The male voice is that of Ghantasaala.We find no female voice in the song. The number you have mentioned could be a repetition of the same song in different voices of A. M .Raja and A.P Komala.
Could you please verify at your convenience! [ I know you are hard pressed for time trying to straddle your endeavour between your professional duties and the exigencies, demanded in your zeal in collecting data of archival significance]
it was Telugu University that was offered the endowment. Although I was at the reception, I mistook it as Central University, Hyderabad. It was Telugu University at Hyderabad. I regret for the error.
ఉగాది రోజు తఃతః గారి వ్యాఖ్య చూసి, విశ్వనాథ పై ఏదన్నా తెలుగు పుస్తకం చదువుదామని చూస్తే పురాణం “విశ్వనాథ ఒక కల్ప వృక్షం,” [1] కనిపించింది. అందులోని విశేషాలు కొందరికి ఆసక్తికరంగా ఉండవచ్చని ఇస్తున్నాను. గుడివాడలో గజారోహాణోత్సవం (1942) సందర్భంగా (షష్ఠిపూర్తి కాదు) కాటూరి గారి పద్యాలు రక్తికట్టినట్లు మరెవరివీ లేవట. మరో పద్యం [1-143]:
పితృసాదుల్ వలె కాశీ కేగితివొ? యా విశ్వేశ్వరున్ దెచ్చి చే
సితివో మేటి ప్రతిష్ఠ? పద్యములనన్ చేలోకువౌటంగదా
శతకం బొక్కటి వట్టి, గొంటిని ప్రతిష్ఠన్, మేల్ భళా కాశికా
పతి విశ్వేశ్వర! నీవు మెచ్చవలె నబ్బో యిట్టి చాతుర్యముల్!
అయితే గుడివాడలోనే (1956) జరిగిన సభలో “షష్ఠిపూర్తి” అనే వ్యంగ్య పూరితమైన, విశ్వనాథని అవమానించే వ్యాసం కాటూరి వారు చదివారు [1-99]. సన్మాన సభలోనా అని మనం ఆశ్చర్యపోతాం. సరే, ఉగాది సమయాన ఆ విషయాలెందుకు తలచుకోవడం.
కాటూరి, అడవి (“అతడు గీసిన గీత బొమ్మై, అతడు పలికిన పలుకెల్ల అర్థవత్కృలై”) కూడా మన్మథలో పుట్టినవాళ్ళే.
[1] “విశ్వనాథ ఒక కల్ప వృక్షం,” పురాణం సుబ్రహ్మణ్యశర్మ. పరిష్కర్త, కోవెల సంపత్కుమారాచార్య. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, 2005. పలుచోట్ల నుండి చేర్చిన విషయాలని పుస్తకరూపంలో తీసుకురాకముందరే పురాణం చనిపోవడంతో, కోవెల పరిష్కరించి ప్రచురణ యోగ్యం కల్పించారు. అయినా కొన్నిచోట్ల ఎవరు ఎవరితో అన్నదీ స్పష్టంగా లేదు. అనుబంధంగా ఉన్న విశ్వనాథ తమ్ముడు వెంకటేశ్వర్లు గారి వ్యాసం, ’నేనూ – మా అన్నగారు,’ విలువైనది.
మార్చ్ 26 న కొప్పాక ఫౌండేషన్ వారి తెలుగు సాహిత్య పీఠం అట్లాంటా లోని ఎమరి యూనివర్శిటీలో అనుకున్నట్లుగా ప్రారంభమైందని “సారంగ” లో మీరు వ్రాసిన వార్త చదవడం చాలా సంతోషకరం. ఆ పీఠం తొలి ప్రొఫెసర్ గా ప్రసిద్ధ డాక్టర్ వెల్చేరు నారాయణ రావు గారు నియమితులవడం మరింత ముదావహం.
వారి ఫౌండేషన్ వారి ఇష్టం అనుకోండి గాని, కొప్పాక వారు యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ కి బదులు ఆంధ్రా యూనివర్శిటీ కి వారి ఆఫర్ని ఇచ్చుండవచ్చు అని నా వ్యక్తిగత అభిప్రాయం. వారి తండ్రి గారు ఆంధ్రా యూనివర్శిటీ లోనే చదువుకున్నారు అనేది కూడా ఒక బలమైన కారణంగా వుండేది. అలా కానప్పుడు తెలుగు భాషకి విశేష కృషి జరుగుతున్న అమెరికా దేశంలోనే యూనివర్శిటీల్ని ఎంచుకోవడమే సమంజసం. ఆ రకంగా మంచి పనే జరిగింది.
తలపెట్టిన పని పూర్తి చేసిన కొప్పాక కుటుంబం వారికి అభినందనలు.
On the 26th March 2015, the Koppaka Foundation Professorship was announced by the Dean of Emory College, Emory University. Ninety years old Koppaka Sita garu with her three children attended the function. The dean announced that Prof. Velcheru Narayana Rao, an internationally well-known Telugu, poet,critic, and translator will occupy the Koppaka Foundation Chair as its first professor. More than 200 Telugus and quite a few Americans have attended the function.
The announcement was followed by an hour long well organized classical music concert, Kuchipudi dance performance, and poetry readings from classics along with English translations. After that the Dean of Emory College hosted a reception to the Koppaka family and the invited guests.
At the reception, Dr. Venkataramarao Koppaka, M.D., Ph.D, son of Dr. Koppaka Visweswara Rao and Sita garu, who works for CDC spoke at the request of the dean. Dr. Koppaka spoke from his heart, truly from his heart, about his parents’ cherished desire to establish the Telugu Chair. During his short speech, he mentioned that the family first wanted to fund the Chair at the Central University in Hyderabad, and that effort did not ‘some how’ go far!
When that effort did not ‘go far’ they opted to fund the chair at the Emory University in Atlanta which has a strong South Asian Languages and Cultural Studies program.
(Personally, I really wonder why the Central University did not enthusiastically welcome the offer to fund the Chair!)
It was not the right time or place find out why the Central University, Hyderabad administration did not pursue such a great offer and have the chair at their own institution.
As one who has closely followed the birth of Emory Telugu Initiative about 5 years ago, its growth, and to witness the final establishment of the Telugu Chair in a premier university in the United States, I felt very proud, and at the same time very humbled and reminded of a line from one of Gurazada Apparao’s song:
” వట్టి మాటల్ కట్టి పెట్టోయ్
గట్టి మేల్ తలపెట్టవోయ్”
శ్రీ తమ్మినేని యదుకులభూషణ్ గారు – చాలా బావుంది మీ వ్యాఖ్య. అంటే, నాకు నచ్చింది. పద్యానికి, వచనానికి సంబంధించి మీరు వ్రాసిన వాటితో ఏకీభవిస్తున్నాను. చక్కగా చెప్పవలసింది సూటిగా సరళంగా అర్థమయ్యేట్టు చెప్పివేశారు. ఈ మధ్య కాలంలో నేను చూసిన కామెంట్లలో ఇది ఉత్తమ తరగతికి చెందిందని చెప్పడానికి నాకేమాత్రమూ సంకోచం లేదు. ధన్యవాదాలు. మరొక్కసారి కూడా చెపుతాను ధన్యవాదాలని, ఎందుకంటే వ్యాసం చదివారు కాబట్టి, చదివి దాని మీద అభిప్రాయం వెలిబుచ్చారు కాబట్టి.
సరే అదలా ఉంచితే, ఈశ్వర ప్రయోగం పునరుక్తికి కారణం ఇదీ – ఈ పాత వ్యాసానికి మూలకారణం చాలా ఏళ్లక్రితం చదువుకున్న “చలం గారి ఉత్తరాలు”. ఆ సంగతి వ్యాసంలో ఎక్కడో ఒకచోట, అక్కడ కుదరకపోతే చివరనన్నా చెప్పవలసిన నేను, వదిలెయ్యటం పూర్తిగా నా దోషమే! అందుకు క్షమాపణలు. – పోతే, వీరేశలింగంగారికి వారు వ్రాసిన ఉత్తరాల్లోని శైలిని అనుకరిద్దామని చేసిన విఫల ప్రయత్నం ఇది. వారి ఉత్తరాల్లో ప్రముఖంగా కనపడే పదం “ఈశ్వర” సంబంధం. అయితే దానిని నేను ఈ వ్యాసంలో వాడుకొన్న తీరు మీరన్నట్టు అవసరానికి మించిందేమోనని ఇప్పుడు అనిపిస్తున్నది. వచ్చే రచనల్లో కాసింత జాగ్రత్తగా ఉండటానికి దోహదపడుతుంది. అందుకు కృతజ్ఞతలు. ఈ వ్యాసం సఫలం కాలేదని నాకు తెలిసినా, అంటే, నాకు తృప్తిగా లేకున్నా, అది వేరే రూపు సంతరించుకొన్నా, వ్రాసేసినతరువాత, ఉన్న దానిని ఎవరికీ ఇవ్వకుండా దగ్గర పెట్టుకుని ఏం చేస్తాంలేనన్న దానితో ఈమాట వారికి చివరి నిముషంలో పంపిస్తే, వారు దయతో అచ్చువేసారు.
ఇహ చవట సంగతికొస్తే, విపరీతార్థాలు ఏవీ లేవనే అనుకోలు. ఒకవేళ వున్నదనే అనుకున్నా, వారికి నేను సమాధానం చెప్పలేకపోయినానన్న దోషం లేకుండగా దానికి తగ్గ జవాబు ఆ తర్వాతి నా కామెంటు(లో)తో సరిపెట్టబడింది. వారు వ్రాసిన మామూలు తెలుగు వచనంలోని ఆ చవట = [చమట, చెమట] అని నేను తీసుకొన్న అర్థం. కుంకుమ పెట్టుకోవడం మానేసి స్టిక్కర్ల వెంబడి పడ్డ ప్రస్తుత తరాన్ని ప్రతిఫలిస్తూ వ్రాసి దానికి వజనుగా ఇతరాలు కలిపారు దానికి. అది మంచి భావమే, కాకుంటే ప్రయోగం దెబ్బతిన్నది. ఇహ మిగతా వ, మ కారాల సంగతి గురించి మీరు వివరించిన తీరుతో సరిపోయింది. ఇహ ఇక్కడికి వదిలేస్తాను దీనిని.
అయితే ఈరోజుకి ఒక మంచి కామెంటు చదివానన్న తృప్తి. అందుకు మరొక్కసారి, మీకు ధన్యవాదాలు. ఇందులో, ఈ ధన్యవాదాల్లో, పునరుక్తిని మటుకు వదిలెయ్యండి. 🙂
Popularity of Telugu language is an inverted pyramid. Needs to be built from the grassroots level where it has no value. As a votary of Telugu, anyway, I humbly salute the long Herculean effort lying behind this landmark achievement.
వచనమైనా, పద్యమైనా ఎంత క్లుప్తంగా ఉంటే అంత అందం; పద్యంలోనైనా క్లుప్తతను సాధించడం కోసం కవి భావానుగుణంగా తన అవగాహన కొద్దీ, ప్రయోగ సామర్థ్యం కొద్దీ నానా వృత్తాలను వాడతాడు. తరళంలో చెప్పేభావాన్ని మత్తేభంలో లో చెప్పడు.
అంతేకాదు, మరీ ముఖ్యంగా “వచనం” కూడా వాడతాడు. మోహన గారు తమ ఛందో వ్యాసాల్లో చక్కగా పేర్కొన్నట్టు పద్యం కూడా ఒక పద్ధతికి లోబడి రాసిన వచనమే. పాత కాలంలో వెగటు పుట్టించే పద్యాలు రాసిన వారు ఎంతో మంది ఉన్నారు, లేదంటే ప్రాచీన కావ్యాల్లో కుకవి నింద ఎందుకు ఉంటుంది?? నాకు చూడగా, ఏ కాలంలోనైనా భావానుగుణంగా రాయలేక పోవడం పెద్ద లోపం. భావాంతం, పదాంతం ఒకే సారి జరిగితే కవికి /పఠితకు లాభం. అది లేకపోతే ఉభయ భ్రష్టత్వం సిద్ధిస్తోంది. పుట్టపర్తి, విశ్వనాథ మరి కొద్దిమందిని మినహాయిస్తే గత శతాబ్దంలో చక్కని పద్యాలు రాసినవారు లేరు.రాయప్రోలు లాంటి వారి వృత్తాలు కూడా (గేయాలు కాదు )అతి పేలవంగా కుంటుతూ నడుస్తాయి, ఇక ఇతరుల పద్యాల గూర్చి చర్చించి లాభం లేదు. ప్రాచీనుల పద్యాలు దేవాలయాల్లో శిల్పకళలా స్పుటంగా, మూర్తిమంతంగా ఉంటాయి. ఆ తరహా పద్యకళ విశ్వనాథాదుల దాకా వచ్చి ఆగి పోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే, భావానుగుణంగా రాయలేనప్పుడు పద్యమైనా, వచనమైనా ఆఖరికి ఏ రచనైనా అందగించదు.
పునరుక్తి పెద్ద దోషం, మీ వ్యాసం ఉద్దేశం బావుంది, చెప్పిన విషయాలు కొన్ని వ్యంగ్య స్ఫోరకంగా బావున్నాయి, కానీ ఈశ్వర ప్రయోగం ఎన్నిసార్లు జరిగిందో గమనించండి (పాతిక సార్లు), అన్నిసార్లు అవసరమా?? మీకు నచ్చిన కావ్యానికి విశ్వనాథ పీఠిక ఒక్కసారి చదివి చూడండి, పునరుక్తి దోషమున్నదా పరిశీలించండి. వచనమైనా, పద్యమైనా స్ఫుటంగా, బలంగా కరవాలం దూసినట్టు ఉండాలి, దర్భపోచ ఊగినట్టు కాదు. మంచి రచనలో బలహీనతకు తావు లేదు.
ఇక చవట శబ్ద విచారణ: మీ హృదయోల్లాస వ్యాఖ్య చదివిన తర్వాత కూడా నాకు అర్థం కాలేదు: “చవటకు జారిన కుంకుమ ఈ రోజు కనిపించదు” అన్న వాక్యం, తర్వాతి వాక్యం కూడా చదివాను ఇక్కడ అనుకోకుండా ఊడి పడిన చవట ఎవడు?? కొంపదీసి ఇక్కడ ఏమైనా విపరీతార్థము గలదా ?? నిఘంటువు తెరిస్తే:
చవట : శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004
వి. పనికి రానివాఁడు, శక్తిహీనుఁడు, ఎంబెన్న.
చవట : మాండలిక పదకోశం (తె.అ.) 1985
అసమర్థుడు, వ్యర్థుడు, వాజ, వాజమ్మ, అప్రయోజకుడు
మీ తాజా కలం అనుసరించి రెండో వాక్యం జాగ్రత్తగా చదివాను: “కానీ నుడిటిమీద ఆ పొడువాటి స్టిక్కర్ కూడా” కుంకుమ, స్టిక్కర్ రెండూ కనిపించక పోతే వాడు చవట, ఎంబెన్న క్రింద లెక్క వేయవలెనని భావమా?? ఇదేదో వచన కవిత్వంలోకి దిగబడి మీ వ్యాసం చెప్పని ఫలశ్రుతిని ప్రసాదిస్తున్నదా?? అన్న అనుమానం పొడసూపి, ఆ తర్వాతి వాక్యాన్ని (“ఒక భావాన్ని ప్రతిఫలిస్తుంది, కాదా?”) చదివినా నాకేమి బోధ పడలేదు. మళ్ళీ సదరు రచయిత అభిప్రాయాల్లో ఒక వాక్యం చూసి నాకు ఎటూ పాలు పోలేదు!!
“నాకు తెలుగు తెలుసు, మామూలు తెలుగు, అందరికి అర్థవయ్యే తెలుగు, మంది మాట్లాడే తెలుగు”. మరి నాకెందుకు అర్థం కావడం లేదు “మావూలు” తెలుగు??
పద్యాలను దొంగలను తోలిరి, వచనంతో ఇన్ని తంటాలా??
శ్రీలంకలో సంచార జాతులు మాట్లాడే తెలుగు, తమిళ నాడు నానా తెలుగు పల్లెల్లో మాట్లాడే తెలుగు అర్థం అవుతున్నదే, మరి ఇతగాడి తెలుగుతో వచ్చిన చిక్కు ఏమిటి??
“మాకు మీ కష్టతరవైన పద్యాలతో పనేవుంది చెప్పండి. కాదనటం లేదు మీకవి నచ్చుతాయి, మిమ్మలని అవి కదిలిస్తాయి, మీకా పద్యం చదివినప్పుడో, విన్నప్పుడో మీరు ఒక నిర్వాణ అవస్తలోకి పోతారు. అది మీకు తెలుసు, మీరు ఆ వ్యవస్తలో సబ్యులు, కానీ దురదృష్టం కొద్ది నూటికి తొంభై తొమ్మిది తెలుగు వాళ్ళవి మేవా బావిలో లో భాగం కాదు”
ఇక్కడ “మేవా బావి” అన్న పదబంధం చిక్కు ముడిని విప్పింది:
ఉర్దూ – తెలుగు నిఘంటువు (బి.రామరాజు) 1962
మేవా : పండు, ఫలము
మేవా ఫరోష్ : పండ్లమ్మువాడు
మాండలిక పదకోశము (ఆం.ప్ర.సా.అ.) 1970 R
మేవా :ఎండబెట్టిన పండ్లు. [కరీంనగర్]
మేవా అన్న ఉర్దూ పదం రచయితకు తెలిసే అవకాశం లేదు, మరీ పాత తరం తెలంగాణా వాసి అయితే తప్ప, మరి మేవా బావి ఎక్కడ గలదు?? “మేమా” అన్న అచ్చతెలుగును ఒక పధ్ధతి ప్రకారం ఖూనీ చేస్తే సిద్ధించే అర్థబోధకు ఏ మాత్రం ఉపకరించని వికృత రూపం అది. అది ఎట్లన్నన్ —
ఈయన తెలుగు సినిమాల్లో ఇతర మాండలికం మాట్లాడాలని ప్రయత్నించి విఫలమయ్యే పాత్రల్లా, మకారాన్ని వకారం చేసి, రెక్కాడితే డొక్కాడని సగటు జీవిలా చలామణీ అయ్యే ప్రయత్నం చేసి మన కళ్ళల్లో మన్ను కొట్టి పోతున్నారు.అంతే కాదు వత్తుల్లేని వ్యవస్థను లేని “మేవా బావిని” సృష్టించి 99 శాతం మంది తరపున వకాల్తా పుచ్చుకొని పద్యం చదివేవారు బావిలో కప్పలు, తతిమ్మా జనం ఉత్తారాధునికులు అని తెలివిగా తీర్మానిస్తున్నారు. భేష్!!
వ్యావహారికమున ఉచ్చారణలో కొన్ని సార్లు వకారము మకారము భిన్న అర్థ బోదకాలు కావు (ఉదా : మామా / మాఁవా), దీన్ని పట్టుకుని పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రంలా ఎక్కడ పడితే అక్కడ ప్రయోగించి చివరికి చమట ను చవట గా మార్చి “మేవా బావి” లో లేని సావాన్యులను (సామాన్యులను) ఇలా హింసించడం తగునా ??
లేదా సంపాదకులు దయ తలచి క్రింది పేరాలో చివరి వాక్యాన్ని గట్టిగా అమలు చేస్తే మేలు.
“We review comments before they are posted, and reserve the right to edit, remove, or not allow posting of any comment that is off-topic, inappropriate or is of a promotional nature. We also reserve the right to edit comments for clarity, readability or spelling, when appropriate.” (Ameritas అన్న Insurance Company website నుండి సంగ్రహితం).
మాధుర్యానికి మరో పేరు: ఏ. ఎం. రాజా గురించి Siddineni Bhavanarayana అభిప్రాయం:
03/31/2015 1:15 am
Sreenivas garu,
On the piece of information provide by you, i have accessed the video.
“తీయని ఈ కాపురమే దివ్యసీమ విరితేనెలూరు…” (A.P.కోమలతో).
http://www.4shared.com/video/HRWUSPmM/S_052_-_Paropakaram_-_Teeyani_.html
The male voice is that of Ghantasaala.We find no female voice in the song. The number you have mentioned could be a repetition of the same song in different voices of A. M .Raja and A.P Komala.
Could you please verify at your convenience! [ I know you are hard pressed for time trying to straddle your endeavour between your professional duties and the exigencies, demanded in your zeal in collecting data of archival significance]
Yours faithfully,
Siddineni Bhavanarayana
దేశభక్తి గేయాలు గురించి Sivaramakrishna Vankayala అభిప్రాయం:
03/31/2015 12:28 am
చిన్నప్పుడు విన్న ఉత్తెజపూరితమైన గీతాలను మళ్ళీ గుర్తుచేసారు శ్రీనివాస్ గారూ! ధన్యవాదాలు!
మాధుర్యానికి మరో పేరు: ఏ. ఎం. రాజా గురించి jawaharlal అభిప్రాయం:
03/29/2015 8:38 am
Krishna mohan garu
mee vyasam chalaa bagundi. naa raboye book lo eea article mee pearuto pettukuntaanu. permission ivvandi please
అమెరికా ఎమరీ యూనివర్శిటీలో తెలుగు సాహిత్యపీఠం గురించి Veluri Venkateswara Rao అభిప్రాయం:
03/28/2015 8:23 pm
Dear friends:
it was Telugu University that was offered the endowment. Although I was at the reception, I mistook it as Central University, Hyderabad. It was Telugu University at Hyderabad. I regret for the error.
Veluri Venkateswara Rao
ఈమాట మార్చ్ 2015 సంచికకు స్వాగతం! గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
03/28/2015 5:57 pm
ఉగాది రోజు తఃతః గారి వ్యాఖ్య చూసి, విశ్వనాథ పై ఏదన్నా తెలుగు పుస్తకం చదువుదామని చూస్తే పురాణం “విశ్వనాథ ఒక కల్ప వృక్షం,” [1] కనిపించింది. అందులోని విశేషాలు కొందరికి ఆసక్తికరంగా ఉండవచ్చని ఇస్తున్నాను. గుడివాడలో గజారోహాణోత్సవం (1942) సందర్భంగా (షష్ఠిపూర్తి కాదు) కాటూరి గారి పద్యాలు రక్తికట్టినట్లు మరెవరివీ లేవట. మరో పద్యం [1-143]:
పితృసాదుల్ వలె కాశీ కేగితివొ? యా విశ్వేశ్వరున్ దెచ్చి చే
సితివో మేటి ప్రతిష్ఠ? పద్యములనన్ చేలోకువౌటంగదా
శతకం బొక్కటి వట్టి, గొంటిని ప్రతిష్ఠన్, మేల్ భళా కాశికా
పతి విశ్వేశ్వర! నీవు మెచ్చవలె నబ్బో యిట్టి చాతుర్యముల్!
అయితే గుడివాడలోనే (1956) జరిగిన సభలో “షష్ఠిపూర్తి” అనే వ్యంగ్య పూరితమైన, విశ్వనాథని అవమానించే వ్యాసం కాటూరి వారు చదివారు [1-99]. సన్మాన సభలోనా అని మనం ఆశ్చర్యపోతాం. సరే, ఉగాది సమయాన ఆ విషయాలెందుకు తలచుకోవడం.
కాటూరి, అడవి (“అతడు గీసిన గీత బొమ్మై, అతడు పలికిన పలుకెల్ల అర్థవత్కృలై”) కూడా మన్మథలో పుట్టినవాళ్ళే.
ఉప్పొంగి పోయింది గోదావరీ – తాను
తెప్పున్న యెగిసింది గోదావరీ!
కొండల్లో ఉరికింది కోనల్లో నిండింది
ఆకాశగంగతో హాస్తాలు కలిపింది.
అడివిచెట్లన్నీని జడలలో తురిమింది,
ఊళ్ళు దండలగుచ్చి మెళ్ళోన తాల్చింది.
…
నరమానవుడి పనులు శిరమొగ్గి వణికాయి
కరమెత్తి దీవించి కడలికే నడిచింది.
కొడవళ్ళ హనుమంతరావు
[1] “విశ్వనాథ ఒక కల్ప వృక్షం,” పురాణం సుబ్రహ్మణ్యశర్మ. పరిష్కర్త, కోవెల సంపత్కుమారాచార్య. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, 2005. పలుచోట్ల నుండి చేర్చిన విషయాలని పుస్తకరూపంలో తీసుకురాకముందరే పురాణం చనిపోవడంతో, కోవెల పరిష్కరించి ప్రచురణ యోగ్యం కల్పించారు. అయినా కొన్నిచోట్ల ఎవరు ఎవరితో అన్నదీ స్పష్టంగా లేదు. అనుబంధంగా ఉన్న విశ్వనాథ తమ్ముడు వెంకటేశ్వర్లు గారి వ్యాసం, ’నేనూ – మా అన్నగారు,’ విలువైనది.
అమెరికా ఎమరీ యూనివర్శిటీలో తెలుగు సాహిత్యపీఠం గురించి విన్నకోట నరసింహారావు అభిప్రాయం:
03/28/2015 12:19 am
శ్రీ వేలూరి వేంకటేశ్వర రావు గారికి,
మార్చ్ 26 న కొప్పాక ఫౌండేషన్ వారి తెలుగు సాహిత్య పీఠం అట్లాంటా లోని ఎమరి యూనివర్శిటీలో అనుకున్నట్లుగా ప్రారంభమైందని “సారంగ” లో మీరు వ్రాసిన వార్త చదవడం చాలా సంతోషకరం. ఆ పీఠం తొలి ప్రొఫెసర్ గా ప్రసిద్ధ డాక్టర్ వెల్చేరు నారాయణ రావు గారు నియమితులవడం మరింత ముదావహం.
వారి ఫౌండేషన్ వారి ఇష్టం అనుకోండి గాని, కొప్పాక వారు యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ కి బదులు ఆంధ్రా యూనివర్శిటీ కి వారి ఆఫర్ని ఇచ్చుండవచ్చు అని నా వ్యక్తిగత అభిప్రాయం. వారి తండ్రి గారు ఆంధ్రా యూనివర్శిటీ లోనే చదువుకున్నారు అనేది కూడా ఒక బలమైన కారణంగా వుండేది. అలా కానప్పుడు తెలుగు భాషకి విశేష కృషి జరుగుతున్న అమెరికా దేశంలోనే యూనివర్శిటీల్ని ఎంచుకోవడమే సమంజసం. ఆ రకంగా మంచి పనే జరిగింది.
తలపెట్టిన పని పూర్తి చేసిన కొప్పాక కుటుంబం వారికి అభినందనలు.
అమెరికా ఎమరీ యూనివర్శిటీలో తెలుగు సాహిత్యపీఠం గురించి Veluri Venkateswara Rao అభిప్రాయం:
03/27/2015 10:43 pm
Dear eemaata readers and commentators:
Allow me to share with you all the following:
On the 26th March 2015, the Koppaka Foundation Professorship was announced by the Dean of Emory College, Emory University. Ninety years old Koppaka Sita garu with her three children attended the function. The dean announced that Prof. Velcheru Narayana Rao, an internationally well-known Telugu, poet,critic, and translator will occupy the Koppaka Foundation Chair as its first professor. More than 200 Telugus and quite a few Americans have attended the function.
The announcement was followed by an hour long well organized classical music concert, Kuchipudi dance performance, and poetry readings from classics along with English translations. After that the Dean of Emory College hosted a reception to the Koppaka family and the invited guests.
At the reception, Dr. Venkataramarao Koppaka, M.D., Ph.D, son of Dr. Koppaka Visweswara Rao and Sita garu, who works for CDC spoke at the request of the dean. Dr. Koppaka spoke from his heart, truly from his heart, about his parents’ cherished desire to establish the Telugu Chair. During his short speech, he mentioned that the family first wanted to fund the Chair at the Central University in Hyderabad, and that effort did not ‘some how’ go far!
When that effort did not ‘go far’ they opted to fund the chair at the Emory University in Atlanta which has a strong South Asian Languages and Cultural Studies program.
(Personally, I really wonder why the Central University did not enthusiastically welcome the offer to fund the Chair!)
It was not the right time or place find out why the Central University, Hyderabad administration did not pursue such a great offer and have the chair at their own institution.
As one who has closely followed the birth of Emory Telugu Initiative about 5 years ago, its growth, and to witness the final establishment of the Telugu Chair in a premier university in the United States, I felt very proud, and at the same time very humbled and reminded of a line from one of Gurazada Apparao’s song:
” వట్టి మాటల్ కట్టి పెట్టోయ్
గట్టి మేల్ తలపెట్టవోయ్”
Sincerely, — Veluri Venkateswara Rao
వచనానికి ఒక జాబు గురించి మాగంటి వంశీ అభిప్రాయం:
03/27/2015 1:04 pm
శ్రీ తమ్మినేని యదుకులభూషణ్ గారు – చాలా బావుంది మీ వ్యాఖ్య. అంటే, నాకు నచ్చింది. పద్యానికి, వచనానికి సంబంధించి మీరు వ్రాసిన వాటితో ఏకీభవిస్తున్నాను. చక్కగా చెప్పవలసింది సూటిగా సరళంగా అర్థమయ్యేట్టు చెప్పివేశారు. ఈ మధ్య కాలంలో నేను చూసిన కామెంట్లలో ఇది ఉత్తమ తరగతికి చెందిందని చెప్పడానికి నాకేమాత్రమూ సంకోచం లేదు. ధన్యవాదాలు. మరొక్కసారి కూడా చెపుతాను ధన్యవాదాలని, ఎందుకంటే వ్యాసం చదివారు కాబట్టి, చదివి దాని మీద అభిప్రాయం వెలిబుచ్చారు కాబట్టి.
సరే అదలా ఉంచితే, ఈశ్వర ప్రయోగం పునరుక్తికి కారణం ఇదీ – ఈ పాత వ్యాసానికి మూలకారణం చాలా ఏళ్లక్రితం చదువుకున్న “చలం గారి ఉత్తరాలు”. ఆ సంగతి వ్యాసంలో ఎక్కడో ఒకచోట, అక్కడ కుదరకపోతే చివరనన్నా చెప్పవలసిన నేను, వదిలెయ్యటం పూర్తిగా నా దోషమే! అందుకు క్షమాపణలు. – పోతే, వీరేశలింగంగారికి వారు వ్రాసిన ఉత్తరాల్లోని శైలిని అనుకరిద్దామని చేసిన విఫల ప్రయత్నం ఇది. వారి ఉత్తరాల్లో ప్రముఖంగా కనపడే పదం “ఈశ్వర” సంబంధం. అయితే దానిని నేను ఈ వ్యాసంలో వాడుకొన్న తీరు మీరన్నట్టు అవసరానికి మించిందేమోనని ఇప్పుడు అనిపిస్తున్నది. వచ్చే రచనల్లో కాసింత జాగ్రత్తగా ఉండటానికి దోహదపడుతుంది. అందుకు కృతజ్ఞతలు. ఈ వ్యాసం సఫలం కాలేదని నాకు తెలిసినా, అంటే, నాకు తృప్తిగా లేకున్నా, అది వేరే రూపు సంతరించుకొన్నా, వ్రాసేసినతరువాత, ఉన్న దానిని ఎవరికీ ఇవ్వకుండా దగ్గర పెట్టుకుని ఏం చేస్తాంలేనన్న దానితో ఈమాట వారికి చివరి నిముషంలో పంపిస్తే, వారు దయతో అచ్చువేసారు.
ఇహ చవట సంగతికొస్తే, విపరీతార్థాలు ఏవీ లేవనే అనుకోలు. ఒకవేళ వున్నదనే అనుకున్నా, వారికి నేను సమాధానం చెప్పలేకపోయినానన్న దోషం లేకుండగా దానికి తగ్గ జవాబు ఆ తర్వాతి నా కామెంటు(లో)తో సరిపెట్టబడింది. వారు వ్రాసిన మామూలు తెలుగు వచనంలోని ఆ చవట = [చమట, చెమట] అని నేను తీసుకొన్న అర్థం. కుంకుమ పెట్టుకోవడం మానేసి స్టిక్కర్ల వెంబడి పడ్డ ప్రస్తుత తరాన్ని ప్రతిఫలిస్తూ వ్రాసి దానికి వజనుగా ఇతరాలు కలిపారు దానికి. అది మంచి భావమే, కాకుంటే ప్రయోగం దెబ్బతిన్నది. ఇహ మిగతా వ, మ కారాల సంగతి గురించి మీరు వివరించిన తీరుతో సరిపోయింది. ఇహ ఇక్కడికి వదిలేస్తాను దీనిని.
అయితే ఈరోజుకి ఒక మంచి కామెంటు చదివానన్న తృప్తి. అందుకు మరొక్కసారి, మీకు ధన్యవాదాలు. ఇందులో, ఈ ధన్యవాదాల్లో, పునరుక్తిని మటుకు వదిలెయ్యండి. 🙂
భవదీయుడు
వంశీ
అమెరికా ఎమరీ యూనివర్శిటీలో తెలుగు సాహిత్యపీఠం గురించి Marripoodi Mahojas అభిప్రాయం:
03/26/2015 10:39 pm
Popularity of Telugu language is an inverted pyramid. Needs to be built from the grassroots level where it has no value. As a votary of Telugu, anyway, I humbly salute the long Herculean effort lying behind this landmark achievement.
వచనానికి ఒక జాబు గురించి తమ్మినేని యదుకుల భూషణ్ అభిప్రాయం:
03/26/2015 6:05 pm