పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. వేకువనే మోకరించే ఆమె గురించి Uma అభిప్రాయం:

    07/09/2013 8:42 am

    చక్కటి భక్తి భావన.

  2. కాల్వీనో కథల నుంచి – 6ఆ గురించి CHARY అభిప్రాయం:

    07/09/2013 7:11 am

    అప్పటిదాకా ఊరి పొలిమేరల్లో తచ్చాడుతున్న చీకటి మెల్లిగా ఊరి మధ్యలోకి పాకి చెట్ల ఆకుల మధ్యలో…….హ్హహ్హహ్హహ్హహ్హ

  3. హాయిగ పాడుదునా? గురించి Vihari అభిప్రాయం:

    07/09/2013 1:20 am

    సాహితీ ప్రియులకు వందనం!

    చాలా రోజులుగా “ఎర్ర గులాబీ అత్తరు” కథకై ఎంతో ప్రయత్నించుతూ వచ్చాను. ఎన్నో సంవత్సరాల క్రితం తెలుగు నాన్ డిటెయిల్డ్ టెక్స్ట్ బుఖ్కులో చదవడం జరిగింది. కథకులు ఎవరో చెప్పగలరు!

  4. పై గదిలో ప్రేమికుడు గురించి మోహన అభిప్రాయం:

    07/08/2013 8:50 am

    అది చాలా చక్కటి సూచన. అయితే అందులో ఒక ఇబ్బంది వుంది (నాకు!). ఆంగ్లంలో వాడడం అలవాటైన సైంటిఫిక్ పదాలకి తెలుగు సమానార్థక పదాలు నాకంత బాగా రావు. అందువల్లే నేనెప్పుడూ ప్రయత్నించలేదు. అంతకంటే మరే కారణమూ లేదు.

    దీనికి కావలసిన పారిభాషిక పదకోశములు ఉన్నాయి శారద గారు, వాటిని సంప్రదించవచ్చును. మీకు కావాలంటే నేను సహాయము చేయగలను. – మోహన

  5. అలిఖిత కఠిన శాసనం! గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:

    07/08/2013 7:24 am

    ‘కవితని ఒక సైన్స్ పీర్ రెవ్యూడ్ వ్యాసం లాగ నేను చూడను.’

    ‘…నాకు నచ్చింది, నచ్చిందని చెప్పడం. కవిత్వం తో సంబంధం లేదు, మనసుతోనే సంబధం, బతుకుతోనె సంబంధం. ‘

    ఈ ఒక్క వాక్యం చాలు, – ఎందరినో ఆలోచింప చేసేందుకు!

    మీరన్నట్టు – గుండెని కాజేసుకుపోయేదే అసలైన కవిత్వం. అందులో సందేహమే లేదు. కొన్ని అక్షరాలకు గుళ్ళు కట్టలేం. వాట్లని వొడిసిపట్టే గుండెలే..గొప్ప దేవస్థానాలు. వొలికే కన్నీళ్ళే పుష్పాభిషేకాలు. రవికిరణ్ గారూ! కవిత్వం పట్ల మీకు గల భావాభిప్రాయాలను – ఎంతో స్వేచ్ఛగా, స్వచ్ఛంగా, మరెంతో హృద్యంగా – వ్యక్తపరచినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. మరోసారి, మీకు నా మనః పూర్వక ధన్య వాదాలు తెలియ చేసుకుంటూ

    శుభాభివందనాలతో
    -ఆర్.దమయంతి.

  6. ఊహాతీతం గురించి శారద అభిప్రాయం:

    07/07/2013 10:37 pm

    కథ చాలా బాగుంది. అయితే, ఎందుకో ఈ కథ ఈ మాట మెయిన్ పేజీలో లేదు! ఒక్క సారి సంపాదకులు సరి చేయగలరు.

    శారద

    [ఈ విషయం మా దృష్టికి తెచ్చినందుకు కృతజ్ఞులం. తప్పు సరిచేశాము. ఇప్పుడు ముందుపేజీలో కథ కనిపిస్తుంది – సం.]

  7. పై గదిలో ప్రేమికుడు గురించి శారద అభిప్రాయం:

    07/07/2013 9:47 pm

    ముందస్తుగా,అందరికీ క్షమాపణలు. ఏదో కారణాలవల్ల, ఈ వ్యాఖ్యలన్నీ నేను చూడనేలేదు. అందువల్ల స్పందిచలేదు. Did not mean to be rude.

    @సౌమ్య, @ నారాయణ స్వామి గారూ,
    ఉరికే సరదాకి ఈ సారి కథలో పేర్లు మార్చి, కథా స్థలం కూడా మార్చాను. నచ్చినందుకు సంతొషం. అసలు విలన్ని ఏకంగా మోహన్ బాబు చేద్దామనుకున్నా కానీ, వొదిలేసాను 🙂 ఎస్కిమోలకి రెఫ్రిజిరేటర్లు అమ్మ గలిగే వాడని పేరు పొందిన అమీన్ సయానీ పేరు గుర్తు పట్టినందుకు హేపిస్.

    @ మూర్తిగారూ, @ చౌదరి గారూ,
    అనువాదం నచ్చినందుకు సంతోషం.

    @ఇంద్రాణి గారూ,
    హాస్యం ఎప్పుడు అందరికీ నచ్చదు. ఒక కోణం లోంచి చాలా ఫన్నీగా, absurd గా అనిపించే సంభాషణలూ, సన్నివేశాలూ, వేరే కోణం లోంచి ఎవర్నో వెక్కిరిస్తున్నట్టుగా అనిపించడం జరుగుతూంది. అయితే వోడ్ హవుస్ కథల్లో నాకు వ్యక్తిగతంగా నచ్చే అంశాలు, జీవితం లో ప్రతీదీ తేలిగ్గా తీసుకునే మనుషులు. అందువల్లే నాకీ కథ నచ్చింది.

    పోతే, మీరు ప్రస్తావించిన సైన్సు వ్యాసాల అనువాదాలు-
    అది చాలా చక్కటి సూచన. అయితే అందులో ఒక ఇబ్బంది వుంది (నాకు!). ఆంగ్లంలో వాడడం అలవాటైన సైంటిఫిక్ పదాలకి తెలుగు సమానార్థక పదాలు నాకంత బాగా రావు. అందువల్లే నేనెప్పుడూ ప్రయత్నించలేదు. అంతకంటే మరే కారణమూ లేదు.

    కథ చదివి స్పందించిన అందరికీ ధన్యవాదాలు.
    శారద

  8. మన సాహిత్యంలో కవులు, పుస్తకాలు – 2 గురించి indrani Palaparthy అభిప్రాయం:

    07/07/2013 8:41 pm

    కమలా దాస్ కవిత్వం కన్నా ఆవిడ ఆత్మ కధే నాకిష్టం.
    హైదరాబాదు లో ఉన్నప్పుడు నాలుగైదు లైబ్రరీల్లో మెంబరుషిప్పు ఉండేది.
    ఎప్పుడు పుస్తకం ఇచ్చెయ్యాలో ఎప్పుడూ చూసుకోను కనుక ఎన్నోసార్లు జరిమానాలు కట్టాను.

    బ్రిటీష్ లైబ్రరీ కి నేను కట్టినన్ని ఫైన్లు ఎవరూ కట్టి ఉండరేమో.కమలా దాసు పుస్తకాలకీ కట్టాను.

    కధలు,కవితలుకన్నా ఆత్మ కధలంటే నాకెంతో ఇష్టం.

    అన్ని రంగాల్లో వాళ్ళవి.దేశీయులవి.విదేశీయులవి.

    వాళ్ళు అంతా నిజమే రాసారని నమ్ముతాను. ఒకవేళ రాసిన వాళ్ళు నిజాలు దాచిపెట్టినా, అబద్ధాలు రాసినా నాకేమీ పర్వాలేదు.వారి కధ నాకు స్ఫూర్తినిస్తే చాలు.

    ఇంద్రాణి.

  9. దైవం గురించి indrani Palaparthy అభిప్రాయం:

    07/07/2013 6:52 pm

    Narayana Rao garu, Jaya Prabha garu: Thank you for your kind words.

    Thank you everybody for reading my poems and posting your valuable comments. I feel indebted to you all.

    Regards
    Indrani Palaparthy.

  10. అవధారు గురించి gangareddy అభిప్రాయం:

    07/07/2013 4:48 pm

    నాకు cinema చూసినట్లు అనిపించింది. అప్పుడే అయిపోయిందా!