈ త్యాగరాజ కృతి.
అలాగే కదన కుతూహల రాగం అద్భుతం. విన్నకొద్దీ వినాలనిపించే రాగం.
సుబ్బులక్ష్మి గారి గాత్రంలో అయితే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది.
కదన కుతూహల రాగం యొక్క జనక రాగం ఏదో వివరిస్తారా? అలాగే ఈ రాగం గురించి మరిన్ని విశేషాలను దయచేసి తెలుపగలరు.
ధన్యవాదాలు.
పాలపర్తి ఇంద్రాణి.
మల్లే పూల్ మల్లే పూల్ గురించి బొక్కా శ్రీనివాస్ అభిప్రాయం:
06/27/2013 7:45 am
ఇంద్రాణి గారు, అరిసె కోరికినంత అందంగా… అద్భుతానికి అక్షరరూపం ఇవ్వడం మీ ప్రత్యేకత. ఇటువంటివి మరిన్ని రాస్తూ ఉండండి.
– బొక్కా శ్రీనివాస్
పై గదిలో ప్రేమికుడు గురించి mallikarjuna sarma devarakonda అభిప్రాయం:
06/27/2013 3:13 am
ఆ మధ్య వచ్చిన ఆనంద్ తెలుగు సినిమా వంటి ఇంగ్లీష్ కధ. డబ్బున్నవాళ్లు దరిద్రులకు డబ్బున్నవాళ్లమీద వుండే అభిప్రాయాలను డబ్బుతోనే సరిచేస్తారని మరోసారి నిరూపించిన మరో కథ. అనుసృజన ఉత్తమ శ్రేణిది.
హా (స్యం) సం (గీతం) గురించి జీవన్ అభిప్రాయం:
06/26/2013 12:44 pm
మీ ఈ సేకరణకి ఋణం తీర్చలేం.
జాతర గురించి D.Venkateswara Rao అభిప్రాయం:
06/26/2013 10:01 am
మీ జాతరలొ వంటరితనం, కన్నీళ్ళు వత్తిళ్ళు , వేదనలు మరియు మందుపాతరలు మాత్రమే కనిపించాయి.
జాతర గురించి maheshbabu అభిప్రాయం:
06/26/2013 3:09 am
మీరు వ్రసిన కవిత చాలా బాగుంది. ప్రస్తుత జీవిత ప్రయాణాన్ని కళ్ళకు కట్టినట్టుగా ఉంది. జీవితపు అనుభవాల్లోంచి వచ్చినట్టుగా ఉంది.
మహేష్
పై గదిలో ప్రేమికుడు గురించి Dr CBS Venkataramana అభిప్రాయం:
06/25/2013 11:06 am
A touching story with a heart-warming breath of humour. To be good, a story need not be about human suffering only; it can be about even a slightly out-of-the normal and playful heroism also. One’s respect for a great author cannot extend to belittling others!
Dr CBS Venkataramana
దక్షిణ భారతీయ భాషా శాస్త్రజ్ఞుడు: మర్రీ ఎమెనో గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:
06/24/2013 12:26 pm
‘భాషలు వేరైనా భారతీయత ఒక్కటే’ – అని చాటి చెప్పిన భాషా మహర్షి – మర్రీ ఎమెనో!
****
ఈమాట లో – ఈ ఇంటర్వూ – చదువరులను చురుగ్గా చదివిస్తుంది. చివరకు చిత్రమైన అనుభూతిని కలిగిస్తుంది. ఒక ఆశ్చర్యం, ఆనందం, ఉత్సుకత, ఉద్వేగం — ఈ భావ వర్ణాలన్నీ కలసి, ఇంద్రధనస్సయి, కళ్ళముందు నిలిచినట్టుంటుంది. ఇంకా చెప్పాలీ అంటే, భాషాభిమానం గల వారి మనసుల మీద పన్నీటి జల్లుల్ని ని కురిపిస్తుందంటే… అస్సలుకి అతిశయోక్తి లేదు.
భాష కి గిరి గీయడమంటే, మన ఎదుగుదలని మనం అడ్డుకోవడమే అని అంటాడు ఒక రచయిత. ఏ పరిధులు లేకుంటె.. ఆకాశమే కదా హద్దు విద్య నేర్చుకునేందుకు? – అందుకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తాడు ఈ శాస్త్రవేత్త. ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని భాషలున్నా.. – తూరుపు నించి కాంతి వచ్చినట్టు… భాషా శాస్త్రానికి వెలుగు భారత దేశం నించి వచ్చిందంటూ మన భాష ప్రాముఖ్యతని, ప్రాభవాన్ని నలుదెసలా చాటి చెప్పిన ప్రజ్ఞావంతుడు, ప్రతిభాశాలి – ఇంతకీ ఎవరీ మర్రీ బీ. ఎమెనో?
ఎవరంటే : “ఎక్కడో కెనడాలో పుట్టి, ఇంగ్లాండూ అమెరికాలలో చదువుకుని, అమెరికాలో పనిచేస్తూ… భాషా పరిశోధన కోసం భారత దేశం వచ్చి, మన జన జీవన స్రవంతిలో కలిసిపోయి, దక్షిణ భారతీయ భాషలూ, శబ్దాలూ,శబ్ద వ్యుత్పత్తులపై (Linguistics, phonetics and Etymology) పరిశోధన చేసి, వాటిని వెలుగు లోకి తెచ్చిన ‘భాషామహర్షి ‘ఎమేనో గారిని పునఃపరిచయం చేయగలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను.” అంటూ మాధవ్ గారు మనకు పరిచయం చేస్తున్నప్పుడే… మనకనిపిస్తుంది!.. ఎమెనో గారి గురించి – ఇంకా తెలుసుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. ఉత్స్చాహం ఉర్రూతలూగుతుంది. మనకి తెలీకుండానే.. మనమూ ఎమెనో కెదురుగా కూర్చుండిపోతాం. మాధవ్ గారు అడుగుతున్న ప్రశ్నల్నీ, ఎమెనో జవాబుల్నీ ప్రత్యక్షంగా వింటూ వుండిపోతాం.
కారణం ఇందులో ని ప్రధానాంశం – మన భారతీయ భాష కి సంబంధించిన అంశం కాబట్టి!
విశేషమేమిటంటే..మన దేశానికొచ్చి, మన భాషా జ్ఞానాన్ని సముపార్జించిన పండితుడు – ఒక విదేశీయుడు కావడం ఎంతైనా అబ్బురం, అపూర్వం కదా! ఆ శాస్త్రజ్ఞుడే ఈయన – ఎమెనో! (Murray Barnson Emeneau)
@ ఎమెనో పరిశీలనలో వెళ్ళడయిన కొన్ని నిజాలు:
*భారతదేశం చాలా పెద్ద దేశం. దాని అస్తిత్వానికి శాంతియుత జీవనం చాలా అవసరం.
* ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సాంఘిక సంక్షేమ పథకాలూ, ఉచిత వైద్య వసతుల వల్ల ఈ తెగలు అంతరించి పోకుండా ఉన్నాయి. కానీ ఈ తెగలవారి పిల్లలు అందరిలానే నూతన విద్యావిధానాలలో ప్రవేశించడంతో, వారి సొంత భాషల్ని క్రమేణా కోల్పోతున్నారు. ఎవరూ వాటి రక్షణ గురించి శ్రద్ధ చూపలేదు. ఈ మధ్యనే శ్రీ పేరి భాస్కరరావు చాలా శ్రమతో ఈ భాషల్ని కంప్యూటరైజ్ చేస్తున్నారని విన్నాను
* ఆంత్రొపాలజిస్టులలో ఒక వాడుక ఉంది “నథింగ్ ఎవెర్ గెట్స్ లొస్ట్ ఇన్ ఇండియా” అని. (ఇది ఒక రకంగా నిజమే కదా!) చూడండి! ఎవరూ మాట్లాడక పోయినా సంస్కృతం మూడువేల ఏండ్లగా బ్రతికేవుంది. కానీ ఈ మౌఖిక భాషలు అలా ఉండలేవు అని నా భయం.
* భారత దేశంలో ప్రతీ భాషపై ఇతర భాషల ప్రభావం ఉంది. అనేక భాషలున్న దేశంకదా!
* చాలామంది భారతీయులు రెండుకంటే ఎక్కువ భాషలు మాట్లాడగలరు. కొంతమంది 10, 12 భాషల దాకా!’
@ మన దేశ ప్రజలని, ప్రభుత్వాన్నీ ఆలోచింప చేసే వ్యాఖ్య ఇది : సంస్కృతం ఇంకా బ్రతికి ఉండటానికి కారణం జన బాహుళ్యానికి అది ఇంకా కావలసి రావడమే. వాటికన్ ఎప్పుడైతే దైవ ప్రార్ధన వాడుక భాషలో చేయవచ్చని చెప్పిందో యూరోపులో లాటిన్ అప్పుడే అంతరించింది. హిందువులు ఇంకా అటువంటి నిర్ణయం తీసుకోలేదు. “The culture of India is not the culture of west. What gets lost is different in these two worlds” … గత శతాబ్దంలో ఈ భాషల రక్షణకై చాలా కృషి జరిగింది. కానీ ఇంకా చాలా జరగాల్సి ఉంది. ముఖ్యంగా మధ్య భారతం, నర్మదా, గోదావరీ పరీవాహక ప్రాంతాల్లో ఇంకా అనేక భాషలు ఈనాటికీ పరిశోధింప బడలేదు.
@ ఎవరూ కాదనలేని నిజాలివి:
*ధనార్జనే ముఖ్యం అనుకుంటే ఇవేవీ ముఖ్యం కాదు. కానీ, ‘మనిషి అతని మేధ పనిచేసే తీరును అర్ధం చేసుకుంటే గానీ సంపూర్ణమైన ప్రగతి రాదు. అది జ్ఞాన సముపార్జన వల్లే సాధ్యం. ‘
*వర్ణ వ్యవస్థలో, హిందూ బ్రాహ్మణుల కర్తవ్యం అదే కదా! విజ్ఞానాన్ని సముపార్జించడమూ, ముందు తరాలకి అందజేస్తూ సంస్కృతిని పరిరక్షించడమూనూ!
@మన ఐక్యతకి – ఆయన చెప్పిన భాష్యం: ‘భాషలు వేరైనా భారతీయత ఒక్కటే! ‘ ఇది ఎలా అంటే, ‘ఒకే మనిషి వేరు వేరు దుస్తుల్లో ప్రత్యక్షం అయినట్లన్నమాట’ (చదువుతుంటే, దేశ భక్తి పొంగుకు రాదూ?)
@ఆ మహర్షి సూక్తులు:
*’శ్రమ యేవం జయతే!’ – కష్టించి పని చేయమని చెబుతాను.
*’ కాంతి తూరుపు నుండి వస్తుంది. భాషాశాస్త్రంలో వెలుగు – భారతదేశంనుంచి వచ్చింది.’ ( వినంగానే నా మాతృభూమి నన్ను స్పరించినట్టైంది. ఆ ఆనందంతో నా కళ్ళు నాకు తెలీకుండానే చెమ్మగిల్లాయి! )
ఇంటర్వ్యూ చివర్లో… ‘భారతదేశ భాషాభివృద్ధికి ఎనలేని కృషిచేసి, కాలగర్భంలో కలిసిపోతున్న మన భాషాసంస్కృతిని రక్షించుకోవాల్సిన అత్యవసరాన్ని గుర్తుచేసి, మన సంస్కృతీ పురోగమనానికి ఎంతో మేలు చేసిన ఆ మహామనీషికి శతకోటి నీరాజనాలర్పిస్తూ వెనుదిరిగాను.’ – అని అంటూ ముగిస్తారు మాధవ్ మాచవరం.
చదివిన దాంట్లో – నాకు బాగా గుర్తుండిపోయిన విష్యాలు మాత్రమే నేనిక్కడ పేర్కొనడం జరిగింది. కానీ, నిజానికి – ఇంటర్వ్యూ లో ఇంకా ఎన్నో, ఎన్నెన్నో ఆసక్తి కరమైన సంగతులు, విలువైన మాటలు, సమాచార భోగట్టాలు, పరిశీలనాత్మకమైన అంశాలూ… ఇలా చాలానే వున్నాయి. అంతా చదివేశాక – మన దేశాన్ని, మనల్నీ, నిలువుటద్దంలో చూసుకుంటున్నట్టు.. భాషలన్నీ జీవనదులై మనలోంచి ప్రవహిస్తున్నట్టు.. భావన కలుగుతుంది.
ఏ ఉత్తమ సాహిత్యపు ఆశయమైనా ఒకటే – మనిషిని చైతన్య పరచడం. ఏ శాస్తజ్ఞుని పరిశోధనా సారాంశ మైనా ఒకటే – ఉన్నత జీవన ప్రమాణాలను అందివ్వడం. – అందుకు సాక్ష్యం గా నిలుస్తుంది ఈ శాస్త్రజ్ఞునితో జరిపిన ఇంటర్వ్యూ! .
మాధవ్ గారూ! ఇంత మంచి ఇంటర్ వ్యూని ఈ మాట పాఠకుల కోసం ప్రత్యేకంగా అందించినందుకు – నా హృదయ పూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను.
సౌమ్య గారూ! ‘పాఠకుల అభిప్రాయలు’లో మీ లేఖ – నన్నీ ఇంటర్వ్యూని చదివించిన కారణ మైనందుకు … మీకునూ నా ధన్యవాదాలు!
శుభాభినందనలతో..
-ఆర్.దమయంతి.
మల్లే పూల్ మల్లే పూల్ గురించి mallikarjuna sarma devarakonda అభిప్రాయం:
06/22/2013 4:42 am
మంచివి చాలా వరకు ఇలాగే ముగుస్తుంటాయి… ఇంగ్లీషు సినిమాల్లా!
ఈ సంచిక గురించి… గురించి Akella suryanarayana murthy అభిప్రాయం:
06/21/2013 2:57 am
వ్యాసాలు అంత జన రంజకంగా ఉండవు అనేది అంత నిజమనిపించదు, కొంచం స్టార్టింగ్ ట్రబుల్ తప్పకుండా ఉంటుంది నాలాంటి వాళ్లకి, కాని మొదలు పెట్టేక ఆపలేము, nothing less than a story or fiction, either English or Telugu. చడవాలని ఉండాలేకాని
నేను అన్నీ చదవలేదు కని, చదివినవన్నీ, Superb