పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. పడవ ప్రయాణం: కథ నచ్చిన కారణం గురించి Vamsi Mohan Maganti అభిప్రాయం:

    10/19/2013 2:09 pm

    సౌమ్యా

    ఈమాటలో రాయటానికి విముఖత కలగటానికి కారణం వివరించినా, ఈ మీ కామెంటు ఆవిడన్నదాన్ని అర్థం చేసుకోకుండా రాసినదానిలా అనిపించింది. ఇది నాకు లైలా గారి మీద ఉన్న అభిమానంతో రాస్తున్నది కాదని తెలుసుకుంటే చాలు. ఆవిడంటే ఎంత అభిమానం, గౌరవమో, నువ్వన్నా అంతే అభిమానం. డబ్బా ఉన్నది రాయటానికీ, అర్థాలు తోడుకోటానికి, కొండొకచో మోగించుకోటానికి. దూరంగా ఉండటమా, దీటుగా చెప్పగలమా, మనకు తోచినట్టు చెప్పగలమా అన్నది మనకు మనం తీసుకునే నిర్ణయం. అందులో మేధావితనం ఏమీ లేదు, ఉండకూడదు కూడా. ఆవిడ తనకు అర్థమయినదాన్ని చాలా వివరంగా చెప్పారు. ఇతరులకు ఎందుకు నచ్చిందోనన్న వింత తెలుసుకోవాలన్న ఇది ఉందని అడిగారు. అందులో వ్యంగ్యం నాకైతే కనపడలా.

    మీ వ్యాఖ్యలో “మేధావి” అని చిన్నబుచ్చినతనం కనపడింది. అది వయసు వల్ల కావచ్చు. అర్థం చేసుకున్న తీరు కావచ్చు. ఆ రెండిటినీ తప్పు పట్టటానికీ లేదు. అసలు కామెంటు అంటూ రాస్తే కదా ఏమనుకుంటున్నాం అనేది తెలుసేది? దానికి ఇతరులు మనం వినాలనుకున్న మాటల్లో చెప్పలేకపోతేనూ, మనకు వినపడకపోతేనూ – తప్పు పడితేనూ, దాన్ని వ్యంగ్యం కింద బ్రాండు చేస్తేనూ ఎట్లా?

    ఈ లైను లైలా గారికి సంబంధం లేకపోయినా అందువల్ల ముద్ర వేసిన వారి పెంకితనం పెరుగుతుందే తప్ప తగ్గే అవకాశం లేదని మటుకు ఘాట్టిగా చెప్పొచ్చు. స్వీయానుభవమా అని అడిగితే అవుననే చెపుతానేమో..:)

    మళ్లీ కామెంటుకొచ్చేస్తే ఒకరి నిజాయితి వల్ల సొంతలాభం తప్పితే ఇతరులకు జరిగే లాభం తక్కువ. అందునా ఇలాటి కామెంటు బాక్సుల్లో. మనకు మనం నిజాయితీగా ఉన్నామనుకుని ఎట్లా రాస్తున్నమో వారు అట్లానే రాస్తున్నారని అనుకోటమ్లో ఆనందం ఉంటుందేమో – నాకు తెలియదు, ఆసక్తీ లేదు …

    ఇంకా బోల్డు రాయాలని ఉంది కానీ జనాలు తప్పర్థం ఇప్పటికే చాలా చేసేసుకున్నారన్న అనుమానంతో, స్వస్తి …:)

  2. దానవోద్రేక స్తంభకుడు గురించి pvsnarasaiah అభిప్రాయం:

    10/19/2013 6:35 am

    చాల బాగుంది. చక్కటి విశ్లేషణ.

  3. పడవ ప్రయాణం: కథ నచ్చిన కారణం గురించి Sowmya అభిప్రాయం:

    10/18/2013 1:12 pm

    పొరపాటన నాకిలా అనిపించింది అని చెప్పి ఈ కథను గురించి గాని, ఆ సినిమాని గురించి గాని రాస్తే ఏమవుతుందో నాకు అర్థమయింది. ఈ టైపు వ్యంగ్యాలని పట్టించుకోకపోవడమో, ధీటైన జవాబివ్వడమో చేతనయిన రోజున, వీటన్నింటికి కొంచెం సమయం చిక్కితే తప్పకుండా రాస్తానండి.

    ఒక్క ముక్క మాత్రం చెప్పదల్చుకున్నాను, ఇటీవలి కాలంలో జాల గుంపుల్లో ఎవళ్ళో వెర్రి వెంగళప్పలు (అంటే ఇక్కడ నేను) వాళ్ళకి ఫలానా ఏదో నచ్చింది అనడము, టక్కుమని ఓ పది మందొచ్చి… మీ వివేచన మీద నాకు సందేహం అనో, నీకు చదవడం రాదనో…ఇలాంటి వ్యాఖ్యానాలు రాయడమూ చూస్తున్నాను. అసలుకి ఎవళ్ళ అభిప్రాయాలు వాళ్ళు వెలిబుచ్చడానికి కాకపోతే, ఈ వ్యాఖ్యల డబ్బా ఎందుకండి? ప్రపంచాన్ని మార్చివేసే సునిశిత విమర్శలు ఉంటే తప్ప వ్యాఖ్యలు రాయకూడదా మొత్తానికైతే?

    ఇందుకే ఈమాటలో వీలైనన్ని తక్కువ వ్యాఖ్యలు రాస్తాను..ఇంతమంది మేధావులను తట్టుకోలేక. ఒకవైపు నిజాయితీ గా సందేహాలు అడిగితే, వాటికి స్పందనలు సరిగా (వ్యంగ్యంగా ఏదో ఒకటి అనకుండా) ఇవ్వరు. ఒక వైపు ఏదో, నా మానాన నేను ఇంకోళ్ళ జోలికెళ్ళకుండా వ్యాఖ్యలు రాస్తే, ఏం మాట్లాడుతున్నారో నాకర్థం కాని స్థాయిలో జరిగే వ్యాఖ్యానాల్లోకి నన్ను లాగుతారు.

    ఏమైనా, మీ ఇష్టం వచ్చింది అనుకోండి లైలా గారూ నా తెలివితేటల గురించి, నా అభిప్రాయాల విలువ గురించి. మీకు సమాధానాలు చెప్పేంత తెలివిడి నాకు లేదు. ఆపైన మిమ్మల్ని మెప్పించాలన్న/ఒప్పించాలన్న తాపత్రేయం అంతకన్నా లేదు. ఇకపై వ్యాఖ్యలు రాసేందుకు కూడా “నాకు సంబంధంలేని చర్చల్లోకి నన్ను లాగకండి” అని ఒక డిస్ క్లైమర్ పెట్టాలేమో అనిపిస్తోంది.

    ఇక్కడి వరకు వ్యాఖ్యని చదివినందుకు, దీన్ని మాడరేట్ చేయకుండా అంగీకరిస్తే సంపాదకవర్గానికి – ధన్యవాదాలు.

  4. ప్రేమ ఎంత మధురం! గురించి తిలక్ బాబు అభిప్రాయం:

    10/18/2013 10:30 am

    సార్… y2k ప్రాబ్లం అంటే ఏంటి?

  5. అదే నేను గురించి mallikarjuna sarma అభిప్రాయం:

    10/18/2013 3:51 am

    రాధ గార్కి,
    ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు. మీ బుజ్జి కవితలో ఆ రమణుని పసి కళ్ల చూపులు స్పష్టంగానే హృదయాన్ని తాకుతున్నాయి. అందుకే ఓ సారి స్మరించుకుని, ఆ అవకాశాన్ని కల్పించిన మీకు ధన్యవాదాలు చెప్పుకున్నాను. ఇంకా ఇలాంటి ఎన్నో రచనలు మీరు చేయాలని, చేయగలరని నమ్ముతూ…
    నమస్తే,
    మల్లికార్జున శర్మ.

  6. పడవ ప్రయాణం: కథ నచ్చిన కారణం గురించి lyla yerneni అభిప్రాయం:

    10/17/2013 9:04 pm

    Sowmya అభిప్రాయం:

    “దానికర్థం – “ఆ, సరే రంగి..కథంతా చెప్పావు కదా, ఇంక పో. దమ్మిడీ ఇవ్వను” అని రచయిత చెప్పినట్లు రాసుంటే నాకు నచ్చేదని కాదు.”

    నా లైబ్రరీలో పాలగుమ్మి పద్మరాజు కధా సంకలనం ఉంది. పాలగుమ్మి పద్మరాజు, తెలుగు కథకు అంతర్జాతీయ స్థాయిని సాధించిన రచయితగా ఈ పుస్తకం అట్ట మీద ఉంది. లోన వీరి సమగ్ర సాహితిని గూర్చి కొంచెం, వీరి రచనల మీద, డాక్టరేట్ కోసం, పరిశోధనలు జరుపుతున్న విద్యార్ధులు ఉన్నట్టు మార్చి 1985లో అచ్చేసిన ఈ పుస్తకంలో ఉంది. పుస్తకం పేరు ఈ చర్చించబడుతున్న కధ పేరే. “పడవ ప్రయాణం”.

    ఇంతకీ ఆ పడవ ప్రయాణం లో జరిగిందేమిటి? నాకు నా ఇప్పటి తెలివితేటల వల్ల అర్థమయింది ఏమిటి?

    ఆ పడవ ప్రయాణం రాత్రిలో ఒక చిన్న స్కేలు దొంగతనం జరిగింది. పద్దాలు, రంగి ఇద్దరు దొంగలు. పద్దాలు is the muscle. రంగి is the accomplice, the decoy, the diversion. Both are con artists. ఇద్దరూ తాగుతారు. లేకుంటే, అవసరానికి, తాగకపోయినా తాగినట్టుగా నటిస్తారు. అబద్థాలు చెపుతారు. రంగి ఎప్పటి కప్పుడు కట్టు కథలు అల్లుతూనే ఉంది. పధకం ప్రకారం, సరంగుతో కబుర్లాడింది. చుక్కాని పట్టింది. అందరిని నిద్ర పుచ్చింది. అంత హస్కీ గొంతుతో, అంత సెక్సీ పాట పాడితే కొందరికి నిద్ర ఎగిరి పోతుంది. బెల్లం, చింతపండు యవ్వారాల వాళ్లు, తెడ్డులు వేసి, తాళ్లు లాగిన జీవులు కాబట్టి, వాళ్ళు జోగారు. ఆ పడవ లోనే ప్రయాణం చేస్తున్న మన కథకుడు కూడా నిద్ర పోయాడు. లేచాక, కథకుడు, పడవ టాపెక్కి, రంగిని, ఇంటర్వూ చేస్తాడు. ఈ పడవ ప్రయాణీకుడు, ఈ మగవాడు – పద్దాలు బోట్ మీద ఉన్నప్పుడు, పద్దాలుని గాని, రంగిని కాని, ఒక్క ప్రశ్న అడగడు. అడగటానికి అతనికి దమ్ముల్లేవు. ఎందుకంటే, పద్దాలు మక్కెలు ఇరగదంతాడు.

    పడవలో జరిగింది దొంగతనమైతే, ఇతడి curiosity, interrogation, అంతా రంగికి పద్దాలుకి, పెళ్ళయిందో లేదో, పద్దాలు abusive, adulterous relationship ఆమ ఎందుకు భరిస్తోందో, ఈ విషయాల మీద. కథకుడికి, ఆ చీకట్లో ఆమె రవిక ఎత్తి చూపిస్తుందీ, ఆ చీకట్లో ఆమె వీపు మీద అతనికి తెల్లని మచ్చ కనిపిస్తుందీ! అతనికేం తెలుసనీ, అవి burns scars, అవునో కాదో. ఒక వేళ ఆమెకు బొల్లి ఉందో, చల్ది (Herpes zoster) వచ్చిందో? అసలు ఎప్పటి కప్పుడు రంగి అబద్ధాలు కల్పిస్తూనే ఉంది. పద్దాలు తనను విహారయాత్ర తీసుకెళ్ళటం అంతా ఉత్తదని చెప్ప లేదూ? తను, సవితి, వారి మధ్య ఈసులు, పద్దాలు తనను తన్నటాలు, గుడిసెకి నిప్పెట్టటాలు – ఇవన్నీ కూడా అంతకు ముందు పడవ సరంగుకు, (ఇప్పుడు మళ్ళీ, కథకుడికి,) రంగి కల్పించి చెప్పినవి అయ్యుండొచ్చు. ఆమె చెప్పే వాటిలో ఏది నిజమో, ఏది అబధ్ధమో.

    రంగికి కావాల్సింది, తోడుదొంగలు వేసుకున్న ప్లాన్ ప్రకారం, ఆ దొంగసొమ్ము పద్దాలు అనుకున్న చోటికి జేరేసే దాకా, ఆ పడవ లోనే ఉండిపోయి, ఏదో సోది వినిపించటం. మరి మన బ్రిలియంట్ కథకుడు గారు, ఆమెకో చుట్ట ఇచ్చి, తనో చుట్ట వెలిగించి, వింటూ, రంగి అందరికీ అబద్దాలు చెప్పి, తనకు మాత్రం, అంతా నిజమే చెపుతుందని అనుకోటం? అంతటితో అయ్యిందా! ఆ దొంగ, అబద్ధాల కోరు రంగి ఇచ్చిన సమాచారాన్ని ఎడాపెడా ఎనలైజ్ చేసి, అతనికి తోచిన conclusions draw చేసి, మన అందరికీ సరఫరా చెయ్యటం. ఏమి విపరీతం! All of a sudden అతనికి, రంగి అంటే భయం, భక్తి, జాలి కలుగుతాయి. ఎందుకంటేనంట ఒక చెడ్డ మగవాడిని, ఆబిడ గారు -ఆ సుగుణాల రాశి, unconditionally ప్రేమించిందంట. (కధ చదువుతూ, “I Love You, just the way you are”, “Stand by your Man” అని పాటలు పాడుతున్నా నే నిక్కడ.)

    1940ల్లోని ఈ కధని కొందరు బుద్ధిమంతులు ఎలా చదివినారో తెలిసింది. పాఠకులకు కూడా రంగి నచ్చటం, పైగా కొంతమందికి -బతుకంటే అదే, ప్రేమంటే అదే, మా లైఫ్ స్టైల్ కూడా అలాగే ఉంటే బావుండును అని అనుకోటం, ఇదంతా నాకు వింత గా ఉంది. దొంగతనాలు చేస్తూ, తన్నులు తింటూ, పారిపోతూ, – పద్దాలు, రంగి – లాగా బతకటం, తమ సొంత బతుకుల కన్నా సుఖంగా అనిపించటం, నమ్మే మాటేనా?

    రంగి గురించి, అంత fuddled, fuddy duddy ఆలోచన చేశాక, ఆ మాయదారి మహత్తర దేవత హుండీలో ఓ రూపాయ వెయ్యటం పడవ లోని కథకుడికి ఎంత పని. అప్పటిదాకా లేని, కొత్తగా వచ్చి పడే అసంబద్ధత ఏముంది?

    సర్లెండి, ఆ తెలుగు సినిమా రచయిత, ఈ రంగి హృదయాన్ని, ఎలా గొప్పగా ఆవిష్కరించాడో, ఆ విషయం సౌమ్య ఈ పత్రికలో గానీ రాస్తే, తప్పక చదువుతాను. (ఆమెకు రాయాలని ఉంటేనే.)

    లైలా

  7. అతడు నేను గురించి Siva అభిప్రాయం:

    10/16/2013 10:36 am

    అడవి భౌతికమే కాదు మానసికం కూడా. ఆలొచనే అడవి ఐనప్పుడు మహానగరంలొ ఉన్నా 21వ శతాబ్ధంలొ ఉన్న తేడా వుండదు.

  8. ఈమాట గురించి గురించి pasupuleti ramakrishna అభిప్రాయం:

    10/16/2013 7:25 am

    మీమూలంగా తెలుగు సాహిత్యానికి మంచి గుర్తింపు వస్తుంది… కొత్త తరానికి స్పూర్థిప్రదాతలు.

    రామక్రిష్ణ

  9. భోగి తలంట్లు గురించి Suresh అభిప్రాయం:

    10/16/2013 2:31 am

    నాకు చదువుతున్నంతసేపు చనిపోయిన మా నాన్నగారు గుర్తొచ్చారు. ముఖ్యంగా ఈ వాక్యములు చదువుతున్నపుడు..

    “ఆయన తలంటి కోసం అమ్మ అప్పటికే అన్నీ సిధ్ధం చేసేసేది. ఆయన కూర్చోడానికో పెద్ద కుర్చీ పీట.కాళ్ళు జాపుకోడానికి వీలుగా కాళ్ళ కిందొక పీట. సట్లు పడ్డ వెండి గిన్నెలో ఘమఘమల నువ్వుల నూనె, ఒక వెడల్పాటి గిన్నెలో సున్ని పిండి, సోప్ బాక్స్, పైన వాసం మీద వుతికిన టవల్. ఆయన చేతికి అందేలా పాళాలు చేసిన వేడి నీళ్ళ పెద్ద బకెట్ – ఇదీ అక్కడి సరంజామా. ఆయనకి కుంకుడి పిప్పి అంటే చాలా చికాకు. అందుకని, అమ్మ ఉపాయంగా చిక్కటి రసం తీసి చిన్న కూజా బిందెలో పోసి వుంచేది. ఆయన కూర్చోగానే ఆయన తల మీద నూనె అద్దేది. ఆ తర్వాత ఎకరమంత వీపు పని ఆవిడ చూసుకునేది. ఈయన తీరిగ్గా వొంటికి నూనె రాసుకుంటూ ముందుకు వొంగి పాదాలు రుద్దుకుంటూండే వారు. భర్తని అలా ఆవిడ మహారాజులా చూసుకొనేది మరి.”

    వెంటనే అమ్మని పిలిచి ఈ వ్యాసాన్ని చదివించాను. ఆమె కొద్ది సేపు మౌనంగా ఉండిపొయారు, బహుశా నాన్న జ్ఞాపకం కదిలించి ఉంటుంది. ఆ తరువాత ఎవరు రాసారు లాంటి ప్రశ్నలు వేసారు. ఈ వ్యాసం నన్ను, మా అమ్మగారిని ఎంతగా కదిలించిందో మాటలలొ చెప్పలేను. మీకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే.

  10. తిక్కన సోమయాజి భారత యుద్ధ కథ – మూడవ భాగం గురించి జొన్నలగడ్డ ప్రభాకర్ అభిప్రాయం:

    10/15/2013 5:27 pm

    అభిమన్యుడి యుద్ధం ఒళ్లు పులకరింపచేసింది. తేలిక భాషలో అందరికీ అర్థమయ్యేట్లు చాలా చక్కగా రాసారు రామారావు గారు. కథ తెలిసింది, ఎన్నో సార్లు విన్నదే ఐనా ముందు ముందు ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ. అద్భుతంగా వుంది.