పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. స్వప్నలోకచిత్రకారుడు మచాడో గురించి తః తః అభిప్రాయం:

    09/15/2013 4:34 am

    “వ్యాఘ్రీవ తిష్ఠతి జరా పరితర్జయంతీ” ఎప్పటి వాడు భర్తృహరి ?
    తః తః

  2. ఇంటి మొగుడు గురించి narsimha reddy అభిప్రాయం:

    09/15/2013 2:54 am

    బులుసు గారూ మీరు కథ చెప్పే విధానం బాగుంది. యదేచ్చ వంటవాడు కోప వివాహంతో ఒక ఇంటిమొగుడు గా మారడం బాగుంది.మీ పద ప్రయోగం నవ్వించింది.

    నరసింహారెడ్డి గడ్డం.

  3. పాఠకులకు సూచనలు గురించి brahmeswara rao meka అభిప్రాయం:

    09/15/2013 12:34 am

    నమస్కారం. ఈమాట చాల బాగున్నది. ఈపత్రిక అందరికీ తెలియవలసి ఉంది.

  4. ఇంటి మొగుడు గురించి Jagdish అభిప్రాయం:

    09/14/2013 11:03 am

    కధ చాలా బాగుంది. అసలు కధ కన్నకధాగమనం చక్కగా ఉంది.

  5. స్వప్నలోకచిత్రకారుడు మచాడో గురించి jayaprabha అభిప్రాయం:

    09/14/2013 12:13 am

    కొలిచాలా! “వయోవ్యాఘ్రం” ఇది అర్ధం అవుతోంది. అది కాస్తా మనుష్యుల్ని కాలమనే మార్గంలో పొంచి కబళిస్తుందని మానవులు ఊరికే భయపడే కన్నా ఆ ముదిమి అనే పులి నించి కూడా నిర్భయంగా [ జీవన] క్షీరాన్ని గ్రోలండీ అని హితవు చెబుతున్నాడు కవి.

    అంటే మృత్యువుని అన్యాపదేశంగా చెబుతూనే చివరి దాకా నిర్భయంగా జీవితాన్ని అనుభవించమంటున్నాడు మచాదో.

    ఐతే, అసలు ఈ అర్ధం ఇంగ్లీషులోనే ధ్వనించడం లేదు. ఇంక దాని అనువాద వాక్యం అయితే తెలుగులో ఏ అర్ధాన్నీ ఇవ్వడం లేదు సరికదా, నవ్వు తెప్పించేది గా ఉంది. కదా? అనువాదం ఎప్పుడైనా ఏ భాషలో చేస్తున్నామో ఆ భాష లోని పాఠకులని దృస్టిలో పెట్టుకుని సాగాలి మరి.

    జయప్రభ.

  6. స్వప్నలోకచిత్రకారుడు మచాడో గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:

    09/13/2013 1:34 pm

    “పొంచివున్న మృగాలు మిమ్మల్ని/ ద్రోహవస్త్రంలో బంధించక ముందే, అల్లరి చిరుత అందిస్తున్న తియ్యటి క్షీరాలు తాగండి నిర్భయంగా!

    ఇది తెలుగు భాష లో ఏమన్నా ఒక అర్ధాన్ని ఇస్తుందా ? ”ద్రోహ వస్త్రం” ఎమిటీ?

    జయప్రభగారు: స్పానిష్ మూలాన్ని ఆధారంగా కాక స్పానిష్ నుండి ఇంగ్లీష్ లోకి చేసిన అనువాదం అధారంగా చేసిన తెలుగు అనువాదం కాబట్టే ఇన్ని సమస్యలు. అదీ కాక, చినవీరభద్రుడుగారు ఆధారపడిన Willis Barnstone మూలంలో భావాలను యథాతథంగా ఉంచడం కన్నా ఇంగ్లీషు సానెట్ ఛందస్సుకు తన అనువాదం ఒదగడానికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాడు. Willis Barnstone చేసిన అనువాదం ఇంగ్లీష్ పాఠకులకు మచాదోను పరిచయం చెయ్యడానికి ఆంగ్లభాషకు, ఆంగ్ల ఛందస్సుకు సరిపోయే విధంగా చేసిన స్వేఛ్చానువాదం.

    చినవీరభద్రుడుగారు రాసిన ఈ పంక్తులకు ఆధారమైన ఇంగ్లీష్ అనువాదం చూడండి:

    Go out and walk with spring and share the season,
    and fearlessly keep drinking the sweet milk
    the wanton panther offers you, the treason
    of beasts, before she traps you in black silk.

    ఇందులో black silk అన్న మాట మూలంలో లేదు. రెండవ లైను చివర sweet milk అన్న మాటకు ప్రాస సరిపోయేవిధంగా నాలుగవ లైనులో black silk అన్న మాటను ప్రయోగించాడు. మూడవ లైనులో వాడిన treason అన్న మాట కూడా మూలంలో లేదు. మొదటి లైనులో seasonకు ప్రాస సరిపోయే విధంగా మూడవ లైనులో treason అని వాడాడు. మూలంలో లేని treason, silk తెలుగులో కలగలిసి ద్రోహవస్త్రంగా మారిపోయాయి.

    నడవండి చేయి కలిపి వసంతంతో, పంచుకోండి
    పూలతేరు, పొంచివున్న మృగాలు మిమ్మల్ని
    ద్రోహవస్త్రంలో బంధించకముందే, అల్లరి చిరుత
    అందిస్తున్న తియ్యటి క్షీరాలు తాగండి నిర్భయంగా

    మాచాదో రాసిన మూలం ఇది:

    pasead vuestra mutua primavera,
    y aun bebed sin temor la dulce leche
    que os brinda hoy la lúbrica pantera,
    antes que, torva, en el camino aceche.

    దీనికి నాకు తెలిసినంతలో టీకా ఇది:
    pasead = సంచరించండి; vuestra = మీ యొక్క; mutua = పరస్పర; primavera = వసంతం; y = మరియు; aun = ఇంకా/అయినా; bebed = తాగండి; sin temor = భయం లేకుండా; la dulce = తియ్యని; leche = పాలు; que = that ఏదైతే; os = మీకు; brinda = ఇచ్చునో; la lúbrica = slippery, lusty; pantera = Panther అను మృగము; torva = ఘోరం/నిష్ఠురం; en el camino = దారిలోన;aceche = కాపు కాయు; antes que = అంతకు ముందు.

    నాకు తోచిన అర్థాన్ని పంక్తులుగా రాస్తే:

    నడవండి వసంతంతో చేయి కలిపి;
    తుంటరి వయోవ్యాఘ్రం
    అందించే మధుర క్షీరాలను
    ఆస్వాదించండి నిర్భయంగా —
    అది కాలమార్గంలో పొంచి ఉండి
    ఘోరంగా దెబ్బతీయక ముందే.

  7. కాలాతీతం గురించి PAPARAO అభిప్రాయం:

    09/13/2013 12:44 pm

    జీవతములో అథ్యాత్మిక భావాలు ఎలా విస్తరించుకోవాలో హ్రుద్యంగా చెప్పిన మీ కవిత చాలా బాగుంది

  8. అనంతం గురించి PAPARAO అభిప్రాయం:

    09/13/2013 12:40 pm

    సర్వం నేనే. అంటూ సాగిన మీ కవిత చాలా బాగుంది. ఈ శరీరం పంచభూతాత్మికం అని మీ కవితలో చెప్పకనే చెప్పారు

  9. శత్రువు గురించి PAAPAARAAVU అభిప్రాయం:

    09/13/2013 12:36 pm

    శత్రువులంటే మనల్ని అప్రమత్తంగా వుంచేవాడని అర్థం చేసుకోవచ్చు కూడా అని
    ప్రతి ఆటలోనూ సహచరులకంటే ప్రత్యర్ధి పాత్రే ముఖ్యం.అనే వాక్యంలో చెప్పారు. చాలా బాగుంది.

  10. స్వప్నలోకచిత్రకారుడు మచాడో గురించి jayaprabha అభిప్రాయం:

    09/12/2013 2:43 pm

    “పొంచివున్న మృగాలు మిమ్మల్ని/ ద్రోహవస్త్రంలో బంధించక ముందే, అల్లరి చిరుత అందిస్తున్న తియ్యటి క్షీరాలు తాగండి నిర్భయంగా!

    ఇది తెలుగు భాష లో ఏమన్నా ఒక అర్ధాన్ని ఇస్తుందా ? ” ద్రోహ వస్త్రం ” ఎమిటీ ?

    “దవనంలో మరువంలో / తేనెటీగలు మైమరిచే తరుణమిది”

    [?] దవనానికీ మరువానికీ పువ్వులుంటాయా? తేనెటీగలు రావడానికి?

    “నిమ్మ పొద, కేశ రాశి, ఊట నీరు, వేల జలాలు, జలాల్లారా!” లాంటివి తెలుగు భాషలొ తెలుగు కవితా వాక్య నిర్మాణంలో ఇమడని కృతక పదబంధాలు కావా?

    వేరే నాగరికతకి చెందిన ఒక కవిని స్వంత భాష లోకి అనువాదం చేయడం ఏమంత సులువైన విషయం కాదు. ఆ ప్రయత్నం చేసిన చినవీరభద్రుని అభినందిస్తూనే, అనువాదం ఎప్పుడైనా కూడా అనువాదం కాబడిన భాషకి ఎంత దగ్గిరగా తేగలిగామన్నది కూడా అంతే ముఖ్యం గనక, ఇప్పుడు నేను పేర్కొన్న ఇలాంటి వాక్యాలు మరొకసారి చూసుకుని ఉంటే వాటిని తెలుగులోకి ఎలా తేవాలో కూడా అనువాదకునికి తెలిసి ఉండేది.

    “మరీముఖ్యంగా ఒక మాఘ మాసపు గాలి” అంటూ ఒక అనువాద కవితని మొదలు పెట్టిన శ్రీశ్రీ ఒక దారి మన ముందుంచాడు, తెలుగు భాషలో ఊరికే భాషా భేషజం లేకుండా తెలుగుకి సహజమైన రీతిలో అనువాదం చేయడంలో! ఎప్పుడన్నా బాగా చేయలేకపోయినా పరవాలేదు గానీ తెలుగులోకి భావాన్ని చెప్పే పద బంధాలు అసహజంగా ఉండకుండా ఉంటే చాలు. చేయబోయే అనువాదాలలో వీరభద్రుడు ఇలాంటి విషయాలలో బహుశా శ్రధ్ధ వహించ గలడని ఆశిస్తాను.

    జయప్రభ.