పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. అల్లరి పిచుకలు గురించి రవి వీరెల్లి అభిప్రాయం:

    11/01/2013 2:00 pm

    వావ్! బాగుంది.

    “రోజూ బియ్యానికి
    అలవాటు పడ్డ
    పిచుకలు
    ఆలోచనలను
    చెల్లా చెదురు చేసి”

    నచ్చింది.

  2. ఒక్కో రోజు గురించి రవి వీరెల్లి అభిప్రాయం:

    11/01/2013 1:26 pm

    మానసా,

    కవిత చాలా బాగుంది. అభినందనలు!

    రవి

  3. నన్నెచోడుని కుమారసంభవంలో ‘లలితాస్యాంబురుహంబు’ పద్యవివాదం: స్థితిస్థాపన గురించి NS Murty అభిప్రాయం:

    11/01/2013 12:19 pm

    మురళీధరరావు గారూ,
    ఇటువంటి రసవత్తరమూ, పరీశోధనాత్మకమైన వ్యాసాలపై చెప్పడానికి ఏమీ ఉండదు. మీకు శిరసు వంచి అభివాదము చెయ్యడం తప్ప. పద్యాలూ, మీ వివరణా చదువుతుంటే చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నరోజులు గుర్తొస్తున్నాయి.

    అభివాదములతో

  4. ఒక్కో రోజు గురించి వైబోయిన సత్యనారాయణ అభిప్రాయం:

    11/01/2013 12:14 pm

    జీవన పయనాన్ని లయగా నడిపించే
    నిర్వికల్ప సంగీతమేదో ఆగిపోయినట్లై – అనడంలో తాత్వికతని,
    ఏదో రహస్యం అర్థమయ్యీ కానట్టు – అనడంలో మార్మికతని
    ప్రదర్శించిన మీ కవిత చాలా బాగుంది

  5. విశ్వనాథ: వివాహాశీస్సులు గురించి గంటి లక్ష్మీనరసింహమూర్తి(బెంగుళూరు) అభిప్రాయం:

    11/01/2013 11:19 am

    శ్రీ మురళీధర రావుగారు మీరు అత్యంత శ్రద్ధాభక్తులతో పదిలపరచిన విశ్వకవినాధుని తెలుగు పద్యాక్షతలు ఈ-మాట పాఠకులను మూర్థాభిషిక్తులను జేసాయి.అచ్చులో పద్యాలు తెలుగు దేవుడు శ్రీ సత్యనారాయణస్వామి వారి ప్రసాదంలాగ రుచులూరుతున్నాయి.మొదటి పద్యంలో అద్వైతం.రెండవదానిలో జీవాత్మ పరమాత్మలు. మూడవదానిలో జీవునివేదన తాను పరమాత్మని చేరలేనప్పుడు అతడే యొకమెట్టుదిగి నీవోసగం నేనోసగం అనే దేవుడు వివాహబంధంలో నీవోసగం నేనోసగం అని ఒకటైన జంటని రక్ష చేస్తాననడం ఒక్క విశ్వకవినాధునికే చెల్లింది-గంటి

  6. విశ్వనాథ: వివాహాశీస్సులు గురించి NS Murty అభిప్రాయం:

    11/01/2013 10:47 am

    మురళీధరరావుగారూ,
    మీరు ఇంత అపురూపంగా దాచుకున్న పద్యాలను పదిమందికీ అందజెయ్యడం ఎంతైనా సంతోషకరమైన విషయం. మీకు విశ్వనాథ వారి అభిమానిగా వేల వేల కృతజ్ఞతలు.

  7. అల్లరి పిచుకలు గురించి వాహెద్ అభిప్రాయం:

    11/01/2013 10:26 am

    అద్భుతంగా ఉంది.. కొత్త ప్రయోగాలు..కొత్త ఇమేజరీ..చక్కని కవిత.

  8. నాకు నచ్చిన పద్యం: నిగమశర్మ అక్క పలకరింపు గురించి S S N SASTRY అభిప్రాయం:

    10/31/2013 6:21 am

    నిగమశర్మ అక్క చెప్పగానే అతని భార్య చల్లని నీటితో భర్త పాదాలు కడుగుతుంది. ” ఆ పైదలి ప్రాణేశ్వరు …. కొంత కొంత తప్తము కాగన్” ఈ పద్యంలో భార్య ఎదుర్కొంటున్న విరహ తాపాన్ని కవి చక్కగా వివిరించాడు. చాలా మంది దీనికి ప్రాధాన్యత ఇవ్వరు.

    శంకరమంచి సత్యనారాయణ శాస్త్రి (ఎస్ ఎస్ ఎన్ శాస్త్రి) బెంగళూరు

  9. దానవోద్రేక స్తంభకుడు గురించి mallikarjuna sarma అభిప్రాయం:

    10/31/2013 5:34 am

    శర్మ దంతుర్తి గార్కి,
    చిన్న మనవి. అన్నీ మన పురాణేతిహాసాల్లోనే వున్నాయి కనుక ఇలాంటి రచనల్ని అనుసృజనలనవచ్చేమో! నాకు స్పష్టంగా తెలియదు. అయినా ‘లవకుశ’ను చూసి పుల్లయ్యగార్నే అభినందిస్తాంగాని వాల్మీకిని కాదు. ఇది కూడా అలానే అనుకోమని మీ వినయానికి నచ్చజెప్పండి.
    నమస్తే,
    మల్లికార్జున శర్మ దేవరకొండ.

  10. పల్లెటూర్ to పట్నం: The Seven Seater గురించి Indrani Palaparthy అభిప్రాయం:

    10/30/2013 9:34 pm

    ధన్యవాదాలు శర్మ గారు, ఉమ గారు.

    “చల్లటి చల్లలో చిటికెడు ఉప్పు ఓ కరేపాకు రెబ్బ” భలే రాశారు ఉమ గారు 🙂

    ఇంద్రాణి.