కంపెనీ లోగో లో ఉన్న apple న్యూటన్ ది, టూరింగ్ ది కాదు అని ఆ కంపెనీ వాళ్ళన్నారట
ఇది మోకాలికీ బోడిగుండుకీ పెట్టిన సంబంధం లాగ ఉంది. సన్నబడ్డానికో మరోదానికో జాబ్స్ గారు తిండి మానేసి పళ్ళు తినడం అనే అలవాటు చేసుకున్నారు ఓ కుళ్ళు జీన్ పేంట్ వేసుకుని, అతి చేరువ స్నేహితుల్ని(Steve Wozniak(sp?) – అద్భుతమైన టెక్నికల్ పెర్సన్ ప్లస్ మనసున్న మనిషి) కూడా డబ్బు విషయంలో మోసం చేస్తూ, దేశ దిమ్మరిగా తిరిగే రోజుల్లో. అటువంటి రోజుల్లో ఓ కంపెనీకి దివ్యమైన ఐడియా వచ్చింది ఆయనకి. ఆ ఐడియా వచ్చినప్పుడు తాను నడుస్తున్న చోటు ఓ ఏపిల్ తోట; కాకపోతే చేతిలో ఒక ఏపిల్. పూర్తి ఏపిల్ కంటే లోగో లో కొంచెం తిన్న ఏపిల్ బాగా నచ్చింది ఆయనకి. ఇవీ, మిగతా ఆయన చేసిన నిర్వాకాలూ సొంతంగా ఆయన ఆత్మ కథ (వేరే ఎవరో రాసినది) లో చెప్పుకున్నారు.
శిక్ష కి సంబంధించి, నేను రాసింది కాస్త సవరించవచ్చు కాని మరీ సత్యదూరం కాదు.
Davis నుండి, “The judge before whom Turing’s case came, acting out of what he believed were humane motives, permitted Turing to escape prison if he would agree to be treated by hormonal injections …”
గణిత పదాల సూచనలకి చాలా కృతజ్ఞతలు.
గ.సా.భ. క.సా.గు. ల తప్పులు చూసి చాలా సిగ్గేసింది (very embarrassed).
ఈ క్రింది విధంగా మార్పులు చేస్తాను:
Distribution = విభాజనము, పంపకము
Central Limit Theorem = కేంద్రీయ అవధి సిద్ధాంతం
Number theory = సంఖ్యా గణితం
Model = నమూనా
Sample = మచ్చు
“ఏ నాటికైనా తెలుగు సైన్సు రచయితల సరసన చేరదలచుకొంటే పైన పేర్కొన్న దోషాలను దిద్దుకోవటం necessary and sufficient condition అని, మాథమాటిక్స్ లో మాలతీ చందూర్ వంటలు-పిండివంటలను కలిపి ఆసక్తి కరంగా వడ్డించిగల రచయితకు ఇది మంచినీళ్ళ ప్రాయమని నమ్ముతాను.”
పదాలకి సంబంధించిన దోషాలు దిద్దుకోవడం సులభమే; కాని అది necessary but not sufficient condition. 🙂 Thanks for the praise.
కంపెనీ లోగో లో ఉన్న apple న్యూటన్ ది, టూరింగ్ ది కాదు అని ఆ కంపెనీ వాళ్ళన్నారట.
To answer the question how my life would have changed: I think I was trying to understand maths or any subject as it is given. Genetic introduction to any topic was new to me. The history of the subject and the actual subject were different for me in those days.
This article (and a few other books — for instance, Men of Mathematics and Prisoner’s Dilemma, which is about Von Neumann, a topic for the next article) introduced the subject to answer the why of the subject. Most text books did not do that when I was growing up.
If I had gotten hold of this article (and similar ones), when I was 12 years old or so, I certainly would have learnt more about computation. In stead, I was trying to make sense out of quadratic equations and optimization theory, without much context — I was reading college math books, that only gave information instead of teaching. I only was following the examples, without understanding the why of it.
I don’t know what the long term impact would have been. I would have finished my PhD faster, I think. I might still have ended up in the corner of the universe I am now, though :-). I hope I answered your question, as truthfully as I can.
మీరు చెప్పిన ఆ మా వూరు వాడెవరో నాకు తెలీదు. ఎవరో చెప్పితే సంతోషిస్తాను. ఎక్కడ ఎప్పుడు భావాలగురించి రాసారో కాస్త వివరంగా చెప్పండి. పోతే, “ఆకలి, నిద్ర, దాహం, ఆకర్షణ, అసంతృప్తి, జీవితంపై మమకారం-అందరికీ ఇవి సమానమే.” కాదనుకుంటాను. ఇవి అందరికీ ఒకటే! కాని, అందరికీ సమానం (#equal#) కాదు. ఉదాహరణకి, ” ఆకర్షణ, అసంతృప్తి, జీవితంపై మమకారం,” అందరికీ సమానమా? కాదేమో! అలాగే, అడుక్కొని తినేవాడికి, మూడుపూటలా మెక్కే అవకాశం ఉన్నవాడికీ, ” ఆకలి, నిద్ర, దాహం,” సమానం కాదనుకుంటా!
” భావాలు మానవుల్నందరినీ ఏకం చేస్తాయి. వాటిని చెప్పడంలో ప్రయోగించే వివిధ భాషలు మానవుల్ని విడదీస్తాయి.” ఈ వాక్యం నాకు అస్సలు అర్థం కాలేదు. #Tower of Babel# కథ సరదాగానే ఉంటుంది కానీ, అది కట్టు కథ! కాస్త వివరంగా చెప్పితే మరీ సంతోషం.
శ్యామలరావు గారు..మీరు అన్నది నిజం.ఇది కధ ఏమాత్రం కాదు.
అమెరికాలో ఎన్నో ఏళ్లుగా వుంటున్న ఇల్లాలి మనోభావాలు..ముచ్చట్లు అంతే!
(మీరు శీర్షిక “అమెరికా ఇల్లాలి ముచ్చట్లు” చూసే ఉంటారు).
నేను చదువుకునే రోజుల్లో పరిశోధనా పత్రం రాసి ప్రచురణకి పంపితే ముగ్గురు “రివ్యూయర్” ల దగ్గరనుండి అభిప్రాయాలు వచ్చేయి. ఒకరు “బాగుంది, ప్రచురించండి” అంటూ సిఫార్సు చేసేరు. రెండవ వ్యక్తి ఎక్కడెక్కడ మరమ్మత్తులు చేస్తే బాగుంటుందో సూచించేరు. మూడవ వ్యక్తి ఏకి పారేసేడు. మా గురువుగారు “ఆ మూడవ వ్యక్తి నీ హితవు కోరేవాడు. అతను/ఆమె చెప్పిన అభ్యంతరాలన్నిటికి సరి అయిన సమాధానాలు రాసి పట్టుకురా” అని నన్ను పంపేసేరు.
ఎవ్వరైనా సరే మనం రాసిన వ్యాసం చదివి వరసవారీగా తప్పులు ఎత్తి చూపినప్పుడు నేను వారిని మన హితవు కోరే వారిగానే పరిగణిస్తాను. నేను గతంలో “ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది?” అన్న వ్యాసం ఈమాటలో ప్రచురించినప్పుడు యదుకులభూషణ్ గారు ఇలాగే స్పందించేరు. ఆయన సూచించిన సలహాల మేరకి, నేను ఆయనతో ఏకీభవించిన మేరకి నా వ్యాసాన్ని సవరించి తిరగ రాసుకున్నాను. అలా మార్పు చెందిన వ్యాసం కినిగె వారు ఇటీవల ప్రచురించిన నా “విశ్వస్వరూపం” లో చోటు చేసుకుంది.
“ఈమాట” లో ప్రచురించడంలో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ (ఉ. సంపాదకులవారి కలం ఝాడింపులు) చదువరులని నుండి వచ్చే ప్రతిస్పందన చాల విలువైనదని నా నమ్మకం. సైన్సుని తెలుగులో రాసేటప్పుడు మనం వాడే పదజాలం ఇంకా స్థిరపడలేదు – రాసేవారు తక్కువ కావడం ఒక కారణం. కనుక ఎవ్వరో ఆక్షేపిస్తారని భయపడి ఆ రాసే నలుగురూ మానుకుంటే ఎలా? మనకి తెలుగులో రాసే వాళ్లూ కావాలి, ఆ రాతలలో తప్పులని ఎత్తి చూపేవాళ్లూ కావాలి. – వేమూరి
మోహనగారు “ముగింపు ఎందుకో నన్ను ఆకర్షించలేదు. వాళ్లు చంపబడకుండా ఉండి ఉంటే బాగుండేది” అన్నారు. కానీ కథకుడు ఇచ్చిన ముగింపే సబబు. అది సహజమైన ముగింపు. మోహనగారు కోరిన ముగింపూ ఇవ్వవచ్చును. ట్రాక్టరు బోల్తా కొట్టి ఆ ముసలమ్మ కుటుంబం మొత్తం చనిపోయారన్న దానికి బదులుగా ముసలమ్మకుటంబాన్ని ఏదో చేయటానికి వెడుతూ సత్తిరాజే ట్రాక్టరు బోల్తా కొట్టి చనిపోయాడని వ్రాయవచ్చును. కాని అది వట్టి మెలోడ్రామెటిక్ ముగింపు ఐపోతుంది. ఈ విధమైన ముగింపు కథకుడికి తోచలేదని నేను అనుకోను. అందుచేత సహజమైన ముగింపు వైపుకే కథకుడూ మొగ్గినట్లు నా అభిప్రాయం.
జడ్జి కొంత మానవీయ దృష్టితో జైలు శిక్ష వెయ్యకుండా, లైంగిక కోరికలు తగ్గించే హార్మోనుల చికిత్స విధించాడు.
ఇది పూర్తిగా నిజం కాదేమో అని గూగులమ్మ అంటోంది. He was given an option of treatment or jail.
“Turing was prosecuted in 1952 for homosexual acts, when such behaviour was still criminalised in the UK. He accepted treatment with oestrogen injections (chemical castration) as an alternative to prison.” (From http://en.wikipedia.org/wiki/Alan_Turing).
కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 9: అతి సరళమైన అత్యద్భుత ట్యూరింగ్ యంత్రం గురించి Lakshman Munakala అభిప్రాయం:
01/07/2015 3:18 am
Excellent and very well written article. I really enjoyed reading it and it made me understand Turing Machine even better.
Thanks & Regards,
Lakshman.
కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 9: అతి సరళమైన అత్యద్భుత ట్యూరింగ్ యంత్రం గురించి okAnokaDu అభిప్రాయం:
01/06/2015 11:48 am
ఇది మోకాలికీ బోడిగుండుకీ పెట్టిన సంబంధం లాగ ఉంది. సన్నబడ్డానికో మరోదానికో జాబ్స్ గారు తిండి మానేసి పళ్ళు తినడం అనే అలవాటు చేసుకున్నారు ఓ కుళ్ళు జీన్ పేంట్ వేసుకుని, అతి చేరువ స్నేహితుల్ని(Steve Wozniak(sp?) – అద్భుతమైన టెక్నికల్ పెర్సన్ ప్లస్ మనసున్న మనిషి) కూడా డబ్బు విషయంలో మోసం చేస్తూ, దేశ దిమ్మరిగా తిరిగే రోజుల్లో. అటువంటి రోజుల్లో ఓ కంపెనీకి దివ్యమైన ఐడియా వచ్చింది ఆయనకి. ఆ ఐడియా వచ్చినప్పుడు తాను నడుస్తున్న చోటు ఓ ఏపిల్ తోట; కాకపోతే చేతిలో ఒక ఏపిల్. పూర్తి ఏపిల్ కంటే లోగో లో కొంచెం తిన్న ఏపిల్ బాగా నచ్చింది ఆయనకి. ఇవీ, మిగతా ఆయన చేసిన నిర్వాకాలూ సొంతంగా ఆయన ఆత్మ కథ (వేరే ఎవరో రాసినది) లో చెప్పుకున్నారు.
కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 9: అతి సరళమైన అత్యద్భుత ట్యూరింగ్ యంత్రం గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
01/06/2015 2:43 am
okAnokaDu గారికి,
శిక్ష కి సంబంధించి, నేను రాసింది కాస్త సవరించవచ్చు కాని మరీ సత్యదూరం కాదు.
Davis నుండి, “The judge before whom Turing’s case came, acting out of what he believed were humane motives, permitted Turing to escape prison if he would agree to be treated by hormonal injections …”
కొడవళ్ళ హనుమంతరావు
కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 9: అతి సరళమైన అత్యద్భుత ట్యూరింగ్ యంత్రం గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
01/06/2015 2:09 am
భూషణ్ గారికి,
గణిత పదాల సూచనలకి చాలా కృతజ్ఞతలు.
గ.సా.భ. క.సా.గు. ల తప్పులు చూసి చాలా సిగ్గేసింది (very embarrassed).
ఈ క్రింది విధంగా మార్పులు చేస్తాను:
Distribution = విభాజనము, పంపకము
Central Limit Theorem = కేంద్రీయ అవధి సిద్ధాంతం
Number theory = సంఖ్యా గణితం
Model = నమూనా
Sample = మచ్చు
“ఏ నాటికైనా తెలుగు సైన్సు రచయితల సరసన చేరదలచుకొంటే పైన పేర్కొన్న దోషాలను దిద్దుకోవటం necessary and sufficient condition అని, మాథమాటిక్స్ లో మాలతీ చందూర్ వంటలు-పిండివంటలను కలిపి ఆసక్తి కరంగా వడ్డించిగల రచయితకు ఇది మంచినీళ్ళ ప్రాయమని నమ్ముతాను.”
పదాలకి సంబంధించిన దోషాలు దిద్దుకోవడం సులభమే; కాని అది necessary but not sufficient condition. 🙂 Thanks for the praise.
కంపెనీ లోగో లో ఉన్న apple న్యూటన్ ది, టూరింగ్ ది కాదు అని ఆ కంపెనీ వాళ్ళన్నారట.
కొడవళ్ళ హనుమంతరావు
కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 9: అతి సరళమైన అత్యద్భుత ట్యూరింగ్ యంత్రం గురించి Ramarao Kanneganti అభిప్రాయం:
01/06/2015 1:36 am
To answer the question how my life would have changed: I think I was trying to understand maths or any subject as it is given. Genetic introduction to any topic was new to me. The history of the subject and the actual subject were different for me in those days.
This article (and a few other books — for instance, Men of Mathematics and Prisoner’s Dilemma, which is about Von Neumann, a topic for the next article) introduced the subject to answer the why of the subject. Most text books did not do that when I was growing up.
If I had gotten hold of this article (and similar ones), when I was 12 years old or so, I certainly would have learnt more about computation. In stead, I was trying to make sense out of quadratic equations and optimization theory, without much context — I was reading college math books, that only gave information instead of teaching. I only was following the examples, without understanding the why of it.
I don’t know what the long term impact would have been. I would have finished my PhD faster, I think. I might still have ended up in the corner of the universe I am now, though :-). I hope I answered your question, as truthfully as I can.
సాహిత్యావగాహన: మరొక దృక్పథం గురించి వేలూరి వేంకటేశ్వర రావు అభిప్రాయం:
01/05/2015 11:27 pm
కృష్ణారావుగారూ:
ఆలస్యంగా సమాధానం రాస్తున్నందుకు క్షమించండి.
మీరు చెప్పిన ఆ మా వూరు వాడెవరో నాకు తెలీదు. ఎవరో చెప్పితే సంతోషిస్తాను. ఎక్కడ ఎప్పుడు భావాలగురించి రాసారో కాస్త వివరంగా చెప్పండి. పోతే, “ఆకలి, నిద్ర, దాహం, ఆకర్షణ, అసంతృప్తి, జీవితంపై మమకారం-అందరికీ ఇవి సమానమే.” కాదనుకుంటాను. ఇవి అందరికీ ఒకటే! కాని, అందరికీ సమానం (#equal#) కాదు. ఉదాహరణకి, ” ఆకర్షణ, అసంతృప్తి, జీవితంపై మమకారం,” అందరికీ సమానమా? కాదేమో! అలాగే, అడుక్కొని తినేవాడికి, మూడుపూటలా మెక్కే అవకాశం ఉన్నవాడికీ, ” ఆకలి, నిద్ర, దాహం,” సమానం కాదనుకుంటా!
” భావాలు మానవుల్నందరినీ ఏకం చేస్తాయి. వాటిని చెప్పడంలో ప్రయోగించే వివిధ భాషలు మానవుల్ని విడదీస్తాయి.” ఈ వాక్యం నాకు అస్సలు అర్థం కాలేదు. #Tower of Babel# కథ సరదాగానే ఉంటుంది కానీ, అది కట్టు కథ! కాస్త వివరంగా చెప్పితే మరీ సంతోషం.
విధేయుడు,
వేలూరి వేంకటేశ్వర రావు.
అమెరికా ఇల్లాలి ముచ్చట్లు: కొత్త తరం గురించి శ్యామలాదేవి అభిప్రాయం:
01/05/2015 8:40 pm
శ్యామలరావు గారు..మీరు అన్నది నిజం.ఇది కధ ఏమాత్రం కాదు.
అమెరికాలో ఎన్నో ఏళ్లుగా వుంటున్న ఇల్లాలి మనోభావాలు..ముచ్చట్లు అంతే!
(మీరు శీర్షిక “అమెరికా ఇల్లాలి ముచ్చట్లు” చూసే ఉంటారు).
శ్యామలాదేవి
కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 9: అతి సరళమైన అత్యద్భుత ట్యూరింగ్ యంత్రం గురించి Rao Vemuri అభిప్రాయం:
01/05/2015 6:43 pm
యదుకులభూషణ్ గారి వ్యాఖ్యానంపై నా వ్యాఖ్య:
నేను చదువుకునే రోజుల్లో పరిశోధనా పత్రం రాసి ప్రచురణకి పంపితే ముగ్గురు “రివ్యూయర్” ల దగ్గరనుండి అభిప్రాయాలు వచ్చేయి. ఒకరు “బాగుంది, ప్రచురించండి” అంటూ సిఫార్సు చేసేరు. రెండవ వ్యక్తి ఎక్కడెక్కడ మరమ్మత్తులు చేస్తే బాగుంటుందో సూచించేరు. మూడవ వ్యక్తి ఏకి పారేసేడు. మా గురువుగారు “ఆ మూడవ వ్యక్తి నీ హితవు కోరేవాడు. అతను/ఆమె చెప్పిన అభ్యంతరాలన్నిటికి సరి అయిన సమాధానాలు రాసి పట్టుకురా” అని నన్ను పంపేసేరు.
ఎవ్వరైనా సరే మనం రాసిన వ్యాసం చదివి వరసవారీగా తప్పులు ఎత్తి చూపినప్పుడు నేను వారిని మన హితవు కోరే వారిగానే పరిగణిస్తాను. నేను గతంలో “ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది?” అన్న వ్యాసం ఈమాటలో ప్రచురించినప్పుడు యదుకులభూషణ్ గారు ఇలాగే స్పందించేరు. ఆయన సూచించిన సలహాల మేరకి, నేను ఆయనతో ఏకీభవించిన మేరకి నా వ్యాసాన్ని సవరించి తిరగ రాసుకున్నాను. అలా మార్పు చెందిన వ్యాసం కినిగె వారు ఇటీవల ప్రచురించిన నా “విశ్వస్వరూపం” లో చోటు చేసుకుంది.
“ఈమాట” లో ప్రచురించడంలో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ (ఉ. సంపాదకులవారి కలం ఝాడింపులు) చదువరులని నుండి వచ్చే ప్రతిస్పందన చాల విలువైనదని నా నమ్మకం. సైన్సుని తెలుగులో రాసేటప్పుడు మనం వాడే పదజాలం ఇంకా స్థిరపడలేదు – రాసేవారు తక్కువ కావడం ఒక కారణం. కనుక ఎవ్వరో ఆక్షేపిస్తారని భయపడి ఆ రాసే నలుగురూ మానుకుంటే ఎలా? మనకి తెలుగులో రాసే వాళ్లూ కావాలి, ఆ రాతలలో తప్పులని ఎత్తి చూపేవాళ్లూ కావాలి. – వేమూరి
కోనసీమ కథలు: న్యాయవాదం గురించి తాడిగడప శ్యామలరావు అభిప్రాయం:
01/05/2015 12:34 pm
పరమ ఆలస్యంగా వ్రాస్తున్న కామెంట్. ఏమీ అనుకోకండి.
మోహనగారు “ముగింపు ఎందుకో నన్ను ఆకర్షించలేదు. వాళ్లు చంపబడకుండా ఉండి ఉంటే బాగుండేది” అన్నారు. కానీ కథకుడు ఇచ్చిన ముగింపే సబబు. అది సహజమైన ముగింపు. మోహనగారు కోరిన ముగింపూ ఇవ్వవచ్చును. ట్రాక్టరు బోల్తా కొట్టి ఆ ముసలమ్మ కుటుంబం మొత్తం చనిపోయారన్న దానికి బదులుగా ముసలమ్మకుటంబాన్ని ఏదో చేయటానికి వెడుతూ సత్తిరాజే ట్రాక్టరు బోల్తా కొట్టి చనిపోయాడని వ్రాయవచ్చును. కాని అది వట్టి మెలోడ్రామెటిక్ ముగింపు ఐపోతుంది. ఈ విధమైన ముగింపు కథకుడికి తోచలేదని నేను అనుకోను. అందుచేత సహజమైన ముగింపు వైపుకే కథకుడూ మొగ్గినట్లు నా అభిప్రాయం.
కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 9: అతి సరళమైన అత్యద్భుత ట్యూరింగ్ యంత్రం గురించి okAnokaDu అభిప్రాయం:
01/05/2015 11:32 am