పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. శ్రీ శ్రీ కవిత్వంపై … మరో వ్యాసం గురించి battu vijaykumar అభిప్రాయం:

    01/04/2014 2:14 am

    దేవుడి గురించి చెప్పిన వేదవ్యాసంలా అనిపించింది.

  2. నొట్టు స్వరాలు, కర్ణాటక సంగీతంలో పాశ్చాత్య బాణీలు గురించి మోహన అభిప్రాయం:

    01/03/2014 11:29 pm

    గ్రంథసూచిలో చెప్పినట్లు సంగీత సంప్రదాయ ప్రియదర్శిని కాదు, అది సంగీత సంప్రదాయ ప్రదర్శిని. గ్రంథసూచిలోని అంకెలు కొన్ని వ్యాసములో లేవు. సంగీత సంప్రదాయ ప్రదర్శిని ఇక్కడ లభించును. సుబ్బరామదీక్షితులు పరమపదించినప్పుడు మహాకవి సుబ్రహ్మణ్య భారతి తన సంతాపమును తెలియజేస్తూ తమిళములో కవితను కూడ వ్రాసెను, అది కూడ ఇక్కడ లభ్యము. విధేయుడు – మోహన

  3. మంచు గురించి Ravi Patnaik అభిప్రాయం:

    01/03/2014 5:58 pm

    సో, చావు దగ్గిరకి వెళ్తే వేణ్ణీళ్ల స్నానం, మాంఛి రెసెప్షనూ, మళ్లీ వెళ్లిపోతాననే వరకూ ఏమీ అడగకపోవడం, వెనక్కి వచ్చేసేటప్పుడు బస్సుదాకా సహాయం. ఇందులో మళ్లీ తలుపు వేసేసిన రూమూ, పాస్టరు గారూ స్వర్గానికి చిహ్నమా? భలే, భలే. ఏదైనా సినిమా డైరక్టర్ దగ్గిరకి తీసుకెళ్తే బాగుంటుందేమో? చచ్చేవాడికి ఒక సూపర్ పైంటింగ్ వెయ్యాలనే కోరికెందుకో? వాడికి వేణ్ణీళ్లు పెట్టి ఇచ్చేది మృత్యువు! ఆహా ఏమి సూపర్ కధండీ!

    దామోదర్ అనే పేరులో, ఆయన చేసే బడి పంతులు ఉద్యోగంలో కూడా ఏదో అర్ధం కాని లొసుగు ఉందేమో కాస్త వివరించి మా లాంటి అల్పులకి జ్ఞానోదయం చెయ్యండి మరి. ఏమో ఈ పేరుకి ఏ అర్ధం తీయగలరో?

    చివరిగా ఒక మాట – please read about frost bite on Google before trying to educate other people. And those who decide to kill themselves are not afraid. Those who commit suicide are dare devil people. Anyways, au revoir to this discussion.

    (Comment edited -Ed.)

  4. కృషితో దుర్భిక్షం గురించి మధురవాణి అభిప్రాయం:

    01/03/2014 2:08 pm

    ​వైద్యశ్రీ గారూ, వంకాయల సంగతేమో గానీ నవ్వుల సేద్యం మాత్రం బ్రహ్మాండంగా చేసి పంటని మాకందరికీ కూడా పంచారు. అభినందనలు. 🙂

  5. కృషితో దుర్భిక్షం గురించి సుజాత అభిప్రాయం:

    01/03/2014 1:57 pm

    మీ కథలెప్పుడు చదివినా నాకు మొక్కపాటి వారు గుర్తొస్తారు. ఈ సారీ అంతే 🙂

    మొత్తానికి మీ వ్యవసాయానికి మంచి రోజులింకా రాలేదన్నమాట. సశేషంతో వదిలి పెట్టారు కాబట్టి సఫల వ్యవసాయ పద్ధతులతో మరో కథను పండిస్తారని చూస్తున్నా!

  6. బంతిపూల పడవ మీద పోదాం పదవా! గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:

    01/03/2014 1:45 pm

    సునీత గారు, మీ కామెంట్ – ‘దేని కోసం ఏం కోల్పోతున్నామో’ అన్నారు చూశారూ? – ఇదొక్క మాట చాలు. ఎవరికి వారు ప్రశ్నించుకునేందుకు, జవాబు కోసం వెతుకులాడుకునేందుకు. ఎదగడం కోసం పుట్టిన వూరు వదిలేస్తాం. పై చదువుల కోసం రాష్ట్రాన్ని వదిలేస్తాం. బ్రతకడం కోసం ఏ దేశమైనా సరే అనుకుని పోతున్నాం. బర్డెన్ అని చివరికి సొంతవారిని కూడా వది లేస్తే, మీరన్నట్టు దేనికోసం ఏం కోల్పోతున్నామో అర్ధమౌతుంది. అపోహలతో కారాలూ మిరియాలూ నూరుకోడం కంటే ఎవరో ఒకరు ఓ అడుగు ముందుకేసి, చేయీ చేయి కలుపుకుంటే జీవితం – ఇదిగో ఇలా బంతి పూల పడవలా వుంటుందని చెప్పడం కోసం రాసిన కథ ఇది. పడవ అందంగా వుందన్న మీ ప్రశంసకివే నా ధన్యవాదాలు సునీత గారూ! శుభాకాంక్షలతో 🙂

  7. పన్నీరు బుడ్డి గురించి Tarun అభిప్రాయం:

    01/03/2014 12:29 pm

    “పెంచి పోషించిన ఆస్తులు మాత్రం
    వారసుల ఇరుకు మదుల్లో వాటాలై విడిపోతుంటాయ్”

    అద్భుతమైన ప్రెజెంటేషన్. మనుషులనే పంచుకుంటున్నవాళ్ళు ఆస్తులను వదిలేస్తారా! ఇరుకు మదులు అనే ప్రయోగం బాగుంది.

  8. బంతిపూల పడవ మీద పోదాం పదవా! గురించి sunitha అభిప్రాయం:

    01/03/2014 11:57 am

    నిజ్జంగా ఇంత మంచి పండగ జరుపుకోగలిగితె!!!

    దేని కోసం ఏది కోల్పోతున్నామో ఒక్క క్షణం ఆగి ఆలోచించేలా రాశారు. నిజంగా ఇటువంటి ఆలోచన అందరిలో వస్తే ఎంత బావుంటుంది కదా!! ఎంత ఆనందం సొంతం చేసుకొగలుగుతామో. ఎంతో అందంగా ఉంది దమయంతి గారూ ఈ బంతి పూల పడవ.

  9. పన్నీరు బుడ్డి గురించి Jayashree Naidu అభిప్రాయం:

    01/03/2014 11:38 am

    ఆది అనాదుల ఆద్యంతం కవి కంటితో చూపించారు. వేదాంతాన్ని సింపుల్ పదాల్లో పలికించేశారు.
    కంగ్రాట్స్ అనిల్ గారు.

  10. మంచు గురించి రఘోత్తమరావు అభిప్రాయం:

    01/03/2014 10:55 am

    చచ్చిపోవాలకొన్నవాడు పాములున్నాయంటే భయపడ్డం ఒక వ్యక్తిలోని వైరుధ్యాలకు, మనో వైకల్యాలకు ఒక ప్రతీక.

    స్వానుకంపనతో (self pity!) తన చుట్టూవున్న సమాజపు చేతగానితనాన్ని, క్రూరత్వాన్ని ఎత్తి చూపించాలని తాపత్రయ పడ్డవాడు చావులోని స్తబ్దత, చల్లదనం ఓ వ్యక్తి రూపంలో ఎదురుపడగానే మళ్ళీ అదే పనికిమాలిన సమాజంలోకి పారిపోవడం ఒకానొక సమయంలో, ఒకానొక స్థాయిలో, మనుషులు తమకు తాము చేసుకొనే ఆత్మవంచనకు పరాకాష్ట.

    చివరగా, ఆ కొండ మీది మాట్లాడని వ్యక్తి నిజానికి ఒక పాత్రలాగా అనిపించే “మంచు లాంటి మనిషి” ఎవరో కాదు చావే! మంచు దూరం నుంచి చూస్తే అందంగా అనిపిస్తుంది. అలాని దగ్గరికెళ్ళి అతిగా ఆడితే… ఫ్రాస్ట్ బైట్‍తో ఎంతో బెంబేలెత్తిస్తుంది. ఎంతగా అంటే చావాలనుకున్నవాడు సైతం ఎండిన బ్రతుకును మళ్ళీ ప్రేమించేటంతగా!

    నాకు మాత్రం నచ్చింది సుబ్బూ 🙂