పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. వేకువనే మోకరించే ఆమె గురించి Ramarao Vadapalli అభిప్రాయం:

    07/24/2013 5:18 am

    నాకు మదర్ థెరిసా గుర్తుకి వచ్చింది. మంచి కవిత.

  2. దైవం గురించి nagamurali అభిప్రాయం:

    07/24/2013 2:17 am

    Thank you Veluri gaaru for your wonderful comment on a wonderful poem.

    When I read this poem, I remembered an anecdote from Steven Pinker’s How The Mind Works. Once the author went to an exhibition on spiders. Next to him a lady was exclaiming, ‘How can one Not believe in God looking at all this!’, and at the same moment Pinker was exclaiming ‘How can one Not believe in Natural Selection looking at all this!’.

  3. దైవం గురించి Veluri Venkateswara Rao అభిప్రాయం:

    07/23/2013 3:36 pm

    “ట” వేదాంతం
    ———–

    ‘ఒక్క “ట” తో ఎంత పని చేయించుకున్నారు మీరు!’ — అని ఒక ప్రఖ్యాత ఆరోచకులు అన్న వెంటనే మరొక ప్రముఖ ఆరోచకులు అవును సుమా, ‘మంచి పద్యమేనని’ కితాబు ఇచ్చిన తదుపరి నాబోటి సాధారణ పాఠకుడు, ఒకరకంగా ‘సతృణాభ్య వ్యవహారి’ ఉద్ధతుల మధ్యకి దిగి, ’తగుదునమ్మా అని’ అభిప్రాయం రాయటానికి నిజంగా భయం వేస్తున్నదంటే నమ్మండి.

    నామటుకు నాకు ఒక పద్యం చదవగానే మెరుపులా ఏదో, ఎక్కడో చదివినదో, ఎవరో చెప్పగా విన్నదో జ్ఞాపకాని కొస్తుంది. ఆజ్ఞప్తి నా బుర్రకి పనికల్పించి సాదృశ్యం కోసం వెతుకులాడిస్తుంది. ఆ సాదృశ్యత ఏదో తట్టగానే, ఆ పద్యం ఒకటికి పది సార్లు చదివి, ఆనందించడానికి తోడ్పడుతుంది. ఈ పద్యం, మరీ ముఖ్యంగా ఆ ‘ట’ మీద వివరణ నాకు ఋగ్వేదంలోని నాసదీయ సూక్తం ( పది.129) జ్ఞప్తి కి తెచ్చింది. మరీ ముఖ్యంగా, ఆ సూక్తంలో ఏడవ ‘శ్లోకం.’

    ఇయం విసృష్టిర్యత ఆబభూవ యది వా దధే యది వా న ।
    యో అస్యాధ్యక్షః పరమే వ్యోమన్ సో అంగ వేద యది వా నవేద ॥

    This hymn has been translated, commented and critiqued by tons of scholars. It has been known as the Creation Hymn. It has been interpreted as one of the earliest accounts of skeptical inquiry and agnosticism. There was a Telugu translation by Vadlamudi Gopalakrishnayya from the Rigveda Samhita published by the Tirumala Tirupati Deevasthanam. It was more difficult than the original Rik. I will give one translation, I liked most. It was by Raimundo Panikkar. Here it goes:

    “That out of which creation has arisen,
    Whether it held it firm or it did not,
    He who surveys it in the highest heaven,
    He surely knows – or may be He does not.”

    May be, it tells more than the alleged ‘ట’; or may be it does not. Who knows!
    Whether Indrani Palaparthi has this స్మృతి when she was penning the poem would be a topic of discussion on her knowledge or association with Hindu Scriptures, Mysticism and even Psychoanalysis. And, that would be fodder for other comments and counter-comments.

    I know, I have been accused of living in the 1980s, and did not ‘grow up.’ With this note I am afraid I would be condemned to be living some three thousand five hundred years ago! I would like to end my comment with a light hearted story.

    Long long ago,there was a king by name Sisunaga. He had banned eight sounds in his kingdom because they were difficult to pronounce. They are :
    ట ఠ, డ ఢ, శ ష, హ, క్ష. If this poem were to be written in Magadha during Sisunaga’s time, what could have happened to the, ‘ట,’ story?

    Finally, Indrani garu! I loved reading your poems before publication in eemaaTa; and I love them more now after publication in eemaaTa.

    Best Wishes, — Veluri Venkateswara Rao

  4. నిశ్శబ్దం గురించి RAVIKIRAN TIMMIREDDY అభిప్రాయం:

    07/22/2013 11:40 pm

    అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు, అత్తలు అని నేనే కదా మహా ఫీల్ అయిపోయి వాళ్ళని నా నెత్తి మీద పెట్టుకుంటా వుంటాను. తప్పు నాది అవునో కాదో నాకు తెలియదు, కానీ నేనలా వ్రాసి వుండాల్సింది కాదు. ఆ రకంగా తప్పు నాదే, ఎందుకంటే, మీరందరూ నా ఆడ బిడ్డలే కదా. సారీ.

    -కిరణ్

  5. తెనాలి రామలింగకవి శబ్దార్థ గూఢచిత్ర పద్యం గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:

    07/22/2013 10:15 am

    వ్యాసాన్ని ఆసాంతం చదివి ఎంతో దయతో స్పందించిన శ్రీ కృష్ణమోహనరావు గారికి, రవి గారికి, పి. లలిత గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.

    శ్రీ కృష్ణమోహనరావు గారు! తుమ్మల వేణుగోపాలరావు గారి గూఢచిత్ర రహస్యప్రకాశిక భారతీయ భాషలన్నిటిలోని చిత్రరీతులను పరిశీలించి రూపొందించిన ఒక సమగ్ర విజ్ఞానసర్వస్వం. మొత్తం ఆఱు భాగాలుగా సంకల్పింపబడి, సగం మాత్రమే పూర్తయి అచ్చయింది. ఆ కూర్పు కాలంలో శ్రీ తుమ్మల వేణుగోపాలరావు గారు ఒక వారం రోజులు మా ఇంట ఉండి వారి సహృత్సల్లాపాలతో మా ఇంటిని ధన్యధన్యం చేశారు. పైపైని చదివేవారికి కొంత చాదస్తంగా అనిపిస్తుంది కాని, ఎంతో విలువైన సమాచారాన్ని మనకోసం సేకరించి శేఖరించిన మహానుభావులు వారు.

    ఆధునికజీవితం ప్రకృతివిలాసానికి దవీయసమై కవిత్వం అంతర్ముఖీనత నుంచి బహిర్ముఖం కాసాగినపుడు మాఱిన కవిసమయాల నైపథ్యంలో ఇప్పుడు ఇటువంటి పద్యరచనమూ జరగటంలేదు; జరిగినవాటి పద్యార్థమూ తెలియటం లేదు. ఇటీవలి కాలంలో ఇటువంటి విషయాలపై గురుభావం సన్నగిల్లిపోయినందువల్ల చదివేవారూ లేరు; అచ్చువేసేవారూ లేరు.

    గుడారు వెంకటదాస కవి గారి “ప్రబంధశిరోభూషణ ప్రకృష్ట బలరామ చరిత్రము”
    శిష్టు కృష్ణమూర్తి శాస్త్రి గారి “కంకణబంధ రామాయణము”
    వఠ్యం పరబ్రహ్మశాస్త్రి గారి “చిత్రకంకణ రామాయణము”
    శ్రీమాన్ గోపాలాచార్యుల వారి “గురుమూర్తి నాయని విలాస చిత్రప్రబంధము”
    అల్లమరాజు రంగశాయి కవి గారి “చంపూ భారతము”
    నాదెళ్ళ పురుషోత్తమకవి గారి “అద్భుతోత్తర రామాయణము”, “కృష్ణానదీ మాహాత్మ్యము”,
    గాదె పాపరాజకవి గారి “చతుర్ముఖ కంద పద్య రామాయణము”
    పోకూరి కాశీపతి గారి “దశాక్షర శ్రీ శేషశైలేలీల”, “త్రింశత్యర్థపద్యరత్నము”
    శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి గారి “శుద్ధాంధ్ర నిరోష్ఠ్య నిరూష్మ నిర్వచనైకాదశాక్షర శకుంతలా చరిత్రము”
    మండపాక పార్వతీశ్వరశాస్త్రి గారి “ప్రబంధ సంబంధ బంధ నిబంధన గ్రంథము”
    బండ్ల సుబ్రహ్మణ్యకవి గారి “విద్యుల్లతా బంధ ప్రబంధము”
    వాసుదేవ అద్వైత పరబ్రహ్మశాస్త్రి గారి “మేకాధీశ శబ్ద శతకోటి”

    తెలుగువాళ్ళు నిర్లక్ష్యం చేసిన ఈ నిధులు ఎన్నని చెప్పను? ఇటువంటి కృతులకు కాలం చెల్లిందని, కాలస్రవంతి గతి మళ్ళిందని సమర్థించుకోవటం ఒక్క తెలుగువాళ్ళకే చెల్లింది.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

  6. వేకువనే మోకరించే ఆమె గురించి జాన్ హైడ్ కనుమూరి అభిప్రాయం:

    07/22/2013 4:19 am

    Chunduri Srinivasa Gupta
    Mercy Margaret

    స్పందనకు ధన్యవాదాలు

  7. ప్రవాసి గురించి jayaprabha అభిప్రాయం:

    07/22/2013 3:16 am

    రవి శంకర్ !! మీ తల్లి నేల మిమ్మల్ని వెనక్కి రావొద్దని చెప్పిందా ?? ఏదో ఒకనాటికి ఆ నేల కిందే ఎందుకని నిదురించాలీ ??

    జయప్రభ .

  8. మనిషంటే… మింగేస్తూ మింగేయబడుతున్న జ్ఞాపకం గురించి Narayana అభిప్రాయం:

    07/21/2013 11:55 pm

    తమ అభినందనలను/అభిప్రాయాలను తెలియజేసిన మిత్రులకు పేరు పేరునా
    ధన్యవాదాలు.

    నారాయణ.

  9. నదిలోని నీరు గురించి D.Venkateswara Rao అభిప్రాయం:

    07/21/2013 2:28 pm

    ఈ కవితకు ‘నదిలోని నీరు’ అన్న పేరు ఎందుకు పెట్టారో చెప్ప గలరా స్వాతి కుమారి గారూ?

  10. వేకువనే మోకరించే ఆమె గురించి Mercy Margaret అభిప్రాయం:

    07/21/2013 12:18 pm

    మంచి కవిత. నాకు మా అమ్మను గుర్తు చేసారు అంకుల్. ధన్యవాదాలు.