పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. కృషితో దుర్భిక్షం గురించి బులుసు సుబ్రహ్మణ్యం అభిప్రాయం:

    01/06/2014 3:56 am

    రాజ్ కుమార్ గార్కి, ధన్యవాదాలు. అవునండి, చింతన్ బైఠక్ అంటే మీరు సరిగ్గానే చెప్పారు. కూర్చుని ఆలోచించడం. …దహా.

    లక్ష్మి గార్కి, ధన్యవాదాలు. రైతు బజార్ లో బేరాలుండవు. ఘోరంగా బేరమాడి ఒక వంకాయో, దొండకాయో కొసరుగా తీసుకోక పొతే తృప్తి ఉండదు. …దహా.

    సుజాత గార్కి, ధన్యవాదాలు. మొక్కపాటి వారు వ్రాసినంత జన రంజకంగా వ్రాయాలంటే నేనింకో పది జన్మలెత్తాలి. ఇంకా వ్యవసాయమా? ఇప్పటికే పలు గుట్టలు మొలిచాయి బట్టతల మీద. …దహా.

    మధురవాణి గార్కి, ధన్యవాదాలు. నా వ్యవసాయం మీకు కూడా నవ్వులాట గానే ఉందన్నమాట. …దహా.

  2. కృషితో దుర్భిక్షం గురించి బులుసు సుబ్రహ్మణ్యం అభిప్రాయం:

    01/06/2014 3:53 am

    గోపాలకృష్ణ గార్కి, మీ వ్యాఖ్యలకి ధన్యవాదాలు. వంకాయ వంటి కూర, పంకజముఖి సీత వంటి భార్యామణి లేదన్నారు కవులు. వంకాయలదేల యన్న కూరగాయలందు వంకాయ లెస్స అని అన్నారుట మహారాజులు. వంకాయతో వెయ్యి రకాలు అన్నారు నాలాంటి వంకాయ ప్రియులు. మీరేమో నాలుగు రోజులకే విరక్తి అంటున్నారు. మీ కోసం ఎప్పుడో వంకాయోపాఖ్యానం కూడా రాసేస్తాను. …దహా.

    మురళీ గార్కి, ధన్యవాదాలు. దూరదర్శన్ వారి సలహాలు పాటిస్తే ఇంతే సంగతులు అని జనవాణి. …దహా.

    సుబ్రమణ్యం గార్కి, సుబ్రహ్మణ్యం నిష్టల గార్కి. మీ వ్యాఖ్యలు శ్రవణానందకరంగా ఉన్నాయి. ధన్యవాదాలు. చదివే వాళ్ళుంటే వ్రాస్తూనే ఉంటాను. …దహా.

  3. కవిరాజశిఖామణి గురించి lyla yerneni అభిప్రాయం:

    01/05/2014 4:15 pm

    నన్నెచోడుడు బహుశా పంపకవిని అనుసరించాడేమో ఈ విషయములో?

    To me the concepts of Manmadha / Eros are very enjoyable. Goethe (who claims to be the liberator of German poets of late 18th century,) decisively leads a pan erotic life. Eros is his driving force. Goethe adores Eros in his poetry.

    “Call Eros blind if you like, and a boy, and wanton: I know him and his sagacity well, this incorruptible god.”

    I like these words too–

    “Eros has arrows that work many ways; some merely will scratch us,
    And as the slow venom acts, so the heart sickens for years.
    But there are others, strong feathered and freshly pointed and sharpened-
    Right to the marrow they pierce, quickly they kindle the blood.” – Goethe, Roman Elegies.

    I don’t know what Nannechoda is about. What his beliefs are. What he likes. What he dislikes. What is his poetry about. Are they brought out in his work? I don’t have his work.

    More so, it looks I should read Pampa kavi. How do I get to know him?

    Lyla

  4. నన్నెచోడుని కుమారసంభవంలో ‘లలితాస్యాంబురుహంబు’ పద్యవివాదం: స్థితిస్థాపన గురించి lyla yerneni అభిప్రాయం:

    01/05/2014 3:59 pm

    “ఇంకా జాగ్రత్తగా పరిశీలిస్తే నన్నెచోడుని పద్యంలో ‘మహోత్పలగంధి,’ ‘ఉత్పలనేత్రి,’ అని ఒకే ఉపమానం పునరుక్తం కావటం కూడా భావ్యంగా లేదు. వాటికి పర్యాయాలను నిలపలేనంత సామాన్యకవి కాడు కదా. ఇక పోతే, సందర్భౌచితి లోపించిన ‘అంగజరసాంభఃపూర,’ ‘మనోజాతానలం,’ వంటి పరికర్షణీయాలను గుఱించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది.”

    నన్నెచోడుని కుమార సంభవం లోనిదని ఉదహరించ బడి న పద్యం, తెనాలి రామకృష్ణుని దని చెప్పబడిన పద్యం, రెండింటి లో నాకు నన్నెచోడుని పద్యం ఎక్కువ ఆకర్షణీయంగా ఉంది. పార్వతి మీది పద్యం ఆమె అంగ వర్ణన కాదు. రెండు దిండు గలీబులు, రెండు దుప్పట్లు, ఒక లంగా, ఒక లుంగీ –ఇలా వరసగా రాసి, చివరికి కూడి, మొత్తం శాల్తీలు అని, లెక్క సరి చూసే చాకలి పద్దు కాదు.

    కలువల సౌకుమార్యం, తూళ్ళ నాజుకులు, పూల బొడ్డులు, పూల సుగంధం, సరసు లోని హంసలు, వాటి తేలియాటలు – మొత్తంగా ఒక సరసు అందం. అట్టి పార్వతి అందం. నిజానికి అంతా చదివా క, అది నీటి సరసు గురించీ కాదు. పార్వతి కన్నులు, చన్నులు, గురించీ కాదు. అది ఒక మనోహర సౌందర్య భావన. ఒక మన్మధ భావన. ఒక సౌందర్య కాంక్ష, ఒక సాంగత్య కాంక్ష, ఆ లబ్ధిలో తృప్తి చెందుతుందన్న భావన.

    రామాయణమంతా విన్నాక రాముడికి సీత ఏమవుతుందన్నట్టు, పార్వతి, శివుల దీర్ఘ వియోగం, జన్మాంతర ప్రణయం మరిచి పోయి, గౌరి ఎందుకు తపస్సు చేస్తోందో, ఆమె ఎందుకు కృశిస్తోందో మర్చిపోయి, మన్మధ భావాన్ని, మన్మధ బాణ ప్రభావాన్ని మరిచి పోయి, శివుడేమిటి? కృశించిన పార్వతి దేహాన్ని కోరటమేమిటి? అంటే ఇంకేముంది? కథ బుధ్ధం శరణం గఛ్ఛామి.

    There is nothing wrong in Tenali’s poem. He just wrote it the way, he likes it. Sometimes we feel like Classics, Sometimes we feel like Harlequins and Mills and Boons.

    Lyla

  5. మంచు గురించి పూర్ణిమ అభిప్రాయం:

    01/05/2014 3:28 pm

    కథను గురించి నాదో ప్రశ్న. రచయితగానీ, ఎడిటర్లుగానీ అవసరమనిపిస్తే సమాధానాలు ఇవ్వవచ్చు.

    ఈ కథకు first party narration సరిపోయిందని మీకు ఎందుకు అనిపించింది? ఇందులో అతడు పనిజేస్తున్న రంగం అడ్వర్టైజింగ్ అనీ, చిత్రాలు గీస్తాడో / తీస్తాడో అని చూచాయిగా చెప్పుకున్నాడు. అతడి మాటలే బోలెడంత కవితాత్మకంగా ఉన్నాయి. ఇంతిలా చెప్పగలిగినవాడి ఆర్ట్ పెయిటింగో, ఫొటోగ్రఫీయో ఎందుకు కావాలి? కళాఖండం సృష్టించడానికి, ఆపై ఆత్మహత్య ఆలోచన ఉన్నవాడు, వాటిని గురించి గట్టిగా ఆలోచించకుండా, కేవలం తనకు ఆశ్రయమిచ్చినవాడి దినచర్య గురించి అవసరానికి మించిన కుతూహలం చూపడం ఎలా జస్టిఫై అవుతుంది? ఈ కథ third party narrationలో ఉండుంటే కొంచెం మెరుగ్గా ఉండేదనిపిస్తోంది. మీరేమంటారు?

    కథ ఆసక్తికరంగా ఉంది గానీ convincingగా లేదనిపిస్తోంది నాకైతే! జననం (life) లాగా చావుకి gestation period అవసరం లేదు కదా! ఒక్క క్షణం చాలు, దాని పని అది కానిచ్చుకోవడానికి. మరి అలాంటి మృత్యువుతో సావాసంలో అర్థమేమిటి? లేక, ఆ కొండపైన అతడున్న రెండురోజులు చనిపోయిన తర్వాత అతగాడి afterlife సూచిస్తుందా? అన్నది కూడా బోధపడ్డం లేదు. (ఈ పేరా కథపై నా ఆలోచనలు మాత్రమే! నేను అడగదల్చుకున్న ప్రశ్నలో భాగం కావు.)

  6. బంతిపూల పడవ మీద పోదాం పదవా! గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:

    01/05/2014 12:42 pm

    * మనసున్న వారికే మధుర జ్ఞాపకాలుంటాయేమోనండి సుబ్రహ్మణ్యం గారూ! గుండె మీద నీడలు కదలినప్పుడల్లా కళ్ళెందుకో చెమర్చిపోతాయి. నాకూ అంతే. మీ విలువైన అభిప్రాయం ఒక అందమైన కామెంట్ లా నిలిచిపోతుందిక్కడ. మీకు నా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, పండగ శుభాకాంక్షలతో…

    *ఉన్న ఊరు, కన్న వారు, బాల్యం నాటి రోజులు. మనకెప్పటికీ మనసులో నిలిచిపోయే సజీవ సుందర చిత్రాలు. కాలం మారొచ్చు. మార్పులతో బ్రతుకూ మలుపులు పోవచ్చు. కానీ ఎప్పటికీ మాయనది, మన సంస్కృతీ, మన సాంప్రదాయం. కన్నబాబు గారూ! మీరీ కథని అద్భతమైన కథగా అభివర్ణించడం ఎంతయినా హర్షదాయకం! మీకు నా మనః పూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, సంక్రాంతి శుభాకాంక్షలతో…

  7. పన్నీరు బుడ్డి గురించి సురేష్ రావి అభిప్రాయం:

    01/05/2014 11:36 am

    “తనతో బాటే పెరిగి పెద్దవైన అనుభవం, నైపుణ్యం
    వదల్లేక అగరొత్తి పొగల్లో సుళ్ళు తిరుగుతుంటే
    పెంచి పోషించిన ఆస్తులు మాత్రం
    వారసుల ఇరుకు మదుల్లో వాటాలై విడిపోతుంటాయ్”

    యండమూరి అంతర్ముఖాన్ని ఓ చిన్న కవితలో చూపించారు. హాట్స్ అఫ్ ప్రసాద్ గారూ.

  8. మంచు గురించి సాయి పద్మ అభిప్రాయం:

    01/05/2014 9:43 am

    త్రిపుర కథలు అనగానే బాబోయ్ మాకు అర్ధం కావు అనే చాలామంది ఈ కథ తప్పకుండా చదవాలి. (కొన్ని నాకూ అర్ధం కావు, అర్ధమైనవి కొన్ని వొప్పుకోదు మనసు, అది వేరే సంగతి.) వాక్యాల్లో త్రిపుర అక్కడక్కడా తొంగి చూస్తాడు. నాకెంతో నచ్చింది, ఏదన్నా మూసిపెట్టగానే మనలో ఉండే కుతూహలం. ఈ కథలో మెటఫర్ మంచు వెనుక ఏముంది? మనిషి మనసులో ఏముంది? ఎక్కువ అజెండాలలో బ్రతికే మనం ఏమీ అక్కర్లేకుండా బ్రతికే మనిషిని భరించలేం. అసూయ పడతామా, కుతూహలపడతామా, అన్ని రహస్యాలూ తెలుసుకొని కూడా భరించలేని తనం!

    తప్పకుండా చదవాల్సిన కథ, నాకైతే ఎంతో నచ్చింది. భలే కథ సుబ్రహ్మణ్యం గారూ!

  9. చిట్ట చివరిది గురించి mallikarjunarao chintala అభిప్రాయం:

    01/05/2014 7:26 am

    చాలా బాగుంది.

  10. మంచు గురించి బ్రహ్మేశ్వర రావు మేకా అభిప్రాయం:

    01/05/2014 6:28 am

    జీవితమంటే గుర్తింపు, ధన సంపాదన, ఇతరుల జీవితాలను శోధించడంగా గడుపుతున్నప్పుడు, అటువంటిదేమీ కోరుకోని కొండల్లోని పల్లె జీవితం వింతగా కొందరికి కన్పించడం సహజమే. ఎదుటి మనిషి మనని పట్టించుకోవాలనే తాపత్రయం చక్కగా వ్యక్తం చేశారు. మనిషి తన మానాన తాను ఎట్లా ఉండొచ్చో కూడా బాగానే చిత్రించారు. ఎదుటి వ్యక్తుల కోసం కాకుండా మన చావైనా, బ్రతుకైనా మనమే నిర్దేశించుకోవాలి.