ఒక్క సారిగా మనసు మూడున్నర దశాబ్దాల వెన్నక్కి ఎగిరి వెళ్లింది.. అలనాటి దీపావళి ప్రత్యేక సంచిక అయినటువంటి, బొద్దుగా ఉండే ‘యువ’ పత్రిక చదువుతున్న అనుభూతి కలిగింది. మాటల్లో వర్ణించ లేనటువంటి ఆనందం, చిన్ననాటి ఆప్తమిత్రురాలిని తిరిగి కలసినటువంటి అనుభూతి.
ఎప్పుడో చదివిన కధ “ఎర్ర గులాబీ అత్తరు” వీలయితే ప్రచురించగలరు.
కృతజ్ఞతలు, శుభ
“కులం అనేది మన జీవితాల్ని ఇంకా శాసిస్తూనే ఉంది. కులం అనేది భారతీయుల మైండ్లలో పాతుకు పోయింది” అనేమాట చదువుతుంటే గుండెల్ని పిండినట్లుగా ఉంది. ఎవరు ఎంత దూరంపోయినా మూలాల్లో ఉన్న సంకుచిత భావాలు మాత్రం వీడిపోవు అనటానికి ఈ కథ అద్దం పడుతోంది. విలువలు అనే పదానికి సరైన నిర్వచనం మనం ఆలోచన కంటే ఆచరణలోనే కనిపిస్తుంది కదా? అది చేసాం ఇది చేసాం అని గొప్పలు చెప్పేవారికంటే ఆచరించి చూపటంలోనే అసలైన విలువలున్నాయని స్కాట్ పాత్ర నిరూపించింది. అసాధారణ మేధావులు, వనరులు వున్నా ఇప్పటి వరకూ అభివృద్ధి చెందుతూన్న దేశంగానే ఉండటానికి కులం కూడా దాని పాత్రను సమర్థవంతంగా కాపాడుతోంది అనిపిస్తోంది. ఈ కథ నేటి పరిస్థితులకు అద్దం పట్టినట్లుగా ఉంది. రచనాశైలి చాలా బావుంది. మనసుకు హత్తుకునే పదాలు బావున్నాయి. మీ నుండి మరిన్ని సామాజిక కథాంశాలు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ……
శ్రీ శ్రీరామం గారూ: ఒక ఆత్మీయుని తొ మాట్లాడుతున్నట్టు గా చెప్పిన మీ అభిప్రాయానికి ధన్యవాదాలు. డా రాజు ఈమెయిల్ ఐ.డి.కనుక్కుని నా ఈ మెయిల్(vasudevary@gmail.com)ద్వారా మీకు తెలిపే ప్రయత్నం చేస్తాను.
నమస్కారాల తో
వాసుదేవ రావు.
కథ రచయిత రచనా శైలి బావుంది. భారత్ లో ఇటువంటి సమస్యలకు ఏమాత్రం కొదువ లేదు. సమాజాన్ని గమనిస్తే ఇటువంటి సమస్యలూ కాదూ చాలా రకాలుగా ఎదురవుతూనే ఉంటాయి. ఎదురైన ప్రతి సమస్యనూ ప్రతివాళ్ళూ పరిష్కరించలేకపోవచ్చు. కాకపోతే మానవతా ధర్మం ఏదో ఒకటి చేయాలని తపన పడేవారుంటారు. కానీ వారి జీవన విధానం అందుకు సహకరించకపోవచ్చు. మీవంటి రచయితలు, ఈ కథ రాసి పత్రికా సంపాదకులు ఇటువంటి సమస్యలకు ఏ ఏ సంస్థలను సంప్రదిస్తే ఈ సమస్యలకు కొంతవరకైనా పరిష్కారం దొరక్కపోదనేది నా అభిప్రాయం. సామాజిక దృక్పథంతో పాఠకులకు ఈ కథను అందించిన రచయిత చిన్నమయ్యగారికి ధన్యవాదాలు.
కామెంట్ రాసిన అందరికీ ధన్యవాదములు. ఈ కధలో నేను చెప్పదల్చుకున్నది జ్యోతిష్యం కాదు. తెలుగు భాష అంటే ఎలా పనికిరానిదానికింద చూస్తున్నారో, ప్రతీ పిల్లా పిల్లవాడూ ఇంజినీరింగ్, ఐ ఐ టి అంటూ ఒకటో తరగతి నుంచీ ఎందుకంత అర్రులు చాస్తున్నారో ఈ పిచ్చి మన తెలుగుదేశంలో నే ఎందుకలా ప్రబలుతోందో చెప్దామనుకున్నాను. అదీగాక నేను చూసినంతలో (నేను చూసింది, నాకు తెల్సిందీ పరమాణువులో శతసహస్రాంశం అని చెప్పక్కర్లేదు కదా?) ఈ రోజుల్లో నక్షత్రాల పేర్లు తెలియనివారూ, ముహుర్తం చూడ్డం రానివాళ్ళూ, ఆఖరికి ఇంజినీరింగ్ చదివి “ప్రొఫెషనల్” గా జ్యోతిష్యం చెప్పేవాళ్ళూ కో అంటే కోటి మంది తయారయ్యేరు. జ్యోతిషం నిజమౌతుందా లేదా అనే మాట పక్కనబెట్టి వీళ్ళని చూస్తూంటే తెలిసేది ఏమిటంటే, ఇదొక పూర్తి స్థాయి (ఫుల్ టైం) ప్రొఫెషన్ అయిపోయింది. కంప్యూటర్ మీద పనిచేసేవాళ్ళకి లక్షలమీద జీతాలు ఇస్తుంటే మాకెందుగ్గాదు అని వీళ్ళు కూడా ముందుకొస్తున్నారు. అది అలా ఉంచితే మొత్తమ్మీద నేను చెప్పాలనుకున్న పాయింట్లు సరిగ్గా చెప్పలేకపోయానని తెలిసి వచ్చింది ఇప్పుడు. మరో సారి అందరికీ ధన్యవాదములు.
చాలా చక్కటి వివరణాత్మకమైన వ్యాసాన్ని అందించినందుకు కృతజ్ఞతలు.
మొదటిసారి చదివినప్పటి కంటే, యుద్ధమల్లుని మీద ప్లస్‌లో సాగిన చర్చ ద్వారా మళ్ళీ వచ్చి చదివినప్పుడు, ఆ భాగానికి సంబంధించిన వ్యాసం మరింత తేలిగ్గా అర్థమైన భావన కలిగింది.
వీలైతే ఇటువంటి విశేషాలను లేదా ఇంత సమాచారాన్ని మీరు క్రోడీకరించే క్రమంలో మీరు తెలుసుకున్న లిపి వెనుక శాసనాలకు లేదా ఆయా రాజులకు సంబంధించిన కథలను కూడా పొందుపరచగల్గితే, సాథారణ పాఠకులకు వ్యాసం మరింత ఆసక్తికరంగా తోస్తుందేమోనన్న ఆలోచన కలిగింది.
చక్కని వ్యాసము. ప్రఖ్యాత గణిత శాస్త్ర పరిశోధకులు ఉత్తమ ఉపాధ్యాయులు అయిన ఆచార్య మీనాక్షిసుందరం గారి జీవిత విశేషములు చాల వరకు నాకు తెలియనివి మీ వ్యాసము ద్వారా తెలుసుకొని చాల అనందించాను. మీకు నా ధన్యవాదములు. మీరు తెలుగులో చేసిన సాంకేతిక శాస్త్ర విపులీకరణ చాల చక్కగాఉన్నది. మీకు అభినందనలు.
మీ వ్యాసం నాకు కూడా పాత జ్ఞాపకాలను ఎన్నో గుర్తుకు తెచ్చింది. నేను 1960-63లో M.Sc(Tech) Meteorology and Oceanography చదువుతూ వివేక విన్యాస సధర్మ సాధన హోస్టెల్లో ఉండేవాడిని. నేను బాపట్ల వాస్తవ్యుడ్ని, న్యుక్లియర్ ఫిజిక్స్ ఫేకల్టీ Dr.M L N రాజు, నేను హైస్కూలు, కాలేజి, యూనివర్సిటి చదువులు కలిసి చేసాము. కొమరవోలు శివప్రసాద్ అన్నయ్య నా హైస్కూలు సహధ్యాయి. నేను 1963 తరువాత 2010లో విజిట్ కు విశాఖపట్టణము రావటం జరిగినది, గుర్తుపట్టలేనంత మార్పు కనిపించింది. నేను రాజును కలవటానికి ప్రయత్నించినా కుదరలేదు. మీరు మరోలా భావించకపోతే రాజు ఇ-మెయిల్ తెలిపే సహాయము చేయగలరా? మరొక మారు ఈ వ్యాసము మీరు అందించినందుకు ధన్యవాదములు.
శ్రీరామం
గద్యములో పద్యములు గురించి kusuma kumari j అభిప్రాయం:
11/21/2013 8:16 am
పూజ్యులు శ్రీ కృష్ణ మోహన రావు గారికి
తమవ్యాసం అత్యద్భుతం. వివిధ ఛందోరీతుల వివరణలో తమకు గల కౌశలం అనిర్వచనీయం.
జంధ్యాల కుసుమ కుమారి
ఈమాట గురించి గురించి శుభ అభిప్రాయం:
11/20/2013 11:26 pm
ఒక్క సారిగా మనసు మూడున్నర దశాబ్దాల వెన్నక్కి ఎగిరి వెళ్లింది.. అలనాటి దీపావళి ప్రత్యేక సంచిక అయినటువంటి, బొద్దుగా ఉండే ‘యువ’ పత్రిక చదువుతున్న అనుభూతి కలిగింది. మాటల్లో వర్ణించ లేనటువంటి ఆనందం, చిన్ననాటి ఆప్తమిత్రురాలిని తిరిగి కలసినటువంటి అనుభూతి.
ఎప్పుడో చదివిన కధ “ఎర్ర గులాబీ అత్తరు” వీలయితే ప్రచురించగలరు.
కృతజ్ఞతలు, శుభ
ప్రద్యుమ్నుడి ఉపవాసం గురించి ram అభిప్రాయం:
11/20/2013 2:48 pm
శిరోజ రహితమైన శిరస్సు మీద యాదగిరి గుట్టయో, కోటప్ప కొండయో…సొబగు, సొబగు.
విలువలు గురించి నాగమని అభిప్రాయం:
11/20/2013 1:05 am
“కులం అనేది మన జీవితాల్ని ఇంకా శాసిస్తూనే ఉంది. కులం అనేది భారతీయుల మైండ్లలో పాతుకు పోయింది” అనేమాట చదువుతుంటే గుండెల్ని పిండినట్లుగా ఉంది. ఎవరు ఎంత దూరంపోయినా మూలాల్లో ఉన్న సంకుచిత భావాలు మాత్రం వీడిపోవు అనటానికి ఈ కథ అద్దం పడుతోంది. విలువలు అనే పదానికి సరైన నిర్వచనం మనం ఆలోచన కంటే ఆచరణలోనే కనిపిస్తుంది కదా? అది చేసాం ఇది చేసాం అని గొప్పలు చెప్పేవారికంటే ఆచరించి చూపటంలోనే అసలైన విలువలున్నాయని స్కాట్ పాత్ర నిరూపించింది. అసాధారణ మేధావులు, వనరులు వున్నా ఇప్పటి వరకూ అభివృద్ధి చెందుతూన్న దేశంగానే ఉండటానికి కులం కూడా దాని పాత్రను సమర్థవంతంగా కాపాడుతోంది అనిపిస్తోంది. ఈ కథ నేటి పరిస్థితులకు అద్దం పట్టినట్లుగా ఉంది. రచనాశైలి చాలా బావుంది. మనసుకు హత్తుకునే పదాలు బావున్నాయి. మీ నుండి మరిన్ని సామాజిక కథాంశాలు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ……
ఆచార్య సుబ్బరామయ్య మీనాక్షిసుందరం గురించి వాసుదేవ రావు అభిప్రాయం:
11/20/2013 1:02 am
శ్రీ శ్రీరామం గారూ: ఒక ఆత్మీయుని తొ మాట్లాడుతున్నట్టు గా చెప్పిన మీ అభిప్రాయానికి ధన్యవాదాలు. డా రాజు ఈమెయిల్ ఐ.డి.కనుక్కుని నా ఈ మెయిల్(vasudevary@gmail.com)ద్వారా మీకు తెలిపే ప్రయత్నం చేస్తాను.
నమస్కారాల తో
వాసుదేవ రావు.
తడి గురించి nagamani అభిప్రాయం:
11/20/2013 12:50 am
కథ రచయిత రచనా శైలి బావుంది. భారత్ లో ఇటువంటి సమస్యలకు ఏమాత్రం కొదువ లేదు. సమాజాన్ని గమనిస్తే ఇటువంటి సమస్యలూ కాదూ చాలా రకాలుగా ఎదురవుతూనే ఉంటాయి. ఎదురైన ప్రతి సమస్యనూ ప్రతివాళ్ళూ పరిష్కరించలేకపోవచ్చు. కాకపోతే మానవతా ధర్మం ఏదో ఒకటి చేయాలని తపన పడేవారుంటారు. కానీ వారి జీవన విధానం అందుకు సహకరించకపోవచ్చు. మీవంటి రచయితలు, ఈ కథ రాసి పత్రికా సంపాదకులు ఇటువంటి సమస్యలకు ఏ ఏ సంస్థలను సంప్రదిస్తే ఈ సమస్యలకు కొంతవరకైనా పరిష్కారం దొరక్కపోదనేది నా అభిప్రాయం. సామాజిక దృక్పథంతో పాఠకులకు ఈ కథను అందించిన రచయిత చిన్నమయ్యగారికి ధన్యవాదాలు.
ద్వితీయ కళత్రం గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:
11/19/2013 1:26 pm
కామెంట్ రాసిన అందరికీ ధన్యవాదములు. ఈ కధలో నేను చెప్పదల్చుకున్నది జ్యోతిష్యం కాదు. తెలుగు భాష అంటే ఎలా పనికిరానిదానికింద చూస్తున్నారో, ప్రతీ పిల్లా పిల్లవాడూ ఇంజినీరింగ్, ఐ ఐ టి అంటూ ఒకటో తరగతి నుంచీ ఎందుకంత అర్రులు చాస్తున్నారో ఈ పిచ్చి మన తెలుగుదేశంలో నే ఎందుకలా ప్రబలుతోందో చెప్దామనుకున్నాను. అదీగాక నేను చూసినంతలో (నేను చూసింది, నాకు తెల్సిందీ పరమాణువులో శతసహస్రాంశం అని చెప్పక్కర్లేదు కదా?) ఈ రోజుల్లో నక్షత్రాల పేర్లు తెలియనివారూ, ముహుర్తం చూడ్డం రానివాళ్ళూ, ఆఖరికి ఇంజినీరింగ్ చదివి “ప్రొఫెషనల్” గా జ్యోతిష్యం చెప్పేవాళ్ళూ కో అంటే కోటి మంది తయారయ్యేరు. జ్యోతిషం నిజమౌతుందా లేదా అనే మాట పక్కనబెట్టి వీళ్ళని చూస్తూంటే తెలిసేది ఏమిటంటే, ఇదొక పూర్తి స్థాయి (ఫుల్ టైం) ప్రొఫెషన్ అయిపోయింది. కంప్యూటర్ మీద పనిచేసేవాళ్ళకి లక్షలమీద జీతాలు ఇస్తుంటే మాకెందుగ్గాదు అని వీళ్ళు కూడా ముందుకొస్తున్నారు. అది అలా ఉంచితే మొత్తమ్మీద నేను చెప్పాలనుకున్న పాయింట్లు సరిగ్గా చెప్పలేకపోయానని తెలిసి వచ్చింది ఇప్పుడు. మరో సారి అందరికీ ధన్యవాదములు.
భారతీయ పుస్తక చరిత్ర: 2. రాత పుట్టుక, పరిణామం – భారతీయ లిపులు గురించి Manasa అభిప్రాయం:
11/19/2013 7:55 am
చాలా చక్కటి వివరణాత్మకమైన వ్యాసాన్ని అందించినందుకు కృతజ్ఞతలు.
మొదటిసారి చదివినప్పటి కంటే, యుద్ధమల్లుని మీద ప్లస్‌లో సాగిన చర్చ ద్వారా మళ్ళీ వచ్చి చదివినప్పుడు, ఆ భాగానికి సంబంధించిన వ్యాసం మరింత తేలిగ్గా అర్థమైన భావన కలిగింది.
వీలైతే ఇటువంటి విశేషాలను లేదా ఇంత సమాచారాన్ని మీరు క్రోడీకరించే క్రమంలో మీరు తెలుసుకున్న లిపి వెనుక శాసనాలకు లేదా ఆయా రాజులకు సంబంధించిన కథలను కూడా పొందుపరచగల్గితే, సాథారణ పాఠకులకు వ్యాసం మరింత ఆసక్తికరంగా తోస్తుందేమోనన్న ఆలోచన కలిగింది.
వాటిని కొసరు కథలుగా అయినా అందించ మనవి.
ఆచార్య సుబ్బరామయ్య మీనాక్షిసుందరం గురించి Sriramam అభిప్రాయం:
11/19/2013 2:28 am
శ్రీ వాసుదేవరావు గారికి,
చక్కని వ్యాసము. ప్రఖ్యాత గణిత శాస్త్ర పరిశోధకులు ఉత్తమ ఉపాధ్యాయులు అయిన ఆచార్య మీనాక్షిసుందరం గారి జీవిత విశేషములు చాల వరకు నాకు తెలియనివి మీ వ్యాసము ద్వారా తెలుసుకొని చాల అనందించాను. మీకు నా ధన్యవాదములు. మీరు తెలుగులో చేసిన సాంకేతిక శాస్త్ర విపులీకరణ చాల చక్కగాఉన్నది. మీకు అభినందనలు.
మీ వ్యాసం నాకు కూడా పాత జ్ఞాపకాలను ఎన్నో గుర్తుకు తెచ్చింది. నేను 1960-63లో M.Sc(Tech) Meteorology and Oceanography చదువుతూ వివేక విన్యాస సధర్మ సాధన హోస్టెల్లో ఉండేవాడిని. నేను బాపట్ల వాస్తవ్యుడ్ని, న్యుక్లియర్ ఫిజిక్స్ ఫేకల్టీ Dr.M L N రాజు, నేను హైస్కూలు, కాలేజి, యూనివర్సిటి చదువులు కలిసి చేసాము. కొమరవోలు శివప్రసాద్ అన్నయ్య నా హైస్కూలు సహధ్యాయి. నేను 1963 తరువాత 2010లో విజిట్ కు విశాఖపట్టణము రావటం జరిగినది, గుర్తుపట్టలేనంత మార్పు కనిపించింది. నేను రాజును కలవటానికి ప్రయత్నించినా కుదరలేదు. మీరు మరోలా భావించకపోతే రాజు ఇ-మెయిల్ తెలిపే సహాయము చేయగలరా? మరొక మారు ఈ వ్యాసము మీరు అందించినందుకు ధన్యవాదములు.
శ్రీరామం
చా.సో. తో ముఖాముఖీ గురించి సూర్య వేంకట సుబ్రహ్మణ్యం నూకిరెడ్డి అభిప్రాయం:
11/18/2013 9:49 pm
ప్రియమైన ఈమాట ఎలక్ట్రానిక్ తెలుగు పత్రిక వారికి,
తందనాన బళా సంగీతరూపకం ఉంటే ప్రసారం చేస్తారని ఆశిస్తున్నాను.
ఇట్లు
సూర్య వేంకట సుబ్రహ్మణ్యం నూకిరెడ్డి