తెలుగులో రాయకపోవడానికి అసలైన కారణం సమయం లేకపొవడమేనండి. టైప్ చేయడం, తప్పులు దిద్దడం అదీ చాలా టైం పడుతుంది. ఓపిగ్గా కూర్చుని రాయాలి. ఇంకో సమస్య ఏమిటంటే లేఖిని, ఈమాట లలో ఉన్న బాక్సులు టైప్ చేస్తూండగా నిండాయి అనుకోండి, పైకీ కిందకీ లాగడనికి స్క్రాల్ బార్స్ లేవు. టైప్ చేసేది ఎక్కువయ్యే కొద్దీ ఇదెక్కడ గొడవరా భగవంతుడా అని మధ్యలో వదిలేయాలనిపిస్తుంది. అదీకాక నెట్ కనెక్షన్ తెగిపోవడం అనే దరిద్రం ఉండనే ఉంది. కాపీ పేస్ట్ చేయాలంటే సుమారు అరగంట పడుతుంది పెద్ద పోస్ట్ కి. అదే ఆంగ్లంలో అయితే పదిహేను నిముషాల్లో మొత్తం అంతా టైప్ చేసేయొచ్చు – మొత్తం కామెంట్ చేసిన డభ్భై మందినీ ఏకేస్తూ 🙂
[స్క్రాల్ బార్స్ లేకపోయినా అప్, డౌన్ యారోలు వాడి మీరు ఆ కామెంట్ బాక్స్‌లో పైకీ కిందికీ కదలవచ్చు. లేదా ఫైర్‌ఫాక్స్‌లో కుడి వైపు కింది మూలను మౌస్‌తో నొక్కిపట్టుకుని బాక్స్ సైజ్ పెంచుకోవచ్చు కూడా. – సం.]
appointment, engagement అనే పదాలకు సంకేత అని సంస్కృత నిఘంటువులలో నున్నది. సమయము అని కూడ మనము కలిపితే “సంకేత సమయము” అని చెప్పవచ్చును. ఇందులో అభిసారికలు లేరు, వారికి సంకేత సమయము మాత్రమే కాదు, సంకేత స్థలములు కూడ కావాలి 🙂 విధేయుడు – మోహన
మీరు వివరించిన మూడు కారణాలు కావు. సంపాదకుల అభిప్రాయమేమో కానీ, నేను మాధవ్ గారితో ఏకీభవిస్తాను.
అవును. కొందరికి తెలుగులో రాయడం ఆంగ్లం లో రాయడమన్నంత సులువు కాదు. ఇందులో నేను అనుభవజ్ఞుణ్ణి కాబట్టే నా కష్టం ఏమిటో నాకే తెలుసు. అది తరవాత మీకు, త:త: గారికి, ఇక్కడున్న దిగ్గజాలందరికీ వివరిస్తాను. మీకప్పుడు ఒక ‘insider’ అభిప్రాయం కూడా తెలుస్తుంది.
మీరు ఇంతగా తెలుగులో రాయండి, అని ప్రాథేయ పడడంలో తప్పు లేదు. కానీ అదేదో తెలుగంటే దురాభిమానమని అనుకుంటారేమో అని మీరు అనుకోడం అనవసరమైన ఆలోచన. ఐతే మీరు వేసిన ప్రశ్నలు, అనుకుంటున్న కారణాలు, గంభీరంగా పరిశీలించాల్సిన విషయం ఉంది (దానికి ఈ వ్యాసంతో కూడా సంబంధం ఉంది).
కావున త్వరలోనే ఈ విషయమై నేను “తెలుగొచ్చిన తెలుగోడు భావ వ్యక్తీకరణ చేయబోతే ఆ తెలుగు దేవత, అందని అందంలా, అలా దూరంగా వినువీధుల్లో విహరిస్తూ ఉంటే… నా గుహలో, కుటిలో, చీకటిలో, ఒక్కడనై స్రుక్కిన రోజులు లేవా…” అన్న బాధేమిటో చర్చిస్తాను.
అప్పుడు మీరు ఖచ్చితంగా మీ అభిప్రాయన్ని మార్చుకుని, మా లాంటి వాళ్ళను దయతో క్షమిస్తారని కూడా ఆశిస్తున్నాను.
మీరు ప్రస్తావించిన పుస్తకం(చూ. డి. చంద్రశేఖరరేడ్డి, మన భాష, పుట 203, మీడియా హౌస్ పబ్లికేషన్స్, 2001.) నేను చూడలేదు. ఇటుపైన “ఎపాయంట్‌మెంట్” అన్న మాటకి తెలుగుమాట లేదని “డిసపాయంట్” అవకుండా మీరు కూడ ఈ మాట వాడి చూడండి అన్నారు. కాని అభిసారం అన్నది appointment అన్నమాటకు సరైన అనువాదం ఐనా కాకపోయినా అది సంస్కృతపదం కాని అది అసలు తెలుగు మాట కానేకాదు. ఒకవేళ సరైన పదమే ఐతే ఈ సంస్కృతపదం మనం హాయిగా వాడుకోవచ్చును. కాని ఇది సరైన అనువాదం కాదనే నా అనుమానం.
అభిసారం అనే మాట వినగానే అష్టవిధనాయికల్లోని అభిసారిక గుర్తుకువస్తుంది. (కొంచెం మంది ఇదేమిటండోయ్ ఇదేదో అతిసారం అన్నట్లుందే అనుకునే అవకాశమూ ఉందనుకోండి!)
ఈ అభిసారం అనే మాటకు అభిసారం = ప్రేమికులు సంగమార్థం చేసుకునే నిర్ణయం, ప్రేమికుల సంకేతస్థలం అని వికీపీడియా పేజీలో కనిపించింది కూడా. ఇక్కడ అభిసారిక లేదా అభిసారి లేదా అభిసారుడు అనే పదాల్లో ఒక రహస్యసంకేతస్థలంలో సమాగమనం కోసం పోతున్న వ్యక్తి అనే అర్థం వస్తున్నది.
అని కర్ణపర్వంలో ఒక శ్లోకం ఉంది పదవ అధ్యాయంలో. ఇక్కడ అభిసారం అనే మాట ప్రత్యక్షంగా కనిపిస్తోంది. ఇది ఒక యుధ్ధరంగవర్ణనలో భాగం. శృంగారమూ చట్టుబండలూ ఏమీ లేదు. సరే, ఇక్కడ ఎవరికీ ఎవరితోనూ ఏవిధమైన appointment కూడా లేదు కదా?
అలాగే బౌధ్ధవాంగ్మయానికి సంబంధించిన త్రిపిటకంలో అసీతినిపాతో అనే అధ్యాయంలో ఈ అభిసారం అనే మాట తరచుగానే కనిపిస్తున్నది. ఉదాహరణకు ఒకచోట
న తే అభిసరం పస్సే న రథే నపి పత్తికే;
నాస్స చమ్మంవ కీటం వా, వమ్మితే చ ధనుగ్గహే
ఇది ప్రాకృతంలో ఉన్నది. మొదటిపాదం సంస్కృతంలోచూస్తే “న తే అభిసరం పశ్యే న రథే నపి పంక్తికే” అని అనివస్తుంది. రథాలూ సైన్యాలు ఏవీ నీ వెంటరావు సుమా అని అర్థం చెప్పుకోవచ్చును. ఇక్కడా ఏవిధమైన appointment ప్రసక్తీ లేదు.
అందుచేత అభిసారం అనేది appointment అన్నమాటకు సరైన అనువాదం కాకపోవచ్చని అనుకుంటున్నాను.
ఒక ఆంగ్లవ్యాఖ్య క్రింద, వేలూరి వేంకటేశ్వర రావు వ్రాలు అన్న సంతకం సంతోషం కలిగించింది. పోనీ లెండి కనీసం ఒక్క సారి తెలుగు సంతకం చేసి మమ్మల్ని ధన్యుల్ని చేసారు. శ్రీవేలూరివారు హాయిగా తెలుగులో వ్యాఖ్యను వ్రాయగలరని నా నమ్మకం.
‘ఈమాట’ పత్రికలో వ్యాఖ్యలు సాధారణంగా తెలుగులోనే ఉంటాయన్న మాధవ్‌గారి అభిప్రాయం నిజం కావచ్చు. ఆ విషయంలో గణాంకాలసంగతిచర్చలు వద్దు కాని, కేవలం తెలుగులో రాయమనడం కొందరికి తమ అభిప్రాయం వెల్లడించడానికి ప్రతిబంధకమౌతుందని వారెందుకన్నారో బోధపడలేదు. తెలుగువారికి తెలుగులో చెప్పటానికి ఏమి ప్రతిబంధకం ఉంటుందీ అని ఆశ్చర్యం కలుగుతోంది.
తెలుగువారు ఆంగ్లంలో వ్యాఖ్యలు వ్రాయటానికి కారణం ఏమిటీ అని ఆలోచిస్తే, మూడు సందర్భాలు కనిపిస్తున్నాయి. మొదటిది వ్యాఖ్యాతకు తెలుగులిపిలో వ్రాయటానికి తగినంత అభ్యాసం లేకపోవటం. రెండవది భావవ్యక్తీకరణకు తెలుగుభాషకు తగినంతశక్తి ఉన్నదన్న విశ్వాసం వ్యాఖ్యాతకు లేకపోవటం. మూడవది, తెలుగుకన్న ఆంగ్లం గొప్పభాష కాబట్టి ముఖ్యమైన విషయాలు ఆంగ్లం లోనే వ్రాయటం సబబు అన్న స్థిరాభిప్రాయం. నా చిట్టిబుఱ్ఱకు తట్టని యే యితర మహత్తర కారణాలైనా ఉన్నాయేమో సందర్భాన్ని బట్టి వ్యాఖ్యాతలో అనుభవాన్ని బట్టి సంపాదకులో సెలవియ్యాలి.
ఆంగ్లంలో ఉన్న వ్యాఖ్యలను చదవటం కంటే, మీరు నాది తెలుగుభాషా దురభిమానం అంటే నిస్సిగ్గుగా ఒప్పేసుకునని ఊరుకోవటమే నాకు సులభమూ సమ్మతమూ కూడా.
నిజమే. ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను నిర్భయంగా పుస్తకరూపం లో ప్రకటించే హక్కు వుండాలి.
కానీ, వచ్చిన చిక్కల్లా ఏంటంటే, ఈ హక్కు హైందవ మతం గురించిన పుస్తకాల పై మాత్రమే చర్చకు వస్తున్నది. ఇస్లాం మతం పై ఒక్క కార్టూన్ వచ్చినా, భూనభోంతరాళాలు దద్దరిల్లుతున్నాయి. పుంఖానుపుంఖాలుగా వస్తున్న ఈ అభిప్రాయాల గొంతుకలు ఎందుకో అప్పుడు మౌనం వహిస్తాయి. ‘లజ్జ’ అన్న పుస్తకాన్ని వ్రాసిన తస్లిమా నస్రీన్ ను హైదరాబాద్ లోని ప్రెస్ క్లబ్ లో కొట్టినప్పుడు, ఎందుకో అప్పుడు ఇంత మందికి భావస్వేఛ్చాప్రకటన హక్కు గురించిన స్పృహ కలుగలేదు.
మతం అనేది అతి సున్నితమైన విషయం. ఎంత కాదనుకున్నా, ఇది ఒక ‘నిరంతరం పోలిక దృష్టి’ తో చూడబడే విషయం. హైందవ మతస్తులు, ఖచ్చితంగా తమ మతంపై వచ్చిన లేదా వస్తున్న విమర్శలను, ఇతర మతాలతో పోల్చి చూసుకుంటారు. కేవలం తమ మతం పై మాత్రమే విమర్శలు వచ్చినట్లైతే, అందులోనూ ఆ విమర్శ వేరొక మతస్తుడిచే చేయబడి వున్నట్లయితే, ఖచ్చితంగా దాని వుద్దేశ్యాన్ని శంకించాల్సిన నేపథ్యం ఏర్పడుతుంది.
“అభిసారం అని “appointment” అనే ఆంగ్లపదానికి భాషాంతరీకరణం అంత సబబుగా తోచదు.”
మొదట్లో ఈ మాట నా స్వకపోల కల్పితమనే అనుకుని జంకుతూ వాడేను. తదుపరి ఈ మాట, విస్తారంగా వాడుకలో లేకపోయినా, దరిదాపు ఇదే అర్థాన్ని ఇస్తుందని తెలుసుకున్నాను.
(చూ. డి. చంద్రశేఖరరేడ్డి, మన భాష, పుట 203, మీడియా హౌస్ పబ్లికేషన్స్, 2001.) వాడుకలో లేకుండా పోతూన్న ఒక మాటని తిరిగి వాడుకలోకి తీసుకొచ్చేనని అనుకొండి. ఇటుపైన “ఎపాయంట్‌మెంట్” అన్న మాటకి తెలుగుమాట లేదని “డిసపాయంట్” అవకుండా మీరు కూడ ఈ మాట వాడి చూడండి. – వేమూరి.
హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి okaDu అభిప్రాయం:
03/10/2014 1:08 pm
తా. శ్యా గారికి.
తెలుగులో రాయకపోవడానికి అసలైన కారణం సమయం లేకపొవడమేనండి. టైప్ చేయడం, తప్పులు దిద్దడం అదీ చాలా టైం పడుతుంది. ఓపిగ్గా కూర్చుని రాయాలి. ఇంకో సమస్య ఏమిటంటే లేఖిని, ఈమాట లలో ఉన్న బాక్సులు టైప్ చేస్తూండగా నిండాయి అనుకోండి, పైకీ కిందకీ లాగడనికి స్క్రాల్ బార్స్ లేవు. టైప్ చేసేది ఎక్కువయ్యే కొద్దీ ఇదెక్కడ గొడవరా భగవంతుడా అని మధ్యలో వదిలేయాలనిపిస్తుంది. అదీకాక నెట్ కనెక్షన్ తెగిపోవడం అనే దరిద్రం ఉండనే ఉంది. కాపీ పేస్ట్ చేయాలంటే సుమారు అరగంట పడుతుంది పెద్ద పోస్ట్ కి. అదే ఆంగ్లంలో అయితే పదిహేను నిముషాల్లో మొత్తం అంతా టైప్ చేసేయొచ్చు – మొత్తం కామెంట్ చేసిన డభ్భై మందినీ ఏకేస్తూ 🙂
[స్క్రాల్ బార్స్ లేకపోయినా అప్, డౌన్ యారోలు వాడి మీరు ఆ కామెంట్ బాక్స్‌లో పైకీ కిందికీ కదలవచ్చు. లేదా ఫైర్‌ఫాక్స్‌లో కుడి వైపు కింది మూలను మౌస్‌తో నొక్కిపట్టుకుని బాక్స్ సైజ్ పెంచుకోవచ్చు కూడా. – సం.]
అనాథ గురించి కార్తీక్ అభిప్రాయం:
03/10/2014 11:38 am
Heart touching.. అలల్లోంచి తప్పిపోయి
ఇసుక మేటలో చిక్కుకుపోయిన నీటి చుక్కలా వాడు
భూమ్మీద ఒంటరిగా మిగిలిపోయాడు. entha baagundo..
సైగల్… గురించి కార్తీక్ అభిప్రాయం:
03/10/2014 11:30 am
నిజంగా చాలా బాగుంది. అధ్బుతః
బల్లి ఫలితం గురించి మోహన అభిప్రాయం:
03/10/2014 10:57 am
appointment, engagement అనే పదాలకు సంకేత అని సంస్కృత నిఘంటువులలో నున్నది. సమయము అని కూడ మనము కలిపితే “సంకేత సమయము” అని చెప్పవచ్చును. ఇందులో అభిసారికలు లేరు, వారికి సంకేత సమయము మాత్రమే కాదు, సంకేత స్థలములు కూడ కావాలి 🙂 విధేయుడు – మోహన
హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి Yoga అభిప్రాయం:
03/10/2014 10:49 am
తాడిగడప గారూ:
పెద్దవారు కాబట్టీ… నమస్కరిస్తూ:
మీరు వివరించిన మూడు కారణాలు కావు. సంపాదకుల అభిప్రాయమేమో కానీ, నేను మాధవ్ గారితో ఏకీభవిస్తాను.
అవును. కొందరికి తెలుగులో రాయడం ఆంగ్లం లో రాయడమన్నంత సులువు కాదు. ఇందులో నేను అనుభవజ్ఞుణ్ణి కాబట్టే నా కష్టం ఏమిటో నాకే తెలుసు. అది తరవాత మీకు, త:త: గారికి, ఇక్కడున్న దిగ్గజాలందరికీ వివరిస్తాను. మీకప్పుడు ఒక ‘insider’ అభిప్రాయం కూడా తెలుస్తుంది.
మీరు ఇంతగా తెలుగులో రాయండి, అని ప్రాథేయ పడడంలో తప్పు లేదు. కానీ అదేదో తెలుగంటే దురాభిమానమని అనుకుంటారేమో అని మీరు అనుకోడం అనవసరమైన ఆలోచన. ఐతే మీరు వేసిన ప్రశ్నలు, అనుకుంటున్న కారణాలు, గంభీరంగా పరిశీలించాల్సిన విషయం ఉంది (దానికి ఈ వ్యాసంతో కూడా సంబంధం ఉంది).
కావున త్వరలోనే ఈ విషయమై నేను “తెలుగొచ్చిన తెలుగోడు భావ వ్యక్తీకరణ చేయబోతే ఆ తెలుగు దేవత, అందని అందంలా, అలా దూరంగా వినువీధుల్లో విహరిస్తూ ఉంటే… నా గుహలో, కుటిలో, చీకటిలో, ఒక్కడనై స్రుక్కిన రోజులు లేవా…” అన్న బాధేమిటో చర్చిస్తాను.
అప్పుడు మీరు ఖచ్చితంగా మీ అభిప్రాయన్ని మార్చుకుని, మా లాంటి వాళ్ళను దయతో క్షమిస్తారని కూడా ఆశిస్తున్నాను.
భవదీయుడు
యోగా
బల్లి ఫలితం గురించి తాడిగడప శ్యామలరావు అభిప్రాయం:
03/10/2014 10:31 am
మీరు ప్రస్తావించిన పుస్తకం(చూ. డి. చంద్రశేఖరరేడ్డి, మన భాష, పుట 203, మీడియా హౌస్ పబ్లికేషన్స్, 2001.) నేను చూడలేదు. ఇటుపైన “ఎపాయంట్‌మెంట్” అన్న మాటకి తెలుగుమాట లేదని “డిసపాయంట్” అవకుండా మీరు కూడ ఈ మాట వాడి చూడండి అన్నారు. కాని అభిసారం అన్నది appointment అన్నమాటకు సరైన అనువాదం ఐనా కాకపోయినా అది సంస్కృతపదం కాని అది అసలు తెలుగు మాట కానేకాదు. ఒకవేళ సరైన పదమే ఐతే ఈ సంస్కృతపదం మనం హాయిగా వాడుకోవచ్చును. కాని ఇది సరైన అనువాదం కాదనే నా అనుమానం.
అభిసారం అనే మాట వినగానే అష్టవిధనాయికల్లోని అభిసారిక గుర్తుకువస్తుంది. (కొంచెం మంది ఇదేమిటండోయ్ ఇదేదో అతిసారం అన్నట్లుందే అనుకునే అవకాశమూ ఉందనుకోండి!)
ఈ అభిసారం అనే మాటకు అభిసారం = ప్రేమికులు సంగమార్థం చేసుకునే నిర్ణయం, ప్రేమికుల సంకేతస్థలం అని వికీపీడియా పేజీలో కనిపించింది కూడా. ఇక్కడ అభిసారిక లేదా అభిసారి లేదా అభిసారుడు అనే పదాల్లో ఒక రహస్యసంకేతస్థలంలో సమాగమనం కోసం పోతున్న వ్యక్తి అనే అర్థం వస్తున్నది.
రాజానం నిహతం థృష్ట్వా అభిసారం చ మారిష
అభ్యథ్రవన్త వేగేన చిత్రసేనస్య సైనికాః
అని కర్ణపర్వంలో ఒక శ్లోకం ఉంది పదవ అధ్యాయంలో. ఇక్కడ అభిసారం అనే మాట ప్రత్యక్షంగా కనిపిస్తోంది. ఇది ఒక యుధ్ధరంగవర్ణనలో భాగం. శృంగారమూ చట్టుబండలూ ఏమీ లేదు. సరే, ఇక్కడ ఎవరికీ ఎవరితోనూ ఏవిధమైన appointment కూడా లేదు కదా?
అలాగే బౌధ్ధవాంగ్మయానికి సంబంధించిన త్రిపిటకంలో అసీతినిపాతో అనే అధ్యాయంలో ఈ అభిసారం అనే మాట తరచుగానే కనిపిస్తున్నది. ఉదాహరణకు ఒకచోట
న తే అభిసరం పస్సే న రథే నపి పత్తికే;
నాస్స చమ్మంవ కీటం వా, వమ్మితే చ ధనుగ్గహే
ఇది ప్రాకృతంలో ఉన్నది. మొదటిపాదం సంస్కృతంలోచూస్తే “న తే అభిసరం పశ్యే న రథే నపి పంక్తికే” అని అనివస్తుంది. రథాలూ సైన్యాలు ఏవీ నీ వెంటరావు సుమా అని అర్థం చెప్పుకోవచ్చును. ఇక్కడా ఏవిధమైన appointment ప్రసక్తీ లేదు.
అందుచేత అభిసారం అనేది appointment అన్నమాటకు సరైన అనువాదం కాకపోవచ్చని అనుకుంటున్నాను.
హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి తాడిగడప శ్యామలరావు అభిప్రాయం:
03/10/2014 9:52 am
ఒక ఆంగ్లవ్యాఖ్య క్రింద, వేలూరి వేంకటేశ్వర రావు వ్రాలు అన్న సంతకం సంతోషం కలిగించింది. పోనీ లెండి కనీసం ఒక్క సారి తెలుగు సంతకం చేసి మమ్మల్ని ధన్యుల్ని చేసారు. శ్రీవేలూరివారు హాయిగా తెలుగులో వ్యాఖ్యను వ్రాయగలరని నా నమ్మకం.
‘ఈమాట’ పత్రికలో వ్యాఖ్యలు సాధారణంగా తెలుగులోనే ఉంటాయన్న మాధవ్‌గారి అభిప్రాయం నిజం కావచ్చు. ఆ విషయంలో గణాంకాలసంగతిచర్చలు వద్దు కాని, కేవలం తెలుగులో రాయమనడం కొందరికి తమ అభిప్రాయం వెల్లడించడానికి ప్రతిబంధకమౌతుందని వారెందుకన్నారో బోధపడలేదు. తెలుగువారికి తెలుగులో చెప్పటానికి ఏమి ప్రతిబంధకం ఉంటుందీ అని ఆశ్చర్యం కలుగుతోంది.
తెలుగువారు ఆంగ్లంలో వ్యాఖ్యలు వ్రాయటానికి కారణం ఏమిటీ అని ఆలోచిస్తే, మూడు సందర్భాలు కనిపిస్తున్నాయి. మొదటిది వ్యాఖ్యాతకు తెలుగులిపిలో వ్రాయటానికి తగినంత అభ్యాసం లేకపోవటం. రెండవది భావవ్యక్తీకరణకు తెలుగుభాషకు తగినంతశక్తి ఉన్నదన్న విశ్వాసం వ్యాఖ్యాతకు లేకపోవటం. మూడవది, తెలుగుకన్న ఆంగ్లం గొప్పభాష కాబట్టి ముఖ్యమైన విషయాలు ఆంగ్లం లోనే వ్రాయటం సబబు అన్న స్థిరాభిప్రాయం. నా చిట్టిబుఱ్ఱకు తట్టని యే యితర మహత్తర కారణాలైనా ఉన్నాయేమో సందర్భాన్ని బట్టి వ్యాఖ్యాతలో అనుభవాన్ని బట్టి సంపాదకులో సెలవియ్యాలి.
ఆంగ్లంలో ఉన్న వ్యాఖ్యలను చదవటం కంటే, మీరు నాది తెలుగుభాషా దురభిమానం అంటే నిస్సిగ్గుగా ఒప్పేసుకునని ఊరుకోవటమే నాకు సులభమూ సమ్మతమూ కూడా.
హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి Dr. CBS Venkataramana అభిప్రాయం:
03/10/2014 8:09 am
శ్రీమతి వెండీ డానిగర్ గారి పుస్తకం గురించి:
నిజమే. ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను నిర్భయంగా పుస్తకరూపం లో ప్రకటించే హక్కు వుండాలి.
కానీ, వచ్చిన చిక్కల్లా ఏంటంటే, ఈ హక్కు హైందవ మతం గురించిన పుస్తకాల పై మాత్రమే చర్చకు వస్తున్నది. ఇస్లాం మతం పై ఒక్క కార్టూన్ వచ్చినా, భూనభోంతరాళాలు దద్దరిల్లుతున్నాయి. పుంఖానుపుంఖాలుగా వస్తున్న ఈ అభిప్రాయాల గొంతుకలు ఎందుకో అప్పుడు మౌనం వహిస్తాయి. ‘లజ్జ’ అన్న పుస్తకాన్ని వ్రాసిన తస్లిమా నస్రీన్ ను హైదరాబాద్ లోని ప్రెస్ క్లబ్ లో కొట్టినప్పుడు, ఎందుకో అప్పుడు ఇంత మందికి భావస్వేఛ్చాప్రకటన హక్కు గురించిన స్పృహ కలుగలేదు.
మతం అనేది అతి సున్నితమైన విషయం. ఎంత కాదనుకున్నా, ఇది ఒక ‘నిరంతరం పోలిక దృష్టి’ తో చూడబడే విషయం. హైందవ మతస్తులు, ఖచ్చితంగా తమ మతంపై వచ్చిన లేదా వస్తున్న విమర్శలను, ఇతర మతాలతో పోల్చి చూసుకుంటారు. కేవలం తమ మతం పై మాత్రమే విమర్శలు వచ్చినట్లైతే, అందులోనూ ఆ విమర్శ వేరొక మతస్తుడిచే చేయబడి వున్నట్లయితే, ఖచ్చితంగా దాని వుద్దేశ్యాన్ని శంకించాల్సిన నేపథ్యం ఏర్పడుతుంది.
(to be continued)
బల్లి ఫలితం గురించి Rao Vemuri అభిప్రాయం:
03/10/2014 5:47 am
“అభిసారం అని “appointment” అనే ఆంగ్లపదానికి భాషాంతరీకరణం అంత సబబుగా తోచదు.”
మొదట్లో ఈ మాట నా స్వకపోల కల్పితమనే అనుకుని జంకుతూ వాడేను. తదుపరి ఈ మాట, విస్తారంగా వాడుకలో లేకపోయినా, దరిదాపు ఇదే అర్థాన్ని ఇస్తుందని తెలుసుకున్నాను.
(చూ. డి. చంద్రశేఖరరేడ్డి, మన భాష, పుట 203, మీడియా హౌస్ పబ్లికేషన్స్, 2001.) వాడుకలో లేకుండా పోతూన్న ఒక మాటని తిరిగి వాడుకలోకి తీసుకొచ్చేనని అనుకొండి. ఇటుపైన “ఎపాయంట్‌మెంట్” అన్న మాటకి తెలుగుమాట లేదని “డిసపాయంట్” అవకుండా మీరు కూడ ఈ మాట వాడి చూడండి. – వేమూరి.
కోనసీమ కథలు: శిరోముండనం గురించి Brahmanandam Gorti అభిప్రాయం:
03/10/2014 2:10 am
Sharing an article on the state of Widows/divorcees in India
http://www.bbc.com/news/magazine-26356373
కథ నచ్చిందంటూ అభినందనలు తెలిపిన వారికి ధన్యవాదాలు.