పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. త్రిపురాత్రి… త్రిపురహిత పగలు… గురించి ravikiran timmireddy అభిప్రాయం:

    07/02/2013 10:50 pm

    కొన్ని సార్లు అద్భుతవని చెప్పటానికి కూడా మనసు రాదు. ఆ పదం చాలా తేలికగానూ, ఏ మాత్రం భావానికి న్యాయం చేయనట్టు అనిపిస్తుంది. మరొక అద్భుతవైన పదం మీ కవిత మనస్సులో నింపిన నిశ్శబ్ధం నుంచి వెలుపలకి రాదు. పక్షి ఈకల లాటి ఈ పదాలన్నీ మీ కవిత సృష్టించిన ఘాడతలోకి నిశ్శబ్ధంగా జారిపోతాయి.

    -Ravikiran Timmireddy

  2. మన సాహిత్యంలో కవులు, పుస్తకాలు – 2 గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:

    07/02/2013 8:48 pm

    ‘అచ్చమైన కవిత్వం అచ్చమైన సహృదయులకు మాత్రమే అర్థమవుతుంది. ” – కవిత్వాన్ని ఎంత అందంగా, హృద్యంగా నిర్వచించారు! -అభినందనలు.
    -ఆర్.దమయంతి.

  3. మన సాహిత్యంలో కవులు, పుస్తకాలు – 2 గురించి Velcheru Naraayana Rao అభిప్రాయం:

    07/02/2013 5:28 pm

    నా వ్యాసం మీద ఆలోచనకీ, అంతర్దృష్టికీ పనికొచ్చే ఉత్తరాలు (జయప్రభ, సౌమ్య, భావనారాయణ గార్లవి) వొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. వాటికి సమాధానాలు నాకు నిబ్బరంగా తెలియవు. పదిమందీ ఆలోచనలూ కలబోస్తే నేను చెప్పే వాటికన్నామంచి సమాధానం దొరకొచ్చు. నాకు తోచిన మాటలు చెప్తాను.

    విమర్శకులు విమర్శాతీతులు కారు. వాళ్ల దృష్టిలోపాలూ, సంస్కారపరిమితులూ అభిమాన దురభిమానాలూ, వాళ్లకి వుంటాయి. ఒక్కసారి నావ్యాసం మళ్లా చూడండి:

    “… చదివేవాళ్ళు, వాళ్ళ మనసులో పొరలు అడ్డం పెట్టుకొని, వాళ్ళ రాగద్వేషాల దారిలో కవిత్వాన్ని చూస్తే దానికి ఇంకొక దుర్వ్యాఖ్యానం వస్తుంది. అందుకనే అచ్చమైన కవిత్వం అచ్చమైన సహృదయులకు మాత్రమే అర్థమవుతుంది. ఈ బాధ్యత ఒక్క వ్యక్తి మీద పెట్టకుండా కొన్ని తరాల మనుషులు, కొన్ని సంవత్సరాల పాటు ఆ కవిత్వాన్ని చదువుతూ ఉంటే తాత్కాలిక రాగద్వేషాలు, వ్యక్తిగత వైమనస్యాలు క్రమక్రమంగా తొలిగిపోయి కవిత్వమే మిగులుతుంది అని ఒక ఆశ.”

    సహృదయుడు ఒక వ్యక్తి కాదు. అచ్చమైన సహృదయులు కొన్ని తరాల విమర్శకుల సంపుటి. విమర్శకులు వేరే ఒక జాతి కాదు. ఇందులో కవులూ, రచయితలూ కూడా వుంటారు. పైగా, రాగద్వేషాలకి అతీతంగా కవిని/రచయితని అర్థంచేసుకోడం సాధ్యం కాదు. ఎందుకంటే కవిత్వమూ, రచనా రాగద్వేషాల లోంచే వొస్తాయి కాబట్టి. కాని, చదివేవాళ్లు తమ వ్యక్తిగత సంకుచిత రాగద్వేషాలకి అతీతంగా రచనని అర్థంచేసుకోడం సాధ్యం. వాళ్లు కొన్ని తరాల వాళ్లు అయితే ఇంకా తేలికగా సాధ్యం.

    విమర్శకులు, అంటే సహృదయులు, కవుల్లాగ కథలు కట్టి చెప్పుకునే స్థాయికి ఎదగరు. వాళ్లెప్పుడూ అనామకులే, తెరవెనకవాళ్లే. ఎప్పుడో ఒక అభివగుప్తుడో, మమ్మటుడో, జగన్నాథుడో ఆ స్థాయికి వొస్తారు. అదీ వాళ్లు కవులు కూడా కాబట్టి. ఆధునిక కాలంలో కవి జీవిత చరిత్రల రచయితలు కవులకన్న, రచయితల కన్న, ప్రముఖ స్థాయికి రావడం, వాళ్ల వల్లే కవులూ, రచయితలూ అర్థం చేసుకోబడడం గురించే నా అభ్యంతరం.

    కవి జీవితం గురించి తెలిస్తే కవిత్వం, రచయిత బతుకుని గురించి తెలిస్తే ఆ రచయిత రచనలూ ఎక్కువ బాగా తెలుస్తాయనేది ఆధునిక పెట్టుబడిదారీ సమాజం ఏర్పరచిన భ్రమ. కమలాదాస్ కవిత్వానికీ ఇది వర్తిస్తుంది. అయితే ఇది మీకు రుజువు చెయ్యలేను.

    ఈ సందర్భంలో ఒక చిన్న కథ చెప్తాను: 8వ శతాబ్దపు సంస్కృత ఆలంకారికుడు దండి తన కావ్యాదర్శపు ప్రారంభంలో సరస్వతీ ప్రార్థన చేస్తూ

    చతుర్ముఖముఖాంభోజ కలహంసవధూ ర్మమ
    మానసే రమతాం నిత్యం సర్వ శుక్లా సరస్వతీ

    (బ్రహ్మ నాలుగు ముఖాలూ అనే పద్మాలలో (విహరించే) హంస, పూర్తిగా తెల్లగా వుండే సరస్వతి, నా మనస్సులో ఎల్లప్పుడు ఆనందంగా ఉండు గాక) అని రాశాడు.

    ఇది చదివి, విజ్జిక అనే ఆవిడ ఇలా అందిట:

    నీలోత్పలదలస్యామాం విజ్జికాం మా మజానతా
    వృథైవ దండినా ప్రోక్తా సర్వ శుక్లా సరస్వతీ

    (నల్ల కలువ లాగ (అందంగా) వుండే విజ్జిక అనే నన్ను గుర్తించక (ఎరగక) సరస్వతీ దేవి ఎప్పుడూ తెల్లగానే వుంటుంది అని దండి (తెలివి తక్కువగా) చెప్పాడు.)

    దండిని గురించీ, విజ్జికని గురించీ మీ ఇష్టం వొచ్చిన కథ చెప్పుకోండి, కానివాళ్ల నిజ జీవితాలు తెలిస్తే ఈ శ్లోకాలు ఇంకా ఎక్కువ బాగ అర్థం అవుతాయా, లేకపోతే ఆ సమాచారం మీ ఊహకి అడ్డొచ్చి, ఈ శ్లోకాలు దెబ్బతింటాయా?

    ఇకపోతే సూరన, సూరన్నల పేర్ల అక్షర నిర్ణయం గురించి: కళాపూర్ణోదయం, ప్రభావతీప్రద్యుమ్నం గద్యలో ఆయన పేరు సూరయ అని వుంది. అయ్య, అన్న, అప్ప, అయ, అన, అప – ఇవన్నీ సమానార్థకాలుగానే వాడారు. ఇందులో ఛందస్సుకి అనువైన రూపాలు ఆచరణలోకి వొచ్చాయి. పేరులో అక్షరబద్ధత మనకి పూర్తిగా ఆధునిక కాలం లోనే వొచ్చింది. అయితే సూరన పేరులో నకారద్విత్వం ఎంతముందు వాడుకలో కనిపిస్తుందో నేను పరిశీలించలేదు.

    –నారా

  4. మన సాహిత్యంలో కవులు, పుస్తకాలు – 2 గురించి Siddineni Bhava Narayana. అభిప్రాయం:

    07/02/2013 2:54 pm

    నారాయణ రావు గారూ,

    ఫింగళి సూరన పేరుని ఇలాగే చూడడం అలవాటయ్యింది. I remember the name being spelt with a single consonant in your translated work of Pingali Surana’s Prabhavathi Pradyumnam – The Demon’s Daughter.

    I am afraid the consonant N sound is ungerminated in Surana. I guess it is a typo we see in the essay with a germinated consonant. I request the editor to check the spelling. This practice of doubling the consonant at the end of a personal name did not take root by the sixteenth century in Telugu.

    Yours Obediently,
    Siddineni Bhava Narayana.

  5. త్రిపురాత్రి… త్రిపురహిత పగలు… గురించి ns murty అభిప్రాయం:

    07/02/2013 12:58 pm

    అద్భుతమైన కవిత. భగవంతం గారూ, మీకు మనః పూర్వక అభినందనలు.

  6. అలిఖిత కఠిన శాసనం! గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:

    07/02/2013 12:54 pm

    ‘అనుభవాన్ని ఇంత చక్కగా అక్షరాల్లో మలచడం ఒక కవితా కనికట్టు.
    ఒక అత్యద్భుతవైన అక్షరాల మేజిక్కు.’

    *అనుభవం సొంతం కావొచ్చు. ఊహా జనితమూ కావొచ్చు.

    చక్కదనం మన భాషలోనే ఇమిడి వుంది. కదూ? మీరన్నట్టు కవిత – కనికట్టు చేస్తుంది. ఈ మాజిక్క్ మాత్రం …అంతా…అనుభూతించే వారి సహృదయతలోనే దాగి వుంటుంది.

    మీ స్పందన నాకెంతో ఆనందాన్ని కలగచేసింది రవికిరణ్ గారూ!
    మీకు నా మనః పూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ..
    -ఆర్.దమయంతి.

  7. అలిఖిత కఠిన శాసనం! గురించి ravikiran timmireddy అభిప్రాయం:

    07/02/2013 11:49 am

    “ఈ రాత్రికిక సెలవీయలేను. రేపటిని స్వాగతించనూ లేను.
    ఇదొక మధురావస్థ. మిధ్య కాని తీపి మరణావస్థ.
    కొన్ని నరకాలు ఎన్ని పూర్వ పుణ్యవరాలో!”

    అనుభవించిన వారికే తెలుస్తుంది. కానీ ఆ అనుభవాన్ని ఇంత చక్కగా అక్షరాల్లో మలచడం ఒక కవితా కనికట్టు. ఒక అత్యద్భుతవైన అక్షరాల మేజిక్కు.

    అద్భుతంగా వుంది దమయంతి గారు.

    -రవికిరణ్ తిమ్మిరెడ్డి.

  8. అవధారు గురించి సాయి పద్మ అభిప్రాయం:

    07/02/2013 11:09 am

    ‘త్రిపుర’ గారి మీద ఇంత గొప్ప ఇష్టమైన వ్యాసం ఇంతవరకూ చదవలేదు, చదవబోము కూడా అన్నంత గాఢంగా ఉంది. మరణం ఎంత శాశ్వతమైనదో, జ్ఞాపకం ఎంత సజీవమైనదో తెలుసుకోవాలంటే ఇది చదవచ్చు. కనక ప్రసాద్ గారికి చెప్పుకొనే మనిషి లేకపోవచ్చు, కానీ జ్ఞాపకాలని అవధరించటమేకాదు, మన చేత ధరింపచేస్తారు కూడా. ఒక చలం, త్రిపుర, ఏంటి వీళ్ళంతా… మనుషుల్ని అంతలా ఎలా ప్రేమించగలరు… ఖాళీలను అక్షరాలతో, మానవత్వంతో నింపితే తప్ప!!

  9. భార్యోత్సాహం గురించి DG అభిప్రాయం:

    07/02/2013 8:41 am

    మొత్తానికి పెళ్ళితో మొదలుబెట్టి ఫేసుబుక్కు దాకా అందర్నీ ఏకేశారు కదండీ? ఏలూరు వెళ్తే ఇలాంటి ఆలోచన్లు ఎందుకురావూ? అందులోనూ ఊరంతా పొగాకు గిడ్డంగులూ, రైల్వే గేట్లూనూ. బండి వచ్చేటప్పుడు గేటు ఇవతల రిక్షా ఆగిపోతే సిగరెట్టు కాల్చుకుంటూ ఇలాంటి బ్రహ్మాండమైన ఐడియాలు సంపాదిస్తున్నారు కాబోలు. ఆఁ?

  10. చంద్రుణ్ణి చూపించే వేలు గురించి pradeep అభిప్రాయం:

    07/02/2013 8:30 am

    వ్యాసకర్తకి మనవి:
    ఇదే వ్యాసాన్ని కొద్ది మార్పులతో wikipediaలో (తెలుగు) చేర్చగలిగితే మరి కొందరికి దీన్ని పరిచయం చేసినట్టు అవుతుంది.

    [వ్యాసకర్త ఇస్మాయిల్ లేరు. ఇది ఒక పుస్తకానికి ముందుమాట అని మీరు గమనించే ఉండాలి. అందువల్ల ఏ రకమైన మార్పులు చేయగలరు? -సం]