పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. శంకరాచార్యుల రచనలో ఛందస్సు వైభవము గురించి indrani Palaparthy అభిప్రాయం:

    08/02/2013 1:48 pm

    అయ్యో,అలాగా!
    చాలా చోట్ల శంకరాచార్య విరచితమనే చూశానండీ.

    Thank you for the information.

    Indrani.

  2. శంకరాచార్యుల రచనలో ఛందస్సు వైభవము గురించి మోహన అభిప్రాయం:

    08/02/2013 12:40 pm

    వ్యాసము నచ్చినందులకు కృతజ్ఞతలు ఇంద్రాణి గారు, మహిషాసురమర్దిని స్తోత్రమును వ్రాసినది శంకరాచార్యులు కాదు, రామకృష్ణకవి. ఈ రామకృష్ణకవి ఎవరో, ఎప్పటివారో అనే విషయముగురించి నేను వెదకుతూ ఉన్నాను. ఇంతవరకు నా ప్రయత్నము సఫలీకృతము కాలేదు. అందుకే నేను శంకరుల యమునాష్టకమును ఉదహరించాను. ఈ మహిషాసురమర్దిని స్తోత్రమునుగురించి మా ఊరి చిన్మయా మిషనులోని ఆచార్యులు ఒకప్పుడు ఇలాగన్నారు – ప్రపంచములో మొట్టమొదటి rap music ఈ స్తోత్రము! విధేయుడు – మోహన

  3. హిందోళ రాగం – అనుబంధం గురించి indrani Palaparthy అభిప్రాయం:

    08/02/2013 10:35 am

    మీరు రాషిన వ్యాషం కూలంకషంగా పరిషీలించి, కాచి, వడపోషి, షేవించిన మీదట రాష్తున్న నా అమూల్యాభిప్రాయం 🙂

    1) హిందోళం అషలు పేరు ఇండోరం, అది ఇండోర్ లో పుట్టింది కాబట్టి దాన్ని అలా అనేవారుట. ఇప్పుడు వడోదరం అనవచ్చుట. ఈ విషయం మీకు తెలియదు, అషలిప్పడివరకూ నాకే తెలియదు, వొప్పేషుకోండొప్పేషుకోండి.

    2) వ్యాషం మొదట మీరు రాషిన కామెంట్లకి ష్క్వేరు బ్రాకెట్లు వాడడం వల్ల వ్యాషం అందం చెడిపోయిండి. ఫ్లవర్ బ్రాకెట్లు వాడితే బాగుండేది. అషలు ఫ్లవర్ బ్రాకెట్లే ఎందుకు వాడాలో తెలియాలంటే నా పరిషోధనా వ్యాషం చదివి తెలుషుకోవాళి. రాయంగానే పంపిష్తాను.

    3) మీరువాడిన కీబోర్డు బొమ్మ బాగాలేదు, కలర్ పిక్చరు వాడుంటే మీ వ్యాషం అందంగా వుండేది.

    🙂 🙂

    ఎవరు రాసారో కానీ అర గంటనించీ నవ్వుతూనే ఉన్నానండీ . 🙂

    ఇంద్రాణి.

  4. శంకరాచార్యుల రచనలో ఛందస్సు వైభవము గురించి indrani Palaparthy అభిప్రాయం:

    08/02/2013 9:45 am

    ఇప్పుడే ఈ వ్యాసం చూస్తున్నాను మోహన రావు గారు.

    చాలా మంచి విషయాలను తెలియజెప్పారు. ఆది శంకరులను తలచుకుంటేనే మనసెంతో ప్రశాంతమౌతుంది నాకైతే. వారి మహిషాసుర మర్దిని స్తోత్రం నాకెంతో ఇష్టం. అస్తమానం పాడుకుంటూ ఉంటాను.

    మా ఊరి పక్కన, త్రిపురాంతకం దేవాలయ ప్రాంగణంలో ఉంటాయి కదంబ వృక్షాలు. అమ్మ వారు ‘కదంబ వన ప్రియ’ కదా, అక్కడ నిలబడి ఈ స్తోత్రం తలచుకుంటే అమ్మ వారు అక్కడ తిరుగుతున్నట్టు కళ్ళకు కనిపిస్తుంది నాకైతే.

    ధన్యవాదాలు.

    ఇంద్రాణి.

  5. ఇలైయిల్ తంగియ తూళిగల్ గురించి వలలుడు అభిప్రాయం:

    08/01/2013 11:59 am

    అనువాదం చూస్తూ, కవి గొంతులో తమిళ కవిత విన్నాను.
    అద్భుతం.
    దయచేసి సుబ్రహ్మణ్య భారతి, వాలి వంటి ఇతర కవులవి కూడా ఇలా అనువాదం ఇచ్చే ప్రయత్నం చేయండి.

  6. తెనాలి రామలింగకవి శబ్దార్థ గూఢచిత్ర పద్యం గురించి Velcheru Naraayana Rao అభిప్రాయం:

    08/01/2013 11:51 am

    పుస్తకాలకి ఎప్పుడూ కాలం చెల్లదు. అవి చదివి, అవసరమైన చోట్ల ఇప్పటి తెలుగులో అర్థాలు చెప్పే పండితులకి కాలం చెల్లిందంటే అది నిజమే. అది మన విశ్వవిద్యాలయాల చిన్నచూపు వల్ల. ఈ పుస్తకాల ఆచూకీ తెలిసిన వాళ్ళు, వాటికి అర్థాలు చెప్పగలవాళ్ళు ఇంకా వున్నారు, కాకపోతే వాళ్లు విశ్వవిద్యాలయాలలో లేరు. ఆధునిక సాహిత్య పాఠకులు ఈ పుస్తకాలు చదవాలని నేను ఆశించను. ఈ రకం పుస్తకాలు రాయబడిన రోజుల్లో కూడా చాలా తక్కువమంది పండితులే వీటిని చదివారు.

    –నారా

  7. తెలుగు పలుకు: 2013 తానా సమావేశాల ప్రత్యేక సంచిక గురించి Krishna Rao Maddipati అభిప్రాయం:

    08/01/2013 9:04 am

    వయసైపోతంది. అన్నీ గుర్తెట్టుకోడం కట్టవే!

  8. వేకువనే మోకరించే ఆమె గురించి Augustus,augustya అభిప్రాయం:

    08/01/2013 2:05 am

    అమ్మ పాట నా జీవితానికి బాట

  9. తెలుగు పలుకు: 2013 తానా సమావేశాల ప్రత్యేక సంచిక గురించి Sesha Vadapalli అభిప్రాయం:

    07/31/2013 5:40 am

    (సోమరాజుకి ఆడి బామ్మరిదికీ తేడా తెలీపోతే ఎలా?)

    మర్యాద, మర్యాద!
    తెలియాల్సింది “సోమరాజుగాడికి ఆడిబావగారికీ డిపరెన్సు.”

    (Mutyala Muggu (Youtube Video) 0:37:38)

  10. మత్తకోకిల కథ గురించి Vadrevu Ch Veerabhadrudu అభిప్రాయం:

    07/30/2013 11:03 pm

    చాలా విలువైన వ్యాసం.. చక్కని తులనాత్మక పరిశీలన.