ఈ పుస్తకం కినిగెలో ప్రస్తుతానికి దొరకదు. ఎమెస్కో వారి దగ్గర కాని, పుస్తక విక్రయశాలలో కాని దొరుకుతుంది. కినిగెలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాను.
– వేమూరి
ఈపద్యంలో తుషారబిందువులచేత విశ్లేషణం చెందిన (అంటే రంగులు రంగులుగా విడిపోయిన)సూర్యరశ్మివల్ల లూతాకల్పితతంతుసద్మములు బహు(వర్ణ)రత్నోదీర్ణమగునట్లు వెలుగొందుచున్నట్లున్నవని చెప్పడం జరిగింది. అంటే నీటిబిందువు పట్టకంలాగా సూర్యునిరంగులను విడగొట్టడం ఆనాటికే ఎందరో గమనించడంజరిగింది. కాని ఇందులో ఆవిడగొట్టఁబడిన రంగుల పట్టీలేదు గాని, అవి బహువర్ణములని గమనించినట్లు తెలుస్తున్నది.
2. గుప్తరాజులకాలంనాటిదిగా భావింపఁబడే అమరకోశంలో, తెలుపు, పసుపుతోఁ గూడిన తెలుపు (హరిణవర్ణము), ధూసర (బూడిదరంగు),నలుపు (కృష్ణే నీలాసిత శ్యామ కాల శ్యామల మేచకాః అని అమరం, ఇందులో నీలం అసితశబ్దానికి అంటే నలుపుకు పర్యాయంగా చెప్పఁబడింది), పీతము (పసుపుపచ్చ),హరితము (ఆకుపచ్చ), రక్తము (ఎఱుపు),శోణ, అరుణ, పాటల, కపిశ, ధూమ్ర,కర్బుర, పింగళవర్ణములకు పర్యాయపదము లున్నవి. నీలతివస్త్వన్తరమితి నీలః అంటే ఇతరవస్తువులను నల్లగఅంజేయునది అని నీలశబ్దమునకు వ్యుత్పత్తి. కాని ‘నీలీ’ ‘నీలినీ’ అని నిలిచెట్టుకు పేర్లు. అందుచేత మొదటినుండి నీలశబ్దం నలుపుకు, నీల(బ్లూ) వర్ణానికి వర్తించడం గమనించవచ్చు.
చూసేందుకు మొట్టికాయ వేసినంత సులభంగా వున్నప్పటికీ కొన్ని ద్వైదీభావాలలో, అనవసరపు ఈర్షలతో కొట్టుకుపోయే వారికి నిజంగా అవసరమైన ఔషధపు చుక్కలా రాశారు భాస్కర్ గారూ. బావుంది.
వేలూరి గారితో మొత్తంగా విభేదిస్తున్నాను … నేను కూడా పీసపాటి గారి నాటకాలను చూశాను … ప్రజాకవులంటే ఈలల కోసం రాసే వాళ్ళు కాదు .. మనసు , మనిషి లోతుల్లోకి వెళ్లి వెదికే వాళ్ళు … మీరెంత ప్రయత్నం చేసినా శ్రీ శ్రీ గారే 20 వ శతాబ్దపు కవి … మీ అంచనాల ప్రకారం వేటూరి గారు శతాబ్దపు కవి కావాలి … ఛాందస భావాల్ని వదిలి నిజాన్ని నిజంగా చూడండి …. దండాలు …
కవి, “సవ్వడిచేసి మాపాప కునుకు చెడదీయకే” అని రాశారు. “సవ్వడి చెసే మా పాప కునుకు” అని రాయలేదు. “చేసే” కాదు, “చేసి”. మరొక్క సారి చదవండి ఈ పాట. గాలికి అలా చెబుతున్నారు, సవ్వడి చెయ్యొద్దని.
మీ అనుభవాలు చాలా బాగున్నాయి .
మాది సురవరం , మీరు చెప్పే వర్ణన లో నేను కొన్ని మాత్రమే గుర్తుపట్టగలుగుతున్నాను .
గోషా హాస్పిటల్ ఎదురుగా , దుర్గాదాస్ గారి హాస్పిటల్ వీధి,శ్రీ ప్రకాష్ స్కూల్ వీధి ( రెడ్ కాన్వెంట్ వీధి అనేవాళ్ళం ) , కొంచెం ఇవతల కి సురవరం వైపు వస్తే వినాయకుడి గుడి ఎదురుగా ఉన్న వీధి ఉంది.
కాని ఆశ్చర్యం ఏంటంటే , కొత్తపేట నుండి తుని కి మధ్యలో ఇలా ఉండేదా ??, చాలా ఆశ్చర్యంగా ఉంది చదువుతుంటే ..
మీరు చెప్తుంటే లక్ష్మి దేవి చెరువు చాలా పెద్దగా ఉండేదని అర్ధం అవుతుంది .
పుస్తక పరిచయం: వేమూరి వెంకటేశ్వర రావు ‘అమెరికా అనుభవాలు’ గురించి Rao Vemuri అభిప్రాయం:
01/01/2014 9:20 pm
ఈ పుస్తకం కినిగెలో ప్రస్తుతానికి దొరకదు. ఎమెస్కో వారి దగ్గర కాని, పుస్తక విక్రయశాలలో కాని దొరుకుతుంది. కినిగెలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాను.
– వేమూరి
పలుకుబడి: రంగులు గురించి దేశికాచారి అభిప్రాయం:
01/01/2014 6:44 pm
1.అష్టదిగ్గజాలలో నొకఁడైన ధూర్జటి కాళహస్తిమాహాత్మ్యంలోని ఈక్రింది పద్యంలో నీటిబిందువులవల్ల విశ్లేషణంచెందే సూర్యరశ్మిప్రస్తావన ఈవిధంగా ఉన్నది.
ప్రాతఃకాలతుషారశీకరచయప్రాప్తిన్ లసన్మౌక్తికో
పేతాగారములట్లు చెల్వెసఁగి,తద్బిందుచ్ఛటాజాత ఖ
ద్యోతచ్ఛాయలఁ గొంతసేపు బహురత్నోదీర్ణగేహంబులై
లూతాకల్పితతంతుసద్మములు వొల్చుం, జెప్పఁ జిత్రంబులై.
ఈపద్యంలో తుషారబిందువులచేత విశ్లేషణం చెందిన (అంటే రంగులు రంగులుగా విడిపోయిన)సూర్యరశ్మివల్ల లూతాకల్పితతంతుసద్మములు బహు(వర్ణ)రత్నోదీర్ణమగునట్లు వెలుగొందుచున్నట్లున్నవని చెప్పడం జరిగింది. అంటే నీటిబిందువు పట్టకంలాగా సూర్యునిరంగులను విడగొట్టడం ఆనాటికే ఎందరో గమనించడంజరిగింది. కాని ఇందులో ఆవిడగొట్టఁబడిన రంగుల పట్టీలేదు గాని, అవి బహువర్ణములని గమనించినట్లు తెలుస్తున్నది.
2. గుప్తరాజులకాలంనాటిదిగా భావింపఁబడే అమరకోశంలో, తెలుపు, పసుపుతోఁ గూడిన తెలుపు (హరిణవర్ణము), ధూసర (బూడిదరంగు),నలుపు (కృష్ణే నీలాసిత శ్యామ కాల శ్యామల మేచకాః అని అమరం, ఇందులో నీలం అసితశబ్దానికి అంటే నలుపుకు పర్యాయంగా చెప్పఁబడింది), పీతము (పసుపుపచ్చ),హరితము (ఆకుపచ్చ), రక్తము (ఎఱుపు),శోణ, అరుణ, పాటల, కపిశ, ధూమ్ర,కర్బుర, పింగళవర్ణములకు పర్యాయపదము లున్నవి. నీలతివస్త్వన్తరమితి నీలః అంటే ఇతరవస్తువులను నల్లగఅంజేయునది అని నీలశబ్దమునకు వ్యుత్పత్తి. కాని ‘నీలీ’ ‘నీలినీ’ అని నిలిచెట్టుకు పేర్లు. అందుచేత మొదటినుండి నీలశబ్దం నలుపుకు, నీల(బ్లూ) వర్ణానికి వర్తించడం గమనించవచ్చు.
గరళం గురించి కట్టా శ్రీనివాస్ అభిప్రాయం:
01/01/2014 1:39 pm
చూసేందుకు మొట్టికాయ వేసినంత సులభంగా వున్నప్పటికీ కొన్ని ద్వైదీభావాలలో, అనవసరపు ఈర్షలతో కొట్టుకుపోయే వారికి నిజంగా అవసరమైన ఔషధపు చుక్కలా రాశారు భాస్కర్ గారూ. బావుంది.
జనరంజని: సాలూరు రాజేశ్వరరావు గురించి Siddineni Bhavanarayana అభిప్రాయం:
01/01/2014 12:16 pm
శ్రీ పరుచూరి శ్రీనివాస్ గారూ, ధన్యవాదాలు. మీకు ఋణపడి ఉంటాను.
సి.భావానారాయణ
గత శతాబ్దంలో ప్రజాకవులు గురించి ఆర్ వి బి బాబు .. అభిప్రాయం:
01/01/2014 7:06 am
వేలూరి గారితో మొత్తంగా విభేదిస్తున్నాను … నేను కూడా పీసపాటి గారి నాటకాలను చూశాను … ప్రజాకవులంటే ఈలల కోసం రాసే వాళ్ళు కాదు .. మనసు , మనిషి లోతుల్లోకి వెళ్లి వెదికే వాళ్ళు … మీరెంత ప్రయత్నం చేసినా శ్రీ శ్రీ గారే 20 వ శతాబ్దపు కవి … మీ అంచనాల ప్రకారం వేటూరి గారు శతాబ్దపు కవి కావాలి … ఛాందస భావాల్ని వదిలి నిజాన్ని నిజంగా చూడండి …. దండాలు …
సడిచేయకే గాలి గురించి శాస్త్రి అభిప్రాయం:
12/31/2013 10:48 am
బత్తు విజయ్‌కుమార్ గారికి,
అనేక నమస్కారాలు.
కవి, “సవ్వడిచేసి మాపాప కునుకు చెడదీయకే” అని రాశారు. “సవ్వడి చెసే మా పాప కునుకు” అని రాయలేదు. “చేసే” కాదు, “చేసి”. మరొక్క సారి చదవండి ఈ పాట. గాలికి అలా చెబుతున్నారు, సవ్వడి చెయ్యొద్దని.
ధన్యవాదాలతో,
శాస్త్రి
సడిచేయకే గాలి గురించి nagamurali అభిప్రాయం:
12/31/2013 8:24 am
Sorry, nitpicking. కవివర్యులు అనాలనుకుంటా.. లేక పండితమ్మన్యులు లాగా కవిమన్యులని వాడేరా? 🙂
రచయితలకు సూచనలు గురించి S A Rahman,Chittoor. అభిప్రాయం:
12/31/2013 5:45 am
ఈ మాట పత్రిక లోని కథలతో పాటు అన్ని రచనలు చాలా బాగున్నాయి.
ముఖ్యంగా సంపాదకులు గారికి రచయితలకు సహ పాఠకులకు
2014
నూతన సంవత్సర
శుభాకాంక్షలు.
నూతనసంవత్సరములో పత్రిక మరింత ప్రచారం పొంది ఉజ్వల భవిష్యత్తుతో ప్రకాశించాలని మనసార అకాంక్షిస్తు:–
ఎస్. ఎ. రహమాన్. చిత్తూరు – 517001.
ఆంథ్ర ప్రదేశ్.
పుస్తక పరిచయం: వేమూరి వెంకటేశ్వర రావు ‘అమెరికా అనుభవాలు’ గురించి Venkat అభిప్రాయం:
12/30/2013 11:03 pm
కినిగె లొ ఈ పుస్తకం దొరుకుతుందా ?
నాన్నగారు కట్టిన ఇల్లు గురించి Venkat అభిప్రాయం:
12/30/2013 9:59 pm
మీ అనుభవాలు చాలా బాగున్నాయి .
మాది సురవరం , మీరు చెప్పే వర్ణన లో నేను కొన్ని మాత్రమే గుర్తుపట్టగలుగుతున్నాను .
గోషా హాస్పిటల్ ఎదురుగా , దుర్గాదాస్ గారి హాస్పిటల్ వీధి,శ్రీ ప్రకాష్ స్కూల్ వీధి ( రెడ్ కాన్వెంట్ వీధి అనేవాళ్ళం ) , కొంచెం ఇవతల కి సురవరం వైపు వస్తే వినాయకుడి గుడి ఎదురుగా ఉన్న వీధి ఉంది.
కాని ఆశ్చర్యం ఏంటంటే , కొత్తపేట నుండి తుని కి మధ్యలో ఇలా ఉండేదా ??, చాలా ఆశ్చర్యంగా ఉంది చదువుతుంటే ..
మీరు చెప్తుంటే లక్ష్మి దేవి చెరువు చాలా పెద్దగా ఉండేదని అర్ధం అవుతుంది .
ఇప్పుడు అంతా మారిపోయింది