పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16473

  1. ఉడుత గురించి Arun Kumar అభిప్రాయం:

    03/02/2015 5:52 am

    కళ్ళు
    విప్పార్చుకుని
    బరువుగా తూగే
    సీతాఫలాలతో
    చాల బాగున్నది మీ కవిత

  2. అలనాటి నటి ఎస్. వరలక్ష్మితో ముఖాముఖీ గురించి Siddineni Bhavanarayana అభిప్రాయం:

    03/02/2015 12:42 am

    శ్రీపరుచూరి శ్రీనివాస్ గారూ,

    We are aware of your fascination for Mrs Varalakshmi’s voice. We thankfully acknowledge the archieval value of the interview, though we are not as enchanted as you have been by her singing acumen.

    There is a continuous shuttle of references alluded to the state of affairs in the bygone epoch and those of the then contemporary period. The a brief note on the context of the interview would have better elucidated the purport of the anecdotes recollected and the remarks expressed.

    Regards.

    yours thankfully,

    Siddineni Bhavanarayana

  3. ఐడ్స్ ఆఫ్ ఏప్రిల్ గురించి Rao Vemuri అభిప్రాయం:

    03/01/2015 8:08 pm

    ఈ ఎనానిమస్సు గారికీ నాకూ ఏదో బాదరాయణ సంబంధం ఉందేమోనని అనిపిస్తోంది. రచయిత సంప్రదించిన గ్రంథాలు రెండూ The New Yorker అని చూడగానే నా అనుమానం నిజమేనేమోనని మళ్లా అనిపిస్తోంది. రచయిత శైలి చూడగానే ఈయన ఈమాటకి కొత్తేమీ కాదని కూడ అనిపిస్తోంది. మరి ఎనానిమస్సు ఎందుకో?

    నేను విద్యార్థిగా ఉన్న రోజులలో IRS వారి నుండి వారి ఆఫీసుకి రమ్మనమని శ్రీముఖం పంపించేరు. వెళ్లేను. “నువ్వు చదువు అయిన తరువాత మీ దేశం వెళ్లిపోతున్నావా ఇక్కడే ఉంటావా?” అని అడిగేరు. ఒఠ్ఠి వెర్రి వెధవాయిలా “మా దేశం వెళ్లిపోదామనే అనుకుంటున్నాను” అన్నాను. “అయితే నువ్వు మాకు మరో 150 డాలర్లు బాకీ ఉన్నావు. బకాయి పడ్డావు కనుక జరిమానా. వెంటనే కట్టకపోతే “పెనల్టీ” అని బెదిరించింది ఆవిడ. నోరు మూసుకుని కట్టేసేను. అప్పటి నుండి ఇప్పటి వరకు నాకు అనుమానమే – నా దగ్గర అన్యాయంగా వసూలు చేసిందేమోనని. లేకపోతే ఏమిటి చెప్పండి? ఆ రోజుల్లో దరిద్ర రేఖ దిగువన బతికేవాడిని. ఈ IRS వాళ్లు నాలాంటి కాకి పిల్లల మీద ఉండేలు దెబ్బ కొట్టినంత జోరుగా మదించిన మోతుబరుల దగ్గరకి పోరని విన్నాను. నేను ఇలా రాసేనని తెలిస్తే సదరు IRS వారు నా వెంట మళ్లా పడతారేమోనని భయంగా ఉంది. – లమయోనభేదహః

  4. ఈమాట మార్చ్ 2015 సంచికకు స్వాగతం! గురించి Maganti Vamsi అభిప్రాయం:

    03/01/2015 5:37 pm

    🙂 శ్రీ మోహన – Thanks for the links. Now the clarity is somewhat better. By the way, Rip said, he’s glad to be in sleep than being in the company of writer elite.. And being no critic myself, and I am sure you are not referring to me, :P, I humbly say that murugan aborugan was a straight copy paste from the caption under the photo.

  5. ఈమాట మార్చ్ 2015 సంచికకు స్వాగతం! గురించి J K Mohana Rao అభిప్రాయం:

    03/01/2015 1:45 pm

  6. ఈమాట మార్చ్ 2015 సంచికకు స్వాగతం! గురించి మాగంటి వంశీ మోహన్ అభిప్రాయం:

    03/01/2015 12:42 pm

    పోతే ఈ సంపాదకీయంలో వేసిన బొమ్మ – ఆ మురుగన్ – అబోరుగన్ ఎవరో ఆ కతేమిటో, ఈ సంపాదకీయానికి ఆ బొమ్మకు ఉన్న లంకేవిటో కాస్త తెలియపరిస్తే బాగుంటుందని పరమపిత ఉవాచ…ఇంతకు ముందు పేజి రిఫ్రెష్షు ప్రాబ్లము వలన్ బొమ్మ కనపడలా…అందువల్ల గ్రైపు వాటరు సంగతి తెలియలా!

  7. ఈమాట మార్చ్ 2015 సంచికకు స్వాగతం! గురించి మాగంటి వంశీ మోహన్ అభిప్రాయం:

    03/01/2015 11:27 am

    భావాలు.
    మనోభావాలు.
    చెత్త భావాలు.
    చిత్తు భావాలు.
    ఉత్త భావాలు.
    ప్రతి వాడికి ఒక భావం.
    ఒక మనోభావం.

    అందరివీ దెబ్బతినటమే.
    స్త్రీల భావాలు దెబ్బతినటం.
    కులాల భావాలు దెబ్బతినటం.
    కవుల భావాలు దెబ్బతినటం.
    సంపాదకుల భావాలు దెబ్బతినటం.
    సంపాదకీయాల భావాలు దెబ్బతినటం.
    ఓలు మొత్తంగా అన్నీ దెబ్బతినటం.
    దెబ్బతినిపిచ్చుకోవటం.

    ఒక్క సంప్రదాయవాదులవి తప్ప.
    ఏం సంప్రదాయవాదులు మనుషులు కారా?
    ఏమో కారేమో! ఎవడికి తెలుసు ?

    వందల ఏళ్ళ నుంచి ఉన్న కట్టూబొట్టూ పాడైపోతే మనోభావాలు గాయపట్టం తప్పు.

    వందల ఏళ్ళగా ఉన్న సంస్కృతి సంప్రదాయాలు పాడైపోతున్నాయని మనోభావాలు గాయపట్టం తప్పు.

    వందల ఏళ్ళ నుంచి ఉన్న కుటుంబ సంబంధాలు పాడైపోతే మనోభావాలు గాయపట్టం తప్పు.

    వందల ఏళ్ళగా ఉన్న భాష ఆంగ్లంలోకి దిగిపోతోందని బాధ పట్టం తప్పు.

    వందల ఏళ్ళగా లేని విచ్చలవిడితనం ఇప్పుడే రెచ్చిపోతోందని బాధపట్టం తప్పు.

    పాత సాహిత్యం చదవండిరా, కొత్త సాహిత్యంలో పట్టండిరా అని నెత్తీ నోరు మొత్తుకోవటం తప్పు.

    మనదాన్లో ఏవీ లేవని మనల్ని మనం తక్కువచేసుకుంటున్నామని, చేసుకోవాలని ప్రవచించే వాళ్ళను ఏం చెయ్యాలని బాధ పట్టం తప్పు.

    వేల సంవత్సరాలుగా జీవితంలో భాగమైపోయిన రామాయణ, భారత, భాగవతాల్ని ఏ రచైత నోటికొచ్చినట్టు కారుకూతలు కూస్తున్నా ఎవడు పట్టిచ్చుకోవట్లేదని మనోభావాలు గాయపర్చుకోటం తప్పు.

    వీళ్ళెవరూ కాని సంస్కృతీ పరిరక్షకులు, ఆ పరిరక్షకుల మీద దాడి చేసేవాళ్లు కామోసు. విచిత్రమైన గీత.

    ఈ గీత చతుర్ముఖుడు రాసాడని ఊరకోటమా!

    లేక మిగతావాళ్ళంతా చేస్తున్న రివోల్టు ఈ సంప్రదాయవాదులెందుకు చేయట్లేదో మీకెవరికన్నా తెలుసా?

    ఎవడి పాపాన ఎవడు పోతాడో తెలీక ఊరకుంటున్నారా?

    ఎవడి పాపం వాడినే చుట్టుకుంటుందని ఊరకుంటున్నారా?

    చతుర్ముఖుడు రాసాడే అనుకో, చిన్న గీతను పెద్ద గీత చేసుకోటం నీ చేతిలో పనే.

    పండగలొస్తే సంప్రదాయవాదులు కావాలి.
    పబ్బాలొస్తే సంప్రదాయవాదులు కావాలి.
    పుడితే సంప్రదాయవాదులు కావాలి.
    చస్తే సంప్రదాయవాదులు కావాలి.
    అసలు సంప్రదాయవాది, వాడెట్లా చస్తే ఎవడిక్కావాలి ?
    నైతిక భావాలు ఎట్లా చచ్చిపోతే ఎవడిక్కావాలి?
    మంచి నేర్పే భావాలు చచ్చిపోతే ఎవడిక్కావాలి ?
    అంతే! అంతే! అంతే!
    ఇంతే! ఇంతే! ఇంతే!

    కలికాలంలో అంతే!
    అంతా పోయేదాకా ఇంతే!
    ఇప్పటికి ఇంతే! అంతే!

  8. ఎం. వీ. విందుడు గురించి zilebi అభిప్రాయం:

    02/17/2015 9:03 pm

    బులుసు వారి టపాకి ఒకే ఒక్క కామింటా! లా! లా! లా!

    హతవిధీ! కాల మహిమ అనిన ఇదియే కదా!!

    బ్లాగు లోకమును విడిచి ‘ఈవిహంగ’ లోకమునకు ‘ఈమాట’ లాడ నెగిరి కదా!!

    జేకే !

    బాగుందండీ ఈ ఎం వీ విందుడు !

    విందు విలాసాలకి ఐటీ సెక్టారు కూడా ఇక తిలోదకాలిచ్చే రోజులు వచ్చేసినట్టు ఉన్నాయి మీరు వ్రాసినది చదివాక!!

    చీర్స్
    జిలేబి

  9. చిత్ర గీతములలో ఛందస్సు గురించి రవి అభిప్రాయం:

    02/17/2015 12:29 am

    చాలా అందమైన వ్యాసం. పాడుకునే ప్రతీ పాటలోని మాత్రాగణాల అమరికనూ పరిశీలించాలనిపించే ఉత్సుకత కలుగుతూంది, ఈ వ్యాసం చదివితే. ధన్యవాదాలు.

  10. నాకు నచ్చిన పద్యం: ఒక వెచ్చని హెచ్చరిక గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:

    02/15/2015 3:03 am

    ఎప్పటిలాగే మిత్రులు కామేశ్వరరావుగారు చక్కని పద్యాన్ని, చక్కని వివరణతో అందించినందుకు చాలా కృతజ్ఞతలు.

    “లతాంగి” అని సంబోధిస్తూ మేలుకొలుపడానికి ఉత్పలమాల ఛందాన్ని ఎన్నుకోవడం కూడా ఔచిత్యంగా ఉంది. కోడి కూతలో హెచ్చరికున్నది అని అంటూ, పొద్దున పొద్దున్నే వట్టి హెచ్చరికతో కాకుండా, మేలుకొని మధుపూర్ణపాత్రని అందుకోమని ముగించడం, కరుణశ్రీ గారు అదనంగా కూర్చిన, కాదు, కూర్చాలని చూపిన, సొగసు లాలిత్యం అని అనిపిస్తుంది.

    ఎవరో ఒక కుర్రవాన్ని ఒక్కరోజులో ఇన్ని తప్పులు ఎట్లా చేసావు అని కోప్పడితే, ఏమీ లేదు నేను చాలా పొద్దున్నే నిద్రలేస్తాను అని అన్నాడట! మేలుకోవడం ఒక్కటే కాదు, మేలుకొని మధుపూర్ణపాత్రను అందుకోవడం అని చెప్పడం నిండుగా ఉంది.

    ఈ పద్యం చదివితే- ఆయుష్షు తగ్గిపోతుంది, యౌవనం తరిగిపోతుంది, గడిచిన రోజులు తిరిగి రావు, కాలం అన్నింటినీ మింగేస్తుంది, అని ఇది మరవడం అనే అపరాధాన్ని మన్నించి శివున్ని రక్షించమని పలికిన ఆది శంకరుల “శివాపరాధక్షమాపణ స్తోత్రం” లోని ఈ శ్లోకాన్ని గుర్తుకుతెచ్చింది.
    ————————–
    “ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతి క్షయం యౌవనం
    ప్రత్యాయాంతి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః
    లక్ష్మీస్తోయతరంగభంగచపలా విద్యుచ్చలం జీవితం
    తస్మాత్త్వాం శరణాగతం శరణద త్వం రక్ష రక్షాధునా”
    ————————–
    కాలాన్ని ఎంతో సద్వినియోగపరుస్తే కూడా సాధ్యమా అనిపించే కార్యాలెన్నో చేసిన శంకరులే దీన్ని చెప్పడం విశేషం.
    =========
    విధేయుడు
    _శ్రీనివాస్