పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16473

  1. శేషు మావయ్య గురించి Radha అభిప్రాయం:

    05/03/2015 12:33 pm

    దమయంతి గారూ, కథ చాలా బావుంది. బెహరా గారు షేర్ చేసుకోవడం వల్ల చూడగలిగాను. అభినందనలు. థాంక్్స బెహరా గారూ!

  2. శేషు మావయ్య గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:

    05/03/2015 9:35 am

    ‘కథ,కథనం అద్భుతంగా సాగాయి, మొదలు పెట్టాకా ఎక్కడా ఆగలేం’
    – థాంక్స్ వసంత. ఎంత పొంగిపోకూడదనుకున్నా, ఏవిటో.. సంతోషమేసిపోతుంది ప్రశంసలకి. :-)చాలా చాలా థాంక్సండి వసంత లక్ష్మి.

    * ‘ఇంతకీ శేషు మావయ్య అలా ఎందుకు చేసేడంటారు?’
    చాలా కారణాలు ఊహించాను. నేననుకున్నట్టు ఆయన అలానే మరణించారు. కొంత వరకు పాఠకుల ఊహకే వదిలేయడం జరిగింది జగధ్ధాత్రి గారు. మీ హృదయ స్పందన తెలియచేసినందుకు నా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి.
    నమస్సులతో..

    * సురేష్ నా కథలపై మీ వ్యాఖ్యలు, ప్రశంసలు నాకు మంచి స్ఫూర్తిని, ఉత్సాహాన్ని ఇస్తూ వుంటాయి. మరొక మంచి కథ రాసి మీ వంటి గొప్ప పాఠనాసక్తి గల సాహీతీ పరుని ప్రశంసను పొందాలనే తహతహ కలుగుతూ వుంటుంది.
    మీకు నా హృదయపూర్వక కృతజ్నతలు తెలియచేసుకుంటూ, శుభాకాంక్షలతో..

    * ‘మనసు పొరల్లో దాగిన ఊసులు ఉబికి ఉబికి వచ్చే సందర్భాలను వర్ణించిన విధానం భేష్….’ – మీరు భేష్ అన్నారంటే గొప్ప గానే వుంటుంది మరి బెహరా గారు. 🙂 చాలా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.

  3. వాన కడిగిన మధ్యాహ్నం … గురించి G.S.Lakshmi అభిప్రాయం:

    05/03/2015 7:22 am

    చిత్రాన్ని కళ్లముందు నిలబెట్టాసారండీ. అభినందనలు.

  4. శేషు మావయ్య గురించి బెహరా వెంకట లక్ష్మీ నారాయణ అభిప్రాయం:

    05/03/2015 4:36 am

    కథ చెప్పిన తీరు చాలా చాలా బాగుంది. మనసు పొరల్లో దాగిన ఊసులు ఉబికి ఉబికి వచ్చే సందర్భాలను వర్ణించిన విధానం భేష్… మొత్తం మీద ఆసక్తిగా కథను చదివించేలా (ఏకబిగిన) వ్రాసిన దమయంతి గారికి అభినందనలు.

  5. శేషు మావయ్య గురించి suresh అభిప్రాయం:

    05/03/2015 3:20 am

    చాలా ఆసక్తికరంగా సాగిన కథ, అత్తయ్య మరణం, మామయ్య పెళ్ళి, ఆ ఫొటొ, గుండెలని పిండెసినట్లు అనిపించింది. ఈ అత్తయ్యని మర్చిపొలెము.

  6. శేషు మావయ్య గురించి జగద్ధాత్రి అభిప్రాయం:

    05/03/2015 2:37 am

    దమయంతి గారూ మీ కధన శైలి చాలా బాగుంది. మానవ స్వభావాలెంత చిత్రమైనావో బాగా చిత్రించారు. ఇంతకీ శేషు మావయ్య అలా ఎందుకు చేసేడంటారు? ….ప్రేమతో జగతి

  7. శేషు మావయ్య గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:

    05/03/2015 1:09 am

    * థాంక్స్ రా సుమ! చాలా చాలా థాంక్స్. కథ మీద చక్కని అభిప్రాయాన్ని అందించినందుకు.

    *’ చాల సేపు ఏదో ఆలోచనలో ఉండి పోయాను నేనయితే…ఈ లోకం తో ఏ సంబంధమూ లేనట్లుగా ‘ – ఎంత గొప్ప ప్రశంస! కథ పై మీ విలువైన అభిప్రాయాన్ని వ్యక్తపరచినందుకు చాలా సంతోషం గా వుంది. మీకివే నా హృదయపూర్వక ధన్యవాదాలు.

    *ayyavaru గారు ధన్యవాదాలండి.

  8. శేషు మావయ్య గురించి వసంత లక్ష్మి ,ఫి. అభిప్రాయం:

    05/03/2015 12:25 am

    దమయంతి గారూ !

    కథ,కథనం అద్భుతంగా సాగాయి, మొదలు పెట్టాకా ఎక్కడా ఆగలేం, మావయ్యలతో ఉండే చనువూ, ఆ ఆప్యాయత, మేన కోడలుకే సొంతం.

    సముద్రంతో పోలుస్తూ, అత్త – మావయ్యల మధ్య కుదిరిన ప్రేమ బంధంలో పిల్లలు లేని విసాదాన్ని, అనారోగ్యాన్ని అధిగమిస్తూ ప్రేమా బంధం పెనవేసుకు పోవడం ..అన్నీ అందంగా వర్ణించారు, ఈ కథలో.

    ప్రతాప్ కుమార్ గారు చెప్పినట్టు, చక్కటి వ్యాఖ్యలు కథనాన్నికి వన్నె తెచ్చాయి .మీదైన శైలిలో కథనం హృద్యంగా సాగి, విషాదంగా ముగిసినా, శేషు మావయ్య జీవితం ఇలాగే అంతమవుతుంది అనే ఊహని చివరికి నిజం చేసారు. మంచి కథ చదివిన అనుభూతి. మాకు ఇచ్చారు..

    వసంత లక్ష్మి .

  9. తెలుగు అంతర్జాతీయ భాష కావాలంటే… గురించి Brahmanandam Gorti అభిప్రాయం:

    05/02/2015 7:25 pm

    ఈ వ్యాసం మొత్తం చదివితే ఇందులో కొత్తగా ప్రతిపాదించిన వేమీ లేవు. ప్రతిపాదనలూ అంటూ చెప్పినవి కూడా పాతవే. వ్యాస రచయితలకి తెలుగు రాష్ట్రాలూ, అక్కడి రాజకీయ పరిస్థితులూ తెలుసు. యూనివర్శిటీల్లో ఉద్యోగాలు కావాలన్నా, నిధులు కావాలన్నా ప్రభుత్వాల చేతల్లోనే ఉంటాయి. వాళ్ళు విదిల్చి పారేసిన గ్రాంటులతో ఏ విశ్వవిద్యాలయమూ నడవ లేదు. ఇహ పరిశోధన అంటారా? సాహిత్యమే అవసరం లేదు. మిగతా ఏ విభాగాలు అంటే సైన్సూ వగైరా, ఏవి తీసుకున్నా ఇంతకంటే దారుణమైన పరిస్థితి. ఎక్కడా ఉద్యోగం రాని వాళ్ళు తెలుగు ఎం.ఏ కానీ, పి.హెచ్.డీ కానీ చేస్తారన్న చిన్న విషయం పసి పిల్లాడిక్కూడా తెలుసు. ఒకవేళ ఈ వ్యాసరచయితలు ప్రతిపాదించినట్లు ఒక సంస్థ చేసినా, మరలా అదే మనుషులూ, ఇవే రాజకీయాలూను. ప్రైవేటు సంస్థలూ అనగానే రకరకాల సమీకరణాలు ముందుకొచ్చేస్తాయి. అంతెందుకు? తానా, ఆటా తీసుకోండి. కనీసం పాతికేళ్ళుగా ఉన్నాయి కదా? వాళ్ళంతా తెలుగుకీ, సాహిత్యానికి చేసింది ఎంతో అందరికీ తెలుసు. ఇలా చెప్పడం వలన ఆ సంస్థలని తక్కువ చేయడం కాదు. మనకా దృక్పథం లేదు. మీరు ప్రస్తావించినట్లు ఇండియాలో తెలుగు చదువుకొచ్చి, అమెరికాలో ఉంటూ తెలుగు మీద అభిమానంతో రచయితలుగా మారిన వాళ్ళు ఉండచ్చు. ఇంటర్నెట్ వచ్చాక కాలక్షేపానికి రాస్తున్న వాళ్ళే ఎక్కువ, నాతో సహా! ఇంటర్నెట్ రాక మునుపు ఎంత మంది తెలుగు రాసేవాళ్ళు కనబడతారు? ఇదంతా ఎందుకంటే ప్రవైటు సంస్థలూ, అకాడమీల వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు.

    మోహన గారు చెప్పినది అక్షర సత్యం. నాలాంటి వాళ్ళు రచయితలుగా ఎప్పుడు మారామ. మా కడుపులో చల్ల రెండు పూటలా హాయిగా పారినప్పుడే కదా? ఇండియాలో ఉంటూ, రోజూ వారీ ఉద్యోగం చేస్తుకుంటూ, దిన దినగండం నూరేళ్ళ ఆయుష్షులా గడిపుతూ ఉంటే సాహిత్యం ఎక్కడ ఎక్కుతుంది. ఈ విషయమ్లో మోహన గారితో నూటికి నూరు పాళ్ళూ నేనూ ఏకీభవిస్తాను.

    చివరగా – వేలూరి గారూ ఇదే విషయమ్మీద చాలా కాలం క్రితం సంపాదకీయం రాసారు కూడా. తాటాకు చప్పుళ్ళలా కామెంట్లు వచ్చి పడిపోయాయి. అంతే! అక్కడితో అందరూ మర్చి పోయారు. మరలా ఇప్పుడు మరోసారి వచ్చింది కాబట్టి అందరూ ఆవేశంగా తీర్మానాలూ, సలహాలూ ఇచ్చేస్తారు. అక్కడితో చల్లారి పోతుంది. కానీ ఇదంతా గొంగళీ వ్యవహారం.

    ఇంకో సంపాదకీయంలో కూడా ఇలాంటి విషయాలే ప్రస్తావించారు. ఓపికా, ఆసక్తీ ఉన్న వారి కోసం – తెలుగు భాషకి భవిష్యత్తులేదా?

    మరలా విన్నవే వింటున్నాం; కొంత విరామ తరువాత. అంతే!

    -బ్రహ్మానందం గొర్తి

  10. శేషు మావయ్య గురించి ayyavaru అభిప్రాయం:

    05/02/2015 5:05 pm

    మంచి కధ. ఇంకా చెప్పాలంటే చక్కని తెలుగు కధ …….