చీమలమర్రి బృందావనరావు మొల్ల గురించి చాలా చక్కగా వివరించారు.ఇలాంటి వ్యాసాలు పెద్దలు అనేకం వ్రాస్తే మేము చదివి ఆనందించడమే కాకుండా, పదమందికి చెప్పగలం తద్వారా భాషాభివృద్ధికి కూడా దోహదపడినట్లుండును.
ధన్యవాదములు. .
పి.రామకృష్ణారెడ్డి,
తెలుగుపండిట్,
నంది అకాడమి,
నంద్యాల .
శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి అరికాళ్ళ కింద మంటలు చదివిన వారికి ఈ కథ ఇంకా సాత్వికంగా అనిపిస్తుంది. ఆ రొజుల్లొనె రచయిత అంత ధైర్యంగ వ్రాసారంటే, సాయి గారు కాచి పాత్రకు న్యాయం చెయ్యగలరు అనిపించింది.
చాలా అద్భుతంగా ఉంది. ఇది వసు చరిత్రకు సమకాలికమంటున్నారు. ఐతే వసు చరిత్రకు వచ్చిన కీర్తి దీనికి రాక పొడానికి కారణం మాధవరాయలు అళియరామరాయలంతటి ప్రసిద్ధుడు కాక పొవడమే కావచ్చు. ఒక వేళ ఇది నిజమే ఐతే దీన్ని బట్టి ఇలాంటి కావ్యాన్ని “పిల్ల వసు చరిత్ర” అనుకోడం కాక వసు చరిత్రను “పెద్ద చంద్రికా పరిణయం” అనుకోవచ్చు.
“ఇంత చేసి కూడా ఆయన ప్రతి పుస్తకంలోను దేవతల అనుగ్రహము, తల్లిదండ్రుల తపస్సు, తన గురువుల కృప ఇవే తన పుస్తకాలకి కర్తలనీ తాను కేవలం ఉపకరణం మాత్రమే అని సవినయంగా చెప్పుకోగల మహానుభావుడాయన.”
వేద భాష్యాన్ని రాసిన సాయణుల గురించి రాస్తూ పుల్లెల వారు సాయణులు తన గురించి తాను రాసుకున్న ” న ధ్యానం న వ్రతం నార్చా న సమాధిర్న వా జపః , సుప్రసిద్ధా బలం యస్య మతిరేవ మహీయసీ ” అన్న శ్లోకాన్ని ని పేర్కొని, తెనిగిస్తూ “ఏ సాయణాచార్యునికి సుప్రసిద్ధమూ చాలా గొప్పదీ అయిన బుద్ధియే బలమో, అంతే కాని ధ్యానం కాని, వ్రతం కాని, దేవతాది పూజ కాని, యోగం గాని, జపం కాని ఎవనికి బలం కాదో…” అని వివరించారు.
(పుల్లెల వారి ప్రస్తావనలు, సంస్కృత భాషా ప్రచార సమితి హైదరాబాద్- 500 001, జులై,2011, పుట 363.)
చాలా చక్కని, చిక్కని వ్యాసం. వ్యాసరచయితలు అభినందనీయులు. ప్రచురణ, ముద్రణలకు సంబంధించి సాంకేతికపరమైన పలు అంశాలు చర్చించారు.
కానీ తెలుగు పుస్తకాల ప్రచురణను ఆంగ్ల పుస్తకాల ప్రచురణతో పోల్చటం అంత సమంజసం కాదనుకుంటాను. హాలీవుడ్ స్థాయిలో తెలుగు సినిమా తీయటం సాధ్యమా? అయితే కనీసావసరం, అచ్చు తప్పులూ, పదాలవిరుపుల్లో లోపాలగురించైనా తగినంత శ్రద్ధ పెట్టటం లేదు మన రచయితలు, ప్రచురణకర్తలుకూడా. ఆ గాలి కి బదులు ఆగాలి అని వుంటే అర్థంలో ఎంత తేడా. డిజిటల్ తైప్ వచ్చాక చాలా పుస్తకాల్లో పంక్తి ప్రారంభమే “లేదా”లతో ప్రారంభం అవుతూంది, సెట్టింగ్లో శ్రద్ధ పెట్టక పోవటం మూలంగా. మేమెంత శ్రద్ధచూపినా, మాసొంత ప్రచురణల్లోనైనా ఈ ఉపద్రవాన్ని నివారించలేకున్నాం.
అభిప్రాయాలలో ఎవరో హాసం ప్రచురణల నాణ్యతను ప్రస్తావించారు. నావద్దనున్న కోతికొమ్మచ్చి మొదటిభాగలో మధ్యన కొన్ని పుటలు బైండింగ్ ను ఒరుసుకొని ముందుకు చొచ్చుకువచ్చాయి. బహుశా ముళ్ళపూడి ఆత్మ అందులో ప్రవేశించి, భడవా, ఈ పుటల్లో ఇంకా మధురరసగుళికలున్నాయిరా అని చెబుతున్నదేమోననుకున్నాము.
ఇంద్రకంటి వేంకటేశ్వర్లు మరియు గుమ్మళ్ళ పుల్లారెడ్డి
వెంకటేశ్వర రావు గారికి వందనములు. పాత వ్యాసమును మిత్రులు నాచే చదివించారు. అద్భుతమైన వ్యాసము. సారపు ధర్మమున్ పద్యము నాకు కూడా బాగా నచ్చిన పద్యము. ఈ పద్యము ప్రతిలో దోషాలుండుటచే గణములు సరిపోవు. పద్యమిలా ఉండాలి.
సారపు ధర్మమున్ విమల సత్యముఁ బాపముచేత బొంకుచేఁ
బారముఁ బొంద లేక చెడఁ బాఱినదైన యవస్థ దక్షు లె
వ్వార లుపేక్షసేసి రది వారల చేటగుఁ గాని ధర్మ ని
స్తారక మయ్యు సత్య శుభదాయక మయ్యును దైవముండెడున్ !
పూజ్యతములు శ్రీ కృష్ణదేశికాచార్యుల వారికి
నమస్కారములతో,
మీరు లేఖ వ్రాసినప్పటినుంచి అలంకారములయొక్క అనుప్రాణనమును గురించి లక్షణశాస్త్రంలో ఏమైనా చెప్పబడి ఉన్నదా? తొలిసారి దీనిని ఎవరు ప్రయోగించారు? అని నాకు అందుబాటులో ఉన్న గ్రంథాలలో వెతికిచూశాను. అక్కడక్కడ వ్యాఖ్యాతలచే అనుప్రాణితముల నిర్దేశములే తప్ప ఆలంకారికుల నిర్వచనములు నాకేవీ కనుపింపలేదు. దీనిని గురించిన విమర్శకుల చర్చలేవీ లభింపలేదు. వాక్యంలో రెండు అలంకారములు ఉన్నప్పుడు వాటియొక్క ప్రాధాన్యవివక్షచేత ఉత్థాపితత్వము, సంకీర్ణత, సాంకర్యము అన్నవాటికే గాని అనుప్రాణనమునకు ఉక్తలక్షణమేమిటో తెలియలేదు. అది విజాతీయములకేనా? అభేదాదిప్రాధాన్యం కలిగిన సజాతీయములకు కూడా వర్తిస్తుందా? లేక యథేచ్ఛాప్రవర్తితమా? అన్న సందేహమూ తీరలేదు. ఈ పద్యంలోని సారోల్లేఖముల మాటెలా ఉన్నా, లాక్షణికోక్తి విషయమై నాతోపాటు మీతోపాటు ‘ఈమాట’ పాఠకులు ఆలోచింపగలరని ఈ మాట వ్రాశాను.
నాకు నచ్చిన పద్యం: మొల్ల రాకుమారుల వర్ణన గురించి P. RAMA KRISHANA REDDY అభిప్రాయం:
10/14/2015 12:34 am
చీమలమర్రి బృందావనరావు మొల్ల గురించి చాలా చక్కగా వివరించారు.ఇలాంటి వ్యాసాలు పెద్దలు అనేకం వ్రాస్తే మేము చదివి ఆనందించడమే కాకుండా, పదమందికి చెప్పగలం తద్వారా భాషాభివృద్ధికి కూడా దోహదపడినట్లుండును.
ధన్యవాదములు. .
పి.రామకృష్ణారెడ్డి,
తెలుగుపండిట్,
నంది అకాడమి,
నంద్యాల .
కోనసీమ కథలు: శిరోముండనం గురించి Rama Subbarao అభిప్రాయం:
10/13/2015 11:51 pm
శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి అరికాళ్ళ కింద మంటలు చదివిన వారికి ఈ కథ ఇంకా సాత్వికంగా అనిపిస్తుంది. ఆ రొజుల్లొనె రచయిత అంత ధైర్యంగ వ్రాసారంటే, సాయి గారు కాచి పాత్రకు న్యాయం చెయ్యగలరు అనిపించింది.
ప్లే బ్యాక్ సింగర్ పి. బి. ఎస్. గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:
10/13/2015 10:13 am
ఈ వ్యాసంలో ప్రస్తావించబడ్డ “మనసులోని కోరిక” అన్న పాట పై ఈ పాటకు బాణీ ఇచ్చిన సాలూరు రాజేశ్వరరావు గారి మాటల్లో వివరాలు ఇక్కడ వినండి.
https://www.facebook.com/yasasvi.gantasala/videos/787141681396391/?pnref=story
విష్ణుభొట్ల లక్ష్మన్న
చంద్రికాపరిణయము గురించి indrakanti pinakapani అభిప్రాయం:
10/12/2015 4:52 am
చాలా అద్భుతంగా ఉంది. ఇది వసు చరిత్రకు సమకాలికమంటున్నారు. ఐతే వసు చరిత్రకు వచ్చిన కీర్తి దీనికి రాక పొడానికి కారణం మాధవరాయలు అళియరామరాయలంతటి ప్రసిద్ధుడు కాక పొవడమే కావచ్చు. ఒక వేళ ఇది నిజమే ఐతే దీన్ని బట్టి ఇలాంటి కావ్యాన్ని “పిల్ల వసు చరిత్ర” అనుకోడం కాక వసు చరిత్రను “పెద్ద చంద్రికా పరిణయం” అనుకోవచ్చు.
పుల్లెల శ్రీరామచంద్రుడు గురించి తః తః అభిప్రాయం:
10/11/2015 12:26 am
వేద భాష్యాన్ని రాసిన సాయణుల గురించి రాస్తూ పుల్లెల వారు సాయణులు తన గురించి తాను రాసుకున్న ” న ధ్యానం న వ్రతం నార్చా న సమాధిర్న వా జపః , సుప్రసిద్ధా బలం యస్య మతిరేవ మహీయసీ ” అన్న శ్లోకాన్ని ని పేర్కొని, తెనిగిస్తూ “ఏ సాయణాచార్యునికి సుప్రసిద్ధమూ చాలా గొప్పదీ అయిన బుద్ధియే బలమో, అంతే కాని ధ్యానం కాని, వ్రతం కాని, దేవతాది పూజ కాని, యోగం గాని, జపం కాని ఎవనికి బలం కాదో…” అని వివరించారు.
(పుల్లెల వారి ప్రస్తావనలు, సంస్కృత భాషా ప్రచార సమితి హైదరాబాద్- 500 001, జులై,2011, పుట 363.)
తః తః
తెలుగులో పుస్తక ప్రచురణ – ఆకారవికారాలు గురించి indrakanti venkateswarlu అభిప్రాయం:
10/07/2015 9:32 am
చాలా చక్కని, చిక్కని వ్యాసం. వ్యాసరచయితలు అభినందనీయులు. ప్రచురణ, ముద్రణలకు సంబంధించి సాంకేతికపరమైన పలు అంశాలు చర్చించారు.
కానీ తెలుగు పుస్తకాల ప్రచురణను ఆంగ్ల పుస్తకాల ప్రచురణతో పోల్చటం అంత సమంజసం కాదనుకుంటాను. హాలీవుడ్ స్థాయిలో తెలుగు సినిమా తీయటం సాధ్యమా? అయితే కనీసావసరం, అచ్చు తప్పులూ, పదాలవిరుపుల్లో లోపాలగురించైనా తగినంత శ్రద్ధ పెట్టటం లేదు మన రచయితలు, ప్రచురణకర్తలుకూడా. ఆ గాలి కి బదులు ఆగాలి అని వుంటే అర్థంలో ఎంత తేడా. డిజిటల్ తైప్ వచ్చాక చాలా పుస్తకాల్లో పంక్తి ప్రారంభమే “లేదా”లతో ప్రారంభం అవుతూంది, సెట్టింగ్లో శ్రద్ధ పెట్టక పోవటం మూలంగా. మేమెంత శ్రద్ధచూపినా, మాసొంత ప్రచురణల్లోనైనా ఈ ఉపద్రవాన్ని నివారించలేకున్నాం.
అభిప్రాయాలలో ఎవరో హాసం ప్రచురణల నాణ్యతను ప్రస్తావించారు. నావద్దనున్న కోతికొమ్మచ్చి మొదటిభాగలో మధ్యన కొన్ని పుటలు బైండింగ్ ను ఒరుసుకొని ముందుకు చొచ్చుకువచ్చాయి. బహుశా ముళ్ళపూడి ఆత్మ అందులో ప్రవేశించి, భడవా, ఈ పుటల్లో ఇంకా మధురరసగుళికలున్నాయిరా అని చెబుతున్నదేమోననుకున్నాము.
ఇంద్రకంటి వేంకటేశ్వర్లు మరియు గుమ్మళ్ళ పుల్లారెడ్డి
విద్యార్థిమిత్ర ప్రచురణలు, కర్నూలు
స్త్రీ పర్వంలో గాంధారి గురించి gannavarapu narasimha murty అభిప్రాయం:
10/06/2015 1:53 pm
వెంకటేశ్వర రావు గారికి వందనములు. పాత వ్యాసమును మిత్రులు నాచే చదివించారు. అద్భుతమైన వ్యాసము. సారపు ధర్మమున్ పద్యము నాకు కూడా బాగా నచ్చిన పద్యము. ఈ పద్యము ప్రతిలో దోషాలుండుటచే గణములు సరిపోవు. పద్యమిలా ఉండాలి.
సారపు ధర్మమున్ విమల సత్యముఁ బాపముచేత బొంకుచేఁ
బారముఁ బొంద లేక చెడఁ బాఱినదైన యవస్థ దక్షు లె
వ్వార లుపేక్షసేసి రది వారల చేటగుఁ గాని ధర్మ ని
స్తారక మయ్యు సత్య శుభదాయక మయ్యును దైవముండెడున్ !
పారము = ఒడ్డు
టూఎయిటీన్ డీ గురించి రవి అభిప్రాయం:
10/05/2015 1:16 am
మంచి థీమ్ కానీ, ఒక్కొక్క వాక్యానికి వెనుక కథ ఊహించుకొని చదవాలంటే strain గా ఉందండి.
ప్రార్ధన: నువ్వే నేనవ్వు – 1వ భాగం గురించి రవి అభిప్రాయం:
10/05/2015 1:10 am
క్షమించండి. చాలాకాలం తర్వాత చూస్తున్నాను. ఏదో వ్యాఖ్య వ్రాసి ఊరుకోవడం తప్పేమో.
చక్కనైన ఈ కవిత చదవగానే ఛప్పున గుర్తుకు వచ్చిన సంస్కృతశ్లోకాన్ని ఉదహరించాను.
వేదాల్లోని ఒక అపురూపమైన మంత్రం అది. సందర్భాన్ని బట్టి అర్థం. పెళ్ళిలో దంపతులను దీవించే సందర్భములో:
దాంపత్యజీవితమును ఆరంభించబోతున్న మీకు రాజైన వరుణుడు, దేవుడైన బృహస్పతి, ఇంద్రుడు, అగ్ని నిశ్చయముగా అనేకమైన సంపదలను అందించుగాక!
దాంపత్యజీవితము – బదులు ఆధ్యాత్మిక/భక్తి ఇత్యాదులను కూడా ప్రతిక్షేపించుకోవచ్చును.
పోతనామాత్యుని కల్పనానల్పశిల్పం గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:
10/04/2015 9:34 am
పూజ్యతములు శ్రీ కృష్ణదేశికాచార్యుల వారికి
నమస్కారములతో,
మీరు లేఖ వ్రాసినప్పటినుంచి అలంకారములయొక్క అనుప్రాణనమును గురించి లక్షణశాస్త్రంలో ఏమైనా చెప్పబడి ఉన్నదా? తొలిసారి దీనిని ఎవరు ప్రయోగించారు? అని నాకు అందుబాటులో ఉన్న గ్రంథాలలో వెతికిచూశాను. అక్కడక్కడ వ్యాఖ్యాతలచే అనుప్రాణితముల నిర్దేశములే తప్ప ఆలంకారికుల నిర్వచనములు నాకేవీ కనుపింపలేదు. దీనిని గురించిన విమర్శకుల చర్చలేవీ లభింపలేదు. వాక్యంలో రెండు అలంకారములు ఉన్నప్పుడు వాటియొక్క ప్రాధాన్యవివక్షచేత ఉత్థాపితత్వము, సంకీర్ణత, సాంకర్యము అన్నవాటికే గాని అనుప్రాణనమునకు ఉక్తలక్షణమేమిటో తెలియలేదు. అది విజాతీయములకేనా? అభేదాదిప్రాధాన్యం కలిగిన సజాతీయములకు కూడా వర్తిస్తుందా? లేక యథేచ్ఛాప్రవర్తితమా? అన్న సందేహమూ తీరలేదు. ఈ పద్యంలోని సారోల్లేఖముల మాటెలా ఉన్నా, లాక్షణికోక్తి విషయమై నాతోపాటు మీతోపాటు ‘ఈమాట’ పాఠకులు ఆలోచింపగలరని ఈ మాట వ్రాశాను.
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు