ఇటువంటి గూఢ చిత్రార్థాలు ఎక్కువగా సంస్కృత పద్యములలో నుంటాయి. తెలుగు పద్యములలోని ఈ మాణిక్యాన్ని త్రవ్వి దానిలోని కాంతులను జనబాహుళ్యానికి బోధపడేటట్లు చక్కగా వివరించి తెలిపిన మురళీధరరావుగారికి అభినందనలు. ఇంకా ఇలాటి పద్యాలను పాఠకులకు వివరిస్తారని ఆశిస్తున్నాను. సంప్రదాయ సాహిత్యములో కూడ మెరుగులున్నాయనడానికి ఇదొక సాక్షి. ఉన్న చిక్కల్లా ఇవి చెప్పితే తప్ప సామాన్యముగా అర్థము కావు. ఇంతకూ ఆమె కురులు ఎందుకు నల్లని మబ్బులకు సరితూగ లేకపోయాయో, కొద్దిగా మట్టిరంగులో నుండినదా 🙂 సంస్కృతములో ఉండే కొన్ని పద్యాల గూఢార్థములను వివరించిన ఒక పుస్తకము వేణుగోపాలరావు వ్రాసిన గూఢచిత్ర రహస్య ప్రకాశిక (ఇది DLI-IISc లో లభ్యము). విధేయుడు – మోహన
సప్రశ్రయంగా ఎన్నో నైఘంటిక వివరాలతో మీరు రాసిన లేఖకు కృతజ్ఞతలు. పట్టణ/పట్టన/పత్తన అన్న పదజాల ప్రయోగాలపై, వాటి వ్యుత్పత్తి విషయమై ఇండాలజీ పండితుల మధ్య చాలా చర్చ జరిగింది. ప్రశస్తమైన సంస్కృత పదాల వ్యుత్పత్తి నిఘంటువు నిర్మించిన Mayrhofer పండితుడు పత్తన- పదానికి ఇండో-యూరోపియన్ వ్యుత్పత్తి నిరూపించడం కష్టతరమని (*partana — (√pr̥ > Lat. portus, ch.) ) ఇది అనార్యపదంగానే భావించాలని 1953 నిఘంటువులో పేర్కొన్నాడు. బరో పండితుడు 1947 లోనే ఇది ద్రావిడ భవమని వాదించాడు. ఇప్పటికీ దీని వ్యుత్పత్తి వివాదాస్పదమనే చెప్పుకోవాలి. Franklin Southworth రచించిన Linguistic Archaeology of South Asia (2005) పుస్తకంలో స్థూలంగా ఇలా వివరించారు:
paṭṭaṇa/paṭṭana ‘town’ ON, VarBrS ← PSD *paṭṭi ‘cow-stall, habitation’; *paṭṭiṇam/ paṭṭaṇam ‘town, city, seaport’ DEDR 3868 (Burrow 1947a). M53 notes that the form pattana with dental -tt- is attested earlier (from the MBh on) and suggests that if the word is borrowed (Dravidian being the likeliest source), the earlier form with dentals represents phonological assimilation of the foreign word.
References:
Burrow, T. (1945) “Some Dravidian words in Sanskrit,” TPS, pp. 79–100.
Burrow, T. (1947a) “Dravidian Studies vii: further Dravidian words in Sanskrit,” BSOAS 12:365–96.
Mayrhofer, M. (1953a) “Die Substrattheorien und das Indische,” Germanisch-Romanische Monatsschrift 34: 230–42.
Mayrhofer, M. (1953b) (M53) Kurzgefasstes etymologisches Wörterbuch des Altindischen: A concise etymological Sanskrit dictionary, Heidelberg: Carl Winter, Universitätsverlag.
Southworth, Franklin C. 2005 Linguistic Archaeology of South Asia. London/New York: Routledge Curzon.
మాన్యమిత్రులు శ్రీ కొలిచాల సురేశ్ గారికి నమస్కృతులతో,
భాషాశాస్త్రంలో శబ్దవ్యుత్పత్త్యధికరణమంటే నాకు అభిమానమే కాని అభినివేశం లేదు. మీ లాగా గాఢమైన కృషి చెయ్యలేదు. అందువల్ల ఈ నా మాటలు మీ నుంచి సమాధేయాలే కాని నా నుంచి సమాధానాలు కావు.
“పట్టణం” ద్రావిడ భాషామాతృకమై సంస్కృతంలోకి చేరినదన్న సాధ్యనిర్దేశానికి, మీ నిగమనానికి ఆధారాలు మీ వివరణ ద్వారా నాకింకా స్పష్టపడలేదు. అది సాంస్కృతికం కాదన్న నమ్మకం కలుగలేదు. సంస్కృతంలో “పట్టణం” కంటె “పత్తనం” ప్రాక్తనకాలికమైనట్లు కనబడుతుంది. క్ర్రి.శ. 4-వ శతాబ్ది నాటికే అమరసింహుడు తన నామలింగానుశాసనంలో – “పూః స్త్రీ పురీ నగర్యౌ వా పత్తనం పుటభేదనం, స్థానీయం నిగమః” అని పర్యాయపదావళిని ఇచ్చాడు.
ప్రాంతభేదాన్ని బట్టి వ్యాఖ్యాతలు “పట్టణం” పదానికి వివిధార్థాలను నిర్దేశించారు. “అమరకోశోద్ఘాటన వ్యాఖ్య”లో క్షీరస్వామి ప్రయాణాలు తక్కువగా ఉండి జనం స్థిరంగా ఒకచోట ఉండే ఊరు “స్థానీయ”మని, జనం తరచు వస్తూ పోతూ ఉండే ఆవాసం “పత్తన”మని వివరించాడు. సంస్కృతకృతులకు లభిస్తున్న దక్షిణదేశపు వ్రాతప్రతులలో “పత్తనం”, “పట్టనం”, “పట్టణం” అన్న మూడు రూపాలు కనబడుతున్నప్పటికీ, ఉత్తరదేశంలోనూ, తమిళ ప్రాంతంలోనూ అచ్చయిన సంస్కృతగ్రంథాలు అన్నింటిలో “పత్తనం” అన్న రూపమే కనబడుతున్నది. ఇదే నిజానికి ప్రాచీనరూపమేమో పరిశీలింపవలసి ఉన్నది.
అయితే, ఆంధ్రుడైన మల్లినాథసూరి తెలుగుదేశంలోని వ్యవహారాన్ని, తెలుగు కావ్యాలలోని ప్రయోగాలను గుర్తించినవాడు కనుక, తన “అమరపదపారిజాతం”లో –
అని పట్టణం అంటే స్కంధావారమంతా అందుబాటులో ఉండే మహానగరమని, దానికి “పత్తనం” అన్న రూపంకూడా ఉన్నదనీ వ్రాశాడు. పట్టణం (City) అని, పత్తనం (Town) శాఖానగరమని వ్రాశాడు. యాదవ ప్రకాశుల వారి “వైజయంతి”ని ప్రమాణీకరించాడు.
లింగయ సూరి తన “అమరపదవివృతి”లో – పతన్తి జనా అత్రేతి పత్తనం. “‘పత గతౌ’. పట్టణమితి పాఠే పటన్తి జనా అత్రేతి పట్టణం. ‘పట గతౌ’ అని వ్రాశాడు. ప్రజలు తండోపతండాలుగా వచ్చి చేరేది “పత్తన”మని, దానిగుండా జనం ప్రయాణిస్తారు కనుక (floating population వల్ల) అది పట్టణమని – ఛాయాభేదంతో కొత్త అర్థాన్ని చెప్పాడు. ఆ అర్థనిర్ణయానికి శిక్షాప్రణీతంగా ధాతుప్రమాణాలను ఇచ్చాడు.
అచ్యుతోపాధ్యాయుని “వ్యాఖ్యాప్రదీపం”, ఆశాధరుని “క్రియాకలాపం”, నీలకంఠుని “సుబోధిని”, భరత మల్లికుని “ముగ్ధబోధ” – ఇదే తీరున అర్థనిర్ణయం చేశాయి. ఔత్తరాహుడైన కృష్ణమిశ్రుడు “పత్తన” శబ్దాన్ని మాత్రమే అంగీకరించి, “పతన్త్యత్ర” అని నిశ్చయించి, ‘విపతేర్ తనన్’ అని ఉణాది సూత్రం (3-150) ప్రమాణీకరించాడు. ఆయన అర్థం క్షీరస్వాంయాదులతో సంవదిస్తుంది. క్రీ.శ. 16-వ శతాబ్దం నాటి తాళ్ళపాక తిరువేంకటాచార్యులు ఈ అన్నింటినీ పరిశీలించి తన “లింగాభట్టీయం”లో –
భానుజీ దీక్షితుడు తన “వ్యాఖ్యాసుధ” (రామాశ్రమి)లో “పత్తన” శబ్దాన్ని గ్రహించి, “పతన్తి జనా యత్ర” (జనం పెద్ద సంఖ్యలో వచ్చిపడుతుండే చోటు) అన్న భావంతో ‘వీ పతిభ్యాం తనన్’ ఆధారంగా పత్ + తన అని సాధించాడు. అంతటితో ఊరుకోక “పట్టనం ఇతి వాచస్పతిః” అని ఎవరో వాచస్పతిని ఉదాహరించి, అవి సమానార్థకాలని అన్నాడు.
అలాగే కాశీనాథుని “కాశిక”, గోస్వామి “బాలబోధిని”, నారాయణానంద రామచంద్రుని “అమరకౌముది”, బృహస్పతి “అమరకోశ పంజిక”, మధురేశ విద్యాలంకారుని “సారసుందరి” వ్యాఖ్యలన్నీ “వ్యాపారులు వస్తూ పోతూ ఉండే చోటు”, “జనాభా ఎప్పటికప్పుడు పెరుగుతుండే ఆవాసం” అని చెప్పిన నిర్వచనాలు నిజానికి ఎంతో భావ్యంగానూ, అర్థవంతంగానూ, వ్యాకరణసాధ్యాలు గానూ, సప్రమాణంగానూ ఉన్నాయి.
ద్రావిడశబ్దమైన “పట్టు” నుంచి “పట్టణము”ను సాధించటానికి మీరు ఊహించిన “పట్టు” ధాత్వర్థరూపమైన వ్యుత్పత్తి మార్గాన్ని కూడా సంస్కృత లాక్షణికులు గుర్తింపకపోలేదు.
అని దామోదరుడు తన “సంగీతదర్పణం”లో అన్నాడు. అయితే, అది వీణ తీగలపైని వ్రేళ్ళను మీటే సందర్భంలో వివరించిన భావచ్ఛాయ. జనస్థానమన్న భావంతో కాదు. “పట్టు” సంస్కృత లాక్షణికుల దృష్టిలో ఉన్నదని చెప్పటం మాత్రమే నా ఉద్దేశం.
“పట్టణము” ద్రావిడ భాషామాతృకమై సంస్కృతంలోనికి వెళ్ళినదని ప్రయోగకాల నిర్నిమిత్తంగా “పట్టిన” శబ్దానికి చెబుతున్న భావార్థమాత్రాన రుజువు చెయ్యటం కష్టం. ఇకపోతే, ఊరిపేర్లలోని “పట్నం” సముద్రతీర ప్రాంతమే. సముద్రతీరం కాకపోతే ఒకానొక పెద్ద జలాశయానికి సన్నిహితం. సముద్రతీర ప్రాంతమూ, జలాశయప్రాంతమూ – రెండూ కాని ఊళ్ళ పేర్లు కేవలం అనుకరణమాత్రాన వచ్చిన ఆధునిక నామధేయాలు. ఒకప్పుడు సార్థకంగా ఏర్పడిన పేర్ల వంటివి కావు.
ఈ మాటలన్నీ విద్యార్థిత్వంతో మీ అభిప్రాయాన్ని కోరుతున్నవే గాని, విద్యాధికత్వంతో మీకు చెప్పగోరినవి కావు.
“అనిపిండి” గృహనామ శబ్ద స్వరూపనిరూపణను గుఱించిన మీ చర్చను అధికరించిన నా సందేహాలను మఱొకసారి మనవిచేస్తాను.
ఇలాంటి భాషనీ ఇలాంటి అభిప్రాయాన్నీ అచ్చు ఎలా వేశారూ? అని ఒక పాఠకురాలిగా నేను సంపాదకులని అడుగుతున్నాను. దీన్ని అచ్చువేయడం లో మీ ఉద్దేశ్యం ఏమిటీ??
దిగంబరుల కవిత్వం తర్వాత మగవాళ్ళు ఎలాపెడితే అలా రాయడాన్నీ ఏ భాష లో నైనా ఆడవాళ్లని గురించి మాట్లాడటాన్నీ తగ్గించుకోవడం తెలుగు దేశం లో జరిగింది. ఆడవాళ్ళు విమర్శలోనీ రచనా శైలి లోనీ ప్రవేశించాకా ఎలా పెడితే అలా మాట్లాడేయడం తెలుగు దేశాన అయితే మళ్ళీ సాధ్యం కాలేదు. మరి అదేతీరులో తిరిగీ మీ పత్రికలో ఈ భాషా విధానం ఏమిటి? మీ పత్రిక వీటిని ప్రచురించి వీటికి ప్రాముఖ్యం ఇవ్వడం ఏమిటి? అలాంటి భాషని వాడటం ఏమి కష్టం గనక? ఎవరన్నా రాయొచ్చునే ? ఆడవాళ్ళు రాస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి బహుశా లైలా ప్రయత్నం చేశారు.
రాయాలంటే ఆడవాళ్ళు సైతం అలా రాయడం ఏమీ కస్టం కాదు సుమా అని లైలా చెప్పినట్లయింది. ఆ ప్రయోగం ఆవిడ చేసి చూపిన లక్ష్యం అదే నని నేను అనుకున్నాను. అంత పాటి విమర్శని కూడా ఈ రవికిరణ్ తీసుకోలేకపోయినాడా? ఎంత విషాదం! వెంటనే ప్రతిస్పందనని మరెంత వికారంగా రాసేడో? దాన్ని ప్రచురించి మీ పత్రికకి ఉన్న gender insensitivityని మీరు చాటుకున్నారు. ఇంత చదువుకున్న వాళ్ళున్న మీ పత్రిక కూడా చివరికి ఇంతేనన్నమాట! how sad !
రవికిరణ్ గారు: ఇంటిపేర్ల గురించి మీరు దాదాపు సరిగ్గానే ఊహించారు. ఇంటిపేర్లు మనకు కాకతీయులకు పూర్వం ఉన్నట్టు దాఖలాలు లేవు. కవుల విషయంలో నన్నయ్య (భట్టు బిరుదు కావచ్చు) నుండి శ్రీనాథుడి వరకూ ఉన్న కవుల ఇంటిపేర్లు మనకు తెలియవు. నాచన సోమన పేరులో నాచన తండ్రి పేరు అయితే, పాల్కురికి సోమనాథుడి పేరులో పాల్కురికి వారి ఊరుపేరు కావచ్చును. బమ్మెర పోతన, అష్టదిగ్గజాల కాలం నుండి మనకు ఇంటిపేర్లు అవిరళంగా కనిపిస్తున్నాయి.
ప్రాఙ్నన్నయ్య శాసానాలలో ఊరుపేరో, ప్రాంత నామమో తగిలించిన పేర్లు కొన్ని అరుదుగా కనిపిస్తున్నాయి; కాని, ఆ రోజుల్లో తెలుగు వారు కూడా ద్రావిడ సంప్రదాయంలో లాగా తండ్రి పేరు తగిలించుకొనే అలవాటు ఉందని కొన్ని శాసనాలలో పేర్లు సూచిస్తున్నాయి.
స్థూలంగా ప్రస్తుతం తెలుగువారి ఇంటిపేర్లలో ఊరిపేరే అధికంగా కనిపిస్తుంది. వృత్తినామాలు/పదవులు (ప్రగడ మొ.), ధాన్యాల పేర్లు, కుటుంబంలో పేరు పొందిన వారి పేరు ఇలాంటివి కూడా విరళంగా కనిపిస్తున్నాయి.
ఈ విషయంపై వేమూరి గారు రాసిన వ్యాసం, అలాగే, ఇదివరకు నేను ఇండో-యూరేసియన్ రీసర్చ్ వేదికపై చేసిన చర్చను మీరు చదవవచ్చును.
సురేష్ ఏమి చెబ్తాడో నేనూ ఆసక్తిగా ఎదురు చూస్తాను రవికిరణ్! తెలుగు వారి ప్రత్యేకత వారి ఇంటిపేర్లే!! ముందునించీ కూడా!! మనకి పాత కాలం నించీ వస్తున్న / కొనసాగుతున్న ఇంటిపేర్లు అనేకం ఉన్నాయి. ఇంటిపేర్లు కనిపించనివీ ఉన్నాయి. పేరుకి ముందు తండ్రి పేరు కాక వేరే గా మరి ఒక ఇంటిపేరు కలిగి ఉండటం తెలుగు వారి ప్రత్యేకత. కుంతి కుమారులు కౌంతేయులు, పాండురాజు పుత్రులు పాణ్దవులు కదా?? అక్కడ వంశానికీ.. తల్లి తండ్రి పేరుకీ ప్రాధన్యత ఇచ్చినట్టున్నారు. తమిళ నాట, కన్నడిగులకీ సైతం తండ్రి పేరే ముందు వస్తుంది. కానీ వారికీ వారిదైన గోత్రం ఉంటుంది.
తెలుగు వారు వారి పేరు చెప్పాలంటే వారి ఇంటి పేరుతో కలిపే చెప్పాలి. అది సంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని ఇటీవల పాటించడం తగ్గినట్టుంది. ఇంక ఇంటిపేరు అంటే family name మహరాష్ట్రులకీ ఉంది, మిగిలిన వారికీ ఉంది సుమా!! పరిశీలిస్తే మరిన్ని ఆసక్తికరమైన సంగతులు తెలుస్తాయి కూడా!!
ఊరిపేరో ఆ కుటుంబంలో పేరు పొందిన వారి పేరో వారి వారి వృత్తిని అనుసరించి వచ్చిన పేరో, పౌరుష నామాలో ఇంటిపేరుగా ఉండొచ్చు. ఇలా ఈ సంప్రదాయమే ఇండియా మొత్తంగా ఉంది. అయితే ఔత్తరాహికులు వారు వారి కుటుంబ నామాన్ని వెనక పెట్టుకుంటారు. తెలుగు వారు ఒక్కరే తమ పేరుకి ముందు తమ కుటుంబపు పేరు పెట్టుకుంటారు. ఒక ఇంటిపేరే ఉంటుంది. మీరన్నట్టు గుర్తు కోసం ఒక ఇంటిపేరుకి మరో మారు నామం ఉండొచ్చు. కానీ అది కేవలం గుర్తుకే! వాడవలసి వచ్చినప్పుడు మీరన్నట్టు వారు కూడా వారి వారి అసలు ఇంటిపేరు నే వాడతారు.
తెలుగులో ఇంటిపేర్లు అన్ని కులాల వారికీ ఉన్నాయి ఇది మీకు సామాజిక చరిత్ర చూస్తే తెలుస్తుంది. అల్లసాని పెద్దన, నంది తిమ్మన లాంటివి ఇంటి పేర్లే! మాదయగారి మల్లన అని అన్నప్పుడు అది తమిళ సంప్రదాయం నించి వచ్చినట్టుగా అనిపిస్తుంది. కదా?? ధూర్జటికి ఇంటిపేరు లేదు. సన్యాసం తీసుకున్నా మరింక ఆ పాత ఇంటిపేరు కొనసాగదు. వాళ్ళు పెట్టుకునే వేరే పేరు ఉంటుంది. ధూర్జటి విషయం లో ఏమై ఉంటుందో మనకి తెలియదు. అలా తెలియకుండా ఉన్నవీ ఉన్నాయి. సంఘం / సాళువ/ తుళువ/ఆరవీడు వంశాల వాళ్ళు అని విజయ నగర రాజులని గురించి చెప్పేరు కదా? “సమ్మెట నరపాల సార్వభౌముడు” అని అల్లసాని పెద్దన చాటువు కృష్ణ దేవునిమీద చెప్పింది ఉంది. ఇందులోని “సమ్మెట” కృష్ణదేవరాయల ఇంటిపేరని అనే వారూ ఉన్నారు.
ఇంక రెడ్లని గురించి పాకనాటివారు, రేనాటివారూ, పంట రెడ్లూ లాంటి విభజన ఉన్నది కదా?? ఇది మిగిలిన కులాల లోనూ ఇటువంటి ఒక విభజన ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అయితే కులాలలో శాఖా విభజన వేరు. ఇంటిపేరు వేరూను. వారి కుటుంబాలలో కుటుంబ చరిత్ర ని చెప్పేటప్పుడో వారి వారి మూలాలని చెప్పేటప్పుడో తెలుసుకునేందుకు ఉపకరించేవి ఇవే!! ఇంక సురేష్ కొలిచాల జవాబుని విందాం!!
ఎందుకని అభినందించాలి మోహన గారూ ? వాళ్ళు తీరిక లేక పోయినా చేసినందుకా? ఇది సరి అయిన కారణమేనా? ఏదో ఒక సంచిక తేవాలి గనక తేవడం అని అనుకుంటే అందులో ఏమి గొప్ప ఉంది మెచ్చుకోవలసిందీ? అది ఒక తంతు మాత్రమే కదా? తెలుగు దేశంలో ఒక పని చేస్తే అందులో ఒక స్టాండర్డ్ ఉండదని ఆరోపణ చేసే వారో తరుచూ తమ విమర్శలలో చూపించే వారో మరి వారి దేశంలో వారి ఆధ్వర్యంలో తయారయ్యే ఒక ప్రత్యేక సంచిక మిగిలిన వాని కన్నా ఎలా భిన్నమైనదో ఒక “స్టాండర్డ్ ” ద్వారానే కదా చూపించాలి? లేనప్పుడు ఒకరిని అనే అర్హత ఎక్కడినించి వస్తుందీ?
వేకువనే మోకరించే ఆమె గురించి Chunduri Srinivasa Gupta అభిప్రాయం:
07/21/2013 11:43 am
అమ్మ ఎప్పుడూ అమ్మే, బాగుంది.
నిశ్శబ్దం గురించి D.Venkateswara Rao అభిప్రాయం:
07/21/2013 6:56 am
కవితలు వాటి అభిప్రాయాలు అందరూ చదువుకునే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను.
తెనాలి రామలింగకవి శబ్దార్థ గూఢచిత్ర పద్యం గురించి మోహన అభిప్రాయం:
07/20/2013 7:08 pm
ఇటువంటి గూఢ చిత్రార్థాలు ఎక్కువగా సంస్కృత పద్యములలో నుంటాయి. తెలుగు పద్యములలోని ఈ మాణిక్యాన్ని త్రవ్వి దానిలోని కాంతులను జనబాహుళ్యానికి బోధపడేటట్లు చక్కగా వివరించి తెలిపిన మురళీధరరావుగారికి అభినందనలు. ఇంకా ఇలాటి పద్యాలను పాఠకులకు వివరిస్తారని ఆశిస్తున్నాను. సంప్రదాయ సాహిత్యములో కూడ మెరుగులున్నాయనడానికి ఇదొక సాక్షి. ఉన్న చిక్కల్లా ఇవి చెప్పితే తప్ప సామాన్యముగా అర్థము కావు. ఇంతకూ ఆమె కురులు ఎందుకు నల్లని మబ్బులకు సరితూగ లేకపోయాయో, కొద్దిగా మట్టిరంగులో నుండినదా 🙂 సంస్కృతములో ఉండే కొన్ని పద్యాల గూఢార్థములను వివరించిన ఒక పుస్తకము వేణుగోపాలరావు వ్రాసిన గూఢచిత్ర రహస్య ప్రకాశిక (ఇది DLI-IISc లో లభ్యము). విధేయుడు – మోహన
తెలుగువారి ఊళ్ళ పేర్లు – ఇంటి పేర్లు గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:
07/20/2013 7:02 pm
ఏల్చూరి మురళీధరరావు గారు,
సప్రశ్రయంగా ఎన్నో నైఘంటిక వివరాలతో మీరు రాసిన లేఖకు కృతజ్ఞతలు. పట్టణ/పట్టన/పత్తన అన్న పదజాల ప్రయోగాలపై, వాటి వ్యుత్పత్తి విషయమై ఇండాలజీ పండితుల మధ్య చాలా చర్చ జరిగింది. ప్రశస్తమైన సంస్కృత పదాల వ్యుత్పత్తి నిఘంటువు నిర్మించిన Mayrhofer పండితుడు పత్తన- పదానికి ఇండో-యూరోపియన్ వ్యుత్పత్తి నిరూపించడం కష్టతరమని (*partana — (√pr̥ > Lat. portus, ch.) ) ఇది అనార్యపదంగానే భావించాలని 1953 నిఘంటువులో పేర్కొన్నాడు. బరో పండితుడు 1947 లోనే ఇది ద్రావిడ భవమని వాదించాడు. ఇప్పటికీ దీని వ్యుత్పత్తి వివాదాస్పదమనే చెప్పుకోవాలి. Franklin Southworth రచించిన Linguistic Archaeology of South Asia (2005) పుస్తకంలో స్థూలంగా ఇలా వివరించారు:
References:
తెలుగువారి ఊళ్ళ పేర్లు – ఇంటి పేర్లు గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:
07/20/2013 4:11 pm
మాన్యమిత్రులు శ్రీ కొలిచాల సురేశ్ గారికి నమస్కృతులతో,
భాషాశాస్త్రంలో శబ్దవ్యుత్పత్త్యధికరణమంటే నాకు అభిమానమే కాని అభినివేశం లేదు. మీ లాగా గాఢమైన కృషి చెయ్యలేదు. అందువల్ల ఈ నా మాటలు మీ నుంచి సమాధేయాలే కాని నా నుంచి సమాధానాలు కావు.
“పట్టణం” ద్రావిడ భాషామాతృకమై సంస్కృతంలోకి చేరినదన్న సాధ్యనిర్దేశానికి, మీ నిగమనానికి ఆధారాలు మీ వివరణ ద్వారా నాకింకా స్పష్టపడలేదు. అది సాంస్కృతికం కాదన్న నమ్మకం కలుగలేదు. సంస్కృతంలో “పట్టణం” కంటె “పత్తనం” ప్రాక్తనకాలికమైనట్లు కనబడుతుంది. క్ర్రి.శ. 4-వ శతాబ్ది నాటికే అమరసింహుడు తన నామలింగానుశాసనంలో – “పూః స్త్రీ పురీ నగర్యౌ వా పత్తనం పుటభేదనం, స్థానీయం నిగమః” అని పర్యాయపదావళిని ఇచ్చాడు.
ప్రాంతభేదాన్ని బట్టి వ్యాఖ్యాతలు “పట్టణం” పదానికి వివిధార్థాలను నిర్దేశించారు. “అమరకోశోద్ఘాటన వ్యాఖ్య”లో క్షీరస్వామి ప్రయాణాలు తక్కువగా ఉండి జనం స్థిరంగా ఒకచోట ఉండే ఊరు “స్థానీయ”మని, జనం తరచు వస్తూ పోతూ ఉండే ఆవాసం “పత్తన”మని వివరించాడు. సంస్కృతకృతులకు లభిస్తున్న దక్షిణదేశపు వ్రాతప్రతులలో “పత్తనం”, “పట్టనం”, “పట్టణం” అన్న మూడు రూపాలు కనబడుతున్నప్పటికీ, ఉత్తరదేశంలోనూ, తమిళ ప్రాంతంలోనూ అచ్చయిన సంస్కృతగ్రంథాలు అన్నింటిలో “పత్తనం” అన్న రూపమే కనబడుతున్నది. ఇదే నిజానికి ప్రాచీనరూపమేమో పరిశీలింపవలసి ఉన్నది.
అయితే, ఆంధ్రుడైన మల్లినాథసూరి తెలుగుదేశంలోని వ్యవహారాన్ని, తెలుగు కావ్యాలలోని ప్రయోగాలను గుర్తించినవాడు కనుక, తన “అమరపదపారిజాతం”లో –
“పట్టణం – నిగమః. నగరనామాని. పట్టణం పుటభేదనం. పత్తనం చ” ఇతి వైజయన్తీ పాఠాత్ పత్తన శబ్దోప్యస్తి.”
అని పట్టణం అంటే స్కంధావారమంతా అందుబాటులో ఉండే మహానగరమని, దానికి “పత్తనం” అన్న రూపంకూడా ఉన్నదనీ వ్రాశాడు. పట్టణం (City) అని, పత్తనం (Town) శాఖానగరమని వ్రాశాడు. యాదవ ప్రకాశుల వారి “వైజయంతి”ని ప్రమాణీకరించాడు.
లింగయ సూరి తన “అమరపదవివృతి”లో – పతన్తి జనా అత్రేతి పత్తనం. “‘పత గతౌ’. పట్టణమితి పాఠే పటన్తి జనా అత్రేతి పట్టణం. ‘పట గతౌ’ అని వ్రాశాడు. ప్రజలు తండోపతండాలుగా వచ్చి చేరేది “పత్తన”మని, దానిగుండా జనం ప్రయాణిస్తారు కనుక (floating population వల్ల) అది పట్టణమని – ఛాయాభేదంతో కొత్త అర్థాన్ని చెప్పాడు. ఆ అర్థనిర్ణయానికి శిక్షాప్రణీతంగా ధాతుప్రమాణాలను ఇచ్చాడు.
అచ్యుతోపాధ్యాయుని “వ్యాఖ్యాప్రదీపం”, ఆశాధరుని “క్రియాకలాపం”, నీలకంఠుని “సుబోధిని”, భరత మల్లికుని “ముగ్ధబోధ” – ఇదే తీరున అర్థనిర్ణయం చేశాయి. ఔత్తరాహుడైన కృష్ణమిశ్రుడు “పత్తన” శబ్దాన్ని మాత్రమే అంగీకరించి, “పతన్త్యత్ర” అని నిశ్చయించి, ‘విపతేర్ తనన్’ అని ఉణాది సూత్రం (3-150) ప్రమాణీకరించాడు. ఆయన అర్థం క్షీరస్వాంయాదులతో సంవదిస్తుంది. క్రీ.శ. 16-వ శతాబ్దం నాటి తాళ్ళపాక తిరువేంకటాచార్యులు ఈ అన్నింటినీ పరిశీలించి తన “లింగాభట్టీయం”లో –
“ఆపతన్తి వణిజోస్మిన్నితి పత్తనం. పత్ ఌ గతౌ.” వర్తకులు దీనినిగూర్చి వత్తురు గనుక పత్తనము. పట్టణమనియు పాఠము కలదు.”
అని మఱొక అర్థాన్ని వ్రాశాడు.
భానుజీ దీక్షితుడు తన “వ్యాఖ్యాసుధ” (రామాశ్రమి)లో “పత్తన” శబ్దాన్ని గ్రహించి, “పతన్తి జనా యత్ర” (జనం పెద్ద సంఖ్యలో వచ్చిపడుతుండే చోటు) అన్న భావంతో ‘వీ పతిభ్యాం తనన్’ ఆధారంగా పత్ + తన అని సాధించాడు. అంతటితో ఊరుకోక “పట్టనం ఇతి వాచస్పతిః” అని ఎవరో వాచస్పతిని ఉదాహరించి, అవి సమానార్థకాలని అన్నాడు.
అలాగే కాశీనాథుని “కాశిక”, గోస్వామి “బాలబోధిని”, నారాయణానంద రామచంద్రుని “అమరకౌముది”, బృహస్పతి “అమరకోశ పంజిక”, మధురేశ విద్యాలంకారుని “సారసుందరి” వ్యాఖ్యలన్నీ “వ్యాపారులు వస్తూ పోతూ ఉండే చోటు”, “జనాభా ఎప్పటికప్పుడు పెరుగుతుండే ఆవాసం” అని చెప్పిన నిర్వచనాలు నిజానికి ఎంతో భావ్యంగానూ, అర్థవంతంగానూ, వ్యాకరణసాధ్యాలు గానూ, సప్రమాణంగానూ ఉన్నాయి.
ద్రావిడశబ్దమైన “పట్టు” నుంచి “పట్టణము”ను సాధించటానికి మీరు ఊహించిన “పట్టు” ధాత్వర్థరూపమైన వ్యుత్పత్తి మార్గాన్ని కూడా సంస్కృత లాక్షణికులు గుర్తింపకపోలేదు.
“పట్టుః – అయ మాన్ధ్రభాషాశబ్దః. తన్త్ర్యాస్ఫోటనే దృఢాస్ఫోటః”
అని దామోదరుడు తన “సంగీతదర్పణం”లో అన్నాడు. అయితే, అది వీణ తీగలపైని వ్రేళ్ళను మీటే సందర్భంలో వివరించిన భావచ్ఛాయ. జనస్థానమన్న భావంతో కాదు. “పట్టు” సంస్కృత లాక్షణికుల దృష్టిలో ఉన్నదని చెప్పటం మాత్రమే నా ఉద్దేశం.
“పట్టణము” ద్రావిడ భాషామాతృకమై సంస్కృతంలోనికి వెళ్ళినదని ప్రయోగకాల నిర్నిమిత్తంగా “పట్టిన” శబ్దానికి చెబుతున్న భావార్థమాత్రాన రుజువు చెయ్యటం కష్టం. ఇకపోతే, ఊరిపేర్లలోని “పట్నం” సముద్రతీర ప్రాంతమే. సముద్రతీరం కాకపోతే ఒకానొక పెద్ద జలాశయానికి సన్నిహితం. సముద్రతీర ప్రాంతమూ, జలాశయప్రాంతమూ – రెండూ కాని ఊళ్ళ పేర్లు కేవలం అనుకరణమాత్రాన వచ్చిన ఆధునిక నామధేయాలు. ఒకప్పుడు సార్థకంగా ఏర్పడిన పేర్ల వంటివి కావు.
ఈ మాటలన్నీ విద్యార్థిత్వంతో మీ అభిప్రాయాన్ని కోరుతున్నవే గాని, విద్యాధికత్వంతో మీకు చెప్పగోరినవి కావు.
“అనిపిండి” గృహనామ శబ్ద స్వరూపనిరూపణను గుఱించిన మీ చర్చను అధికరించిన నా సందేహాలను మఱొకసారి మనవిచేస్తాను.
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు
నిశ్శబ్దం గురించి jayaprabha అభిప్రాయం:
07/19/2013 1:06 pm
ఇలాంటి భాషనీ ఇలాంటి అభిప్రాయాన్నీ అచ్చు ఎలా వేశారూ? అని ఒక పాఠకురాలిగా నేను సంపాదకులని అడుగుతున్నాను. దీన్ని అచ్చువేయడం లో మీ ఉద్దేశ్యం ఏమిటీ??
దిగంబరుల కవిత్వం తర్వాత మగవాళ్ళు ఎలాపెడితే అలా రాయడాన్నీ ఏ భాష లో నైనా ఆడవాళ్లని గురించి మాట్లాడటాన్నీ తగ్గించుకోవడం తెలుగు దేశం లో జరిగింది. ఆడవాళ్ళు విమర్శలోనీ రచనా శైలి లోనీ ప్రవేశించాకా ఎలా పెడితే అలా మాట్లాడేయడం తెలుగు దేశాన అయితే మళ్ళీ సాధ్యం కాలేదు. మరి అదేతీరులో తిరిగీ మీ పత్రికలో ఈ భాషా విధానం ఏమిటి? మీ పత్రిక వీటిని ప్రచురించి వీటికి ప్రాముఖ్యం ఇవ్వడం ఏమిటి? అలాంటి భాషని వాడటం ఏమి కష్టం గనక? ఎవరన్నా రాయొచ్చునే ? ఆడవాళ్ళు రాస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి బహుశా లైలా ప్రయత్నం చేశారు.
రాయాలంటే ఆడవాళ్ళు సైతం అలా రాయడం ఏమీ కస్టం కాదు సుమా అని లైలా చెప్పినట్లయింది. ఆ ప్రయోగం ఆవిడ చేసి చూపిన లక్ష్యం అదే నని నేను అనుకున్నాను. అంత పాటి విమర్శని కూడా ఈ రవికిరణ్ తీసుకోలేకపోయినాడా? ఎంత విషాదం! వెంటనే ప్రతిస్పందనని మరెంత వికారంగా రాసేడో? దాన్ని ప్రచురించి మీ పత్రికకి ఉన్న gender insensitivityని మీరు చాటుకున్నారు. ఇంత చదువుకున్న వాళ్ళున్న మీ పత్రిక కూడా చివరికి ఇంతేనన్నమాట! how sad !
జయప్రభ.
తెలుగువారి ఊళ్ళ పేర్లు – ఇంటి పేర్లు గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:
07/19/2013 10:22 am
రవికిరణ్ గారు: ఇంటిపేర్ల గురించి మీరు దాదాపు సరిగ్గానే ఊహించారు. ఇంటిపేర్లు మనకు కాకతీయులకు పూర్వం ఉన్నట్టు దాఖలాలు లేవు. కవుల విషయంలో నన్నయ్య (భట్టు బిరుదు కావచ్చు) నుండి శ్రీనాథుడి వరకూ ఉన్న కవుల ఇంటిపేర్లు మనకు తెలియవు. నాచన సోమన పేరులో నాచన తండ్రి పేరు అయితే, పాల్కురికి సోమనాథుడి పేరులో పాల్కురికి వారి ఊరుపేరు కావచ్చును. బమ్మెర పోతన, అష్టదిగ్గజాల కాలం నుండి మనకు ఇంటిపేర్లు అవిరళంగా కనిపిస్తున్నాయి.
ప్రాఙ్నన్నయ్య శాసానాలలో ఊరుపేరో, ప్రాంత నామమో తగిలించిన పేర్లు కొన్ని అరుదుగా కనిపిస్తున్నాయి; కాని, ఆ రోజుల్లో తెలుగు వారు కూడా ద్రావిడ సంప్రదాయంలో లాగా తండ్రి పేరు తగిలించుకొనే అలవాటు ఉందని కొన్ని శాసనాలలో పేర్లు సూచిస్తున్నాయి.
స్థూలంగా ప్రస్తుతం తెలుగువారి ఇంటిపేర్లలో ఊరిపేరే అధికంగా కనిపిస్తుంది. వృత్తినామాలు/పదవులు (ప్రగడ మొ.), ధాన్యాల పేర్లు, కుటుంబంలో పేరు పొందిన వారి పేరు ఇలాంటివి కూడా విరళంగా కనిపిస్తున్నాయి.
ఈ విషయంపై వేమూరి గారు రాసిన వ్యాసం, అలాగే, ఇదివరకు నేను ఇండో-యూరేసియన్ రీసర్చ్ వేదికపై చేసిన చర్చను మీరు చదవవచ్చును.
గతమెంతో ఘనకీర్తి – భవితెంతో భవదీప్తి గురించి మోహన అభిప్రాయం:
07/19/2013 5:30 am
హీబ్రూలాగే తెలుగు ప్రాచీనమైన భాష. క్రీ.పూ. 1500 నాటికే తెలుగుభాషకు లిపి వుంది.
??? !!! 🙂 🙂 🙂 విధేయుడు – మోహన
తెలుగువారి ఊళ్ళ పేర్లు – ఇంటి పేర్లు గురించి jayaprabha అభిప్రాయం:
07/19/2013 3:27 am
సురేష్ ఏమి చెబ్తాడో నేనూ ఆసక్తిగా ఎదురు చూస్తాను రవికిరణ్! తెలుగు వారి ప్రత్యేకత వారి ఇంటిపేర్లే!! ముందునించీ కూడా!! మనకి పాత కాలం నించీ వస్తున్న / కొనసాగుతున్న ఇంటిపేర్లు అనేకం ఉన్నాయి. ఇంటిపేర్లు కనిపించనివీ ఉన్నాయి. పేరుకి ముందు తండ్రి పేరు కాక వేరే గా మరి ఒక ఇంటిపేరు కలిగి ఉండటం తెలుగు వారి ప్రత్యేకత. కుంతి కుమారులు కౌంతేయులు, పాండురాజు పుత్రులు పాణ్దవులు కదా?? అక్కడ వంశానికీ.. తల్లి తండ్రి పేరుకీ ప్రాధన్యత ఇచ్చినట్టున్నారు. తమిళ నాట, కన్నడిగులకీ సైతం తండ్రి పేరే ముందు వస్తుంది. కానీ వారికీ వారిదైన గోత్రం ఉంటుంది.
తెలుగు వారు వారి పేరు చెప్పాలంటే వారి ఇంటి పేరుతో కలిపే చెప్పాలి. అది సంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని ఇటీవల పాటించడం తగ్గినట్టుంది. ఇంక ఇంటిపేరు అంటే family name మహరాష్ట్రులకీ ఉంది, మిగిలిన వారికీ ఉంది సుమా!! పరిశీలిస్తే మరిన్ని ఆసక్తికరమైన సంగతులు తెలుస్తాయి కూడా!!
ఊరిపేరో ఆ కుటుంబంలో పేరు పొందిన వారి పేరో వారి వారి వృత్తిని అనుసరించి వచ్చిన పేరో, పౌరుష నామాలో ఇంటిపేరుగా ఉండొచ్చు. ఇలా ఈ సంప్రదాయమే ఇండియా మొత్తంగా ఉంది. అయితే ఔత్తరాహికులు వారు వారి కుటుంబ నామాన్ని వెనక పెట్టుకుంటారు. తెలుగు వారు ఒక్కరే తమ పేరుకి ముందు తమ కుటుంబపు పేరు పెట్టుకుంటారు. ఒక ఇంటిపేరే ఉంటుంది. మీరన్నట్టు గుర్తు కోసం ఒక ఇంటిపేరుకి మరో మారు నామం ఉండొచ్చు. కానీ అది కేవలం గుర్తుకే! వాడవలసి వచ్చినప్పుడు మీరన్నట్టు వారు కూడా వారి వారి అసలు ఇంటిపేరు నే వాడతారు.
తెలుగులో ఇంటిపేర్లు అన్ని కులాల వారికీ ఉన్నాయి ఇది మీకు సామాజిక చరిత్ర చూస్తే తెలుస్తుంది. అల్లసాని పెద్దన, నంది తిమ్మన లాంటివి ఇంటి పేర్లే! మాదయగారి మల్లన అని అన్నప్పుడు అది తమిళ సంప్రదాయం నించి వచ్చినట్టుగా అనిపిస్తుంది. కదా?? ధూర్జటికి ఇంటిపేరు లేదు. సన్యాసం తీసుకున్నా మరింక ఆ పాత ఇంటిపేరు కొనసాగదు. వాళ్ళు పెట్టుకునే వేరే పేరు ఉంటుంది. ధూర్జటి విషయం లో ఏమై ఉంటుందో మనకి తెలియదు. అలా తెలియకుండా ఉన్నవీ ఉన్నాయి. సంఘం / సాళువ/ తుళువ/ఆరవీడు వంశాల వాళ్ళు అని విజయ నగర రాజులని గురించి చెప్పేరు కదా? “సమ్మెట నరపాల సార్వభౌముడు” అని అల్లసాని పెద్దన చాటువు కృష్ణ దేవునిమీద చెప్పింది ఉంది. ఇందులోని “సమ్మెట” కృష్ణదేవరాయల ఇంటిపేరని అనే వారూ ఉన్నారు.
ఇంక రెడ్లని గురించి పాకనాటివారు, రేనాటివారూ, పంట రెడ్లూ లాంటి విభజన ఉన్నది కదా?? ఇది మిగిలిన కులాల లోనూ ఇటువంటి ఒక విభజన ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అయితే కులాలలో శాఖా విభజన వేరు. ఇంటిపేరు వేరూను. వారి కుటుంబాలలో కుటుంబ చరిత్ర ని చెప్పేటప్పుడో వారి వారి మూలాలని చెప్పేటప్పుడో తెలుసుకునేందుకు ఉపకరించేవి ఇవే!! ఇంక సురేష్ కొలిచాల జవాబుని విందాం!!
జయప్రభ.
తెలుగు పలుకు: 2013 తానా సమావేశాల ప్రత్యేక సంచిక గురించి jayaprabha అభిప్రాయం:
07/19/2013 1:08 am