పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16474

  1. కొత్తపల్లి – పిల్లల పత్రిక సంపాదకుడు నారాయణ శర్మతో ముఖాముఖి గురించి రాధ మండువ అభిప్రాయం:

    05/03/2014 1:36 pm

    అవును అనిల్ గారూ దశదిశలా వ్యాపించాలి. పిల్లలకి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్న ఈ పత్రిక కి ఆదరణ లేదంటే నమ్ముతారా? దయచేసి ఈ పత్రికకి చందాలు కట్టి, సెట్స్ ఆర్డర్ చేసి పత్రికని నిలబెట్టండి ప్లీజ్. http://www.kottapalli.in

  2. ఎండని ఏడో చేప కథ గురించి రంగ అభిప్రాయం:

    05/03/2014 1:09 pm

    ఆచార్యులవారూ,

    కథ కమ్మగా చెప్పారు.

    ‘ఇమ్మిగ్రేషన్’కి తెలుగు పదాన్ని కట్టలేదెందుకో?

    రంగ

  3. నా అమెరికా ప్రయాణం గురించి Rao Vemuri అభిప్రాయం:

    05/03/2014 9:00 am

    ధన్యవాదాలు, వేణు గారూ. రచనలు చదవటానికి ఆలశ్యం ఏమిటి? వస్తువుకి కాలదోషం పట్టనంత సేపూ ఎప్పుడు చదివినా పరవా లేదు. ఇప్పుడు ఈ పుస్తకం “ఇ-పుస్తకం” రూపంలో కినిగె వారు (kinige.com) విడుదల చేసేరు కనుక నలుగురికీ తేలికగా అందుబాటులోకి వచ్చింది. – వేమూరి

  4. నా అమెరికా ప్రయాణం గురించి Venu అభిప్రాయం:

    05/03/2014 7:14 am

    చాలా బాగుంది వేమూరి గారు. ముఖ్యంగా మీ తెలుగు వింటుంటే ఎంతో హాయిగా చెప్పలేనంత తీయ్యగా వుందండీ. మీ రచనలనీ మరియూ మీ తెలుగుని చాలా ఆస్వాదిస్తున్నామండి. కాని ఆలస్యంగా మీ రచనలు చదువుతున్నాను అందుకు కొంచెం బాధగానే వుందండీ కాని ఇప్పటికైనా మీ రచనలు చదవగలుగుతున్నందుకు చాలా సంతోషంగా వుందండి. ధన్యవాదాలు వేమూరి గారు.

  5. పెండ్యాల జనరంజని గురించి Jagadeeshwar Reddy Gorusu అభిప్రాయం:

    05/03/2014 2:57 am

    అసంపూర్ణమైనా అపురూపం. అద్భుత స్వర కర్త అసలు స్వరం విన్నాం. అదిచాలు. ధన్యవాదాలు – గొరుసు

  6. కొత్తపల్లి – పిల్లల పత్రిక సంపాదకుడు నారాయణ శర్మతో ముఖాముఖి గురించి Anil అనిల్ అట్లూరి అభిప్రాయం:

    05/03/2014 2:32 am

    కొత్తపల్లి దశదిశలా వ్యాపించాలని కోరుకుంటున్నాను!

  7. సెలవురోజు మొదటి ఆట గురించి Sivakumar అభిప్రాయం:

    05/02/2014 7:48 pm

    బాగా పరిచయమైన సారో కథలకి విలక్షణమైన చట్రం. ఇలాంటి సారోలకి స్పందించే హృదయాలు ఆ స్పందనదగ్గరే ఆగిపోతున్నాయన్నది రచయిత పెట్టిన చురక. ఈ కథ, తనని మెచ్చుకునేవాళ్లని, ఈ సారోలని తొలగించడానికి మీరేం చేస్తున్నారని నిలదీస్తుంది. ఆ ప్రశ్నని రచయితకూడా తప్పించుకోలేరు.

  8. వైజ్ఞానిక రంగంలో తెలుగులోకి అనువాదాలు చెయ్యటంలో సాధక బాధకాలు గురించి Rao Vemuri అభిప్రాయం:

    05/02/2014 7:35 pm

    “రక్తానికి ఎరుపు రంగునిచ్చే పదార్థం పేరు ‘హీమ్’ ఒక్క హీమ్ బణువులో వందలకొద్దీ అణువులు ఉంటాయి.”

    ఈ వాక్యంలో చిన్న తప్పు దొర్లిందని ఒక స్నేహితుడు ఎత్తి చూపేడు. ముందుగా ఆ స్నేహితుడికి నా ధన్యవాదాలు. భాషకీ, భావానికీ మధ్య లంకె ఎంత ముఖ్యమో కాళిదాసుని అడగక్కరలేదు, ఈ వాక్యమే చెబుతుంది. ‘హీమ్‌’ లో వందల కొద్దీ అణువులు లేవు, 75 మాత్రమే ఉన్నాయి అని నా స్నేహితుడు నా తప్పుని ఎత్తి చూపించేడు. “ఎన్నో” అని రాయడానికి బదులు “వందలకొద్దీ” అని అజాగ్రత్తగా రాసేను.

    ఎందుకైనా మంచిదని పుస్తకం తెరచి చూసేను. నాలుగు రకాల ‘హీమ్‌’లు ఉన్నాయిట. ఒక రకంలో వంద దాటి ఉన్నాయి, మరొక రకంలో వంద కంTE తక్కువ ఉన్నాయి. ఒక బణువులో 116 కాని 117 కాని అణువులు ఉంటే దానిని “వందలకొద్దీ” అనకూడదు. “వంద పైబడి” అనొచ్చు. సైన్సు రాసేటప్పుడు భాషలో ‘ఖచ్చితత్త్వం’ ఉండాలంటారు, అలంకారాలకి తావు లేదంటారు.

    జానీ కార్సన్‌ కారల్‌ సేగన్‌ ని వెటకారం చేస్తూ “బ్బిలియన్స్‌” అని బిని వత్తి పలుకుతూ అనేవాడు. అదే ధోరణిలో “వ్వందలకొద్దీ” అని మీరు ఎవ్వరైనా వెటకారం చేస్తే నేను భరిస్తాను. పైన ఉదహరించిన వాక్యం ఇలా ఉంటే సరిపోతుంది: “రక్తానికి ఎరుపు రంగునిచ్చే పదార్థం పేరు ‘హీమ్.’ ఒక్క హీమ్ బణువులో 75 నుండి 117 వరకు అణువులు ఉండొచ్చు.”

    ఈ తప్పుని సరిదిద్దమని సంపాదకుడిని ప్రార్ధిస్తున్నాను.

    శలవ్‌
    వేమూరి

    [02మే2014: పై వాక్యం సవరించాము – సం.]

  9. ఇద్దరు మిత్రులు గురించి Ayyavaru Sivalenka అభిప్రాయం:

    05/02/2014 3:44 pm

    nice story. i read similar story in telugu long back. In that two friends start their journey to Kasi and one of them does the same thing what eLishaa did and comes back. don’t know which story came first.

    Note: for some reason I could never do the telugu typing on this site. Also there is no way I can go up using keyboard to rectify any mistake. next time i wish i type in telugu ealisy.

    [we are baffled. All you have to do is to choose Telugu, click in the comment box and start typing! Similarly you can move up and down using arrows! – Ed.]

  10. ఇద్దరు మిత్రులు గురించి sivasankar అభిప్రాయం:

    05/02/2014 2:22 pm

    హల్లో శర్మగారు – మంచి సందేశాత్మక కధని అందించినందుకు ధన్యవాదములు. చాలా చక్కగా అనువదించారు. మరికొన్ని లియో టాల్స్‌టాయ్ కధలు అనువదించగలరు అని కోరుకుంటున్నాను.

    ఇట్లు
    శివ