పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16473

  1. ఈమాట మార్చ్ 2015 సంచికకు స్వాగతం! గురించి తఃతః అభిప్రాయం:

    03/21/2015 11:48 pm

    శ్రి వాడపల్లి:
    ధన్యవాదాలు మీకు.
    నమస్కారాలతో ,నూతన సంవత్సర శుభాకాంక్షలతో
    తఃతః

  2. ఈమాట మార్చ్ 2015 సంచికకు స్వాగతం! గురించి VSTSayee అభిప్రాయం:

    03/21/2015 5:51 pm

    తఃతః అభిప్రాయం: ‘మంత్రవాక్కువు ‘ సత్యనారాయణా అంటూ కాటూరి చెప్పిన ఒక పరమాద్భుతమైన పద్యం … ఈమాట ద్వారా అందించ వలెనని వేడుకోలు.

    శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారి గజారోహణోత్సవ సందర్భమున శ్రీ కాటూరివారు చెప్పినవి …

    పాయక నీపయిం గవులు పద్యము లల్లెడి వేళ ‘సత్యనా
    రాయణ’ యంచు బ్రాసమున యందిడి మీదులు చూడకుండ నీ
    వే యొక ప్రాసదాన మిడ నెంచికదా రచియించుచుంటి రా
    మాయణ! మెంత నేర్పరివిరా! స్తుతిలోభము నీకె చెల్లురా!

    అల కంకంటి కులుండు పాపకవిరా జల్లంత జేముట్టినన్‌
    దల ప్రాణమ్ములు తోకకుం డిగిన తద్రామాయణం బీవు గీ
    ర్బలముం జేసి పునఃప్రతిష్ఠిత సుధాప్రాయాఖిలాంగమ్ముగా
    నిలుపం జూచెదవోయి మంత్రమయవాణీ! సత్యనారాయణా!

    నమస్తే,
    వాడపల్లి శేషతల్పశాయి.

  3. ఈమాట మార్చ్ 2015 సంచికకు స్వాగతం! గురించి తఃతః అభిప్రాయం:

    03/21/2015 2:34 pm

    ఈరోజు ఉగాది. శ్రీ మన్మథ ఉగాది. తెలుగు వాళ్ళు తెలుగులో(?) నడుపుతున్నా ” పాఠకులకు ఉగాది శుభాకాంక్షలు” అని అనటానికి నోరు రాని ‘ ఈ మాట’ కు ఉగాది శుభాకాంక్షలు!

    ‘ ఈ మాట’ మిత్రులకు: ‘ మన్మథ’ నామ సంవత్సరం అనగానే ఆంతరంగ సౌదర్యం అంటే తెలియని వాళ్ళకు నువ్వు మన్మథ లో పుట్టావు అంటే నవ్వొస్తుందేమో అంటూ విశ్వనాథ కు అరవై సంవత్సరాలు నిండిన సందర్భాన , రాసింది నాయని సుబ్బారావు గారని లీలగా జ్ణాపకం,ఆతర్వాత చాలా కాలానికి చదివిన ఒక అభినందన పద్యం గుర్తొస్తోంది.
    ఆ సందర్భం లోనే , ‘ తల ప్రాణంబులు తోకకొచ్చినవి ‘ అంటూ మొదలై . “పాపరాజు” ‘ఉత్తర ‘ (తోక) రామాయణాన్ని మాత్రమే రాస్తే నువ్వు పూర్తిగా రాసి మళ్ళీ ప్రాణాలను తలకు తీసుకొచ్చావు ‘మంత్రవాక్కువు ‘ సత్యనారాయణా అంటూ కాటూరి చెప్పిన ఒక పరమాద్భుతమైన పద్యం గూడా చదివాను . ఈ పద్యాలను దయతో యెవరైనా సంపాయించి ఈమాట ద్వారా అందించ వలెనని వేడుకోలు.
    తఃతః

  4. సముద్రం గురించి lyla yerneni అభిప్రాయం:

    03/21/2015 1:54 pm

    ఎంతో బాగుంది కథ. ‘సముద్రం’ అన్న టైటిల్ ఆకర్షిస్తే క్లిక్ చేసి చదివాను. బ్యూటిఫుల్.

    మేగజీన్ టెక్నికల్ క్రూ, పాఠకులకు ప్రేమతో ప్రొవైడ్ చేసిన ?రాండమ్ ప్లే ఫీచర్ వల్ల, ఇక్కడ, ఈ మధ్యన ఎన్నో మంచి రచనలను చదివాను. లవ్ ఇట్. లవ్ టెక్నాలజీ.

    లైలా

  5. శిక్ష ఖరీదు గురించి మల్లికార్జున శర్మ దేవరకొండ అభిప్రాయం:

    03/20/2015 2:21 am

    క్షమించాలి. ఇంతకుముందు కథ చదివినప్పుడు (నా PC లో ఎందుకో) శీర్షభాగం కనిపించలేదు. ఈరోజు శీర్షిక, మూల రచయిత పేరు కనబడ్డాయి.

    [తప్పు మీది కాదు, మాదే. చిన్న పొరపాటు జరిగి మూల రచయిత పేరు కనపడలేదు. సరిదిద్దాము – సం.]

  6. వచనానికి ఒక జాబు గురించి మాగంటి వంశీ అభిప్రాయం:

    03/19/2015 1:12 pm

    రవికిరణ్ తిమ్మిరెడ్డి గారూ – హమ్మయ్య, ఖంగారు పడ్డాను కానీ, ఉత్తిదే అని తేలిపోయింది. ఇహ పూర్తిగా అర్థమైపోయింది, నా వ్యాసానికి, అందులోని వాక్యాలకు, రాసిన కామెంటుకు నేను పూర్తి న్యాయం చేసాననిన్నీ… దీనికి ఇంతకన్నా ఎక్కువ చెప్పనక్కరలా. 😉

    పోతే, మీ భాషలో చెప్పాలంటే, మీరన్న మాటలే, మీ వచనంలోని, మీ కవిత్వంలోని మాటలే వాడి చెప్పాలనిపించి, అసలు సంగతి వదిలేసిన మీరు, ఆ చవటలతో, కారిపోతూ ఏవిటి రాసుకోవాలన్నా రాసుకోవచ్చు..నానుంచి ఉపేక్ష్యోలక్ష్యమే! చివరిసారిగా మరొక్కసారి స్వస్తి…

    ధన్యవాదాలతో !
    భవదీయుడు
    వంశీ

  7. శిక్ష ఖరీదు గురించి మల్లికార్జున శర్మ దేవరకొండ అభిప్రాయం:

    03/19/2015 1:40 am

    బాగున్న ఈ తమాషా కథ మూల రచయిత పేరు కూడా ఇచ్చి వుంటే ఇంకా బాగుండేది.

  8. వచనానికి ఒక జాబు గురించి ravikiran timmireddy అభిప్రాయం:

    03/18/2015 2:25 pm

    శ్రీ వంశీ మోహన్ గారు,

    మీరు స్కర్టు, పేంటీ దగ్గరే నిలబడిపోయినా, వచనం, పధ్యం దగ్గరకొచ్చినా, అది మీ ఇష్టం. “చవటకు జారిన కుంకుమ ఈ రోజు కనిపించదు” అర్థవైన వారికి ఇక చెప్పేదేవుంది. మీరు కాస్త ఆ లోదుస్తుల నించి బయటకు వచ్చుంటే బాగుండేది. మీరు మరీ వాటిని మక్కీకి మక్కీగా తీసుకుని అక్కడే నిలబడిపొయ్యారు.

    నాకు పద్యం రాదు, నా తెలుగు చదువు పన్నెండో క్లాసు దాకే, నాకు తెలుగు తెలుసు, మామూలు తెలుగు, అందరికి అర్థవయ్యే తెలుగు, మంది మాట్లాడే తెలుగు. కాలం తోపాటూ తనూ మారే తెలుగు. నాకు తెలిసిన తెలుగే మెజారిటీకి తెలిసిన తెలుగు. మాకు కష్టం, సుఖం, నవ్వు, ఏడుపు, సరసం, విరసం అన్నీ ఈ తెలుగులోనే మోహన్ గారు, ఈ చిన్న వాక్యాల్లోనే. మాకు మీరు వ్రాసిన చిన్న వాక్యాలే అర్థమవుతాయి. మాకు పద్యం కంటే పాట మనసుకి పడ్తుంది , గుండెని కదిలిస్తుంది. మాకు మాట్లాడటవే తెలుసు, ఏడుపొచ్చినప్పుడు ఎప్పుడో పొల్లుకొచ్చిన పాట తప్ప, మాకు మాటలే అర్థం అవుతాయి. మాకు మీ కష్టతరవైన పద్యాలతో పనేవుంది చెప్పండి. కాదనటం లేదు మీకవి నచ్చుతాయి, మిమ్మలని అవి కదిలిస్తాయి, మీకా పద్యం చదివినప్పుడో, విన్నప్పుడో మీరు ఒక నిర్వాణ అవస్తలోకి పోతారు. అది మీకు తెలుసు, మీరు ఆ వ్యవస్తలో సబ్యులు, కానీ దురదృష్టం కొద్ది నూటికి తొంభై తొమ్మిది తెలుగు వాళ్ళవి మేవా బావిలో లో భాగం కాదు .

    అనుమానం ఏవీ లేదు నేను రసిక హృదయుడ్నే, కానీ మీరు అప్పుడు కూడా ఆ స్కర్టు దగ్గరే నిలబడి పొయ్యారు మరి, నాకు తెలియదు ఏవనాలో. ఇంకా నయం మీరు సంధ్య లోనూ, ఉషలోనూ కూడా లోదుస్తులని చూడలేదు. ధన్యవాదాలు.

    రవికిరణ్ తిమ్మిరెడ్డి

  9. శ్రీనాథుని శాలివాహన సప్తశతి: తథ్యమిథ్యావివేచన గురించి తః తః అభిప్రాయం:

    03/18/2015 6:12 am

    శ్రీ ఏల్చూరి:
    ఒక ఆలోచన :
    “…..మిమ్ముఁ బ్రోవుతన్.” అని ముగించటం మయూరుని సూర్య శతక ప్రభావం కావచ్చేమో!
    నమస్కారాలతో
    తః తః

  10. వచనానికి ఒక జాబు గురించి మాగంటి వంశీ అభిప్రాయం:

    03/17/2015 1:54 pm

    రవికిరణ తిమ్మిరెడ్డి గారూ – కామెంటుకు ధన్యవాదాలు. ఆలోచనలు రేకెత్తించే విధంగా వున్నది. ఊరకే ఈ కింది వాక్యం తీసుకొన్నా! దాన్ని మీర్రాసిన మిగతా వాటితో కాస్త కలగాపులగం చేస్తే ఒహ పులగం తయారయ్యింది. ఆలోచనల పులగం. అంతా రాస్తే ఈ వ్యాసానికన్నా పెద్దదవుతుందని, ఆ ఆలోచన పులగంలో ఒకటో రెండో ముక్కలు పంచుకుందామని ఈ ప్రయత్నం.

    >>దాంట్లో పద్యం అసలేవీ లేదు కదా, వచనం తప్ప.

    ఇలా రాసారు కాబట్టి మీకు కాస్త కాకున్నా కాస్తన్నా పద్యమొచ్చని అనుకోలు. పద్యమంటే పాత పద్యం. ఆ స్వరూపం అని అర్థం. అక్కడ పద్యంలో రాస్తే ఎందుకు అర్థమవదోనని ఇక్కడ ఈ వ్యాసంలో మొదటి పేరాలో వివరించిన కారణమే. అంటే సంపాదకులకు అర్థం కాదనా అని మీరు తిమ్మిని బమ్మి చేయబోయి బమ్మిని తిమ్మి చేసే ప్రశ్న వేయవద్దు. అది కాదు ఉద్దేశం అక్కడ. ఆ సంపాదకీయం ఎంతమంది చదువుతారో అంతమందికి నా కామెంటు కూడా అర్థమవాలె కదా.

    పైగా ఆ సంపాదకీయానికి నా కామెంటులో మీకు కవిత్వం కనపడ్డదంటే మీరు సామాన్యులు కాదు. రసిక హృదయులు. రసిక హృదయులున్నచోట కవిత్వం పరిఢవిల్లుతుంది. ఆ సంగతి మీ కామెంటు భాగంలోని స్కర్టు తేటతెల్లం చేస్తోంది. నా వ్యాసానికి సమబంధం, సంబంధం లేని లోదుస్తుల వైపు అంత తీవ్రంగా ఆలోచిస్తున్నారంటేనే మీ మనోఫలకం ఎంతగా కళ్ళు విప్పార్చుకుని వున్నదో నాకు తెలిసింది. పైగా నేను స్కర్టులు అవీ వేసుకుని తిరిగే స్కాట్లాండు వాడినీ కాదు. మీరేవిటి వేసుకుని తిరుగుతారో నాకు అనవసరం.

    మీరు మీ వచనంలో ఏవిటి మాట్లాడారో మీకు మాత్రమే తెలుసుననుకొని ఆ ఆలోచన అలా పక్కనబెడుతూ ఉండగా మీ సంధ్య, ఉషలు కనపడ్డారు. సరే మీ టైపులో చెపుతే మీకర్థవౌతుందని, ఎబ్బెట్టు లేకుండగా ఒహ మాట – మీర్రాసిన సంగతి అర్థం కాలేదనుకునేరు, అల్లాటిదేవీ లేదు కానీ, ఊరకే సరదాకి – అలా సంధ్యగారెవరో కావులించుకుంటే మా ఆవిడ కాళికామాతైపోతుంది. ఆ తర్వాత జరిగే పాపపుణ్యాలకు, లోకకళ్యాణాలకు బాధ్యత మీది మీ స్కర్టుది. అందువల్ల ఎవరి జాగ్రత్తలో వాళ్ళుండటం మంచిదేమోనని అనుమానం పొడసూపింది.

    ఇహ ఉష కోసం ఎదురు చూసే ఓపిక లేదు. మీర్రాసిన వచనమే ఉష అయితే, ఆ వచనమే కవిత్వమని మీరనుకుంటే ఆ చతుర్ముఖుడు నా తలరాత ఇట్లా రాసాడని ఊరకోటమే. ఈశ్వరానుగ్రహం ఇంతేనని సరిపెట్టుకోటమే. ఏం? ఇది, ఈ వ్యాసం రాసినప్పుడు సరిపెట్టుకోలా? అంతే! అంతే!

    ఇలా చిన్న వాక్యాల్లో రాసింది మీకర్థవయ్యిందో లేదో నాకు తెలియదు కానీ, ఒక మాట, ఇక్కడ రాసింది ఇదే అర్థం కాలేదంటే కష్టతరమైన పద్యానికి వెడితే ఇహ ఇంతే సంగతులు చిత్తగించవలెనేమోనని – వచనమ్విడ్వుము పద్యము చాలున్ అన్న స్వీయవాక్యంతో ఇక్కడికి, మీతో సంభాషణకు స్వస్తి పలుకుతున్నాను….

    మరొక్కసారి ధన్యవాదాలతో
    భవదీయుడు
    వంశీ

    తా.క – మీర్రాసిన దానిలో నాకు నచ్చిన వాక్యం ఇదీ – “చవటకు” జారిన కుంకుమ ఈరోజు కనిపించదు. తర్వాతి లైను చదివినవాడికి అర్థమవుతుంది కానీ, అది చదవక ఇదొక్కటే తీసుకుంటే, దీని మీదే, ఈ వాక్యం తెచ్చే అర్థాలమీదే ఒహ వ్యాసం రాయవచ్చు. అది ఆవు వ్యాసమైపోతుందని భయమేసింది…