శ్రీ ఏల్చూరి మురళీధర రావు గారి శ్రీ బొప్పన గంగనామాత్య ప్రణీతమంబైన భాగవత పంచమ స్కంధ విశ్లేషణ వారి పాండిత్య ప్రతిభకే గాక వారి సువిశాల తత్వ జ్ఞానసంపదకు వారి సూక్ష్మ పరిశీలనా శక్తికి దర్పణము పడుతుంది.ఇప్పుడు వాడుకలో నున్న ప్రతులలో నున్న దోషాలకు వారు సూచించిన సవరణలు సమంజసముగా నున్నాయి. బలికి సిద్ధపడుతున్నప్పుడు జడభరతుడు పద్మదళాక్షుని తన హృదయములో నిల్పుకొని కాళికా దేవిపైన, కరవాలము పైన ‘అచ్చపు భావముంచుటే’ పద్యానికి, పద్యభావానికీ సొంపు తెస్తుంది. అలాగే పటు తాటంక రథాంగ యుగ్మమునకు బదులు పటుతాటంక పలాంగ యుగ్మ మనే సవరణ కూడా బాగుంది. వ్యాసము సుదీర్ఘమైనా రసవంతముగా సాగింది. అందులో భాగవతములో నన్ను బాగా ఆకర్షించిన జడభరుతుని కధ నెన్ని పర్యాయములైనా చదువుకోగలను. శ్రీ ఏల్చూరి వారికి అభివందనములు!
“అచ్చుయంత్రం వచ్చిన తరువాత మన పుస్తక నిర్మాణ చరిత్ర ఇంతవరకూ ఎవరూ రాయలేదు. ”
జోలెపాలెం మంగమ్మ గారి “Book Printing in India: With special reference to the contribution of European scholars to Telugu (1746-1857)” పుస్తకం కొంత వరకైనా ఈ పని చేసిందనుకుంటున్నాను. నేనీ పుస్తకాన్ని స్థాలీపులాకంగానే చదివాను. చూసినంతవరకూ చేయదగినంత ప్రయత్నం మంగమ్మ గారు చేశారనే అనుకుంటున్నాను. ఈ పుస్తకం గురించి మీకు తెలియదని అనుకోను. మరచిపోయారా, లేక ఆ పుస్తకం ఉదహరించడానికి అర్హం కాదనుకున్నారా?
బ్రౌన్ నిజంగా తెలుగును ఉద్ధరించడానికే చేశాడా అన్న విషయాన్ని చాలా వివరంగానే ప్రశ్నించారు. ఐతే వేమన పద్యాల్లోని ప్రక్షిప్తాల్ని వేరు చేయకుండా ప్రచురించడమే బ్రౌన్ చేసిన తప్పా? మౌఖిక సాహిత్యాన్ని పట్టించుకోకుండా గత సాహిత్య పరిష్కారం ఇప్పటికీ జరుగుతుండడం (అసలు జరిగితే!) గురించిన విశ్లేషణ బాగా నచ్చింది.
ఇన్ని సంవత్సరాల తరవాత నేను ఇప్పుడే చదవటం తటస్తించింది.
కధలో లా శంకర్ లాంటి నాన్నలున్నా జిమ్మి బ్రైన్ లాంటి ఇన్ఫ్లుఎన్స్ దాటి బయటికి రాలేని వాళ్ళు బోలెడుమంది. అది “నిగ్గర్స్” అనుకునే ఆలోచన కావచ్చు లేదా కులం కావ్చ్చ. అసలు కిరణ్ నాన్నే జిమ్మి బ్రైన్ లా వుండచ్చు. ఇది వొక్క NRI లకి మాత్రమే సంబంధించిన కధ అనుకొనక్కర్లేదు ఇండియాలో మనది కాని రాష్ట్రంలో కూడా కావచ్చు. ముంబైలో బిహారి పిల్లాడితో స్నేహం కూడా మాథ్యుతో స్నేహం కావచ్చు. ఇన్ని సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఇంకా మాలవాడలు మాదిగ వాడలు వున్నాయి, హొనౌర్ కిల్లింగ్స్ ఇంకా జరుగుతున్నాయి.
కధలో చెప్పకుండా చెప్పిన బోలెడు విషయాలు ఇప్పటికీ అన్వయిస్తాయి. పర్యావరణ కాలుష్యం లాగా ఈ కాలుష్యం ఇంకా పెద్దదవ్వడానికి మన పాత్ర ఎంత?
ఇలాంటి సజీవమైన కధ రాసిన నారాయణ స్వామి గారికి అభినందనలు
నాకూ అలానే ఎలా అర్ధం చేసుకోవాలో తెలీనట్లు… కాని జ్ణాపకాల గురించి రాసిన చాలా వాక్యాలు నాకెప్పుడూ అనిపించే వాటిలా అనిపించి బావున్నట్లు కూడా వుంది. మొత్తానికి మోడర్న్ఆర్ట్ లా నాకు అర్ధం కాకుండా పొయింది.
“ఇంకొకళ్ళను కష్టపెట్టకుండా జాగ్రత్త పడాలి.” నిజం అందరు ఇలానే అనుకుంటుండచ్చు; కాని అందరికీ అన్నిసార్లూ సాధ్యం కాకపొవచ్చు. మన ప్రమేయం లెకుండానే బరువైపొవచ్చు. బరువయ్యాము అని మనకి తెలియకుండా బరువవ్వచ్చు ఆల్జిమర్స్ లాంటివాటితో…
చాలా చక్కగ చెప్పారు. మీ సుజనరంజనిలో “కల్చరు” హాస్య రచనలో లానే చాలా హృద్యంగా చెప్పారు.
వ్యాసం చాలా బాగుంది. చర్చ రసవత్తరంగా జరిగింది. మధ్యలో శ్రీనివాస్ గారి అర్హతలు, అధికారాల గురించి చర్చ దారిమళ్ళటం అవాంఛనీయం. ఆయన విజ్ఞత, తెలుగుపై ఉన్న ఆయనకున్న జిజ్ఞాస తక్కువేమీ కాదు. “అమెచ్యూర్ సాహితీవేత్తలకు మాట్లాడే అర్హత లేదన్నట్టుగా తీర్మానించటం” శోచనీయం. ఇది సరైన పద్దతి కాదు.
ఇక వ్యాసంలో నాకనిపించిన ఒక విషయం:
ఈ వ్యాసమంతా ఈ క్రింది ఇవ్వబడ్డ కొన్ని “అనుకోళ్ళ” (assumptions) ఆధారంగా నడిచినట్టుంది.
1834లో ఉద్యోగం కోల్పోయి ఇంగ్లాండులో మూడేళ్లు గడిపిన కాలంలో అక్కడి భారతీయ భాషల స్కాలర్స్‌తో జరిపిన సంభాషణలు అతనిలో తను కూడా స్కాలర్ అవ్వాలనే కోరిక బలపరచి వుండాలి.
బహుశా ఆ నాటికే బ్రౌన్‌లో ఇంకొక వ్యక్తి బలపడడం మొదలుపెట్టాడు.
వాళ్ళ దగ్గర తను ఎంత వినయం ప్రదర్శిస్తే తనకి అంత గౌరవం. ఈ మాటల్ని ఈ సందర్భంలో అర్థం చేసుకుంటే బ్రౌన్ చూపించిన వినయానికి ఒక అంతర్గత కారణం ఉందని బోధపడుతుంది.
కానీ అనుకోళ్ళ ఆధారంగా ఎప్పుడో గతించిపోయిన ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని అంచనా వేసి, అతను చేసిన పనిని కూడా తక్కువచేసి మాట్లాడటం నచ్చలేదు. ఎన్ని ఆధారాలు చూపిస్తున్నా నమ్మబుద్ది కావటం లేదు.
సత్యప్రసాద్ గారు, — మీ కథని ఒకటికి రెండు సార్లు చదివా. అయినా, నాకు కొంత వరకే అర్ధమైందని తెలియచేయడానికి చింతిస్తున్నా. గొప్పగొప్ప ఉన్నత స్థాయీ రచనలు ఓ పట్టాన అర్ధం కావంటారు అందుకేకామోసు. 🙂
కథా రచనలో వాడిన కొన్ని పదాలు నాకు నచ్చలేదు. ఈ మధ్య కాలంలో ఎందుకో కానీ, రైటర్స్- కొన్ని తిట్లని యధాతధంగా రాసేస్తున్నారు. వ్యక్తిగతంగా నేనందుకు వ్యతిరేకిని కావడం వల్ల కావొచ్చు, బహుశా ఆ ప్రభావం – కథ మీద కూడా పడుతోందనుకుంటా. ఆ కారణమే కథలపై సదభిప్రాయాన్ని కలగనీకుండా చేస్తోందని చెప్పడానికి నేనేమాత్రం వెనకాడటం లేదు. ఏదేమైనా, ఈ కథని ఇదే వేదిక మీద మీరొక సారి ఎక్స్ ప్లయిన్ చేస్తే తప్ప, కథ పట్ల పూర్తి అవగాహనకొచ్చే అవకాశం నాకు కనిపించడం లేదు.
భక్తకవి బొప్పన గంగనామాత్యుని శ్రీ మహాభాగవత పంచమ స్కంధం గురించి గన్నవరపు నరసింహ మూర్తి అభిప్రాయం:
09/06/2014 12:33 am
శ్రీ ఏల్చూరి మురళీధర రావు గారి శ్రీ బొప్పన గంగనామాత్య ప్రణీతమంబైన భాగవత పంచమ స్కంధ విశ్లేషణ వారి పాండిత్య ప్రతిభకే గాక వారి సువిశాల తత్వ జ్ఞానసంపదకు వారి సూక్ష్మ పరిశీలనా శక్తికి దర్పణము పడుతుంది.ఇప్పుడు వాడుకలో నున్న ప్రతులలో నున్న దోషాలకు వారు సూచించిన సవరణలు సమంజసముగా నున్నాయి. బలికి సిద్ధపడుతున్నప్పుడు జడభరతుడు పద్మదళాక్షుని తన హృదయములో నిల్పుకొని కాళికా దేవిపైన, కరవాలము పైన ‘అచ్చపు భావముంచుటే’ పద్యానికి, పద్యభావానికీ సొంపు తెస్తుంది. అలాగే పటు తాటంక రథాంగ యుగ్మమునకు బదులు పటుతాటంక పలాంగ యుగ్మ మనే సవరణ కూడా బాగుంది. వ్యాసము సుదీర్ఘమైనా రసవంతముగా సాగింది. అందులో భాగవతములో నన్ను బాగా ఆకర్షించిన జడభరుతుని కధ నెన్ని పర్యాయములైనా చదువుకోగలను. శ్రీ ఏల్చూరి వారికి అభివందనములు!
తెలుగులో గ్రంథ పరిష్కరణ గురించి కొన్ని ఆలోచనలు గురించి Maddipati Krishna Rao అభిప్రాయం:
09/06/2014 12:01 am
“అచ్చుయంత్రం వచ్చిన తరువాత మన పుస్తక నిర్మాణ చరిత్ర ఇంతవరకూ ఎవరూ రాయలేదు. ”
జోలెపాలెం మంగమ్మ గారి “Book Printing in India: With special reference to the contribution of European scholars to Telugu (1746-1857)” పుస్తకం కొంత వరకైనా ఈ పని చేసిందనుకుంటున్నాను. నేనీ పుస్తకాన్ని స్థాలీపులాకంగానే చదివాను. చూసినంతవరకూ చేయదగినంత ప్రయత్నం మంగమ్మ గారు చేశారనే అనుకుంటున్నాను. ఈ పుస్తకం గురించి మీకు తెలియదని అనుకోను. మరచిపోయారా, లేక ఆ పుస్తకం ఉదహరించడానికి అర్హం కాదనుకున్నారా?
బ్రౌన్ నిజంగా తెలుగును ఉద్ధరించడానికే చేశాడా అన్న విషయాన్ని చాలా వివరంగానే ప్రశ్నించారు. ఐతే వేమన పద్యాల్లోని ప్రక్షిప్తాల్ని వేరు చేయకుండా ప్రచురించడమే బ్రౌన్ చేసిన తప్పా? మౌఖిక సాహిత్యాన్ని పట్టించుకోకుండా గత సాహిత్య పరిష్కారం ఇప్పటికీ జరుగుతుండడం (అసలు జరిగితే!) గురించిన విశ్లేషణ బాగా నచ్చింది.
అమెరికా ఇల్లాలి ముచ్చట్లు: బరువు! గురించి శ్యామలాదేవి అభిప్రాయం:
09/05/2014 10:28 am
నిజం రమ గారు! అందరం అలానే అనుకుంటాం. చెయ్యగలిగిన దల్లా మన పరిధి మేరకు జాగ్రత్త పడటమే. మీ చక్కని అభిప్రాయాన్ని తెలియజేసినందుకు నా ధన్యవాదాలు.
శ్యామలాదేవి
అమెరికా ఇల్లాలి ముచ్చట్లు: బరువు! గురించి Rama అభిప్రాయం:
09/05/2014 10:09 am
శ్యామల గారు మీరు మి ఈమైల్ చెప్పగలరా? లేదా నాకు మీరు రాసినా సరె rd6219@yahoo.com
మీ అమెరికా ఇల్లాలి ముచ్చట్లకి కౌముది అప్పటి నుండీ గొప్ప అభిమానిని. మీ సుజన రంజని హాస్యరంజనిలో కల్చరు చదివాక మీకు మైల్ రాయలనిపించింది.
రమాదేవి
పూర్వజన్మ వాసన గురించి Rama అభిప్రాయం:
09/05/2014 10:00 am
తుపాకి రాసిన రచయిత దేనా ఈ కథ? ఇంకెవరి కధ అయినా మీ పెరుతో పంపారా? ప్రసాద్ గారిలానే నాకు, నాలాంటి చాలమందికి అర్ధం కాకపొయే లానే వుంది.
రమాదేవి
తుపాకి గురించి Rama అభిప్రాయం:
09/05/2014 8:31 am
ఇన్ని సంవత్సరాల తరవాత నేను ఇప్పుడే చదవటం తటస్తించింది.
కధలో లా శంకర్ లాంటి నాన్నలున్నా జిమ్మి బ్రైన్ లాంటి ఇన్ఫ్లుఎన్స్ దాటి బయటికి రాలేని వాళ్ళు బోలెడుమంది. అది “నిగ్గర్స్” అనుకునే ఆలోచన కావచ్చు లేదా కులం కావ్చ్చ. అసలు కిరణ్ నాన్నే జిమ్మి బ్రైన్ లా వుండచ్చు. ఇది వొక్క NRI లకి మాత్రమే సంబంధించిన కధ అనుకొనక్కర్లేదు ఇండియాలో మనది కాని రాష్ట్రంలో కూడా కావచ్చు. ముంబైలో బిహారి పిల్లాడితో స్నేహం కూడా మాథ్యుతో స్నేహం కావచ్చు. ఇన్ని సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఇంకా మాలవాడలు మాదిగ వాడలు వున్నాయి, హొనౌర్ కిల్లింగ్స్ ఇంకా జరుగుతున్నాయి.
కధలో చెప్పకుండా చెప్పిన బోలెడు విషయాలు ఇప్పటికీ అన్వయిస్తాయి. పర్యావరణ కాలుష్యం లాగా ఈ కాలుష్యం ఇంకా పెద్దదవ్వడానికి మన పాత్ర ఎంత?
ఇలాంటి సజీవమైన కధ రాసిన నారాయణ స్వామి గారికి అభినందనలు
రమాదేవి, హైదరాబాద్
జ్ఞాపకాల వాసన గురించి Rama అభిప్రాయం:
09/05/2014 7:42 am
నాకూ అలానే ఎలా అర్ధం చేసుకోవాలో తెలీనట్లు… కాని జ్ణాపకాల గురించి రాసిన చాలా వాక్యాలు నాకెప్పుడూ అనిపించే వాటిలా అనిపించి బావున్నట్లు కూడా వుంది. మొత్తానికి మోడర్న్ఆర్ట్ లా నాకు అర్ధం కాకుండా పొయింది.
అమెరికా ఇల్లాలి ముచ్చట్లు: బరువు! గురించి Rama అభిప్రాయం:
09/05/2014 6:45 am
“ఇంకొకళ్ళను కష్టపెట్టకుండా జాగ్రత్త పడాలి.” నిజం అందరు ఇలానే అనుకుంటుండచ్చు; కాని అందరికీ అన్నిసార్లూ సాధ్యం కాకపొవచ్చు. మన ప్రమేయం లెకుండానే బరువైపొవచ్చు. బరువయ్యాము అని మనకి తెలియకుండా బరువవ్వచ్చు ఆల్జిమర్స్ లాంటివాటితో…
చాలా చక్కగ చెప్పారు. మీ సుజనరంజనిలో “కల్చరు” హాస్య రచనలో లానే చాలా హృద్యంగా చెప్పారు.
మనకు తెలియని బ్రౌన్ దొర: ఛాల్స్ ఫిలిప్ బ్రౌన్ గురించి బొల్లోజు బాబా అభిప్రాయం:
09/05/2014 5:05 am
వ్యాసం చాలా బాగుంది. చర్చ రసవత్తరంగా జరిగింది. మధ్యలో శ్రీనివాస్ గారి అర్హతలు, అధికారాల గురించి చర్చ దారిమళ్ళటం అవాంఛనీయం. ఆయన విజ్ఞత, తెలుగుపై ఉన్న ఆయనకున్న జిజ్ఞాస తక్కువేమీ కాదు. “అమెచ్యూర్ సాహితీవేత్తలకు మాట్లాడే అర్హత లేదన్నట్టుగా తీర్మానించటం” శోచనీయం. ఇది సరైన పద్దతి కాదు.
ఇక వ్యాసంలో నాకనిపించిన ఒక విషయం:
ఈ వ్యాసమంతా ఈ క్రింది ఇవ్వబడ్డ కొన్ని “అనుకోళ్ళ” (assumptions) ఆధారంగా నడిచినట్టుంది.
కానీ అనుకోళ్ళ ఆధారంగా ఎప్పుడో గతించిపోయిన ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని అంచనా వేసి, అతను చేసిన పనిని కూడా తక్కువచేసి మాట్లాడటం నచ్చలేదు. ఎన్ని ఆధారాలు చూపిస్తున్నా నమ్మబుద్ది కావటం లేదు.
భవదీయుడు
బొల్లోజు బాబా
జ్ఞాపకాల వాసన గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:
09/04/2014 4:34 pm
సత్యప్రసాద్ గారు, — మీ కథని ఒకటికి రెండు సార్లు చదివా. అయినా, నాకు కొంత వరకే అర్ధమైందని తెలియచేయడానికి చింతిస్తున్నా. గొప్పగొప్ప ఉన్నత స్థాయీ రచనలు ఓ పట్టాన అర్ధం కావంటారు అందుకేకామోసు. 🙂
కథా రచనలో వాడిన కొన్ని పదాలు నాకు నచ్చలేదు. ఈ మధ్య కాలంలో ఎందుకో కానీ, రైటర్స్- కొన్ని తిట్లని యధాతధంగా రాసేస్తున్నారు. వ్యక్తిగతంగా నేనందుకు వ్యతిరేకిని కావడం వల్ల కావొచ్చు, బహుశా ఆ ప్రభావం – కథ మీద కూడా పడుతోందనుకుంటా. ఆ కారణమే కథలపై సదభిప్రాయాన్ని కలగనీకుండా చేస్తోందని చెప్పడానికి నేనేమాత్రం వెనకాడటం లేదు. ఏదేమైనా, ఈ కథని ఇదే వేదిక మీద మీరొక సారి ఎక్స్ ప్లయిన్ చేస్తే తప్ప, కథ పట్ల పూర్తి అవగాహనకొచ్చే అవకాశం నాకు కనిపించడం లేదు.
ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.