పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. నిష్కృతి గురించి మోహన అభిప్రాయం:

    06/28/2013 9:56 pm

    మంచి కథ, చక్కటి అనువాదము, గౌరిగారికి అభినందనలు. నేను నవంబరులోనే ఈ కథను చదివినా, ఇప్పుడు ఈ అభిప్రాయమును వ్రాయడానికి ఒక కారణము ఉన్నది. సుప్రసిద్ధ దర్శకుడు బాలు మహేంద్ర “కదైనేరం” (కథాసమయము) అని చిన్నతెరపైన ఒక ధారావాహిని నడిపారు. ఒక్కొక్క వారము ఈ కార్యక్రమములో ఒక చిన్న కథను ఆధారముగా తీసికొని చిత్రీకరించిన కథను ప్రదర్శిస్తారు. ఈ కార్యక్రమములో జయంతన్ వ్రాసిన ఈ కథను ఆధారము చేసికొని “గాయం” అనే ఒక చిన్న చిత్రమును కూడ చిన్నతెరకోసం తీసినారు. కాలావధి సుమారు అరగంట. దీనిని ఇక్కడ చూచి ఆనందించగలరు

    విధేయుడు – మోహన

  2. సిరినివాస వృత్తము గురించి మోహన అభిప్రాయం:

    06/28/2013 8:42 pm

    ఓం
    నమస్తేఽస్తు భగవన్విశ్వేశ్వరాయ 12
    మహాదేవాయ త్రయంబకాయ 11
    త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ 12
    కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ 11
    మృత్యుంజయాయ సర్వేశ్వరాయ 10
    సదాశివాయ శ్రీమన్మహాదేవాయ 12
    నమః
    పురాతన గ్రంథాలలో (ఉదా. భగవద్గీత) వైదిక ఛందస్సునే ఎక్కువగా వాడేవారు. అనుష్టుప్ శ్లోకాలు ముఖ్యముగా వాడేవారు. అట్టి ఛందస్సులో గురులఘువులకన్న పాదములలో అక్షర సంఖ్య ముఖ్యము. చివరి అక్షరాలకు నియమములను పాటించేవారు. ఒక పాదములో ఒక అక్షర సంఖ్య ఉంటే మరొక పాదములో మరొక అక్షర సంఖ్య ఉండుట సామాన్యము. ఈ ప్రార్థనను పై విధముగా విరిచి వ్రాస్తే పాదాలలో 10 నుండి 12 అక్షరాల వరకు ఉన్నాయి. నా ఉద్దేశములో ఇది వైదిక ఛందస్సుకు చేరినది అనుకొంటాను.

    విధేయుడు – మోహన

  3. రాగలహరి: ఆభేరి గురించి indrani Palaparthy అభిప్రాయం:

    06/28/2013 7:12 pm

    నిజమేనండి. తప్పకుండా ప్రయత్నిస్తాను. మా అమ్మ గారు ఇటీవలే గాత్రంలో ప్రభుత్వ డిప్లమో పూర్తి చేశారు. ఇప్పుడు వయొలిన్ నేర్చుకుంటున్నారు.

    ఇంద్రాణి.

  4. రాగలహరి: ఆభేరి గురించి chudamani అభిప్రాయం:

    06/28/2013 9:02 am

    ఇంద్రాణిగారు, విద్యకి వయస్సుతో సంబంధం లేదు. అందులో సంగీతానికి అసలే లేదు. మీకు నిజంగా నేర్చుకోవాలని ఉంటే, వయస్సు గురించి ఆలోచించకండి. గాత్రం మీకు వీలు కాదనుకుంటే వాద్యం నేర్చుకోండి.
    నమస్తే,
    చూడామణి.

  5. చాటు పద్యాల్లో శ్రీనాథుడు గురించి Adinarayana అభిప్రాయం:

    06/28/2013 8:45 am

    శ్రీ రామారావుగారు – శ్రీనాథుడు అంటే నాకు ఎంతో ఇష్టము. ఆయన ఒక గొప్ప శివభక్తుడు. అనావృష్టి (వానలు లేకపొవటం) గ్రసితమైనప్పుడు శ్రీనాథుడు ఓ శివాలయముకు వెల్లి అక్కడ పరమేశ్వరునికి “సిరిగల వానికి జెల్లును, దరుణుల పదియారు వేల దగ బెండ్లాడన్, దిరిపెమున కిద్ద రాండ్రా, పరమేశా గంగ విడుము పార్వతి చాలున్” అని పద్యము అనగానే వర్షాలు కురిశాయి అని పెద్దలు చెప్పుతుంటరు. అటువంటి మహాశివభక్తుడు ఆయన.

    శ్రీనాథుని చాటువులు ఇక్కడ ఇచ్చినందుకు నేను చాలా చాలా కృతజ్ఞుతున్ని అయ్యాను.

    ఇట్లు
    గూడూరు ఆదినారాయణ

  6. సిరినివాస వృత్తము గురించి Adinarayana అభిప్రాయం:

    06/28/2013 2:44 am

    కృష్ణ మోహన్ గారు,
    మీకు మఱియు మీ ఛందస్శాస్త్ర జ్ఞానానికి నా నమస్కారములు.

    నేను చాల రోజుల నుండి ఈ క్రింది శ్లోకము ఏ ఛందస్సులో వ్రాయబడ్డదోనని విచారిస్తున్నను, ఇంటర్నెట్ లో చాల వెతికాను కాని ఎక్కడ లభించలేదు. కనీసం మీరైన నాకు చెబుతారని ఆశిస్తున్నాను. కృతజ్ఞున్ని.

    నమస్తే అస్తు భగవన్విశ్వేశ్వరాయ మహాదేవాయ త్య్రంబకాయ
    త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ |
    నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ
    సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః ||

    మీ శ్రేయోభిలాషి,
    గూడూరు ఆదినారాయణ

  7. హా (స్యం) సం (గీతం) గురించి lyla yerneni అభిప్రాయం:

    06/27/2013 3:42 pm

    Funny!:-)

    ధ్వన్యనుకరణ బిట్ లో – వయొలినిస్ట్ 🙂 “టుట్టుట్టు” వాయించటానికి కమాన్ కింద పెట్టక్కర్లేదు. కావాలంటే పెట్టుకోవచ్చనుకోండీ, కింద కూర్చుని వాయిస్తున్నారు కాబట్టి .
    “టుట్టుట్టు” is a pizzicato, a sound effect the violinist learns, practices, knowingly produces by plucking the string generally with the index finger, instead of using the bow.( Violinist still holds the bow in the hand.) It is an effect nice to hear like other effects as vibrato, tremolo, glissando etc. created on violin by different methods. I do not know the Telugu/Indian music equivalents.

    ముఖమురళి బిట్ – is interesting. I am inclined to group 🙂 a “whistler” with “Woodwind instruments” than with “Vocalists,” even in an orchestra.

    లైలా

  8. రాగలహరి: ఆభేరి గురించి indrani Palaparthy అభిప్రాయం:

    06/27/2013 2:15 pm

    కదన కుతూహలం ను దయ చేసి “కదనకుతూహలం” గా చదువుకోగలరు.

    శంకరాభరణం జన్య రాగాలు అన్నీ వేటికవే చాలా బాగుంటాయి.

    వినడమే కానీ సంగీతం నేర్చుకోలేకపోయానే అని బాధ పడుతుంటాను అప్పుడప్పుడు.

    ఇంద్రాణి.

  9. రాగలహరి: ఆభేరి గురించి indrani Palaparthy అభిప్రాయం:

    06/27/2013 1:20 pm

    ధన్యవాదాలు మోహన గారు.

    ఈ వ్యాసం ఇప్పటిదాకా చూడలేదు. ఇది కూడా చాలా బాగుంది. రాజేష్ వైద్య వీణ మీద కదన కుతూహలం బాగుంది. అలాగే కదన కుతూహల తిల్లానా అమోఘం (బాల మురళి గారిది).

    ఇంద్రాణి.

  10. రాగలహరి: ఆభేరి గురించి మోహన అభిప్రాయం:

    06/27/2013 12:06 pm

    ఇంద్రాణిగారు, కదనకుతూహలము గురించి ఈమాటలో చదువవచ్చును –

    నమస్సులతో – మోహన