పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16472

  1. సహజ గాయని ఎస్. వరలక్ష్మి గురించి చౌదరి.యం.వి. అభిప్రాయం:

    08/20/2015 9:03 am

    చాల కొత్త విషయాలు తెలియజేశారు,చాల మంచి పాటలు వినిపించారు,ధన్యవాదాలు…

  2. సహజ గాయని ఎస్. వరలక్ష్మి గురించి DEVULAPALLI SRINIVASA MURTI అభిప్రాయం:

    08/20/2015 7:40 am

    రియమైన మిత్రులందరికీ …
    అలనాటి మేటి గాయకనటీమణి గురించి కొన్ని అపురూపమైన విశేషాలతో బాటు ఆవిడ ఆపపించిన కొన్ని అపురూపమైన పాటలతో పొందుపరిచి మనముందుంచిన వ్యాసకర్త అభినందనీయులు .

  3. రాగలహరి: మోహనం గురించి Ch.Ravi Kumar అభిప్రాయం:

    08/20/2015 7:10 am

    ఎన్నొ తెలియని విషయాలు చెపుతున్నదుకు కృతజ్ఞతలు.

  4. నాకు నచ్చిన పద్యం: వామనావతారం గురించి badri అభిప్రాయం:

    08/18/2015 12:19 pm

    అద్బుతంగా తోచింది

  5. రహదారి పాట – ‘పథేర్ పాంచాలి’ సత్యజిత్ రాయ్ సినిమా గురించి gudipati అభిప్రాయం:

    08/18/2015 9:34 am

    Just now I ready this essay. congrats and thanks to writer lakshmmanna garu.

    pather panchaali ki ippudu 60 years.

  6. జారిపోయిన కాలం గురించి S A RAHMAN, CHITTOOR. అభిప్రాయం:

    08/16/2015 6:33 am

    జారి పోయిన కాలం చక్కటి కవిత అందించినందుకు రచయిత్రి గారికి సంపాదకులు గారికి ధన్యవాదములు.

  7. నిర్ణయం గురించి Balaram Tej అభిప్రాయం:

    08/13/2015 4:09 am

    చాలా బాగుంది..

  8. సాహిత్యచరిత్రలో అపూర్వమైన పర్యాయకావ్యం: గణపవరపు వేంకటకవి ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము – 2. గురించి దేశికాచారి అభిప్రాయం:

    08/10/2015 11:34 am

    మురళీధరరావుగారికి కృతజ్ఞతలు.
    పొత్తపి వేంకటరమణకవి లక్షణశిరోమణిలో ప్రబంధరాజంలోని కొన్ని పద్యము లుదాహృతము లైనవి. పొత్తపివారి లక్షణశిరోమణికూడ గణపవరపుకవికి పరిచితమేనని మీవ్యాసం తెల్పుతూ ఉన్నది. ఇట్లు వీరిర్వురు సమకాలమువారై ఉండవలెను. కాణాదం పెద్దనసోమయాజి 1761 సంవత్సరంలో రాజ్యానికి వచ్చిన చినసోమభూపాలుని ప్రేరణచేత ముకుందవిలాసాన్ని రచించినట్లు అందలి అవతారికద్వారా తెలియుచున్నది. ముకుందవిలాసపద్యానుకరణలు ప్రబంధరాజంలో కనిపిస్తే, ప్రబంధరాజం 1761 తర్వాతనే రచింపబడి ఉండాలి.ఇట్లు ప్రబంధరాజకవి కాణాదం పెద్దనకు, అయ్యలరాజు అనంతామాత్యునికి, పొత్తపి వేంకటరమణకవికి సమకాలికుడై, వారియందలి గౌరవంచేతనో, వారితోగల పరిచయస్నేహాదులచేతనో సమకాలపు కవులపద్యాలప్రతులనే తన గ్రంథంలో చేర్చుకొన్నట్లుగా తోస్తున్నది.

  9. ప్రధాన సంఖ్యలలో కవలలు గురించి Taara అభిప్రాయం:

    08/08/2015 6:42 pm

    >>మాలాంటి సామాన్యులకి అర్థం అయే రీతిలో ఎక్కడెక్కడ ప్రధాన సంఖ్యల అవసరం వస్తుందో చెబితే బాగుంటుంది కదా?


    I have quals this semester :).

    Primes are (not prime numbers) like atoms (because of Grothendeick), we dont really care about numbers like 4,6,8. We only care about (2), (3).. (x) = ideal generated by x.
    By classification of local fields we have C, R and Q_p as char 0 and F_p((t)) as char p.

    So, when ever we have some results on C or R, we can extend that to p-adic field Q_p, but C or R are easier to work with (or better understood). So, there is more work going on C or R. recently other metrics gained momentum because of works of Terry Tao, Margulis and the recent fields medalists. But the problem is the flows are not homogeneous or simply there may be no longer compact topological structure which makes all existing knowledge obsolete.

    Coming to practical application, unfortunately CS eats everything. But more classical motivation is from Dynamics or Physics or in simple terms what happens to earth’s orbit after say some 1000 billion years, how can you estimate? Well there comes Ergodic theory. There we will have an algebraic structure, which can be reduced to Number Theoretic one. Infact number theory there makes lot of things much easier.

    My adviser was supported by Shell while he was in Grad school, his problem was, the shale gas horizontal drilling process exhibits a nice algebraic curve and he was expected to exploit it’s properties. Unfortunately he didn’t, but some one else did and now we have cheap natural gas. Shell still sponsors Maths grads at lot of schools.

    Or simply to say, any manifold is either R^n or R^2n, so we have real numbers on any manifold, and hence primes. For example earth is 2 dimensional real space (not 3 dimensional), which is R^2, so every point on earth represents a prime (irreducible polynomials like x-1, x-2, x^2+1, x^2 + 2 so on). So, what ever physical phenomenon you mention, it has number theoretic implications.

    Alternatively

    http://intlpress.com/site/pub/pages/journals/items/cntp/_home/_main/

  10. సాహిత్యచరిత్రలో అపూర్వమైన పర్యాయకావ్యం: గణపవరపు వేంకటకవి ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము – 2. గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:

    08/06/2015 3:25 pm

    మాన్యులు శ్రీమదిత్యాది శ్రీమాన్ కృష్ణదేశికాచార్యుల వారి సన్నిధికి

    సప్రశ్రయ నమస్కారములతో,

    సహృద్వాత్సల్యౌదార్యాలు ఉట్టిపడుతున్న మీ ఆశీర్మయవిలేఖితానికి ధన్యవాదాలను విన్నవించికొంటున్నాను. ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసాన్ని ఎంతో దీక్షతో అధ్యయనించిన మీరు అదొక కావ్యసామాన్యం కాదని, అపూర్వమైన వినూత్న లక్ష్యసాగరమని చేసిన ప్రతిపాదన మీ ఆమోదానికి నోచికొన్నందుకు ఎంతో సంతోషంగా ఉన్నది. గణపవరపు వేంకటకవి కృతులను పరిచయం చేసేటపుడు తత్తత్కాలాదికాన్ని విపులంగా సమీక్షింపవచ్చునని అనుకొన్నాను. అందువల్ల మీ ప్రశ్నకు సంక్షేపతః ఇక్కడ సమాధానిస్తున్నాను:

    ‘విద్యావతీ దండకం’ 1948లో Bulletin of Govt. Oriental MSS Library (సంపు – 1; సంచిక – 1) లో అచ్చయింది. అది ముద్దళగిరికి అంకితం. ప్రబంధరాజంలో కవి “చండ విద్యావతీ దండక”మని ప్రాసయతి నిమిత్తం అన్నాడే కాని, అది చండవృష్టి దండకం కాదు. నన్నయాదులు ప్రవేశపెట్టిన కామబాణ దండకమే. వీరేశలింగం గారు కవి 1750 నాటివాడనటం సరికాదని; ముద్దళగిరి 1674లో తంజావూరును పరిపాలించినందువల్ల కవి కాలం నిరూపింపబడుతున్నదని కె. వెంకటసుబ్బాశాస్త్రి గారు, నిడుదవోలు వేంకటరావు గారు విద్యావతీ దండకం పీఠికలో వ్రాశారు. ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసం కూడా తత్సమకాలికమని నిడుదవోలు వారి అభిప్రాయం. అప్పటినుంచి విమర్శకులు కవి కాలాన్ని ఆ విధంగా నిర్ధారించటం జరుగుతున్నది. అది సరికాదు.

    1674లో ముత్తులింగ నాయకుడు (ముద్దళగిరి) తన సవతి అన్న చొక్కనాథ నాయకుని ప్రాపకంతో తంజావూరుకు రాజైనాడు. అప్పటికి అతని వయోవస్థాకాలం పాతిక – ముప్ఫై యేళ్ళకు దరిదాపులలో ఉండి ఉంటుంది. యౌవనోద్రేకం వల్ల, అన్నగారన్న చనవు మూలాన చొక్కనాథ నాయకుని ఏలుబడిలో ఉంటూనే, సమానుడైన స్వతంత్రప్రభువు వలె ప్రవర్తించాడు. శివాజీ సవతి తమ్ముడు ఏకోజీ దండెత్తి, ఒకటి రెండు పర్యాయాల విఫలయత్నం తర్వాత 1676 జనవరి 16-వ తేదీని విష్ణుచక్రం కోటను వశపరచుకొన్నాడు. ఏకోజీ తొలిదండయాత్ర నాటి పరాజయగాథ ‘పెదళ్గిరి విజయము’ మాలికా కావ్యంలో సవిస్తరంగా వివరింపబడింది. (‘పెదళ్గిరి విజయము’ నిడుదవోలు వారన్నట్లు గణపవరపు వేంకటకవి రచన కాదని నేను ఇతరత్ర వేరొక వ్యాసంలో నిరూపించాను.) అప్పటికే అతని ప్రవర్తనతో విసిగి ఉన్న చొక్కనాథుడు అతనికి అండరాలేదు. రాజ్యభ్రష్టుడైన ముద్దళగిరి 1678లో మళ్ళీ అన్నగారి వద్దకు చేరుకొని, అపార్థాలకు క్షమాభిక్షను అర్థించి మధుర వద్ద రాజప్రతినిధిగా ఉన్నాడు. 1678 (కాళయుక్తి)లో మధురలోనూ, 1679 (సిద్ధార్థి)లో శ్రీరంగంలోనూ అతని దానశాసనాలున్నాయి. 1682లో చొక్కనాథ నాయకుడు మరణించిన తర్వాత చిన్నచిన్న అధికారపదవులను చేపట్టి, 1700-1705 (±) ప్రాంతాల కర్ణాటకానికి వెళ్ళి సుమారు యాభై – యాభైఅయిదేళ్ళప్పుడు కుంతూరు దుర్గానికి రాజయ్యాడు. ఎంతకాలం ఉన్నాడో స్పష్టంగా చెప్పలేము. ఆ కాలంలోనే లింగనమఖి శ్రీకామేశ్వరకవి ధేనుమాహాత్మ్య రచన జరిగింది. శ్రీకామేశ్వరకవి ‘సత్యభామా సాంత్వనము’ ముద్దళగిరికి అంకితమైంది. ఈ చారిత్రిక పరిణామాలను గుర్తింపక నిడుదవోలు వారు శ్రీకామేశ్వరకవిని కూడా 1674కు పరిమితం చేశారు. వారిని అనుసరించి తర్వాతివారందరూ వ్రాస్తున్నారు.

    అంతర్గతసాక్ష్యాల వల్ల గణపవరపు వేంకటకవి ‘సర్వలక్షణశిరోమణి’ క్రీస్తుశకం 1700కు పూర్వరచన కాదని నిశ్చయంగా చెప్పవచ్చును. తద్రచనాకాలం కొంచెం ఇంచుమించుగా 1705-1715 (±) కావచ్చును. అందులో ముద్దళగిరి ప్రస్తావన లేదు. అప్పటికి అతని ప్రాపకం లేదన్నమాట. ‘విద్యావతీ దండకం’ ముద్దళగిరికి అంకితం. దాని చివరను “మహాలక్షణగ్రంథ భాషాభిమానప్రథామాధురీసాధురీత్యర్థవ చ్ఛబ్దబంధానుబంధ ప్రబంధాధినాథాప్పయామాత్య రాడ్వేంకటార్య ప్రణీతంబైన” అని ఉన్నది. అంటే విద్యావతీ దండకం సర్వలక్షణశిరోమణికి అనంతరీయం అన్నమాట. ఆ తర్వాత ఒక దశాబ్ది కాలం కృషిచేసి, వందలాది గ్రంథాలనుంచి లక్షణలక్ష్యాలను సమీకరించుకొని ప్రబంధరాజ సంకలనాన్ని మొదలుపెట్టి ఉండాలి. తలకొక్కతీరుగా ఉన్న వ్రాతప్రతులలోని ప్రక్షిప్తాలను తొలగించి సుష్ఠుప్రతిని పరిష్కరింపగలిగితే ప్రబంధరాజ రచనాకాలం 1730 – 1755 (±) కావచ్చునని ఇప్పటి ఆలోచన. ప్రకృతవ్యాసంలో ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము యొక్క సర్వాంగీణవిమర్శ గాక, తెలుగు సాహిత్యచరిత్రకు అపరిచితమైన ఒక్క అపూర్వమైన విశేషం మాత్రమే అధికరింపబడుతున్నది. అందులో సంప్రయుక్తమైన లక్షణజాతాన్ని గురించి, చిత్రకవిత్వాన్ని గురించి ప్రత్యేకంగా పరిశీలింపవలసి ఉంటుంది.

    వేంకటకవి రచనలో తుల్యసంవాదం ఉంటే ఆ రచన ప్రబంధరాజానికి పౌర్వికమని, వేంకటకవి దానిని పరిశీలించి తన సంకలనంలో చేర్చుకొన్నాడని గ్రహించాలి. ఈ పూర్వాపరాల నిశ్చయం అంత సులభసాధ్యం కాదని వ్యాసంలో నేను మనవిచేశాను. గ్రంథస్థపద్యాల పట్టికను తన్మూలపద్యాల గుర్తింపుతో ప్రకటిస్తేనే కాని అది సాధ్యం కాదు. తెలుగు సాహిత్యచరిత్ర చాల వరకు ప్రామాణ్యభావం లేని ప్రాథమికోహలతో సాగినందువల్ల కావ్యపీఠికలలో నిర్ణయింపబడిన కాలాదికాన్ని ప్రమాణంగా స్వీకరింపక చరిత్రనికషపాషాణపట్టికపై స్వయంగా గీచిచూచి తథ్యమిథ్యావివేకంతో పునారచింపవలసిన అవసరం ఉన్నది.

    మీ ఆత్మీయతకు, ఆదృతికి నమస్సుమాంజలి.

    విధేయుడు,
    ఏల్చూరి మురళీధరరావు