పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16474

  1. గణపవరపు వేంకటకవి శబ్దార్థచిత్ర పద్యాలు కొన్ని గురించి అశ్మాచం అభిప్రాయం:

    05/02/2014 1:45 pm

    “శబ్దార్థ చిత్రపద్యములు కొన్ని” అన్న వ్యాసనామానికి ఆయింతగా అభ్రేషము చేకూర్చినా, ఏకార్థముతో కాకుండా చిన్నపాటి ఉపోద్ఘాతముతో మొదలుపెట్టితే ఈ చినుకుపూస ముత్తెపుదండలా వుండేదని అభిప్రాయం.

    ఈ వ్యాసములోని విషయము, వివరణ మహాపండితులకు తప్ప సాధ్యము కాదు. శ్రీ ఏల్చూరికి విషయమూ, వివరణ రెండూ సమృద్ధిగా ఉన్నవి.
    ధన్యవాదాలతో.

    అశ్మాచం
    (asm chamdra)

    [మీ సూచన అనుసరించి వ్యాసకర్త ఒక ముందుమాట రాసి పంపించారు. అది వ్యాసానికి జతచేశాము. – సం.]

  2. మనకు తెలియని బ్రౌన్ దొర: ఛాల్స్ ఫిలిప్ బ్రౌన్ గురించి okaDu అభిప్రాయం:

    05/02/2014 11:14 am

    అద్భుతమైన వ్యాసం. నా మట్టిబుర్రకి తెల్సినంతలో “ఇంగ్లాండు ప్రభువులు” వాళ్ళ సొంత మొహాలు వెలిగించుకోవడానికే (దీన్నే ఇంగ్లీషులో “CUA” అంటారనుకుంటా) కానీ భారద్దేశాన్ని “ఉద్ధరిద్దామని” ఇండియా వచ్చినట్టు కనబడదు. అయితే ఒకటి చెప్పుకోవాలి వీళ్ళ గురించి. వాళ్ళు నేర్చుకున్న తెలుగు వాళ్ళ వాడుకకి ఆ రోజుల్లో సరిపోయింది. చాలకపోతే ఇలా డిక్షనరీలు తయారు చేసుకున్నారు. మనకి ప్రెస్సులూ అవీ లేనందున మనం మౌఖికంగా నేర్చుకున్నాము. ఆ పద్ధతి వాళ్ళకి కష్టమై పుస్తకాలు తీసుకొచ్చేరు. అవి ఎంతవరకు ఉపయోగం అనేది వేరే కధ. అవి మీరు వివరించారు కనక ఆ జోలికి వెళ్డం లేదు.

    కొంచెం ముందుకు వెళ్తే, కాటన్ కూడా గోదావరి మీద ఆనకట్టలు కట్టడానికి కారణం ఆయన ఉద్యోగ ధర్మమే కానీ మనమీద జాలిపడి మనని ఉద్ధరిద్దామని కాదు. ప్రభుత్వం ఒప్పుకోకపోతే, ఆనకట్టల వల్ల ఎంత ఆదాయం వస్తుందో చూపించి మరీ ఒప్పించాడు తప్ప మనని ఉద్ధరిద్దామని కాదు. వరదలప్పుడూ, కష్టాలొచ్చినప్పుడూ కూలి వాళ్ళు పనికి రానంటే గుర్రం మీద కొరడాతో నించుని కొట్టి మరీ పనిచేయించుకునేవాడు అని చెప్పడం నేను విన్నాను. తర్వాత నీళ్ళొచ్చినందుకు ఒక బ్రాహ్మడు సంధ్యావందనం చేస్తూ ఆయనకి శుభం కలగాలని మంత్రం చదవడం, ఒడ్డుమీదనుంచి ఈ “దొరగారు” వినడం అవీ నిజమో కాదో తెలియదు. కట్టుకధలు అవ్వొచ్చు.

    ఇప్పటికీ ఉన్న దరిద్రం ఏమిటంటే, అప్పటి దొరగారి మునిమనవడో, ఈని మనవడో ఇండియా వస్తే వాణ్ణి ఆకాశానికెత్తేశి రాచమర్యాదలు చేయడం (గత రెండు సంవత్సరాలలో జరిగినట్టు గుర్తు).

    వేమన పద్యాలని — మరీ ముఖ్యంగా బ్రాహ్మణ వ్యతిరేకత వుంది కాబట్టి వేమనని — పైకి తీసుకొచ్చాడు బ్రౌన్‌.

    దీనిని నేను ఒప్పుకోనండి. వేమన శతకంలో బ్రాహ్మణ వ్యతిరేకత నాకు అంత కనపడలేదు. నేను సరిగ్గా చదవలేదేమో. నా ఉద్దేశ్యం ప్రకారం వేమన పద్యాలని ఎందుకు తీసుకొచ్చాడంటే అప్పట్లో ఆయనకి ఇవి ఈజీగా అర్ధమై ఉండొచ్చు. కష్టంగా ఉన్నవాటిని పక్కన పెట్టేడు. బ్రౌన్ అంత గొప్పవాడైతే ఆయన సంస్కరించిన పుస్తకాలు తప్ప మిగతావి మనకి లభ్యం కాకూడదు. కానీ మనకి దాదాపు అన్నీ లభ్యమౌతున్నాయి.

    క్రితం ఇండియా ట్రిప్పులో మా అత్తారి ఊరిలో ఈ బ్రౌన్ దొరవీ, కాటన్ దొరవీ (ఉభయగోదావరి జిల్లాల్లో, ముఖ్యంగా ప.గో లో) విగ్రహాలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. ఇన్నేళ్ళ తర్వాత వీళ్ళెవరో ఇంకా ప్రజలకి గుర్తుంటారా అంటే, ఉండరు కానీ మనం వాళ్ళ విగ్రహాలు కట్టి, బలవంతంగా గోంతుకలో పోసి మింగిస్తే గుర్తుపెట్టుకోక ఛస్తారా?

  3. వైజ్ఞానిక రంగంలో తెలుగులోకి అనువాదాలు చెయ్యటంలో సాధక బాధకాలు గురించి అశ్మాచం అభిప్రాయం:

    05/02/2014 11:00 am

    ఈ సంచికలో ఇది అత్యుత్తమమైన వ్యాసం.
    చాలా చక్కగా చిక్కగా ఉన్నది.
    ధన్యవాదాలు శ్రీ వేమూరి.

    అశ్మాచం

  4. మనకు తెలియని బ్రౌన్ దొర: ఛాల్స్ ఫిలిప్ బ్రౌన్ గురించి దేశికాచారి అభిప్రాయం:

    05/02/2014 7:40 am

    బ్రౌనుగారి సాహిత్యసేవను కేవలం వందిత్వదృష్టితోగాక యథార్థదృష్టితో పరిశీలించి వ్రాసిన ఈ వ్యాసం ఎంతో నూతనసమాచారాన్ని తెలుపుతూ ఉన్నది. ప్రపంచంలో ఏఫలాపేక్ష లేకుండ ఉత్తమకార్యాలు చేసే మహామహులు కొందఱుంటారు. ఏదో ఒక ఉత్తమమైన స్వార్థపరమైనలక్ష్యంతో గూడిన అభినివేశంతో మంచి కార్యాలు చేసేవారు కొందఱుంటారు. కొందఱు పూర్వపు జమీందారులు ఈరెండవకోవకు చెందిన వారనుట స్పష్టమైనదే. మీవ్యాసం చదివిన తర్వాత బ్రౌనుగారుకూడ ఈరెండవకోవకు చెందినవారనే అవగాహన నాకు కుదిరింది. ఒక చిన్న సవరణ. మీవ్యాసంలో తెలంగాణమునందలి సంస్థానాధీశులందఱు వెలమదొరలనే అర్థం స్ఫురిస్తున్నది. కాని తెలంగాణమునందలి సంస్థానాధీశులలో ఒక్క జటప్రోలు (కొల్లాపురము) వారు మాత్రమే రాచకొండ నేలిన సర్వజ్ఞసింగభూపాలుని సంతతివారైన పద్మనాయక (వెలమ)ప్రభువులు. మిగితా వనపర్తి, గద్వాల, గోపాలుపేట, ఆత్మకూరు(అమరచింత) ఈ సంస్థానాధీశులందఱు రెడ్డికులజులు.

  5. గూడు గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:

    05/02/2014 6:34 am

    కళ్ళకి కట్టినట్టుంది. ఎంత చక్కటి భాష. మరెంత చింతపెట్టే భావం! ఒక సజీవ సన్నివేశం కళ్లముందు కొచ్చి కదిలిందా, కదిలించిపోయిందా అన్నట్టుంది. కవితాభిమానుల గుండెల్లో నిజంగానే గూడు కట్టుకునే కవిత. వీరి కవితే – ఇంతకుముందొకసారి, ఇక్కడే చదివిన గుర్తుంది.

    కవులిరువురికీ నా అభివందనాలు.

  6. అంపశయ్య: మరొకసారి కొత్తగా! గురించి వే ణు అభిప్రాయం:

    05/02/2014 5:13 am

    తెలుగులో వచ్చిన నవలల్లో ఈ ‘అంపశయ్య’ నవల ప్రత్యేకమైనది. ఎలాంటి సంకోచాలూ లేకుండా కథానాయకుడైన రవి ఆలోచనా స్రవంతిని రచయిత అక్షరబద్ధం చేశారు. రవి ఆలోచనల్లో కూడా రచయితల, కవుల కొటేషన్లు విస్తృతంగా పరుచుకునివుంటాయి. చదువుతుంటే సమకాలీన సాహిత్య పరిమళం, సాంస్కృతిక వాతావరణం పాఠకులను చుట్టుముడుతుంది.

    ఈ నవల మొదట్లోనే – ‘రవి కిరణాంగుళీ నఖక్షతాలతో శ్యామలాకాశం కందింది’ అనే చలం గారి కొటేషన్ని కథతో అనుసంధానం చేయటం ఆకట్టుకుంటుంది. ఈ పదాల్లోనే ప్రధాన పాత్రల పేర్లు (రవి, కిరణ్మయి)గా వచ్చేలా రచయిత నవీన్ భలే రాశారే అనిపిస్తుంది.

    భిన్న కోణాలను స్పశిస్తూ ఈ నవలపై మీరు చేసిన విశ్లేషణ సమగ్రంగా, ఆసక్తికరంగా ఉంది. నవల ముగింపు విషయంలో మీ అభిప్రాయంంతో ఏకీభవిస్తున్నాను!

  7. మోహమకరందం గురించి Prasuna అభిప్రాయం:

    05/02/2014 4:38 am

    బాగుంది మానసా. ఓ చక్కటి చిత్రం కళ్ళముందు ఆవిష్కృతమైంది.

  8. మరి నువ్వేమో… గురించి Prasuna అభిప్రాయం:

    05/02/2014 4:32 am

    ప్రొద్దుటి నుంచీ ఎన్నిసార్లు చదివానో. ప్రతి ఖండికా బాగుంది నిషీ. జీవితంలో ఎన్నింటికో ఈ కవితని అన్వయించుకోవచ్చు. చాలా బాగుంది.

  9. కోనసీమ కథలు: సంస్కృతం మాస్టారు ఇస్మాయిల్ గురించి వి ఎల్ ఎస్ మూర్తి అభిప్రాయం:

    05/02/2014 2:29 am

    వయసు మీద పడ్డ జీవితాలకి గతమే పెద్ద నేస్తం. అందులోనే వాళ్ళని వాళ్ళు తడిమి చూసుకుంటారు. — ఈ మాటలు చాల బాగా అన్నారు. హృదయానికి హత్తుకునే కథ. చాలా బాగుంది. అభివందనాలు.

    వి ఎల్ ఎస్ మూర్తి

  10. పాఠకులకు సూచనలు గురించి Ranitha అభిప్రాయం:

    05/02/2014 1:22 am

    సంపాదకుల గారికి నమస్కారం.

    ఈ మాట చాలాలాలాలా బాగుంది. మా రచనలు పంపాలంటే ఎలాగో తెలియ చేయగలరు,, అలాగే కార్టున్ లు కూడ ప్రచురిస్తార?????