“నీరో చక్రవర్తి రోమ్‌ను పరిపాలిస్తున్న కాలంలో ఆంధ్ర ప్రదేశ్ నుంచి మిరపకాయలు విపరీతంగా ఎగుమతయ్యేవి. రోమ్ నగరాన్ని పునర్మిస్తున్న సమయంలో రోమ్ పౌరులు ప్రభుత్వానికి కడుతున్న పన్నుల కన్నా ఆంధ్రప్రదేశ్ నుంచి మిరపకాయలు దిగుమతి చేసుకోవటానికి చెల్లిస్తున్న సొమ్మే ఎక్కువ అని వగచిన నీరో ఆ దిగుమతులను నిషేధించాడు.”
పై వాక్యంలో “మిరపకాయలు”కి బదులు “మిరియాలు” అని ఉంటే నిజానికి దగ్గరగా ఉంటుందని నా అభిప్రాయం. మిరప మెక్సికోకి దక్షిణంగా ఉన్న అమెరికా ఖండపు పంట. వీటిని భారత దేశానికి పరిచయం చేసినది బుడతకీచులు అని నా నమ్మకం. మిరియాలని, ఇతర సుగంధ ద్రవ్యాలని రోమన్ సామ్రాజ్యానికి ఎగుమతి చేసి ఆ నాటి భరతదేశం బంగారాన్ని విపరీతంగా గణించింది.
చక్కటి ప్రశ్న వేసారు. ఈ వ్యాసకర్త ఎంచుకున్న అంశం మీకూ, నాకు చాలా ఆసక్తి రేకెత్తించే విషయమని నాకు తెలుసు. అయితే, ఈ వ్యాసంతో నాకు ఎన్నో ఇబ్బందులున్నాయి. స్థూలంగా ఈ వ్యాసకర్త తాను చేసిన చాలా నిర్ణయాలకు ఏ శాస్త్రీయమైన ఆధారాలు చూపలేదు. తమిళ, కన్నడ వంటి ఇతర ద్రావిడ భాషలలో ఉన్న పదాలను తులనాత్మకంగా విశ్లేషించి ఉంటే ఆయన వాదనలలోని పొరపాట్లు తెలిసేవి. అయితే, ఆయనకు ఆ రకమైన తులనాత్మక దృష్టి లేదని నాకనిపించింది.
ఈ వ్యాసంలోని లోపాలను చర్చించే ముందు మీరడిగిన పట్నం విషయం.
పట్నం/పట్టణం-/పట్టినం- అన్న ద్రావిడ భాషా పదానికి మూల ధాతువు *పట్టు-. రాచపట్టు, అరసుపట్టు, కరపట్టు, ముంగిలిపట్టు అన్న ఊళ్ళు దక్షిణ భారతంలో చాలా ఉన్నాయి. పట్టినం- అంటే పెద్ద ఊరు, commercial town అన్నది ప్రాథమిక అర్థమనే భావించాలి. సముద్రతీరంలో లేని ఊళ్ళకు కూడా పట్నం అన్న పేరు చివరన ఉన్న కొన్ని ఊర్లు:
కర్ణాటకలోని శ్రీరంగ పట్నం, కోయంబత్తూర్ లోని మలయందిపట్టినం, తంజావూర్ జిల్లాలోని మల్లిపట్టినం మొదలైనవేవీ సముద్ర తీరంలో లేవు.
రోమన్ల కాలంనుండి సముద్ర తీరంలో ఉంటే ప్రాంతాలు సముద్ర వర్తకం వల్ల commercial townగా, పెద్ద నగరాలుగా అభివృద్ధి చెందాయి కాబట్టి చాలా రేవు ప్రాంతాలకు పట్టినం/పట్టణం అని పేరు వచ్చిందని నా ఊహ.
ఇక ఈ వ్యాసంతో నాకున్న సమస్యలు:
సంస్కృత శబ్దమైన గ్రామానికి, ప్రాకృత శబ్దమైన ఊరికి కొన్ని ప్రత్యేక లక్షణాలున్నాయి.
1. ఊరు అన్నది ద్రావిడ భాషపదమేనన్న విషయంలో నాకు తెలిసినంతవరకూ ఏ వివాదం లేదు. కానీ, ఈ వ్యాసకర్త దాన్ని ప్రాకృత భవమని పేర్కొన్నాడు.
నేడు కాలబోధకంగా ఉపయోగిస్తున్న సామెత ‘ఏండ్లు పూండ్లు గడిచా’యనేది నిజానికి ఆ అర్థంలో వచ్చింది కాదు. ఏండ్లు, పూండ్లు గడవడం అంటే ఏరులు అంటే నదులు, పూండ్లు అంటే బురదనేలలు దాటి వచ్చాయనేది అసలైన అర్థం.
2. Humbug! ఏరు అన్న పదానికి బహువచనం ఏండ్లు ఎలా అవుతుందో ఏండ్లు పూండ్లు గడిచా’యనేది కాలబోధకం ఎందుకు కాదో వివరించడానికి రచయిత ఏ ఆధారాలు ఇవ్వలేదు.
రావికంపాడు, పోలకంపాడు మొదలైన గ్రామనామాల్లో కన్పిస్తున్న ‘కమ్మ’కు నది అని అర్థం. గుండ్లకమ్మ మనం ఎరిగినదే. కృష్ణానదికి ‘పేరకమ్మ’ అనేది అచ్చపు తెనుగు పేరు. ఈ రెండు కమ్మలకు మధ్య వున్న నాడు ‘కమ్మనాడు’. ‘కమ్మగుట్టు గడప దాటదు’ అనే సామెతను కమ్మవారి కుటుంబాలలోని గుట్టు గడప దాటి బయటకు రాదనే అర్థంలో వివరించడం పరిపాటి. నిజానికిది సరికాదు. కమ్మనాటి గుట్టు కడప దాటిపోదు అని అర్థం.
3. రచయిత ఊహ తప్ప కమ్మ అన్న పదానికి ‘నది’ అన్న అర్థం ఇవ్వడానికి ఏ ఆధారమూ కనిపించదు. కమ్మ అన్నది కప్పు- అన్న అర్థంలో తమిళంలో వాడుక ఉంది. గుండ్లకమ్మ అంటే గుండ్ల కప్పు అయ్యే అవకాశం ఉంది.
పల్లె మొదట బౌద్ధుల నివాసం. పాడు జైనులుండే చోటు. వాడ శాఖా నగరానికి పేరు.
4. పల్లె, పాడు, వాడ ద్రావిడ పదాలైతే అవి బౌద్ధులు, జైనులు మొదటగా వాడినట్టు చెప్పడానికి ఆధారాలు ఏవి?
చీరాల, పేరాల, గూటాల, కడియాల మొదలైన వానిలోని ‘ఆల’ గడ్డిజాతికి చెందిన మొక్క.
5. ఆల అనేది గడ్డిజాతి మొక్క కాదు. ఞాల (ñāla = నేల) అన్న ధాతువు నుండి వచ్చింది. -ఆల అన్న ప్రత్యయంతో తెలుగుదేశంలో ఉన్న ఊరిపేర్లు కోకొల్లలు: జగిత్యాల, మల్యాల, నంద్యాల, చీరాల, పేరాల, కొడిమ్యాల, పరకాల, పరిటాల, పెండ్యాల, పొన్నాల, మామిడాల, కనగాల, ఓగిరాల, కానాల, గుండాల, చిక్కాల, వావిలాల, ఇటిక్యాల, లింగాల మొ॥ కొన్ని ఉదాహరణలు. -*ఞాల శబ్దమే తరువాత కాలంలో నేలగానూ, -ఆల గానూ మారి ఉండవచ్చననుకుంటే, నంద్యాల (నంది+ఆల), పెంట్యాల/పెండ్యాల (పెంటి + ఆల) వంటి పదాల్లో ఞాల శబ్దపు ప్రాచీన తాలవ్య రూపాన్ని య-వత్తుతో మనకు సూచిస్తూ ఉండవచ్చు.
వైవాకలోని ‘వాక’, పాలువాయిలోని ‘వాయి’ చిన్న ప్రవాహాలను సూచిస్తాయి.
6. నా దృష్టిలో వాక అన్నది ‘పాక’ అన్న పదానికి రూపాంతరం. పదాల మధ్య ‘ప’ కారాన్ని తేలికగా -వ- కారంగా పలకడం ద్రావిడ భాష వర్ణ లక్షణాలలో ఒకటి. దాన్నే మనం గ-స-డ-ద-వాదేశ సంధి అని చెప్పుకుంటాం. తమిళనాడులో ‘వాక’ ‘వాకం’ అన్న పేరుతో చాలా ప్రదేశాలు ఉన్నాయి. వాటిని పాక అన్న అర్థంతోనే వివరిస్తారు.
మానికొండ, పోలు కొండ, కొండ పాటూరులలోని ‘కొండ’ శిలాసూచి కాదు. కొండంగి అనేది గడ్డి జాతి మొక్క. దీనిని బట్టి ఇచ్చట కొండ అనేది మొక్క అని బోధ పడుతుంది.
7. ఈ వాదనకు ఆధారాలు బోధపడవు.
‘వింజ’ అనేది ఒక నీటిపక్షి దాని ఈకలతో చేసినది వింజామర.
8. Totally false. వింజ అంటే నీటి పక్షి కాదు. వింజిలి అంటే ఒక రకమైన చేప. అయితే, దాని ఈకలతో వింజామరలు తయారు చేస్తారని ఎక్కడా వినలేదు. అసలు వివరణ ఇది: చామర అంటే పక్షి ఈక. విఞ్- అన్నది వీచు, విసురు అన్న పదాలకు సంబంధించింది. వీచే పక్షి ఈక వింజామర. ఈ పదాన్ని వెల్ల (=తెల్లని) + చామర అని కొన్ని నిఘంటువులు వివరిస్తాయి కానీ, దానికి కూడ భాషాశాస్త్రం ఒప్పుకోదు. వెల్ల అన్నది విం- ఎలా అయింది?
పులిగడ్డ, పులివెందుల, పులిప్రొద్దుటూరులలోని ‘పులి’ జంతువు కాదు. పులి అంటే అనాది బంజరు.
9. Totally puzzling.
అయినవోలు, అయినంపూడి లలో గల ‘అయిన’ శబ్దానికర్థం నదివంపు తిరిగేచోట అభిముఖంగా వున్న భూభాగం అని అర్థం.
10. తమిళంలో ఆయిని, అయని అంటే ఒక రకమైన మల్లె అన్న అర్థాలు ఉన్నాయి. (āyiṉi, āciṉi bread-fruit tree, añcali jungle jack, āyini, āññali, āññili A. pubescens; ayaṇi, ayani, ayini, ānūṇi, āmini, āyani, āvani, āvini A. hirsuta). ఆ అర్థాన్ని వదిలేసి “నదివంపు తిరిగేచోట అభిముఖంగా వున్న భూభాగం అని అర్థం” ఎలా వచ్చిందో నాకైతే అర్థం కావడం లేదు.
వళందపాలెం డచ్చివారి రాజధాని హాలెండు శబ్దం నుంచి వారి మకాముకు పేరుగా నెలకొన్నది.
11. హాలాండ్ డచ్చివారి రాజధాని కాదు. హాలాండ్ డచ్చివారి రాజ్యంలో ఒక ప్రాంతం పేరు. వళందపాలెం నిజంగా హాలెండు శబ్దం నుంచి వచ్చి ఉంటే మూర్ధన్య -ళ- కారం వాడడానికి కారణమేమి?
ఫరంగుల (విదేశీయులు) ఆవాసం ఫిరంగి పురం. (Foreign అనే ఆంగ్లపదం తెలుగు లిప్యంతరీకరణంలో ఫరంగి అయి, వ్యవహారంలో ఫిరంగి అయింది.)
12. నిజంగా Foreign అనే ఆంగ్లపదం తెలుగు లిప్యంతరీకరణంలో ఫరంగి అయి ఉంటే హింది/ఉర్దూ లోనూ, ఇంకా అరబిక్, పర్షియన్, టర్కిష్ భాషలలో కూడా ఫిరంగీ అని ఎందుకంటారు? అసలు విషయం ఏమిటంటే, ఇది Frank అన్న పదానికి అభాసరూపం. మధ్య యుగ కాలంలో పశ్చిమ యూరప్ వారందరినీ మధ్యాసియా ముస్లిములు ఫ్రాంకులని, ఫిరంకులని, ఫిరంగులని పిలిచేవారు. మన ముస్లిం పాలకుల ద్వారా తెలుగుతో సహా భారతీయ భాషలన్నింటిలో ప్రవేశించిన పదం ఫిరంగి. (The term Frank has been used by many of the Eastern Orthodox and Muslim neighbors of medieval Latin Christendom (and beyond in Asia) as a general synonym for a European from Western and Central Europe, areas that followed the Latin rites of Christianity under the authority of the Pope in Rome — From Wikipedia).
“మల్లెమాల అంటే … కొండదాపున గల అడవిలో నున్న పల్లెను మాల అంటారు”, ” త్యాడ అనే ఊరి పేరుపై బహువచనం తేళ్ళ” అంటూ సాగే ఈ వ్యాసంలోని ఎన్నో వాక్యాలు శాస్త్ర వివేచనకు నిలువవని చెప్పవచ్చు. ఈయన తాను స్వయంగా తెలుగువారి ఊళ్ల పేర్లు – ఇంటి పేర్లపై పరిశోధనా గ్రంథాలను వెలువరించారని, ఆపై ఎంతో మందికి ఇదే అంశంపై Ph. D. కి మార్గ దర్శకులుగా ఉన్నారని విన్నాను. ఆ పరిశోధనా గ్రంథాలను పరిశీలనగా చదివిన వారెవరైనా వాటి నాణ్యత గురించి వివరిస్తే బాగుంటుంది.
ఆశారాజూ! నీ కవిత్వం లోని విషయం నన్ను ఆకట్టుకుంది. ఒక్కరైనా ఈ విషయాన్ని బహిరంగం చేస్తారా అని అనుకున్నాను. శిల్పానికేం గానీ కనీశం మొహమాటం లేకుండా ఉన్నదేదో అన్నావు. అదే పదివేలు.
మొత్తానికి కవులు కవిత్వం తప్ప మిగిలినవన్నీ చేస్తున్నారన్నమాట! ముఖ్యంగా తమ తమ కవిత్వ “ప్రచారం”! గ్లోబలైజేషన్ అంటే ఇదే మరి 🙂 ఇంతకీ ఆ విమర్శకులు అన్నోటి ముందుమాటలూ అన్నోటి చివరిమాటలూ పోటీ పడి రాసినా అసలాఖరుకి ఒక్కరికైనా వారి రాతల్లోని ఆ ఆ విశేషాలేవన్నా అవగతమైనాయా? ఒక్క పద్యమైనా ఒక్కరి మనసులోనైనా దూరి రహస్యాలేవన్నా మాట్లాడిందా? అంతేనా? ఇలా పుస్తకం అచ్చు అవగానే అలా ఒక అవార్డో? అంతా గూడుపుఠాణీ అంటావా? మరీ ఇన్నీ ఉన్నా పుస్తకాలలో ఆ కవిత్వం ఎటు పోయిందో చెప్పేదెవరా అని? కవీ విమర్శకుడూ కుమ్మక్కై కిక్కిరిసి కూర్చున్న దృశ్యం ఇబ్బందిగా తెలుగు అక్షర ముఖ ద్వారాన్ని అటకాయిస్తోంది అనా? కానీ ఆ మాటని నిజాయితీగా చెప్పే పత్రికలూ లేవే? ఇప్పుడు బేధాభిప్రాయాలు లేవు. ఒకటే అభిప్రాయం. ఒకటే మాట! అంతా గుంభనం , అంతా గప్ చుప్! అప్పుడప్పుడు ఒపీనియన్స్ చేంజ్ చేస్తూంటే గానీ పొలిటీషియన్ కానేరడని చెప్పాడు గిరీశం. అందుకు కవులు మాత్రం అతీతులా? ఇంతకీ ఎంతమంది ఉన్నారూ “కవులు” తెలుగులో? ఓ! కవిత్వాన్ని పక్కన పారేసారని కదూ అన్నావు. కవులున్నారు గానీ కవిత్వం లేదన్నమాట! విమర్శ అటకెక్కినట్టుగానే!
అగడ్తలు చుట్టు ఉండే నగరమును పట్టనము అంటారని చదివినట్లు గుర్తు. సముద్రతీరములో ఉండే నగరములకు సముద్రము ఒక వైపు అగడ్తయే కదా? అదియు కాక ముఖ్యనగరమును పట్టనము అంటారు, పట్టమహిషి, పట్టపు ఏనుగు లాటిది ఈ పట్టము. అందుకే మనము పట్టములు కూడ పుచ్చుకొంటాము. ముఖ్యనగరము అని అనుకొంటే అది ఎక్కడైనా ఉండవచ్చును, సముద్రతీరములో మాత్రమే కాదు. పాటలీపుత్రము పట్నా అయినది బహుశా ఇలాగేనేమో? మైసూరునగరము దగ్గరలో రెండు పట్నములు ఉన్నాయి, అవి – చన్నపట్న, శ్రీరంగపట్న. విధేయుడు – మోహన
అమ్మను గుర్తుచేసుకోవడం జ్ఞాపకమేనా! అని అడిగారు. మీరు మోకరించినప్పుడల్లా మిమ్మల్ని జీవిత పధంలో నడిపించిన మీ అమ్మను తలచుకుంటె అది జ్ఞాపకం అవుతుంది. ఆదే మీ అమ్మనే తలచుకుంటూ మోకరిస్తే జన్మ తరిస్తుంది.
కేవలం నాలుగే నాలుగు పాత్రలతో
1.షాదుల్
2. ఇమామ్
3. అమ్మీ
4. చాంద్
పెద్దింటి అశోక్ కుమార్ రాసిన “జిగిరి” నవల చాలా బాగుంది . మనుషులు జంతువుల్లా మారిపోవడానికి ఆయన చెప్పిన కారణాలు అందర్నీ ఆలోచింపచేస్తాయి ….. ఈ నవల వివరణను ఇస్తూ గుడిపాటి గారు రాసిన మాటలు కూడా ఆసక్తిగా ఉంటాయి .
రచయితకు సంబందించిన ఫోటో, బ్లాగ్ నిర్వాహకులకు ఈ లింక్ వద్ద లభిస్తుంది.
నా గమనికలో “పట్నం” అనే పేరు చివర ఉన్నవి సర్వసాధారణంగా సముద్ర తీరాన్ని ఉన్న రేవు పట్నాలు. భీమిలిపట్నం, విశాఖపట్నం, మచిలీపట్నం, చెన్నపట్నం, నాగపట్నం, మొదలైనవి. వీటికి మినహాయింపులు కూడ ఉన్నాయి: నర్శీపట్నం, ఇబ్రహీంపట్నం. ఈ గమనికలో ఏదైనా శాస్త్రీయత ఉందా లేక నా గమనిక కేవలం యాధృచ్ఛికమైన పరిశీలన మాత్రమేనా?
గతమెంతో ఘనకీర్తి – భవితెంతో భవదీప్తి గురించి Rao Vemuri అభిప్రాయం:
07/15/2013 5:15 pm
పై వాక్యంలో “మిరపకాయలు”కి బదులు “మిరియాలు” అని ఉంటే నిజానికి దగ్గరగా ఉంటుందని నా అభిప్రాయం. మిరప మెక్సికోకి దక్షిణంగా ఉన్న అమెరికా ఖండపు పంట. వీటిని భారత దేశానికి పరిచయం చేసినది బుడతకీచులు అని నా నమ్మకం. మిరియాలని, ఇతర సుగంధ ద్రవ్యాలని రోమన్ సామ్రాజ్యానికి ఎగుమతి చేసి ఆ నాటి భరతదేశం బంగారాన్ని విపరీతంగా గణించింది.
గతమెంతో ఘనకీర్తి – భవితెంతో భవదీప్తి గురించి Rao Vemuri అభిప్రాయం:
07/15/2013 5:04 pm
బంగ్లాదేశ్ లోని బెంగాలీలని లెక్కపెట్టకపోతే భారత దేశంలో హిందీ తర్వాత ఎక్కువ మంది మాట్లాడేది తెలుగే అని నా అభిప్రాయం.
తెలుగువారి ఊళ్ళ పేర్లు – ఇంటి పేర్లు గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:
07/15/2013 4:19 pm
వేమూరి గారు,
చక్కటి ప్రశ్న వేసారు. ఈ వ్యాసకర్త ఎంచుకున్న అంశం మీకూ, నాకు చాలా ఆసక్తి రేకెత్తించే విషయమని నాకు తెలుసు. అయితే, ఈ వ్యాసంతో నాకు ఎన్నో ఇబ్బందులున్నాయి. స్థూలంగా ఈ వ్యాసకర్త తాను చేసిన చాలా నిర్ణయాలకు ఏ శాస్త్రీయమైన ఆధారాలు చూపలేదు. తమిళ, కన్నడ వంటి ఇతర ద్రావిడ భాషలలో ఉన్న పదాలను తులనాత్మకంగా విశ్లేషించి ఉంటే ఆయన వాదనలలోని పొరపాట్లు తెలిసేవి. అయితే, ఆయనకు ఆ రకమైన తులనాత్మక దృష్టి లేదని నాకనిపించింది.
ఈ వ్యాసంలోని లోపాలను చర్చించే ముందు మీరడిగిన పట్నం విషయం.
పట్నం/పట్టణం-/పట్టినం- అన్న ద్రావిడ భాషా పదానికి మూల ధాతువు *పట్టు-. రాచపట్టు, అరసుపట్టు, కరపట్టు, ముంగిలిపట్టు అన్న ఊళ్ళు దక్షిణ భారతంలో చాలా ఉన్నాయి. పట్టినం- అంటే పెద్ద ఊరు, commercial town అన్నది ప్రాథమిక అర్థమనే భావించాలి. సముద్రతీరంలో లేని ఊళ్ళకు కూడా పట్నం అన్న పేరు చివరన ఉన్న కొన్ని ఊర్లు:
బుక్కపట్నం, తురకలపట్నం (అనంతపూర్ జిల్లా), దేవగిరిపట్నం, రాఘవపట్నం (వరంగల్ జిల్లా), కేశవపట్నం, రాయిపట్నం (కరీంనగర్ జిల్లా), మొల్కపట్నం (నల్గొండ), నాగపట్నం, మంగపట్నం, బుక్కపట్నం (కడప), రాయపట్నం (ఖమ్మం) మొ.
కర్ణాటకలోని శ్రీరంగ పట్నం, కోయంబత్తూర్ లోని మలయందిపట్టినం, తంజావూర్ జిల్లాలోని మల్లిపట్టినం మొదలైనవేవీ సముద్ర తీరంలో లేవు.
రోమన్ల కాలంనుండి సముద్ర తీరంలో ఉంటే ప్రాంతాలు సముద్ర వర్తకం వల్ల commercial townగా, పెద్ద నగరాలుగా అభివృద్ధి చెందాయి కాబట్టి చాలా రేవు ప్రాంతాలకు పట్టినం/పట్టణం అని పేరు వచ్చిందని నా ఊహ.
ఇక ఈ వ్యాసంతో నాకున్న సమస్యలు:
1. ఊరు అన్నది ద్రావిడ భాషపదమేనన్న విషయంలో నాకు తెలిసినంతవరకూ ఏ వివాదం లేదు. కానీ, ఈ వ్యాసకర్త దాన్ని ప్రాకృత భవమని పేర్కొన్నాడు.
2. Humbug! ఏరు అన్న పదానికి బహువచనం ఏండ్లు ఎలా అవుతుందో ఏండ్లు పూండ్లు గడిచా’యనేది కాలబోధకం ఎందుకు కాదో వివరించడానికి రచయిత ఏ ఆధారాలు ఇవ్వలేదు.
3. రచయిత ఊహ తప్ప కమ్మ అన్న పదానికి ‘నది’ అన్న అర్థం ఇవ్వడానికి ఏ ఆధారమూ కనిపించదు. కమ్మ అన్నది కప్పు- అన్న అర్థంలో తమిళంలో వాడుక ఉంది. గుండ్లకమ్మ అంటే గుండ్ల కప్పు అయ్యే అవకాశం ఉంది.
4. పల్లె, పాడు, వాడ ద్రావిడ పదాలైతే అవి బౌద్ధులు, జైనులు మొదటగా వాడినట్టు చెప్పడానికి ఆధారాలు ఏవి?
5. ఆల అనేది గడ్డిజాతి మొక్క కాదు. ఞాల (ñāla = నేల) అన్న ధాతువు నుండి వచ్చింది. -ఆల అన్న ప్రత్యయంతో తెలుగుదేశంలో ఉన్న ఊరిపేర్లు కోకొల్లలు: జగిత్యాల, మల్యాల, నంద్యాల, చీరాల, పేరాల, కొడిమ్యాల, పరకాల, పరిటాల, పెండ్యాల, పొన్నాల, మామిడాల, కనగాల, ఓగిరాల, కానాల, గుండాల, చిక్కాల, వావిలాల, ఇటిక్యాల, లింగాల మొ॥ కొన్ని ఉదాహరణలు. -*ఞాల శబ్దమే తరువాత కాలంలో నేలగానూ, -ఆల గానూ మారి ఉండవచ్చననుకుంటే, నంద్యాల (నంది+ఆల), పెంట్యాల/పెండ్యాల (పెంటి + ఆల) వంటి పదాల్లో ఞాల శబ్దపు ప్రాచీన తాలవ్య రూపాన్ని య-వత్తుతో మనకు సూచిస్తూ ఉండవచ్చు.
6. నా దృష్టిలో వాక అన్నది ‘పాక’ అన్న పదానికి రూపాంతరం. పదాల మధ్య ‘ప’ కారాన్ని తేలికగా -వ- కారంగా పలకడం ద్రావిడ భాష వర్ణ లక్షణాలలో ఒకటి. దాన్నే మనం గ-స-డ-ద-వాదేశ సంధి అని చెప్పుకుంటాం. తమిళనాడులో ‘వాక’ ‘వాకం’ అన్న పేరుతో చాలా ప్రదేశాలు ఉన్నాయి. వాటిని పాక అన్న అర్థంతోనే వివరిస్తారు.
7. ఈ వాదనకు ఆధారాలు బోధపడవు.
8. Totally false. వింజ అంటే నీటి పక్షి కాదు. వింజిలి అంటే ఒక రకమైన చేప. అయితే, దాని ఈకలతో వింజామరలు తయారు చేస్తారని ఎక్కడా వినలేదు. అసలు వివరణ ఇది: చామర అంటే పక్షి ఈక. విఞ్- అన్నది వీచు, విసురు అన్న పదాలకు సంబంధించింది. వీచే పక్షి ఈక వింజామర. ఈ పదాన్ని వెల్ల (=తెల్లని) + చామర అని కొన్ని నిఘంటువులు వివరిస్తాయి కానీ, దానికి కూడ భాషాశాస్త్రం ఒప్పుకోదు. వెల్ల అన్నది విం- ఎలా అయింది?
9. Totally puzzling.
10. తమిళంలో ఆయిని, అయని అంటే ఒక రకమైన మల్లె అన్న అర్థాలు ఉన్నాయి. (āyiṉi, āciṉi bread-fruit tree, añcali jungle jack, āyini, āññali, āññili A. pubescens; ayaṇi, ayani, ayini, ānūṇi, āmini, āyani, āvani, āvini A. hirsuta). ఆ అర్థాన్ని వదిలేసి “నదివంపు తిరిగేచోట అభిముఖంగా వున్న భూభాగం అని అర్థం” ఎలా వచ్చిందో నాకైతే అర్థం కావడం లేదు.
11. హాలాండ్ డచ్చివారి రాజధాని కాదు. హాలాండ్ డచ్చివారి రాజ్యంలో ఒక ప్రాంతం పేరు. వళందపాలెం నిజంగా హాలెండు శబ్దం నుంచి వచ్చి ఉంటే మూర్ధన్య -ళ- కారం వాడడానికి కారణమేమి?
12. నిజంగా Foreign అనే ఆంగ్లపదం తెలుగు లిప్యంతరీకరణంలో ఫరంగి అయి ఉంటే హింది/ఉర్దూ లోనూ, ఇంకా అరబిక్, పర్షియన్, టర్కిష్ భాషలలో కూడా ఫిరంగీ అని ఎందుకంటారు? అసలు విషయం ఏమిటంటే, ఇది Frank అన్న పదానికి అభాసరూపం. మధ్య యుగ కాలంలో పశ్చిమ యూరప్ వారందరినీ మధ్యాసియా ముస్లిములు ఫ్రాంకులని, ఫిరంకులని, ఫిరంగులని పిలిచేవారు. మన ముస్లిం పాలకుల ద్వారా తెలుగుతో సహా భారతీయ భాషలన్నింటిలో ప్రవేశించిన పదం ఫిరంగి. (The term Frank has been used by many of the Eastern Orthodox and Muslim neighbors of medieval Latin Christendom (and beyond in Asia) as a general synonym for a European from Western and Central Europe, areas that followed the Latin rites of Christianity under the authority of the Pope in Rome — From Wikipedia).
“మల్లెమాల అంటే … కొండదాపున గల అడవిలో నున్న పల్లెను మాల అంటారు”, ” త్యాడ అనే ఊరి పేరుపై బహువచనం తేళ్ళ” అంటూ సాగే ఈ వ్యాసంలోని ఎన్నో వాక్యాలు శాస్త్ర వివేచనకు నిలువవని చెప్పవచ్చు. ఈయన తాను స్వయంగా తెలుగువారి ఊళ్ల పేర్లు – ఇంటి పేర్లపై పరిశోధనా గ్రంథాలను వెలువరించారని, ఆపై ఎంతో మందికి ఇదే అంశంపై Ph. D. కి మార్గ దర్శకులుగా ఉన్నారని విన్నాను. ఆ పరిశోధనా గ్రంథాలను పరిశీలనగా చదివిన వారెవరైనా వాటి నాణ్యత గురించి వివరిస్తే బాగుంటుంది.
నదిలోని నీరు గురించి Ravi అభిప్రాయం:
07/15/2013 3:47 pm
స్వాతీ గారు,
వెంటాడే కవిత.
“సంతకం తప్ప మరొక్క అక్షరం కూడా లేని ఉత్తరాల్లాంటి రహస్యాల్ని కనపడ్ద ప్రతీ పొదలోకీ జారవిడుస్తూ సాగుతున్న రాత్రికి ….”
Too Good.
Ravi
మనిషంటే… మింగేస్తూ మింగేయబడుతున్న జ్ఞాపకం గురించి Ravi అభిప్రాయం:
07/15/2013 3:38 pm
నరేన్, కవిత బాగుంది.
-రవి
కవులు మరిచిపోయారు గురించి jayaprabha అభిప్రాయం:
07/15/2013 2:56 pm
ఆశారాజూ! నీ కవిత్వం లోని విషయం నన్ను ఆకట్టుకుంది. ఒక్కరైనా ఈ విషయాన్ని బహిరంగం చేస్తారా అని అనుకున్నాను. శిల్పానికేం గానీ కనీశం మొహమాటం లేకుండా ఉన్నదేదో అన్నావు. అదే పదివేలు.
మొత్తానికి కవులు కవిత్వం తప్ప మిగిలినవన్నీ చేస్తున్నారన్నమాట! ముఖ్యంగా తమ తమ కవిత్వ “ప్రచారం”! గ్లోబలైజేషన్ అంటే ఇదే మరి 🙂 ఇంతకీ ఆ విమర్శకులు అన్నోటి ముందుమాటలూ అన్నోటి చివరిమాటలూ పోటీ పడి రాసినా అసలాఖరుకి ఒక్కరికైనా వారి రాతల్లోని ఆ ఆ విశేషాలేవన్నా అవగతమైనాయా? ఒక్క పద్యమైనా ఒక్కరి మనసులోనైనా దూరి రహస్యాలేవన్నా మాట్లాడిందా? అంతేనా? ఇలా పుస్తకం అచ్చు అవగానే అలా ఒక అవార్డో? అంతా గూడుపుఠాణీ అంటావా? మరీ ఇన్నీ ఉన్నా పుస్తకాలలో ఆ కవిత్వం ఎటు పోయిందో చెప్పేదెవరా అని? కవీ విమర్శకుడూ కుమ్మక్కై కిక్కిరిసి కూర్చున్న దృశ్యం ఇబ్బందిగా తెలుగు అక్షర ముఖ ద్వారాన్ని అటకాయిస్తోంది అనా? కానీ ఆ మాటని నిజాయితీగా చెప్పే పత్రికలూ లేవే? ఇప్పుడు బేధాభిప్రాయాలు లేవు. ఒకటే అభిప్రాయం. ఒకటే మాట! అంతా గుంభనం , అంతా గప్ చుప్! అప్పుడప్పుడు ఒపీనియన్స్ చేంజ్ చేస్తూంటే గానీ పొలిటీషియన్ కానేరడని చెప్పాడు గిరీశం. అందుకు కవులు మాత్రం అతీతులా? ఇంతకీ ఎంతమంది ఉన్నారూ “కవులు” తెలుగులో? ఓ! కవిత్వాన్ని పక్కన పారేసారని కదూ అన్నావు. కవులున్నారు గానీ కవిత్వం లేదన్నమాట! విమర్శ అటకెక్కినట్టుగానే!
జయప్రభ.
తెలుగువారి ఊళ్ళ పేర్లు – ఇంటి పేర్లు గురించి మోహన అభిప్రాయం:
07/15/2013 1:17 pm
అగడ్తలు చుట్టు ఉండే నగరమును పట్టనము అంటారని చదివినట్లు గుర్తు. సముద్రతీరములో ఉండే నగరములకు సముద్రము ఒక వైపు అగడ్తయే కదా? అదియు కాక ముఖ్యనగరమును పట్టనము అంటారు, పట్టమహిషి, పట్టపు ఏనుగు లాటిది ఈ పట్టము. అందుకే మనము పట్టములు కూడ పుచ్చుకొంటాము. ముఖ్యనగరము అని అనుకొంటే అది ఎక్కడైనా ఉండవచ్చును, సముద్రతీరములో మాత్రమే కాదు. పాటలీపుత్రము పట్నా అయినది బహుశా ఇలాగేనేమో? మైసూరునగరము దగ్గరలో రెండు పట్నములు ఉన్నాయి, అవి – చన్నపట్న, శ్రీరంగపట్న. విధేయుడు – మోహన
వేకువనే మోకరించే ఆమె గురించి Dadala Venkateswara Rao అభిప్రాయం:
07/15/2013 9:06 am
అమ్మను గుర్తుచేసుకోవడం జ్ఞాపకమేనా! అని అడిగారు. మీరు మోకరించినప్పుడల్లా మిమ్మల్ని జీవిత పధంలో నడిపించిన మీ అమ్మను తలచుకుంటె అది జ్ఞాపకం అవుతుంది. ఆదే మీ అమ్మనే తలచుకుంటూ మోకరిస్తే జన్మ తరిస్తుంది.
జిగిరీ – 1వ భాగం గురించి kaasi raaju అభిప్రాయం:
07/15/2013 3:34 am
కేవలం నాలుగే నాలుగు పాత్రలతో
1.షాదుల్
2. ఇమామ్
3. అమ్మీ
4. చాంద్
పెద్దింటి అశోక్ కుమార్ రాసిన “జిగిరి” నవల చాలా బాగుంది . మనుషులు జంతువుల్లా మారిపోవడానికి ఆయన చెప్పిన కారణాలు అందర్నీ ఆలోచింపచేస్తాయి ….. ఈ నవల వివరణను ఇస్తూ గుడిపాటి గారు రాసిన మాటలు కూడా ఆసక్తిగా ఉంటాయి .
రచయితకు సంబందించిన ఫోటో, బ్లాగ్ నిర్వాహకులకు ఈ లింక్ వద్ద లభిస్తుంది.
తెలుగువారి ఊళ్ళ పేర్లు – ఇంటి పేర్లు గురించి Rao Vemuri అభిప్రాయం:
07/15/2013 12:49 am