పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16471

  1. మాయదారి సిన్నోడు: స్వరకర్త రమేశ్ నాయుడు గురించి sudhakar Majety అభిప్రాయం:

    11/09/2015 11:18 pm

    రమేష్ నాయుడు గారు అద్భుతమైన బాణీలు చాలా తక్కువ వాయిద్యాల తో స్వరపరచి మనల్ని ఆనందపరిచారు. మనసుని చల్లబరిచే సున్నితమైన సంగీతం ఆయనది. ఆయన గురించి ఇన్ని విశేషాలు చెప్పిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు మేష్టారూ….

  2. ప్రేమ ఉన్నచోటే భగవంతుడు గురించి వురుపుటూరి శ్రీనివాస్ అభిప్రాయం:

    11/09/2015 6:36 am

    ఒక చిన్న తప్పు దొర్లినట్లుంది – అసలు కథలోని “క్రైస్ట్ ది లార్డ్” మీరు “యెహోవా”గా పేర్కొన్నట్లున్నారు.

  3. ఆనందం అర్ణవమైతే – రత్నాలసరములు గురించి lyla yerneni అభిప్రాయం:

    11/08/2015 10:06 pm

    “అందుకే పదములను సరిగా విడదీసి పదచ్ఛేద, పాదాంత యతులను ఉంచితే పాడుకొనుటకు బాగుంటుంది. అది నా వ్యక్తిగతమైన అభిప్రాయము.”

    Thank you. When you are the lyricist, you can request your composer and singer, to sing it the way you like it to be sung. You can compel them, that they need you approval of the sheet music, and the recording, before it is released to the general public. I am sure it will be a smash hit in some circles.

    ‘ఛందస్సు సర్పపరిష్వంగము’ నుండి విముక్తుడనయ్యానని చెప్పుకొన్న శ్రీశ్రీ ఎన్నో ఛందస్సు విధివిధానాలను పాటించాడు.
    “ఈ ఆనందార్ణవఛందస్సును ఎన్ని విధములుగ కల్పించ వీలగును అనే ప్రశ్నకు జవాబును పరిశీలిద్దాము […]అందులో 78 విధములను శ్రీశ్రీ పై ఐదు కవితలలో నుపయోగించాడు.”

    అంటే శ్రీశ్రీ – ఈ ఛందస్సు 325 విధాలుగా రాయవచ్చని తెలిసి, అన్నీ రాసుకుని, అందులో 78 ఎంచుకొని, ఎక్కడ ఏవి వాడాలో అన్న పరిజ్ఞానంతో, సరిగా అక్కడ అవి వాడినాడని అర్థం వస్తుంది. మీ ఉద్దేశం అదేనా? రకరకాల ఛందస్సులను, display చెయ్యటానికి, శ్రీశ్రీ తన కవిత్వం రాసాడా? ఛందస్సు వద్దు మొర్రో, నాకు నిబంధనలు వద్దంటున్న శ్రీశ్రీ అలాటి పని ఎందుకు చేస్తాడు? అది మీకు నచ్చిన ఊహ. ఆ ఊహను అతని ఛందోపరిజ్ఞానంగా గాని, అతని అభిలాషగా గాని రాయటం, అది true finding ఎలా అవుతుంది? అది మీరు ఎలా నిరూపిస్తారు? నేను ఈ విషయం నిరూపించి చూపాను, అని వ్యాసంలో మీరంటే, శ్రీశ్రీ పరంగా అది సరి ఎలా అవుతుంది? అతని గురించిన అతని మాటలనే ఖాతరు చేసుకోటం లేదే మీరు? ఎవరి మాటల ఆధారంగా ఏమి నిరూపిస్తారు?

    మీరు చేయగలిగిన పనులు, మీ రచనలలో మీరు చేసి చూపి మెప్పించవచ్చును. ఇతరులు సంకల్పించని, చేయని పనులను, వారు చేసారని చెప్పి, ప్రజలను ఒప్పించ లేరు. No one needs that kind of research.

    “ఒక విధంగా చూసినట్లయితే, గేయములు నిజముగా ఏకపాద వృత్తములు! ఈ విషయము ఆశ్చర్యకరముగా కనిపించవచ్చును కాని ఇది ముమ్మాటికి నిజము.”

    అంటే ఏమిటి? ఉదాహరణలు ఇచ్చి వివరించగలరా?

    లైలా

  4. శార్దూలవిక్రీడిత వృత్తము గురించి మోహన అభిప్రాయం:

    11/08/2015 7:22 pm

    శార్దూలము అనే పేరుతో ఉండే మఱొక వృత్తము శార్దూలలలితము. క్రింద దానికి కూడ వ్యాసములో “శార్దూల” వృత్తములకు ఇచ్చిన ఉదాహరణములవంటిదే చిన్న చిన్న మార్పులతో క్రింద ఇస్తున్నాను –

    శార్దూలలలితము – మ/స/జ/స/త/స, యతి (1, 13)
    18 ధృతి 116569

    పారావారముగాదె సత్కరుణకున్, – బాలించు వరునిన్
    శ్రీరామా యని బల్కరాదె ప్రియమై, – శ్రీలింక వలదే,
    యారామమ్ము విలోల మానసము, నీ-వందుండు విరులన్
    హారమ్మై పలు గ్రుచ్చరాదె విధిగా, – నా దేవుఁ గొలువన్

    విధేయుడు – మోహన

  5. ఆనందం అర్ణవమైతే – రత్నాలసరములు గురించి Veluri Venkateswara Rao అభిప్రాయం:

    11/08/2015 1:30 pm

    Dear Mohana Rao:

    I am one of those who is keenly following your work on prosody ever since you started expounding on the subject. If you remember it right, I have been coaxing you to apply your expertise on Group Theoretical Methods to prosody, and do write in English. (Even today, you will see new and interesting books on prosody in English being published!)

    Let me digress.

    If Ramanujam had felt the way you are feeling now because of comments in eemaaTa (or lack of them) work on Number Theory would have been in its infancy and its current use in contemporary genetics, physical sciences,etc., would not have been even dreamed off. One has to follow one’s passion, irrespective of criticism and lack of appreciation. When you get upset, read Hardy’s A Mathematician’s Apology once more!

    I will give you a personal failure of mine, because of my shortsightedness when I was in graduate school. A professor of mine offered to teach a course entitled “Group Theory in Quantum Mechanics,” and almost all the other faculty members advised the then graduate students against it. I did not know why, it might have been politics! Any way, I took the course to fill-in the required credit hours. But, I did not care to pursue it further. Of course, I regret it now! (I still have the 1960s vintage text book by Volker Heine!)

    Personally, I believe what you are experimenting in prosody is extremely important. Of course, there are always a few people (no personal accusation intended, please!)who might think it is a worthless pursuit. A ‘modernist’ and “Marxist” once remarked: why do people still read, do research on, classics? What could you say to that person? Do you remember what Chalam said to the guy who wondered about looking at “sandhya?”in his preface to SriSri?

    Keep it on! And, please try to translate some parts of your valuable research into English! Time is running out!

    Best wishes, — Veluri Venkateswara Rao

  6. ప్రేమ ఉన్నచోటే భగవంతుడు గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:

    11/07/2015 11:23 am

    ధన్యవాదాలండి. కౌముది లో వ్యాసం చదివాక ఇక్కడికొచ్చారేమో 🙂 నాకు తెల్సినంతలో – అంటే ఊహకి అందినంతలో – ఓ స్థాయికి వెళ్ళాక మతం అనేది అనవసరం. అప్పుడు పోతన చెప్పినా టాల్ స్టాయ్ చెప్పినా భగవంతుడనేవాడి గురించి అవన్నీ ఒకేలాగ అనిపిస్తాయి. ఈ కధతో నేను అనువదించాలనుకున్న టాల్ స్టాయ్ కధలన్నీ అయిపోయాయి. మిగతా ఒకట్రెండున్నా చేయలేకపోవచ్చు. సంపాదకులకి ఒక పెద్ద రిలీఫ్ 🙂

  7. అమెరికా ఇల్లాలి ముచ్చట్లు: ఇండియా ప్రయాణం గురించి aakella suryanarayana murthy అభిప్రాయం:

    11/07/2015 9:49 am

    ఏంటో మరి ఒక్కసారి కూడా మా ఆవకాయ లీక్ అవ్వలేదు, కనీసం 15-20 ట్రప్స్ లో, మా ఆవిడ ప్రతిభ పేకింగ్ లో 🙂

  8. మునులేం చేస్తారు నాన్నా? గురించి Chudamani అభిప్రాయం:

    11/06/2015 8:52 am

    త: త: గారు, నమస్తే, కధ బాగుంది. “వన్ డే మా తరం” అని పుట్టించిన పదం కూడా బాగుంది. ముని తపోఫలమంతా చెగోడీల మీద వెచ్చించారా? పాపం..

    చుడామణి.

  9. ఎందుకంత దూరం? గురించి Chudamani అభిప్రాయం:

    11/06/2015 8:43 am

    రాధగారు, కధ బాగుంది. ఎందుకో మనసుకు బాధ కలిగింది. ఇలా ఎంతమంది యువకులు వాళ్ళ చదువులు, కుటుంబాలు వదిలి మిడి మిడి జ్నానంతో జీవితాలను నాశనం చేసుకుంటున్నారో కదా అని అనిపించింది.

  10. ఆనందం అర్ణవమైతే – రత్నాలసరములు గురించి మోహన అభిప్రాయం:

    11/05/2015 10:25 am

    పదముల విఱుపు అవసరమును క్రింద గమనించవచ్చును –

    కనగ రాముని యాటలు
    వినగ రాముని మాటలు
    మనము రామునిఁ దల్చును
    దినము రామునిఁ బిల్చును

    అదే సరియైన విఱుపు లేక –

    కనగ రా
    ముని యాటలు
    వినగ రా
    ముని మాటలు
    మనము రా
    మునిఁ దల్చును
    దినము రా
    మునిఁ బిల్చును

    అందుకే పదములను సరిగా విడదీసి పదచ్ఛేద, పాదాంత యతులను ఉంచితే పాడుకొనుటకు బాగుంటుంది. అది నా వ్యక్తిగతమైన అభిప్రాయము.

    ఇకపోతే ఆఱు నెలలు పరిశోధించి 80 ఏళ్లకుముందు శ్రీశ్రీ ఉపయోగించిన ఒక ఛందస్సును సోదాహరణముగా 78 వృత్తములతో విశదీకరించి, లయబద్ధమైన రత్నాలసరములను వివరించి, ఇంతకుముందు ఏ ఛందోగ్రంథములో వివరించబడని క్రొత్త నడకను మాలికావృత్తములకు నిరూపించగా, వాటినిగుఱించి ఒక్క ముక్క కూడ ఎవ్వరు వ్రాయకుండుటను గమనిస్తే ఇట్టి పరిశోధనలు అవసరమేనా అనే భావము కలుగుతుంది.

    విధేయుడు – మోహన