పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. ఇంకొంచెం అసంబద్ధం గురించి బొల్లోజు బాబా అభిప్రాయం:

    08/04/2013 4:47 am

    extraordinary and heart touching.

  2. చిన్నారి – దేవత గురించి బొల్లోజు బాబా అభిప్రాయం:

    08/04/2013 4:07 am

    అందమైన పద్యం. కథనాత్మక కవిత్వం పట్ల మనవాళ్ళెందుకు విముఖత చూపిస్తారో అర్ధం కాదు. కవిత్వం అంటే మరో ప్లేన్ కి చెందిన వ్యవహారమని దాన్ని జనబాహుళ్యానికి అందకుండా ఎక్కడో ఉంచుతారు. బహుశా అందువల్లనే కథ కవిత్వాన్ని క్రమక్రమంగా ఆక్రమించేస్తున్నది. ఇంత సరళంగా, సూటిగా కథన పద్దతిలో చెప్పే కవితలు ఎక్కువమందిని ఆకట్టుకొంటాయనటంలో సందేహం లేదు.

    శీమాటి అన్న తమిళ పదాన్ని యధాతధంగా ఉంచేసారా అనిపించి, బ్రౌణ్యం చూడగా అది సీమాటి అని, దాని అర్ధం భాగ్యశాలినియైన యాఁడుది అని తెలిసింది. మనం మరచిపోయిన కొన్ని వేల తెలుగుపదాలలో ఇది ఒకటికదా అనిపించింది. మంచి కవితను పరిచయం చేసిన భాస్కర్ గారికి ధన్యవాదాలు.

    భవదీయుడు
    బొల్లోజు బాబా

  3. శంకరాచార్యుల రచనలో ఛందస్సు వైభవము గురించి కామేశ్వరరావు అభిప్రాయం:

    08/04/2013 3:16 am

    “కొందరు దేవీ అశ్వధాటిని శంకరులు వ్రాసినారందురు. కాని ఇది కాళిదాసకృతమని అధికుల ఊహ. నా ఉద్దేశ్యములో ఇది శంకరాచార్యవిరచితమని, ఎందుకంటే ప్రాసయతులు మున్నగు అలంకారములు కాళిదాసునకు పట్టవు.”

    మోహనరావుగారు యీ వ్యాసంలో ప్రస్తావించిన పై వాక్యాలు “చేటీ భవన్నిఖిల” అని మొదలయ్యే దేవీ స్తోత్రం గురించే అనుకుంటాను. ఆ శ్లోకాలన్నీ అశ్వధాటి వృత్తంలో ఉంటాయి. చాటు సంప్రదాయంలో కనిపించే కాళిదాసులాగానే, (శాక్తేయ) మత సంప్రదాయంలో మరొక కాళిదాసు కనిపిస్తాడు. ఈ సంప్రదాయం ప్రకారం – దేవీ పంచస్తవి, సప్తరత్నమాలికాస్తోత్రం, పైన పేర్కొన్న దేవీ స్తుతి (దీనినే దేవీ దశశ్లోకీ అని కూడా అంటారు) – మొదలైనవన్నీ కాళిదాస కృతులే.

  4. నిశ్శబ్దం గురించి ravikiran timmireddy అభిప్రాయం:

    08/03/2013 11:55 pm

    ఎప్పుడో వెళ్ళిపోయిన ఆవెని, అందులోనూ తన లిబరల్ కవిత్వాన్ని, మరే రకవైన ముసుగులూ లేని తన కవిత్వాన్ని, మీరు వ్రాసిన పదాలలోనూ, వాక్యాలలోనూ తప్పులేవి లేవు, కానీ ఆ కాంటెక్స్ట్ లో కమలాదాస్ గారి ప్రస్తావన అసలు బాగలేదు.

    అయినా ఈ విమర్శలు తెలుగు వ్రాతల్లో బూతు అనే దానిమీద ఒక వివరణ, ఒక సవరణ దిశగా పోతాయని నేననుకున్నాను. కానీ ఒకరిమీద మరొకరి కామెంట్లకే పరిమితం అవటం నిజంగా దురదృష్టకరం. అయినా ఎవరికి ఆశక్తి వుంది కనక, ఏ ముగ్గురు నలుగురో అంతే. కానివ్వండి ఈరోజు కాకపోతే, రేపు ఒక సహజవైన వ్యక్తీకరణని బూతని ఎంతకాలం ఆపగలరు.

    -రవికిరణ్ తిమ్మిరెడ్డి

  5. శంకరాచార్యుల రచనలో ఛందస్సు వైభవము గురించి తః తః అభిప్రాయం:

    08/03/2013 7:36 pm

    డా. జయప్రభ:

    ఈలాంటి విషయాల మీద చివరిమాట ఉండదని అనుభవం చెపుతుంది. ప్రగాఢమైన నమ్మకం ఉంటూనే తీవ్రంగా ప్రశ్నించటమూ ఉండవచ్చన్నదీ అనుభవమే. The concept of questioning with faith I first saw in Agehananda Bharati’s ,’The Ochre Robe’ [అనుభవానికీ వయసుకీ సంబంధం లేదనీ- అనుభవం].

    తః తః

  6. శంకరాచార్యుల రచనలో ఛందస్సు వైభవము గురించి jayaprabha అభిప్రాయం:

    08/03/2013 3:58 pm

    తహ తహ గారూ!

    ఆ వ్యాసం చదివే వీలుని కలిగించినందుకు ధన్యవాదాలు మీకు. ఇబ్బంది ఎక్కడ వస్తున్నదంటే మీరు సూచించిన ఆ వ్యాసంలో ఉన్న ఆ 40+ రచనలూ కాక కూడా పేర్కొనని చాలా అష్టకాలు, ఉదాహరణకి అన్నపూrNAష్టకం, రాజ రాజేశ్వరీ అష్టకం, కాల భైరవాష్టకం ఇంకా ఎన్నో ఆదిశంకరుల రచనలుగానే కదా ఉన్నాయి ? ఇవన్నీ ఆయన పేరనే మొత్తం దేశవ్యాప్తంగా చలామణీలో ఉన్నాయి గనక ఆయన రాసేరనే అనుకోవాలి మరి. అంతకన్నా మనకి ప్రస్తుతానికి ఇంకో ఆధారం ఏముందీ? ఎవరికైనా ఇంకా ఎక్కువ తెలిస్తే వారు చెబుతే తెలుసుకోవాలనే ఆసక్తి మాత్రం ఉంది నాకు. నాకు ఈ విషయంలో సందేహాలే తప్ప ఇదమిత్థమైన జ్ఞానం లేదు.

    థాంక్యూ
    జయప్రభ.

  7. శంకరాచార్యుల రచనలో ఛందస్సు వైభవము గురించి తః తః అభిప్రాయం:

    08/03/2013 1:55 pm

    గవేషణా నిష్ణాతులైన డా కృష్ణ మోహన రావు, డా జయప్రభ లకు అంతర్జాలం లొ దొరుకుతున్నEastern Tradition Research Institute,Cotopaxi, Colorado, U.S.A. వారి వ్యాసం ‘Works of the Original Śankarācārya’ చూడగలరని సూచించే సాహసం చేస్తున్నాను.

    తః తః

  8. కాల్వీనో కథల నుంచి – 4 గురించి CHARY అభిప్రాయం:

    08/03/2013 6:05 am

    క్రమశిక్షణతో పెరిగిన మీసం, తీక్షణమైన కళ్ళకు అడ్డంగా నల్ల కళ్ళజోడు….????

  9. నాకు నచ్చిన పద్యం: వసంత కుసుమ వికాసం గురించి kanaka Raju Tunga అభిప్రాయం:

    08/03/2013 2:04 am

    పూలు పూయుటను అద్బుతముగా అక్షరీకరించి పూసినట్లుగా పువ్వును పేరును పేరుపేరుగ ముందొకటి పూయించి దానికన్న ముందొకటి పూచిందంజెప్పిన నన్నెచోడునికి నమోవాక్కం. ఇంతటి అందమైన పద్యాన్ని అందించిన చీమలమర్రి బృందావనరావు గారికి నా వందనాలు.

    తుంగ కనకరాజు
    రామగుండం ఎంటిపిసి

  10. శంకరాచార్యుల రచనలో ఛందస్సు వైభవము గురించి jayaprabha అభిప్రాయం:

    08/03/2013 12:38 am

    నీ తప్పు లేదు ఇంద్రాణీ! చాలా భక్తి సామగ్రి మొత్తంగా శంకరాచార్యుల వారి పేరనే ప్రసిధ్ధమై చలామణీ అవుతున్నది. స్పస్టమైన సమాచారం ఎవరికీ తెలియదు, ఒక నమ్మకం తప్ప. అయితే శంకరాచార్యులు సైతం పీఠాధిపతులై అటుతరవాత అనేకులాపేరనే ఉండి రచనలు చేసి ఉండవచ్చు. వెయ్యేళ్ళ తర్వాత మనకి వీటిని గురించి తెలియగల సమాచారం ఉండదు. క్రాస్ రిఫెరెన్సెస్ ద్వారా మాత్రమే ఏమన్నా నిర్ధారించుకోవాలి. అందుకు చాలా చదువుకోవాల్సి ఉంటుంది. ఉన్నవే నేర్చుకునే ఓపిక లేదు ఎవరికీ! ఇంక వాటిని గురించి ఎవరెవరు మాట్లాడేరో, ఎక్కడెక్కడ మాట్లాడేరో తెలుసుకునే ఆసక్తీ ఓపికా ఉండాలి కదా? అంచేత ఒక నమ్మకం వెంట పోతేనే ఎక్కువ సుఖం !

    చందస్సుని గురించి తెలుసుకోగల వారికి ఈ శ్లోకాలూ, స్తోత్రాలూ , అష్టకాలూ, దండకాలూ, గద్యలూ, వచనాలూ చాలా ఉపయోగపడతాయి. భక్తిని అటుంచినా భాష మీద గొప్ప పట్టుని కల్గిస్తాయి. హిందూ కుటుంబాలలో, ఇళ్ళలో వీటిని అతి చిన్నతనంలో నేర్పే సంప్రదాయం ఉండేది. మరి ఇవాళ్టి చిన్న పిల్లలకి నేర్పుతున్నారో తెలీదు! ఇప్పటికీ అతి ముఖ్యమైన సంస్కృతశ్లోకాలకి కర్తృత్వం మీద ఒక స్పష్టత లేదు.

    మోహన గారూ — “చేటీ భవన్నిఖిల ఖేటీ కదంబవనవాటీ ” అన్న అమ్మవారి స్తోత్రం గురించి తెలిస్తే చెప్పండి. చాలా చిన్నతనంలో నేర్చుకున్నాను దాన్ని. కానీ దానిగురించిన ఇతర వివరాలు నాకు తెలీదు. అది కాళిదాసు రచన అని విన్నట్టు గుర్తు. నిజమేనా?

    జయప్రభ.