పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. అలిఖిత కఠిన శాసనం! గురించి D.Venkateswara Rao అభిప్రాయం:

    07/16/2013 3:05 pm

    మీ కవిత అంతే ఒక శిలా శాసనం
    నా అభిప్రాయం అంతా సాంత్వనం

  2. తెలుగువారి ఊళ్ళ పేర్లు – ఇంటి పేర్లు గురించి jayaprabha అభిప్రాయం:

    07/16/2013 1:32 pm

    కొలిచాలా,

    🙂 మీ వివరణ తో నా సందేహం మరింత జటిలం అయినట్టుంది! ఒక వూరు ఒక ఇంటి పేరుకి ఎన్నిక కావటం మా ప్రాంతాలలో ఉంది. ఉదాహరణకి “నందాపురపు పట్టీ” లో ఉండే అగ్రహారాలలో ఒక్కో అగ్రహారం ఊరుపేరు ఏదైనా ఆ ఊరిలో ఒక ఇంటి పేరు ఎక్కువగా గణనకి వస్తుంది. ఇంటి పేరుకీ వూరి పేరుకీ ప్రత్యక్ష సంబంధం ఏదీ ఉండదు, అయితే ఆ ఇంటి పేరుని ఆ ఊరిపేరునీ కలిపి పేర్కొనడం మాత్రం ఉంటుంది . ఆవూళ్ళో వేరే ఇళ్ళపేళ్ళున్నా ఒక ఇంటిపేరుకే ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. మీరెవరూ అని మా పూర్వీకులని ఎవరన్నా అడిగారనుకోండి, వాళ్ళు “మేం అనాతారం అనిపిండారమండీ ” అని చెప్పేవారన్నమాట! ఇలాగే వేరే గృహనామాలు కూడా వారి వారివి ఆయా ఊళ్లతో కలిపే చెబుతారు.

    అనిపిండి కేవలం ఇంటిపేరే అయి వారు వారి ఊరుని అనాతారం అని చెప్పుకున్నప్పుడు మీరన్న “పిండి” అన్న పదానికి ఇక్కడ విడిగా ఒక గ్రామ స్పృహ అని వివరించే వీలుందా?? నాకు స్పస్టంగా రూపుదిద్దుకోడం లేదు విషయం! కానీ మీ ఊహ మాత్రం బాగుంది. మీరు మరింత వెలుగు ఈ విషయం మీద ప్రసరింపజేయాలని కోరుతున్నాను.
    థాంక్యూ !
    జయప్రభ.

  3. తెలుగువారి ఊళ్ళ పేర్లు – ఇంటి పేర్లు గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:

    07/16/2013 12:03 pm

    జయప్రభ గారు,

    అనిపిండి, అనుపిండి, అనప్పిండి అని మూడు రకాలుగా మీ ఇంటి పేరు ఉండడానికి ఒక కారణం అను-, -పిండి రెండు వేరు విభాగాలు కావటం వల్ల కావచ్చు. ధాతువుల్లో ప్రథమాచ్చుకు ఉన్న ప్రాముఖ్యత చివరి అచ్చుకు ఉండదు. అదీకాక తెలుగులో స్వరమైత్రి (vowel harmony) వల్ల మధ్యాచ్చులు చివరి అచ్చులతో కలసి పోవడం కద్దు. అనుపిండి లో చివరి రెండు ఇ- కారాలకు మైత్రిగా అనుపిండి- అనిపిండి కావడం తెలుగులో అసాధారణమేమి కాదు.

    పిండి, పిండిప్రోలు (ఖమ్మం జిల్లాలో ఊరు), పిండిసూర, మురిపిండి అన్న ఇతర ఇంటిపేర్లకు మీ ఇంటిపేరుకు సంబంధం ఉండవచ్చు. అలాగే, అనియాది, అనిశెట్టి, అనుమగుర్తి, అనుమాలశెట్టి, అనుముల, అనుమోలు అన్న ఇంటి పేర్లకు మీ ఇంటిపేరుకు సంబంధం ఉందో లేదో ఎవరైనా పరిశోధన చెయ్యాలి.

    ఉత్తరాదిలో “గ్రామము” అన్న అర్థంలో పిండి/పిండ్ అన్న ఊళ్ళ పేర్లు సర్వసాధారణంగా కనిపిస్తాయి. పాకిస్తాన్ లోని రావల్ పిండి నుండి పంజాబ్‌లోని బారాపిండ్, బీస్పిండ్, భల్లాపిండ్, బీర్ పిండ్, హబిత్ పిండి, గిద్దర్ పిండి, కపూర్ పిండ్, నవాపిండ్, రాణీపిండ్, వరకూ, అలాగే, అలహాబాద్ జిల్లాలో, ఫిరోజ్ పూర్ జిల్లాలో “పిండి” అన్న పేరు గల గ్రామాలు ఉన్నాయి. ఈ ఉత్తరాదిలోని “పిండి” గ్రామాలకు మీ ఇంటిపేరుకు సంబంధం ఉందో లేదో ఇదమిత్థంగా చెప్పలేను.

    నా ఊహ: “పిండి” అనేది గ్రామనామానికి సంబంధించిన ప్రత్యయమైతే, అను-/అని- అన్నది అనుములు అన్న ధాన్యానికి సంబంధించినదై ఉండవచ్చు. అనుములు ఉత్పత్తి చేసే అనుప- చెట్టు ఉన్న ఊరిని అనుపిండి అని అన్నారేమో. ఇది పూర్తిగా నా ఊహే కానీ, శాస్త్రీయమైన వివరణ కాదు. భారతదేశంలోని ఊర్ల పేర్లపై సమగ్రమైన డేటాబేసు తయారు చేసి దానిపై విపులంగా ఒక పరిశోధనా వ్యాసం రాయాలన్నది నాకున్న కోరికల్లో ఒకటి. ఎప్పటికైనా వీలుచేసుకొని ఆ ప్రాజెక్టును పూర్తి చెయ్యగలననే ఆశిస్తున్నాను.

  4. ఒక వేసవి గురించి పల్లేటి బాలాజీ అభిప్రాయం:

    07/16/2013 10:37 am

    విదేశాల్లొ పిల్లలున్న ఎవరికైనా నచ్చే కథ
    పల్లేటి బాలాజీ

  5. వేకువనే మోకరించే ఆమె గురించి జాన్ హైడ్ కనుమూరి అభిప్రాయం:

    07/16/2013 3:01 am

    Dadala Venkateswara Rao గారు

    కవిత్వం గురించి మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరంలేదు.
    అనుభవాలు, అనుభూతులు వ్యక్తిగతమే అయినా ప్రశ్న వ్యక్తిగతం కాదు (ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో )

    మీ స్పందనకు ధన్యవాదములు.

  6. ఒక వేసవి గురించి Vasu అభిప్రాయం:

    07/16/2013 1:24 am

    మీ ముందు కథల లాగే ఆలోచింప చేసేది గా ఉంది. నాకు ఇది మీ ముందు కథల కంటే బాగా నచ్చింది.

    మా తాతయ్య అంటారు ప్రేమ, వాత్సల్యం, ఆప్యాయత కిందకు ప్రవహిస్తాయి తాత నించి తండ్రికి తండ్రి నించి కొడుకుకి ఇలా. అది సహజం. కానీ అంతకంతకీ ఆ ప్రేమలు కూడా తగ్గిపోతున్నాయేమో. ప్లాస్టిక్ ప్రేమలు ఐపొతున్నాయనిపిస్తుంది ఒక్కోసారి. దానికి కారణం పెరుగుతున్న materialism కావచ్చు.

    పిల్ల జమిందారు సినిమాలో అన్నట్టు రాను రాను మనం వస్తువులను ప్రేమించి మనుషులను వాడుకుంటున్నామేమో .

  7. ఒక వేసవి గురించి manibhushan అభిప్రాయం:

    07/16/2013 1:14 am

    కథ కవితాత్మకంగా ఉంది. మరింత స్పష్టత ఉంటే బాగుండేది. మూడో తరం కాసిన్ని కబుర్లూ, కూసింత ఆప్యాయత కోరుకుంటున్నాయని చెబుతూనే… వాళ్ళు ఫక్తు భౌతికవాదులుగా తయారవుతున్నారన్న ఆవేదనను సైతం వెలిబుచ్చారు. అయితే, కథ పూర్తయ్యాక ఏ ఒక్కరూ మనసులో ఇమడని పరిస్థితి. కథలో మూల వస్తువు (సెంటర్ పాయింట్ మిస్సయ్యారు) కోల్పోయారనిపించింది.

  8. తెలుగువారి ఊళ్ళ పేర్లు – ఇంటి పేర్లు గురించి jayaprabha అభిప్రాయం:

    07/16/2013 12:19 am

    కొలిచాలా! మీ వివరణ బాగుంది. నేను కూడా వేమూరి గారి లాగానే సముద్ర తీర నగరాలకే పట్టణం అన్న అర్ధం స్థిరపడి ఉంటుందని అనుకున్నాను. అలా ఎక్కడో చదివినట్టు కూడా గుర్తు. బహుశా నాలాగే అనుకున్న ఎవరో రాసి ఉంటారు. ఇప్పుడు చప్పున రిఫరెన్సు ఇవ్వలేను లెండి.

    ఇకపోతే ఇంటిపేర్లు ప్రస్తావన వచ్చింది గనక అడుగుతున్నానూ …ఉదాహరణకి మా ఇంటిపేరే ఉంది చూడండీ… అనిపిండి అని. దీనికి అనుపిండి అనీ అనప్పిండి అనీ కూడా రూపాంతరాలని చూసేను నేను. అనాతారం అనిపిండివారని పేరు. అనాతారం అంటే అనాత వరం. కోనసీమ దగ్గర పేరూరు, నందంపూడి పరిసరప్రాంతాలలో కావొచ్చును. అది మా పూర్వీకుల ఊరే అయినా నేనింత దాకా ఆ కోనసీమ చూడలేదు. అట్నించి తూర్పు సీమలకి వలస పోయి మా వాళ్ళు విజయనగరం దగ్గర పల్లెలలో స్థిరపడ్డారట!

    ఇంతకీ ఒక ఇంటిపేరు కి ఇలా మూడు వెర్షన్స్ ఎందుకు ఉన్నవో చెప్పగలరూ? అదీగాక ఈ ఇంటిపేరుకి అర్ధం ఏమై ఉండవచ్చునూ? ఎవరన్నా నా ఈ సందేహం తీర్చిన, ధన్యురాలిని.

    జయప్రభ.

  9. About eemaata గురించి manju surapaneni అభిప్రాయం:

    07/15/2013 7:53 pm

    మీ పత్రిక ఈ మాట చాలా బాగుంది. మీకు నా అభినందనలు. మీ పత్రిక ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాను.

    మంజు నవీన్ సూరపనేని.

  10. తెలుగువారి ఊళ్ళ పేర్లు – ఇంటి పేర్లు గురించి karerababu అభిప్రాయం:

    07/15/2013 7:27 pm

    రావుగారి అభిప్రాయం బాగానే ఉంది. కానీ అమరంలో పట్టం పురబేధనం అనినారు. నిజమే. ముఖ్యముగా తూర్పు సముద్ర తీరం నగరాలను అలా పిలిచారు ముఖ్య కారణం నీటి ఒడ్డున ఉండటం వలన. నది ఒడ్డు పురాలను కూడ కొన్ని చోట్ల అలా పిలిచారు. అశ్వధాటి ,చిత్తజల్లు భోగం వారి ఇంటి పేర్లు. పదాలకు అభినయ చాతుర్యం చూపిన నర్తకి అశ్వధాటి, చిత్తజల్లు లాంటి చిటపట పద వేగం చూపిన నర్తకి చిత్తజల్లు.

    కర్వేరబాబు