శర్మ దంతుర్తి గారికి.ఇది మీ ప్రశ్న వల్ల నాకు కలిగిన సందేహం.
శ్రీధరుడు వ్యాస భాగవతానికి వ్యాఖ్య కదా వ్రాసింది.శ్రీధర భాగవతం అని స్వతంత్ర గ్రంధం ఉన్నదా?.ముఖ్యంగా భాగవతం లోని గహన మైన వేదాంత విషయాలని తెనిగించేటప్పుడు పోతన శ్రీధర వ్యాఖ్యని అనుసరించాడు,అని సరస్వతీ పుత్ర పుట్టపర్తి నారాయణాచార్యుల వారు తన భాగవత సుధా లహరిలో తెలియజేసారు.
కార్తిక్ గారు
విశ్వనాథ సత్యనారాయణ గారి అబ్బాయి పావని శాస్త్రి గారు “సీత” అనే నవల రాసారు. అందులో మంధర రాముణ్ణి అడవులకు ఎందుకు అంత పట్టుదలగా పంపమందో చెప్తారు. నేను అది చదివి చాలా పౌర్ణమిలూ అమావశ్యలు గడిచాయి. రాముణ్ణి చూడగానే ఎంతటివారికైనా సరే ఒళ్ళు జలదరించేదిట. అటువంటివాడి మీద చేత్తో ఎత్తుకు ఆడించిన మంధరకి కోపం పుట్టడానికి కారణం ఏమీ కనిపించదు. నేను పావని శాస్త్రి గారి పంధాలోనే ఈ కధ రాసాను. శ్రీ రవిశంకర్ గారు కైక గురించి చెప్పిన ఉపన్యాసం ఎక్కడో ఇంటర్నెట్లో చదివాను. అందులో కైక ఎంత మనసు కష్టపెట్టుకుంటూ రాముణ్ణి అడవికి ఎందుకు పంపించిందో చెప్తారు. ఈ కధ రాయడానికదో కారణం కూడా.
మొత్తానికి నేను చెప్పదల్చుకున్నది ఏమిటంటే, కైక, మంధర మనం అనుకున్నంత విలన్లు కాదు. కౌసల్య రాముణ్ణి చూడకుండా రెండుమూడు రోజులు ఉండగలిగేదేమో కానీ కైక ఉండలేకపోయేది అంటారు. మంధర ఎంత దుర్మార్గురాలైనా తనకి ఆశ్రయం ఇచ్చిన దశరధుణ్ణీ, ఆశ్రితపారిజాతుడైన రాముణ్ణీ అలా ఆట ఆడించడానికి మనసు ఒప్పుతుందా? మంధరా, కైకా లోక కల్యాణం కోసం అలా చేసారు(ట). ఇది రాస్తూ ఉంటే మనసులోకి త్యాగరాజ కీర్తనలు తన్నుకు వచ్చాయి కొన్నిచోట్ల. ఎలా ఎందుకొచ్చాయో నాకే అర్ధం కాలేదు. అవి అలా వస్తూంటేనే ఇరికించాను కధలో. ఈ కధలో మొదట రాసినది ఆఖరి పేరా; మీరు నమ్ముతారో లేదో. అదయ్యాక మొదటినుంచి రాసాను.
ఒక పద్యాన్ని సాధారణంగా చదువుకుంటూ పోతే అందులో ప్రత్యేకతలు గోచరించవు.విషయం తెలిసివస్తుందేమో కానీ విశేషాలు తెలియవు.శ్రీ భైరవభట్ల కామేశ్వరరావు గారు విపుల వ్యాఖ్యనం లో ఎన్నో సంగతులను తెలిపారు. ముఖ్యంగా శాస్త్రీయసంగీత స్వరప్రస్తారాలను, కవి తన కల్పనాచాతుర్యంతో చేసే వర్ణనల తో పోల్చడం గొప్పగా ఉంది. మంచి పద్యాలను మరిన్నింటిని ఇటువంటి వ్యాఖ్యానాల తో ఇవ్వవలసింది గా మనవి.( “ఒక సంచిక కు ఒకే పద్యం”- అనే నియమము ఏదైనా ఉంటే అది సడలింప ప్రార్థన.)
శ్రీయుతులు కామేశ్వరరావు గారికీ, వేలూరి వేంకటేశ్వర రావు గారికీ కృతజ్ఞతా పూర్వక వందనాలు.
అసందర్భమో కాదో తెలియదు కానీనండీ, నాకీ వ్యాసం చదువుతున్నంతసేపూ ఒకటే తలఁపు. “అసలు తెలుఁగు నేర్చుకోవటమే దండుగ, వృథాకాలయాపన, పైసా కూడు పెట్టదు, ఫేఁషన్ కూడా కాదు” అనకునే ప్రజలు అధికులౌతున్న కాలం కదా, తెలుఁగులో కథలో కవిత్వమో మఱొకటో చదివేవారూ, అందులోనూ కాకితఁపు పుస్తకరూపంలో చదివేవారు ఎంతమంది ఉంటారు అని. ఈ చదివేవారి గుంపు జనాభా తగినంత లేకుండా నాణ్యమైన పుస్తకాల ప్రచురణ లాభసాటి బేరం కాఁబోదు కదా? ఈవేళా రేపూ కొందఱు చక్కటి ప్రమాణాలతో ప్రచురిస్తూన్నా అటువంటి తెలుఁగుప్రచురణలు ఎన్ని వెలుగు చూస్తున్నాయి? ఏమిటోనండీ, ఆలోచించటానికే అదోలా ఉంది.
పోతనామాత్యుని కల్పనానల్పశిల్పం గురించి వీరభద్రం అభిప్రాయం:
09/12/2015 5:40 am
శర్మ దంతుర్తి గారికి.ఇది మీ ప్రశ్న వల్ల నాకు కలిగిన సందేహం.
శ్రీధరుడు వ్యాస భాగవతానికి వ్యాఖ్య కదా వ్రాసింది.శ్రీధర భాగవతం అని స్వతంత్ర గ్రంధం ఉన్నదా?.ముఖ్యంగా భాగవతం లోని గహన మైన వేదాంత విషయాలని తెనిగించేటప్పుడు పోతన శ్రీధర వ్యాఖ్యని అనుసరించాడు,అని సరస్వతీ పుత్ర పుట్టపర్తి నారాయణాచార్యుల వారు తన భాగవత సుధా లహరిలో తెలియజేసారు.
వెడలెను కోదండపాణి గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:
09/11/2015 8:42 am
కార్తిక్ గారు
విశ్వనాథ సత్యనారాయణ గారి అబ్బాయి పావని శాస్త్రి గారు “సీత” అనే నవల రాసారు. అందులో మంధర రాముణ్ణి అడవులకు ఎందుకు అంత పట్టుదలగా పంపమందో చెప్తారు. నేను అది చదివి చాలా పౌర్ణమిలూ అమావశ్యలు గడిచాయి. రాముణ్ణి చూడగానే ఎంతటివారికైనా సరే ఒళ్ళు జలదరించేదిట. అటువంటివాడి మీద చేత్తో ఎత్తుకు ఆడించిన మంధరకి కోపం పుట్టడానికి కారణం ఏమీ కనిపించదు. నేను పావని శాస్త్రి గారి పంధాలోనే ఈ కధ రాసాను. శ్రీ రవిశంకర్ గారు కైక గురించి చెప్పిన ఉపన్యాసం ఎక్కడో ఇంటర్నెట్లో చదివాను. అందులో కైక ఎంత మనసు కష్టపెట్టుకుంటూ రాముణ్ణి అడవికి ఎందుకు పంపించిందో చెప్తారు. ఈ కధ రాయడానికదో కారణం కూడా.
మొత్తానికి నేను చెప్పదల్చుకున్నది ఏమిటంటే, కైక, మంధర మనం అనుకున్నంత విలన్లు కాదు. కౌసల్య రాముణ్ణి చూడకుండా రెండుమూడు రోజులు ఉండగలిగేదేమో కానీ కైక ఉండలేకపోయేది అంటారు. మంధర ఎంత దుర్మార్గురాలైనా తనకి ఆశ్రయం ఇచ్చిన దశరధుణ్ణీ, ఆశ్రితపారిజాతుడైన రాముణ్ణీ అలా ఆట ఆడించడానికి మనసు ఒప్పుతుందా? మంధరా, కైకా లోక కల్యాణం కోసం అలా చేసారు(ట). ఇది రాస్తూ ఉంటే మనసులోకి త్యాగరాజ కీర్తనలు తన్నుకు వచ్చాయి కొన్నిచోట్ల. ఎలా ఎందుకొచ్చాయో నాకే అర్ధం కాలేదు. అవి అలా వస్తూంటేనే ఇరికించాను కధలో. ఈ కధలో మొదట రాసినది ఆఖరి పేరా; మీరు నమ్ముతారో లేదో. అదయ్యాక మొదటినుంచి రాసాను.
నాకు నచ్చిన పద్యం: దాంపత్య మధురిమ – కవిత్వ మాధురీమహిమ గురించి SeshaKumar KV అభిప్రాయం:
09/11/2015 8:03 am
ఒక పద్యాన్ని సాధారణంగా చదువుకుంటూ పోతే అందులో ప్రత్యేకతలు గోచరించవు.విషయం తెలిసివస్తుందేమో కానీ విశేషాలు తెలియవు.శ్రీ భైరవభట్ల కామేశ్వరరావు గారు విపుల వ్యాఖ్యనం లో ఎన్నో సంగతులను తెలిపారు. ముఖ్యంగా శాస్త్రీయసంగీత స్వరప్రస్తారాలను, కవి తన కల్పనాచాతుర్యంతో చేసే వర్ణనల తో పోల్చడం గొప్పగా ఉంది. మంచి పద్యాలను మరిన్నింటిని ఇటువంటి వ్యాఖ్యానాల తో ఇవ్వవలసింది గా మనవి.( “ఒక సంచిక కు ఒకే పద్యం”- అనే నియమము ఏదైనా ఉంటే అది సడలింప ప్రార్థన.)
శ్రీయుతులు కామేశ్వరరావు గారికీ, వేలూరి వేంకటేశ్వర రావు గారికీ కృతజ్ఞతా పూర్వక వందనాలు.
పోతనామాత్యుని కల్పనానల్పశిల్పం గురించి Muralisyam అభిప్రాయం:
09/11/2015 1:25 am
Chalabagunnadi. Dayachesi Sri Kankanti Papraju- Uttara Ramaysnam prachurincha prardhana. Mee abhimani-muralisyam. Pedamuthevi village.
తెలుగులో పుస్తక ప్రచురణ – ఆకారవికారాలు గురించి indrani Palaparthy అభిప్రాయం:
09/10/2015 1:12 pm
ప్రచురణ మీద శ్రీపాద వారి అభిప్రాయాలు ఇక్కడ:
నాకు బాగా నచ్చి సరదాకి చదివేను. ఇక్కడ:
ఇందులో తప్పులన్నీ నావే. క్షమించగలరు.
ఇంద్రాణి.
వెడలెను కోదండపాణి గురించి Karthik Parasa అభిప్రాయం:
09/10/2015 8:16 am
ఈ కథ చదివినప్పుడు నా కళ్ల ముందే రామాయణం జరుగుతున్నట్టు అనిపించింది. ఇది ఈ కథ నిజంగా రామాయణం లో జరిగిందా లేక కల్పననా అని నా సందేహం. తీర్చగలరు.
కార్తీక్.
తెలుగులో పుస్తక ప్రచురణ – ఆకారవికారాలు గురించి రాఘవ అభిప్రాయం:
09/10/2015 8:13 am
అసందర్భమో కాదో తెలియదు కానీనండీ, నాకీ వ్యాసం చదువుతున్నంతసేపూ ఒకటే తలఁపు. “అసలు తెలుఁగు నేర్చుకోవటమే దండుగ, వృథాకాలయాపన, పైసా కూడు పెట్టదు, ఫేఁషన్ కూడా కాదు” అనకునే ప్రజలు అధికులౌతున్న కాలం కదా, తెలుఁగులో కథలో కవిత్వమో మఱొకటో చదివేవారూ, అందులోనూ కాకితఁపు పుస్తకరూపంలో చదివేవారు ఎంతమంది ఉంటారు అని. ఈ చదివేవారి గుంపు జనాభా తగినంత లేకుండా నాణ్యమైన పుస్తకాల ప్రచురణ లాభసాటి బేరం కాఁబోదు కదా? ఈవేళా రేపూ కొందఱు చక్కటి ప్రమాణాలతో ప్రచురిస్తూన్నా అటువంటి తెలుఁగుప్రచురణలు ఎన్ని వెలుగు చూస్తున్నాయి? ఏమిటోనండీ, ఆలోచించటానికే అదోలా ఉంది.
శ్రీమాన్ రీమాన్ ఉవాచ! గురించి indrakanti pinakapani అభిప్రాయం:
09/10/2015 6:10 am
ఆ భగవంతుడనే వాడొకడుంటే శ్రీమాన్ రీమాన్ శిష్టాభిప్రాయం నిజమగు గాక.. !
మాటల అక్షరాలు గురించి S A RAHMAN, CHITTOOR. అభిప్రాయం:
09/09/2015 6:05 am
సింప్లి సూపర్బ్. చిన్ని కవిత చాలా బాగుంది.
ఎస్. ఎ. రహమాన్. చిత్తూరు.
ఈమాట సెప్టెంబర్ 2015 సంచికకు స్వాగతం! గురించి SeshaKumar KV అభిప్రాయం:
09/09/2015 3:39 am
“చంద్రికా పరిణయము”ను శ్రధ్ధ తోడ
మరల వ్రాసి యొసంగిన మాన్య మతికి
కృష్ణ దేశికా చార్యులకు కేలు మోడ్తు
అంద జేసిన “ఈమాట” కంజలిడుదు