ఈ కవిత content వల్ల పాత జ్ఞాపకాలేవో రేగి, ఈ కవిత ఒక రచయిత్రిది కావడంతో మరింత ఎక్కవ connect ఐన ఒక మిత్రురాలు ఈ కవిత చదవమని లింక్ పంపారు. జ్వలించే ప్రేమల వల్ల కలిగే సంయోగ వియోగాలు అందరి జీవితాల్లో సహజమే కాబట్టి కవిత చటుక్కున బాగుందనిపిస్తోంది. కానీ, form దృష్ట్యా, అంటే నిర్మాణపరంగా కవిత అంత మంచి కవిత అనిపించడం లేదు.
తడారిన గాలి, వడి వడిగా నడుస్తూ నిప్పులోకి దూకుతోంది.
తన చివరి పరిమళపు జావళిని వినిపిస్తూ ఓ మల్లె
మట్టిలో రాలిన చప్పుడవుతోంది.
వీధి కొసన గుడ్డి దీపసెమ్మె తల చుట్టూ చలికొంగు కప్పుకుని,
బిక్కుపోతున్న ఒంటరి తోవకి తోడుగా, నించుంది.
గూడు చెదరిన పక్షి తెల్లారడం కోసం తహతహలాడుతోంది.
ఈ పాదాలు ఈ కవితలో శిఖరాయమానమైనవి. దీని స్థాయిలో మిగతా కవితా పాదాలు లేవు. అయితే, శుద్ధ కవిత్వ వాదిలా, అక్షరమక్షరంలో కవిత్వాన్ని పొంగిపొర్లిస్తూ, సారాన్ని గాలికొదిలేయమని నా ఉద్దేశం కాదు. కదంబ మాల వంటి కవితలో కొన్ని prosaic వాక్యాలుండటం ఎంత కొమ్ములున్న కవికైనా సహజమే. ఆయితే, ఆ వాక్యాలు అందులో ఇమడకపోతేనే ఇబ్బంది. అలా ఇబ్బంది కలిగించిన వాక్యాలే…
ఈ హృది ఏ శిల్పి చెక్కని శిలా ఫలకం.
ఇదొక అలిఖిత కఠిన శాసనం!
…ఈ కవితకి శీర్షిక సరఫరా చేయాల్సి రావడం వల్ల ఈ కవిత బలహీన పడిందనిపించింది. ఇదొక మధురావస్థ. మిధ్య కాని తీపి మరణావస్థ. పాదానికి ముందు బొమ్మకట్టిన భావం వల్ల, ఈ పాదంలో ప్రాస చక్కగా అతికింది. కానీ, జాలి మాలిన కాలం ఓ కనికట్టు. ఏ ప్రేమ గాయాలకీ లేదు లేపనాల కట్టు.
వంటి చోట్ల ప్రాసకోసం ప్రయత్నించినట్టు తేలిపోతోంది.
“ఒకటి చెప్పనా? …”
వంటి వాటి ద్వారా కవితలో continuity కోసం చూసినట్టు అనిపించి నచ్చలేదు.
నువ్వంతే! కదలని రాతివి.
నేనూ ఇంతే! కరగని రాత్రిని
అన్న చివరి లైన్లు చూస్తే, కవిత ఎత్తుగడ, ఉపసంహారం వంటి ఎకడమిక్ సూత్రీకరణల స్పృహ ఏమైనా ఉందా అనిపిస్తోంది. ‘అనుభవించిన వారికే తెలుస్తుంది….’ అన్న కామెంట్ తో సహానుభవాన్ని పొందుతున్న ఒకానొక పాఠకుడి మమేకత మీద తగు జాగ్రత్తగా కుండెడు నీళ్ళు పోసినట్టు, అనుభవం సొంతం కావొచ్చు. ఊహా జనితమూ కావొచ్చు… అని దమయంతి గారు బదులివ్వడం ఒక slap on the face లాంటి కొసమెరుపు!
శ్రీ రాజశంకర్‌గారు,
పంచదశ అంటే 15 అని ఎఱుక యున్ననూ. నేను మీరు వ్రాసిన “పంచదశ” ను “పంచ-దశ” అనగా “అయిదు పదులు = యేబై (50)” గానే గణించాను. మన సంభాషణ ధోర్ణిని బట్టి మాటలకు అర్థాలను మఱియు భావార్థాలను మనము గ్రహిస్తాము, అవును కదా. కాబట్టి, మీరు క్షంతవ్యం అడగవలసి లేదు.
చాల ధన్యవాదాలు
కృష్ణ మోహనగారికి మఱియు రాజశంకర్‌గారికి నా కృతజ్ఞపూర్వక నమస్కారములు, మీరు ఇచ్చిన సమాధానాలగుండ తప్పనిసరిగా నా జ్ఞానాభివృద్ధీ అయింది.
రాజశంకర్‌గారు చెప్పిన “హస్తే దిక్ష్విషవ ఉభాభ్యాం ద్వావిగ్0 శతిశ్చ” సూత్రం వల్ల శతరుద్రీయాన్ని పనస (పంచదశ) తో ఎట్లు పరిగణించాలి అనికూడ తెలుసుకున్నాను. కృష్ణ మోహనగారి ద్వారా వేవేఱు ఛందస్సుల గురించి, వాటి పాదాలు మఱియు పాదానికి వుండవలసిన అక్షరాల గురించి తెలుసుకున్నను. చాల ధన్యవాదాలు. మీ వ్యస్తజీవితం నుండి నాగురించి సమయాన్ని తీసి నాకు సమాధానాలు ఇచ్చినందుకు మళ్ళి ఒక సారి నేను చాల-చాల కృతజ్ఞున్ని.
నేను ఇంతకుముందు వ్రాసిన అభిప్రాయములో పొరపాటున 50కి పంచదశ (15) అని అన్నాను. పంచదశ కి బదులు పంచాశతి (50) అని ఉండాలి. తెలుగులో పనసకి పంచదశ ప్రకృతి అనే ధోరణిలో ఈ పొరపాటు దొర్లింది. పొరపాటుకి క్షంతవ్యుడిని.
రాజాశఙ్కర్ కాశీనాథుని
సాధారణంగా నారాయణ రావు మెచ్చుకున్నాడంటే ఆ పద్యం నిజంగా బాగున్నదై ఉంటుందనే ఆలోచన ఒకప్పుడు గాఢంగా ఉండేది నాకు. అయితే అటు తర్వాత ఆయన అభిరుచి పద్యాలకి సంబంధించి చాలా మారిందని ఆయన రాసిన ఇటీవలి పుస్తకాల చివరిమాటల వల్ల తెలిసి వచ్చింది. ఆ నారాయణ రావు, ఈ నారాయణ రావూ బహుశా ఒకరై ఉండరని అనుకున్నాను.
చాలా రోజుల తరవాత ఒక మంచి పద్యం చదివానని ఆయన అన్న ఆ మెప్పు మాట చూసి, ఏమిటా ఆ మంచి పద్యం? అని ఉదాశీనంగానే అనుకో, ఆ పాత అలవాటు వల్ల ఇదిగో ఇటుగా వచ్చి ఈ దైవాన్ని చూశాను. ఆశ్చర్యం!! నారాయణ రావు నిజంగా నిజమే చెప్పాడు. ఇంద్రాణీ!! ఇది నిజంగా మంచి పద్యం!! చాలా మంచి పద్యం. తేటగా ఉంది! నారాయణ రావు మాట మీద నమ్మకం పోగొట్టుకుని ఉండి [అనుమానంతో పేజీ తిప్పేసినట్టు] బహుశా నేను చదవక పోయి కూడా ఉండి ఉందును సుమా!! హమ్మో!! ఎంత మంచి పద్యమో!! చాలా బాగుంది. ఆయన అన్నట్టూ.. ఆ ఒక్క ” ట” నిజంగా మరీ బాగుంది.
“దైవాన్ని” ఇలా చూపించినందుకు!! పైగా ఆయన కళ్లలోకి నువ్వు చూడటం లేదు. నీ ఉలికిపాటు కళ్లలోకి ఆయనే చూస్తున్నాడు. నీ పలుకు అందుకే మెరిసింది మరి! నీ ఇదివరకు కవితలు కూడా నాకు నచ్చినవి ఇంకా ఉన్నా.. ఇది మరీ నచ్చింది. మరొక కవితో పోల్చ వీలులేని స్వంత గొంతుక ఉన్న కవివి నువ్వు ఈ కాలాన!!
ఒక్క “ట” తో ఎంత పని చేయించుకున్నారు మీరు! పద్యం ప్రాణం అంతా ఆ ఒక్క అక్షరంలో పొదివి పెట్టారు. మీరు మాటల్నే కాదు, అక్షరాల్ని కూడా అపురూపంగా వాడతారు. చాలా రోజుల తరవాత మంచి పద్యం చదివాను. — నారా.
అవధారు గురించి ns murty అభిప్రాయం:
07/05/2013 11:33 am
కనక ప్రసాద్ గారూ ,
త్రిపురతో కనక స్మృతులు అనొచ్చు మీ వ్యాసాన్ని. ఆత్మీయంగానూ, ఆత్మీయునిపై అక్కడక్కడ కొంచెం ఆగ్రహంగానూ, కనిపించినా సాహిత్యాభిలాషితో పంచుకున్న అపూర్వ క్షణాలు రికార్డు చేసిపెట్టారు.
మీరు ఆస్టిన్ లో ఉన్నట్టు తెలీదు. మిమ్మల్ని మిస్ అయ్యాను. కాలం అనుకూలిస్తే మళ్ళీ కలుద్దాం.
అభివాదములతో
అలిఖిత కఠిన శాసనం! గురించి naresh nunna అభిప్రాయం:
07/05/2013 9:26 am
ఈ కవిత content వల్ల పాత జ్ఞాపకాలేవో రేగి, ఈ కవిత ఒక రచయిత్రిది కావడంతో మరింత ఎక్కవ connect ఐన ఒక మిత్రురాలు ఈ కవిత చదవమని లింక్ పంపారు. జ్వలించే ప్రేమల వల్ల కలిగే సంయోగ వియోగాలు అందరి జీవితాల్లో సహజమే కాబట్టి కవిత చటుక్కున బాగుందనిపిస్తోంది. కానీ, form దృష్ట్యా, అంటే నిర్మాణపరంగా కవిత అంత మంచి కవిత అనిపించడం లేదు.
ఈ పాదాలు ఈ కవితలో శిఖరాయమానమైనవి. దీని స్థాయిలో మిగతా కవితా పాదాలు లేవు. అయితే, శుద్ధ కవిత్వ వాదిలా, అక్షరమక్షరంలో కవిత్వాన్ని పొంగిపొర్లిస్తూ, సారాన్ని గాలికొదిలేయమని నా ఉద్దేశం కాదు. కదంబ మాల వంటి కవితలో కొన్ని prosaic వాక్యాలుండటం ఎంత కొమ్ములున్న కవికైనా సహజమే. ఆయితే, ఆ వాక్యాలు అందులో ఇమడకపోతేనే ఇబ్బంది. అలా ఇబ్బంది కలిగించిన వాక్యాలే…
…ఈ కవితకి శీర్షిక సరఫరా చేయాల్సి రావడం వల్ల ఈ కవిత బలహీన పడిందనిపించింది. ఇదొక మధురావస్థ. మిధ్య కాని తీపి మరణావస్థ. పాదానికి ముందు బొమ్మకట్టిన భావం వల్ల, ఈ పాదంలో ప్రాస చక్కగా అతికింది. కానీ, జాలి మాలిన కాలం ఓ కనికట్టు. ఏ ప్రేమ గాయాలకీ లేదు లేపనాల కట్టు.
వంటి చోట్ల ప్రాసకోసం ప్రయత్నించినట్టు తేలిపోతోంది.
వంటి వాటి ద్వారా కవితలో continuity కోసం చూసినట్టు అనిపించి నచ్చలేదు.
అన్న చివరి లైన్లు చూస్తే, కవిత ఎత్తుగడ, ఉపసంహారం వంటి ఎకడమిక్ సూత్రీకరణల స్పృహ ఏమైనా ఉందా అనిపిస్తోంది. ‘అనుభవించిన వారికే తెలుస్తుంది….’ అన్న కామెంట్ తో సహానుభవాన్ని పొందుతున్న ఒకానొక పాఠకుడి మమేకత మీద తగు జాగ్రత్తగా కుండెడు నీళ్ళు పోసినట్టు, అనుభవం సొంతం కావొచ్చు. ఊహా జనితమూ కావొచ్చు… అని దమయంతి గారు బదులివ్వడం ఒక slap on the face లాంటి కొసమెరుపు!
వందరూపాయల నోటు గురించి CHARY అభిప్రాయం:
07/05/2013 5:33 am
అద్భుతం… మంచి కథ.
సిరినివాస వృత్తము గురించి Adinarayana అభిప్రాయం:
07/05/2013 3:17 am
శ్రీ రాజశంకర్‌గారు,
పంచదశ అంటే 15 అని ఎఱుక యున్ననూ. నేను మీరు వ్రాసిన “పంచదశ” ను “పంచ-దశ” అనగా “అయిదు పదులు = యేబై (50)” గానే గణించాను. మన సంభాషణ ధోర్ణిని బట్టి మాటలకు అర్థాలను మఱియు భావార్థాలను మనము గ్రహిస్తాము, అవును కదా. కాబట్టి, మీరు క్షంతవ్యం అడగవలసి లేదు.
చాల ధన్యవాదాలు
విధేయుడు
గూడూరు ఆదినారాయణ.
సిరినివాస వృత్తము గురించి Adinarayana అభిప్రాయం:
07/05/2013 3:01 am
కృష్ణ మోహనగారికి మఱియు రాజశంకర్‌గారికి నా కృతజ్ఞపూర్వక నమస్కారములు, మీరు ఇచ్చిన సమాధానాలగుండ తప్పనిసరిగా నా జ్ఞానాభివృద్ధీ అయింది.
రాజశంకర్‌గారు చెప్పిన “హస్తే దిక్ష్విషవ ఉభాభ్యాం ద్వావిగ్0 శతిశ్చ” సూత్రం వల్ల శతరుద్రీయాన్ని పనస (పంచదశ) తో ఎట్లు పరిగణించాలి అనికూడ తెలుసుకున్నాను. కృష్ణ మోహనగారి ద్వారా వేవేఱు ఛందస్సుల గురించి, వాటి పాదాలు మఱియు పాదానికి వుండవలసిన అక్షరాల గురించి తెలుసుకున్నను. చాల ధన్యవాదాలు. మీ వ్యస్తజీవితం నుండి నాగురించి సమయాన్ని తీసి నాకు సమాధానాలు ఇచ్చినందుకు మళ్ళి ఒక సారి నేను చాల-చాల కృతజ్ఞున్ని.
విధేయుడు
గూడూరు ఆదినారాయణ
మనిషంటే… మింగేస్తూ మింగేయబడుతున్న జ్ఞాపకం గురించి KLJ Rao అభిప్రాయం:
07/05/2013 12:13 am
మనిషిని వర్ణించిన తీరు బాగుంది. మనిషి పాంచ భౌతిక దేహుడని నిరూపించేరు .
సిరినివాస వృత్తము గురించి rajashankar అభిప్రాయం:
07/04/2013 9:12 pm
నేను ఇంతకుముందు వ్రాసిన అభిప్రాయములో పొరపాటున 50కి పంచదశ (15) అని అన్నాను. పంచదశ కి బదులు పంచాశతి (50) అని ఉండాలి. తెలుగులో పనసకి పంచదశ ప్రకృతి అనే ధోరణిలో ఈ పొరపాటు దొర్లింది. పొరపాటుకి క్షంతవ్యుడిని.
రాజాశఙ్కర్ కాశీనాథుని
దైవం గురించి jayaprabha అభిప్రాయం:
07/04/2013 9:12 pm
సాధారణంగా నారాయణ రావు మెచ్చుకున్నాడంటే ఆ పద్యం నిజంగా బాగున్నదై ఉంటుందనే ఆలోచన ఒకప్పుడు గాఢంగా ఉండేది నాకు. అయితే అటు తర్వాత ఆయన అభిరుచి పద్యాలకి సంబంధించి చాలా మారిందని ఆయన రాసిన ఇటీవలి పుస్తకాల చివరిమాటల వల్ల తెలిసి వచ్చింది. ఆ నారాయణ రావు, ఈ నారాయణ రావూ బహుశా ఒకరై ఉండరని అనుకున్నాను.
చాలా రోజుల తరవాత ఒక మంచి పద్యం చదివానని ఆయన అన్న ఆ మెప్పు మాట చూసి, ఏమిటా ఆ మంచి పద్యం? అని ఉదాశీనంగానే అనుకో, ఆ పాత అలవాటు వల్ల ఇదిగో ఇటుగా వచ్చి ఈ దైవాన్ని చూశాను. ఆశ్చర్యం!! నారాయణ రావు నిజంగా నిజమే చెప్పాడు. ఇంద్రాణీ!! ఇది నిజంగా మంచి పద్యం!! చాలా మంచి పద్యం. తేటగా ఉంది! నారాయణ రావు మాట మీద నమ్మకం పోగొట్టుకుని ఉండి [అనుమానంతో పేజీ తిప్పేసినట్టు] బహుశా నేను చదవక పోయి కూడా ఉండి ఉందును సుమా!! హమ్మో!! ఎంత మంచి పద్యమో!! చాలా బాగుంది. ఆయన అన్నట్టూ.. ఆ ఒక్క ” ట” నిజంగా మరీ బాగుంది.
“దైవాన్ని” ఇలా చూపించినందుకు!! పైగా ఆయన కళ్లలోకి నువ్వు చూడటం లేదు. నీ ఉలికిపాటు కళ్లలోకి ఆయనే చూస్తున్నాడు. నీ పలుకు అందుకే మెరిసింది మరి! నీ ఇదివరకు కవితలు కూడా నాకు నచ్చినవి ఇంకా ఉన్నా.. ఇది మరీ నచ్చింది. మరొక కవితో పోల్చ వీలులేని స్వంత గొంతుక ఉన్న కవివి నువ్వు ఈ కాలాన!!
అభినందనలు నీకు,
జయప్రభ.
దైవం గురించి Velcheru Naraayana Rao అభిప్రాయం:
07/04/2013 6:13 pm
“ఈయనేనట అన్నీ”
ఒక్క “ట” తో ఎంత పని చేయించుకున్నారు మీరు! పద్యం ప్రాణం అంతా ఆ ఒక్క అక్షరంలో పొదివి పెట్టారు. మీరు మాటల్నే కాదు, అక్షరాల్ని కూడా అపురూపంగా వాడతారు. చాలా రోజుల తరవాత మంచి పద్యం చదివాను. — నారా.
అవధారు గురించి Ismail Penukonda అభిప్రాయం:
07/04/2013 2:22 pm
Touching.