పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. ఇంటి మొగుడు గురించి cbs venkataramana అభిప్రాయం:

    10/25/2013 9:16 am

    కథ చాలా బాగుంది. అద్భుతంగా వుంది. చదువుకునేందుకు హాయిగా వుంది.

    CBS Venkataramana

  2. దానవోద్రేక స్తంభకుడు గురించి satyasai kovvali అభిప్రాయం:

    10/25/2013 9:13 am

    ద్వారపాలకుడిని చూసిన ప్రహస్తుడి పరిస్థితే మీ కథ చదివిన తర్వాత మా పరిస్థితి.

    satyasai

  3. ఇంటి మొగుడు గురించి cbs venkataramana అభిప్రాయం:

    10/25/2013 3:57 am

    అద్భుతంగా ఉంది. హాయిగా కూడా వుంది.

  4. శ్రీ సూర్యనారాయణా… గురించి mallikarjuna sarma అభిప్రాయం:

    10/25/2013 2:23 am

    విష్ణుభొట్ల లక్ష్మన్న గార్కి,
    శత సహస్ర ధన్యవాదాలు.
    విధేయుడు,
    దేవరకొండ మల్లికార్జున శర్మ.

  5. దానవోద్రేక స్తంభకుడు గురించి Vamsi Mohan Maganti అభిప్రాయం:

    10/25/2013 12:49 am

    బ్రహ్మాండంగా రాశారు శర్మగారు….కామేశ్వర రావు గారు కూడా అలా ఓ సారి కనపడ్డారు చదివాక…. 🙂

  6. శ్రీ సూర్యనారాయణా… గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:

    10/24/2013 12:33 pm

    శర్మ గారు:

    ఇది కొంచెం ఆశ్చర్యంగానే ఉంది నాకు!

    మీరు ఉదాహరించిన “హనుమాన్ చాలీసా” లో చెప్పబడ్డ “యుగ సహస్ర యోజన” అంటే వివరణ ఇలా చెప్పొచ్చు!

    1 యుగము = 12000 సంవత్సరాలు
    1 సహస్ర = 1000
    1 యోజనము = 8 మైళ్ళు

    యుగము X సహస్ర X యోజనము = 12000 X 1000 X 8 = 96000000 మైళ్ళు (96 మిలియన్ మైళ్ళు)

    1 మైలు = 1.6 కిలోమీటర్లు

    96000000 మైళ్ళు = 96000000 X 1.6 కి. మీ = 153600000 కి. మీ (15.36 కోట్ల కి. మీ)

    భూమికి, సూర్యునికి మధ్య ఉన్న దూరాన్ని 93 మిలియన్ మైళ్ళు గా నేను ఇచ్చాను! ఇదే విషయం ఈ క్రింది NASA వెబ్ సైటులో కూడా ఉంది.

    http://solarsystem.nasa.gov/planets/profile.cfm?Display=FactsObject=Sun

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  7. శ్రీ సూర్యనారాయణా… గురించి mallikarjuna sarma అభిప్రాయం:

    10/24/2013 3:12 am

    అయ్యల్లారా, అమ్మల్లారా,

    ఇదే సందర్భం లో తులసీదాసుగారి ‘యుగ సహస్ర యోజన…'(హనుమాన్ చాలీసా) అన్న లెక్కా, ఈ 15 కోట్ల కి.మీ లెక్కా సరిపోతున్నాయనీ, NASA వారి లెక్కలతో కూడా విభేదం లేదనీ విన్నాను. విజ్నులు దయతో వివరిస్తే ఋణపడివుంటాను.
    విధేయుడు,
    మల్లికార్జున శర్మ.

  8. దానవోద్రేక స్తంభకుడు గురించి mallikarjuna sarma అభిప్రాయం:

    10/24/2013 2:59 am

    ఆర్. శర్మ దంతుర్తి గార్కి,
    ఈ రచనని మీ స్వీయ రచన అని వివరించకుండా అలా పబ్లిక్ లో వదిలేస్తే దీన్ని పూర్తిగా పోతనామాత్యులవారే 21వ శతాబ్దం లో మళ్లీ జన్మించి రచించారని భావితరాలవారు భావించే అందమైన ప్రమాదం వుంది. గమనించగలరు. ఇకపోతే రచన గురించి ఏమి రాయాలన్నా నీళ్లు కళ్లకు అడ్డుపడుతున్నాయి. ప్రవచనకర్తలకు ఈ నీళ్ల సమస్య వుండదు కాబట్టి వారు యధేచ్ఛగా వాడుకున్నాఎక్కడిదని చెప్పినా మీరేంచేయలేరోచ్!

    నమస్తే,
    విధేయుడు,
    మల్లికార్జున శర్మ.

  9. అదే నేను గురించి mallikarjuna sarma అభిప్రాయం:

    10/24/2013 2:16 am

    రాధ గార్కి,
    ధన్యవాదాలు.
    శర్మ.

  10. అదే నేను గురించి Radha అభిప్రాయం:

    10/22/2013 10:17 pm

    శర్మ గారూ,
    ఈ కామెంట్స్ లో ఎరుపు రంగులో కనపడుతున్న దేవి గారి పేరు మీద క్లిక్ చేస్తే ఆమె బ్లాగ్ మీరు చూడొచ్చు.