పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. రచయితలకు సూచనలు గురించి S A Rahman, Chittoor. అభిప్రాయం:

    11/12/2013 11:16 pm

    సంపాదకులు గారికి,

    “ఈ మాట” ఈ రొజే చూచాను. చాల చాల బాగుంది.

    No words to appreciate the Organisers.

  2. ఆచార్య సుబ్బరామయ్య మీనాక్షిసుందరం గురించి santha Murti అభిప్రాయం:

    11/12/2013 9:31 pm

    గళమురళీ శివ ప్రసాద్, చంద్రశేఖర్ గారికి స్వంత అన్నయ్య కొడుకు. మాది కూడా బాపట్ల. గత యాభై సంవత్సరాలకి పైగా వారి కుటుంబంతో మా స్నేహసంబంధాలు ఈనాటికి మూడు పువ్వులు, ఆరు కాయల రీతిగా కొనసాగుతున్నాయని చెప్పడానికి చాల సంతోషంగ ఉంది.
    శాంతమూర్తి .

  3. ద్వితీయ కళత్రం గురించి పాలూరి వేంకట రామారావు అభిప్రాయం:

    11/12/2013 7:51 pm

    చిన్నకథైనా విషయం బాగానే చెప్పారు.. కాకపోతే విషయానికి, నేపథ్యం అంతగా కుదరలేదనిపించి, కాస్త కృత్రిమత్వంతో కూడిన సిద్ధాంత ప్రాచుర్య ధోరణి పొడచూపింది.

  4. భారతీయ పుస్తక చరిత్ర: 2. రాత పుట్టుక, పరిణామం – భారతీయ లిపులు గురించి పాలూరి వేంకట రామారావు అభిప్రాయం:

    11/12/2013 7:29 pm

    చాల సమగ్రమైన చర్చ.. అనేక సందేహాలను నివృత్తి చేస్తూ భాషా వికాసానికి లిపి అనే మూలస్తంభం అనివార్యం కాదనే సునిశితమైన కోణాన్ని బహు చక్కని శైలిలో ప్రస్తావించినందుకు ధన్యవాదాలు, అభినందనలు.

  5. భారతీయ పుస్తక చరిత్ర: 2. రాత పుట్టుక, పరిణామం – భారతీయ లిపులు గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:

    11/12/2013 5:45 pm

    లలిత-విస్తరమే, విస్తారం కాదు. అచ్చుతప్పు దొర్లినందుకు క్షమాపణలు. కొందరు పదాలని విడదీసి “లలిత విస్తర” మని, మరికొందరు “లలితవిస్తర”మని ఒకే పదంగాను రాస్తున్నారు. భవదీయుడు, శ్రీనివాస్

  6. ఆచార్య సుబ్బరామయ్య మీనాక్షిసుందరం గురించి Santha Murti అభిప్రాయం:

    11/12/2013 4:17 pm

    మీనాక్షి సుందరం గారి మీద మీరు రాసిన వ్యాసం నాకు చాలా పరిచయమైనదిగా అనిపించింది. కారణం, మావారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో, ఆ సమయంలోనే, అయిదు సంవత్సరాలు చదువుకుని, మూడు సంవత్సరాలు లెక్చరరుగా పనిచేసిన కారణాన, అప్పటి కబుర్లు అన్నీని ఎప్పుడూ చెప్తూ ఉండడవే.

    శాంతామూర్తి.

  7. కళాపూర్ణోదయం -8: మణిహారం గురించి K.V.S. Ramarao అభిప్రాయం:

    11/12/2013 11:03 am

    ఎన్నెల గారు: మీ అనుమానం సహేతుకమే. మీరు సరిగానే అర్థం చేసుకున్నారు. ఐతే, కవులు భౌగోళిక, చారిత్రక శాస్త్రవేత్తలు కావాలని లేదు కదా? ఒకవిధంగా చూస్తే, కళాపూర్ణోదయం ప్రతిపాదించే విషయమే “భౌతిక ప్రపంచం వశ్యవాక్కు ఐన కవి సృష్టించిన కావ్యప్రపంచాన్ని ప్రతిబింబిస్తుంది” అని కనుక తన కావ్యప్రపంచానికి భౌతికప్రపంచపు నియమాలు వర్తించవని కవి భావించినట్టు కూడ అనుకోవచ్చు. అంతేకాకుండా “కలౌ వేంకటనాయకః” అన్న భావన పింగళి వారి కాలానికింకా పూర్తిగా దృఢపడలేదేమో ! అంతెందుకు, మహాభారత యుద్ధం లో పాండ్యరాజు పాండవుల పక్షాన, ఆంధ్రులు కౌరవుల పక్షాన యుద్ధం చేసినట్టు భారతం చెప్తున్నది. అంటే పాండ్యులు, ఆంధ్రులు కూడ కృష్ణుడి కాలం నాటి వాళ్లనేనా? (తిక్కన గారి యుద్ధపర్వాలకి తేలిక తెలుగు అనువాదాన్ని ఇక్కడ చదవొచ్చు. ఇలాటి విషయాల “చారిత్రక సత్యాల్ని” నిగ్గుదేల్చబోవటం సంక్లిష్టమైన విషయమని మీకు తెలియంది కాదు. వెల్చేరు నారాయణరావు గారు “తెలుగు రామాయణాలు” అన్న వ్యాసం లోను (ఇది ఈమాటలో దొరుకుతుంది), Textures of Time అన్న గ్రంథం లోనూ ఈ సమస్యను సుదీర్ఘంగా విశ్లేషించి అనేక మౌలిక ప్రతిపాదనలు చేశారు. కుతూహలం వుంటే, వీలైతే వాటిని చూడండి.

  8. రాజులలో సుల్తాను: విజయనగర రాజాస్థాన వస్త్రధారణపై ఇస్లామీయకరణ ప్రభావం గురించి k ramachandra reddy అభిప్రాయం:

    11/12/2013 6:23 am

    వస్త్ర ముఖ్యస్త్వలంకారః
    ప్రియ ముఖ్యంతు భోజనం
    గుణో ముఖ్యంతు నారీణాం
    విద్యా ముఖ్యంతు పూరుషః- అని ఒక ప్రాచీన నీతి శ్లోకం

  9. భారతీయ పుస్తక చరిత్ర: 2. రాత పుట్టుక, పరిణామం – భారతీయ లిపులు గురించి koutilya అభిప్రాయం:

    11/11/2013 2:14 pm

    లలిత విస్తారమా, లలితవిస్తరమా?

  10. అదే నేను గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:

    11/11/2013 12:45 pm

    రాధ గారు
    “దొంగలా నవ్వుతూ” అనడం “దొంగ” దర్శనం అయినతరువాతనే సాధ్యం!
    దర్శనం అయితేనే అసలు దొంగ ఉన్నాడో లేడో ఆపై నవ్వుతున్నాడో కాదో తెలుస్తుంది. దర్శనం కాకుండా చెప్పడం “దొంగ” సాక్ష్యం అవుతుంది కదా! ఇది చదివిన తరువాత దొరకని దొంగ గురించి దొరికిన ఊహ రాయాలి అనిపించింది.

    దొంగ కోసం దేవులాడుతున్న నేను
    నిలుచున్న నేల నాది అనుకుంటే
    కాదు కాదు భూమి ఇచ్చిందే అనిపించింది
    తాగే నీరు నాది అనుకుంటే
    కాదు కాదు నదులిచ్చిందే అనిపించింది
    పీల్చే ఊపిరి నాది అనుకుంటే
    కాదు కాదు గాలిచ్చిందే అనిపించింది
    కనీసం దేహం నాది అనుకుంటే
    కాదు కాదు తల్లిదండ్రులిచ్చిందే అనిపించింది
    ఏది పట్టుకొని నాది అనుకుంటే
    కాదు కాదు పంచభూతాలు ప్రకృతిదే అనిపించింది
    కనీసం ఆలోచనైనా నాది అనుకుంటే
    కాదు కాదు ఆలోచించే శక్తిదే అనిపించింది
    నాది కానిదంతా నాదే అనుకున్నందుకు
    నేనే అసలు దొంగని తేలిపోయింది.
    ============
    విధేయుడు
    _శ్రీనివాస్