శివరామకృష్ణ గారూ, — చంద్రమతీ దేవి మెడలో సూత్రం హరిశ్చంద్రుడికే కనిపిస్తుందట. అటువంటి చిట్కా కోసం వెతుకుతున్నాడు ప్రద్యుమ్నుడు. ఇదివరలో ప్రభావతి చంద్రహారానికి ఇంకో టెక్నిక్ ఉపయోగించింది. అందుకే జాగ్రత్త పడ్డాడు.
రెండు డిపాజిట్లు తీసి చేయించినా గిల్ట్ ఆభరణం అనే డౌట్ మీకెందుకు వచ్చింది. పాపం ప్రద్యుమ్నుడు. ఎవరూ నమ్మరా? దహా!
మంగళసూత్రం కనబడని వ్రతం చేస్తే అమంగళం అప్రహితమవు గాక. మొదటికే మోసం వచ్చి మీరు కనబడకుండా పోతారు. మెరిసే సూత్రాలకు మురిసిపోయే వేళ మసిపూసి మారేడుకాయ చెయ్యకండి. నారాయణ. నారాయణ. పతి వశీకరణ పుణ్యక వ్రతం మీ కొత్త మంగళసూత్రానికి ముందు చేసిన పాత వ్రతం. అందుకనే జీడిపాకంలా శాన్నాళ్ళు సాగదీసినది, వ్రత మహిమతో మీరు ఫలదీకరించారు. ఇంతకి మీరు చేయించిన సూత్రం గిల్టు ఆభరణం కాదు కద! మీరు గిల్టీ, సూత్రం గిల్టు. మీరు మీ ఆవిడ నమ్మకాన్ని వమ్ముచేసే గీటురాయిగా మారకండి.
Talking of rejections, you have missed one more important rejection. Ernest Hemingway’s works were rejected not once, not twice but many times. He was dejected with the rejections and wanted to quit writing fiction for good, until O’Brien discovered him and included his first story The Old Man in his American Short Story collection. In addition, O’Brien dedicated the collection to Hemingway. If O’Brien were not there, we wouldn’t have had Hemingway. Forgive me for my self promotion, this anecdote was recorded in eemaata (See: eemaata, March 2010).
మహచక్కని పేరడీలు రాసారు;– ఇస్మాయిల్గారి చెట్టు నా ఆదర్శం అనే ప్రసిద్ధ కవిత ఫక్కీలో అట్టు నా అదర్శం అద్భుతంగా ఉన్నది! పేరడీలంటే చెవికోసుకునే నేను మిమ్మల్ని అభినందించకండా ఉండలేను! (కొంతమంది శ్రోత్రియ పరులు మిమ్మల్ని అబి నిందించకండా ఉండలేరు లెండి! ఎవరి భాగ్యానికి ఎవరు బాధ్యులు, చెప్పండి!)
I whole heartedly envy you!
మనకి నచ్చిన, మనం మెచ్చిన రచయితల రచనలనే పేరడీ చెయ్యగలం. అది, వారిపై మనకున్న అభిమానానికి, గౌరవానికీ గుర్తు. ఎవడో ‘ కోన్ కిస్సా గొట్టం,’ గాడి రచనలు ఎన్ని ఉన్నా, వాటిపై పేరడీలు ఎవరూ రాయరు. ఎందుకు రాయరో చెప్పటం, ఈమాట మెజారిటీ పాఠకులని అవమానించడం అవుతుంది.
పేరడీ మనసాహిత్యంలో చాలా పాత ప్రక్రియ. కూచిమంచి జగ్గకవి (18 వ శతాబ్దం)ఆంధ్ర వాఙ్మయం లో పేరడీకి నిర్దుష్ట రూపం కల్పించాడని మాచిరాజు దేవీప్రసాద్(1922-1974)రాసాడు. దేవీ ప్రసాద్ పేరడీలకి పెట్టిన పేరని వేరే చెప్పక్కరలేదు. అతను రాసిన ‘ఏరోడ్డు చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం,’ చదవంగానే మళ్ళీ మరొకసారి శ్రీశ్రీని చదవాలనిపిస్తుంది. అది పేరడికున్న ఒక గొప్పలక్షణం. మద్రాసులో చదువుకునే రోజుల్లో ఆంధ్రా మెస్సు మీద రాసిన ఈ పేరడీ చూడండి:
శ్రీరమణ ప్రసిద్ధ రచయితల వచనానికి చక్కని పేరడీలు రాసాడు. మచ్చుకి:
‘అది ధూమశకటము. అభిముఖముగ పోవుచున్నది. అతడు మొదటి తరగతి పెట్టెలో నాసీనుడయ్యెను. ప్రథమశ్రేణి మంజూషము సువిశాలముగానున్నది… ‘ ఎవరి శైలిని పేరడీ చేస్తున్నాడు, చెప్మా?
ఈమాట వ్యవస్థాపకుడు కె.వి.యస్. రామారావు, జాషువ శ్మశాన పద్యాలపై శ్మశాన వాటిక అని పేరడీ ( చూ: ఈమాట, మే 2000) రాసాడు. అలాగే శ్రీశ్రీ కవితలకి కూడా పేరడీలు ( చూ: ఈమాట, సెప్టెంబర్, 2002) రాసాడు.
ఈ మాట ప్రస్తుత సంపాదకులు స్వోత్కర్షని సెన్సారు చెయ్యరనుకుంటాను. వెల్చేరు నారాయణ రావుగారు వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యంలో మెరికల్లాంటి కొన్ని పుస్తకాలకి ఇంగ్లీషు అనువాదాలే కాకుండా, ఆముఖాలు, ఆఃముఖాలు(అంటే వెనుక మాట అని నేను పెట్టిన పేరు) రాసారని మీలో చాలామందికి తెలుసు. వాటిపై ‘ఎమితిని సెపితివె నారా?’ (నారా అన్న పదం మాధవ్ చెరిపేసి అచ్చు వేసాడు!) అని నేను ఈమాటలోనే రాసాను ( చూ: ఈ మాట మార్చి 2012). నారాయణరావు గారు దానిని చదువుకొని, పొట్టచెక్కలయ్యేట్టు నవ్వి, నవ్వి, నవ్వి ఆయాసపడ్డారని విన్నాను. నవ్వుకి నాబాధ్యత; ఆయాసం ఆయన బాధ!
ఇంతగా ఎందుకు చెప్పాల్సి వచ్చిందో మళ్ళీ మరొకసారి చెప్పాలా?
ఈ సంచికలో సంపాదకుని తిరస్కరణ లేఖమీద వచ్చిన కామెంట్లు కొన్ని చదివితే, అవి పేరడిలంటే ఏహ్యభావం ఉండబట్టో, పేరడీ అర్థం కాకపోబట్టో రాసిన కామెంట్ల లా కనపడుతున్నాయి. ఆ వ్యాసం చదివింతరువాత, కుక్కచెవుల్లా ముడుచుకొపోయిన పేజీలతో కుట్లూడి చిరిగిపోతూ శిధిలావస్థలో ఉన్న మహాప్రస్థానం పుస్తకం మళ్ళీమరొకసారి మరిచిపోకుండా ఆప్యాయంగా తెరిచి చూద్దామని అనిపించటల్లేదూ! అది పేరడీ మహత్తు.
ఆఖరిగా మరొక మాట. ఈ మాట స్థాయి దిగజారిపోయింది అన్న వ్యాఖ్య అనుచిత వ్యాఖ్య. It is unfortunate.
పేరడీలు గొప్పరచయితలపైనే రాయటం ఆచారం. ఈ ఆచారం క్రొత్తదేమీ కాది. రెండు శతాబ్దాలుగా తెలుగు సాహిత్యంలో పేరడీ ఒక చక్కని ప్రక్రియగా గుర్తించబడిందని విన్నవించుకుంటున్నాను.
సేతువేటికిరా రామా!
హేతువే లేక
సేతువేటికిరా?
సీత
సముద్ర సంజాత
మహాబలసంపేత
గజఈత
ఆ నాతిని నీవు రక్షించ వలెనా?
ఈతకల్లు తాగి
గెంతు కిష్కింధ కోతిమూకకు
ఊరక, బండరాతి మోత పని
మీ రాజులకు న్యాయమా!
సేతువేటికిరా రామా!
Lyla
Very good essay, with admirable content. Going to enjoy it, one story at a time. Thanks.
One more example of poor Telugu Poetry. Don’t bother.
However ‘Ajantha caves’ are very beautiful. So glad, I have seen them. There is whole lot of art and poetry in them.- Lyla
మా ఆవిడ – మంగళసూత్రం గురించి బులుసు సుబ్రహ్మణ్యం అభిప్రాయం:
01/04/2016 10:42 am
రాజ్ కుమార్ గారికి, ధన్యవాదములు.
శివరామకృష్ణ గారూ, — చంద్రమతీ దేవి మెడలో సూత్రం హరిశ్చంద్రుడికే కనిపిస్తుందట. అటువంటి చిట్కా కోసం వెతుకుతున్నాడు ప్రద్యుమ్నుడు. ఇదివరలో ప్రభావతి చంద్రహారానికి ఇంకో టెక్నిక్ ఉపయోగించింది. అందుకే జాగ్రత్త పడ్డాడు.
రెండు డిపాజిట్లు తీసి చేయించినా గిల్ట్ ఆభరణం అనే డౌట్ మీకెందుకు వచ్చింది. పాపం ప్రద్యుమ్నుడు. ఎవరూ నమ్మరా? దహా!
ధన్యవాదాలు.
ధీర గురించి kiran అభిప్రాయం:
01/04/2016 10:35 am
చాలా బాగుందండీ!ఎంత భావము ఉందో! ప్రతి పదాన్నీఅనుభవించాను.
మా ఆవిడ – మంగళసూత్రం గురించి N.V.Siva Rama Krishna అభిప్రాయం:
01/04/2016 4:25 am
మంగళసూత్రం కనబడని వ్రతం చేస్తే అమంగళం అప్రహితమవు గాక. మొదటికే మోసం వచ్చి మీరు కనబడకుండా పోతారు. మెరిసే సూత్రాలకు మురిసిపోయే వేళ మసిపూసి మారేడుకాయ చెయ్యకండి. నారాయణ. నారాయణ. పతి వశీకరణ పుణ్యక వ్రతం మీ కొత్త మంగళసూత్రానికి ముందు చేసిన పాత వ్రతం. అందుకనే జీడిపాకంలా శాన్నాళ్ళు సాగదీసినది, వ్రత మహిమతో మీరు ఫలదీకరించారు. ఇంతకి మీరు చేయించిన సూత్రం గిల్టు ఆభరణం కాదు కద! మీరు గిల్టీ, సూత్రం గిల్టు. మీరు మీ ఆవిడ నమ్మకాన్ని వమ్ముచేసే గీటురాయిగా మారకండి.
మా ఆవిడ – మంగళసూత్రం గురించి Rajkumar అభిప్రాయం:
01/04/2016 3:18 am
sooooooper
సంపాదకుని తిరస్కరణ లేఖ గురించి Veluri Vemkateswara Rao అభిప్రాయం:
01/04/2016 1:18 am
Dear Suresh:
Talking of rejections, you have missed one more important rejection. Ernest Hemingway’s works were rejected not once, not twice but many times. He was dejected with the rejections and wanted to quit writing fiction for good, until O’Brien discovered him and included his first story The Old Man in his American Short Story collection. In addition, O’Brien dedicated the collection to Hemingway. If O’Brien were not there, we wouldn’t have had Hemingway. Forgive me for my self promotion, this anecdote was recorded in eemaata (See: eemaata, March 2010).
Regards,
Veluri Venkateswara Rao
అట్టు నా ఆదర్శం గురించి Veluri Vemkateswara Rao అభిప్రాయం:
01/03/2016 9:02 pm
మాగంటి వంశీమోహన్ గారూ:
మహచక్కని పేరడీలు రాసారు;– ఇస్మాయిల్గారి చెట్టు నా ఆదర్శం అనే ప్రసిద్ధ కవిత ఫక్కీలో అట్టు నా అదర్శం అద్భుతంగా ఉన్నది! పేరడీలంటే చెవికోసుకునే నేను మిమ్మల్ని అభినందించకండా ఉండలేను! (కొంతమంది శ్రోత్రియ పరులు మిమ్మల్ని అబి నిందించకండా ఉండలేరు లెండి! ఎవరి భాగ్యానికి ఎవరు బాధ్యులు, చెప్పండి!)
I whole heartedly envy you!
మనకి నచ్చిన, మనం మెచ్చిన రచయితల రచనలనే పేరడీ చెయ్యగలం. అది, వారిపై మనకున్న అభిమానానికి, గౌరవానికీ గుర్తు. ఎవడో ‘ కోన్ కిస్సా గొట్టం,’ గాడి రచనలు ఎన్ని ఉన్నా, వాటిపై పేరడీలు ఎవరూ రాయరు. ఎందుకు రాయరో చెప్పటం, ఈమాట మెజారిటీ పాఠకులని అవమానించడం అవుతుంది.
పేరడీ మనసాహిత్యంలో చాలా పాత ప్రక్రియ. కూచిమంచి జగ్గకవి (18 వ శతాబ్దం)ఆంధ్ర వాఙ్మయం లో పేరడీకి నిర్దుష్ట రూపం కల్పించాడని మాచిరాజు దేవీప్రసాద్(1922-1974)రాసాడు. దేవీ ప్రసాద్ పేరడీలకి పెట్టిన పేరని వేరే చెప్పక్కరలేదు. అతను రాసిన ‘ఏరోడ్డు చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం,’ చదవంగానే మళ్ళీ మరొకసారి శ్రీశ్రీని చదవాలనిపిస్తుంది. అది పేరడికున్న ఒక గొప్పలక్షణం. మద్రాసులో చదువుకునే రోజుల్లో ఆంధ్రా మెస్సు మీద రాసిన ఈ పేరడీ చూడండి:
‘నిజంగానే నిఖిల ఆంధ్రం, నిండు హర్షం వహిస్తుందా?
భోజనానికి నిజంగానే భోగకాలం రహిస్తుందా?’
చదవంగానే, శ్రీశ్రీ గుర్తుకి రాకపోతే మనం తెలుగు వాళ్ళమని చెప్పుకోవటం నామర్దా అని నా అభిప్రాయం.
విశ్వనాథ సత్యనారాయణగారి శైలి మీద జలసూత్రం రుక్మిణీ నాథ శాస్త్రి గారు చెప్పిన పేరడీ పద్యం, సత్యనారాయణగారినే కవ్వించి నవ్వించిందని చెప్తారు.
కించిత్ తిక్త కషాయ బాడబ రస క్షే పాతిరే కాతి వా, అని మొదలై, నాలుగవ పాదంచివర, పాషాణపాక ప్రభూ! అని ముగుస్తుంది, ఆపద్యం.
(స్థలాభావం వలన పూర్తిపాఠం కామెంట్ల శిర్షికలో ఇవ్వదలచుకోలేదు.)
ఈ పేరడీ చూడండి:
‘గుండు గొంతుకలోన కొట్లాడుతాది
గుటకేయనీదురా కూసిన్ని కూడ,’ వినంగానే ఎవరి పాట గుర్తుకొస్తుంది?
అలాగే మరొకటి:
‘తొక్కిన వదలని సైకిలు
పక్కింటి మిటారిపైన పగటి భ్రమయున్
ఎక్కకె పారెడు గుర్రము
గ్రక్కున విడువంగవలయు గదరా ….’, చిన్నప్పటి పజ్యం గుర్తుకి రావటల్లేదూ?
శ్రీరమణ ప్రసిద్ధ రచయితల వచనానికి చక్కని పేరడీలు రాసాడు. మచ్చుకి:
‘అది ధూమశకటము. అభిముఖముగ పోవుచున్నది. అతడు మొదటి తరగతి పెట్టెలో నాసీనుడయ్యెను. ప్రథమశ్రేణి మంజూషము సువిశాలముగానున్నది… ‘ ఎవరి శైలిని పేరడీ చేస్తున్నాడు, చెప్మా?
ఈమాట వ్యవస్థాపకుడు కె.వి.యస్. రామారావు, జాషువ శ్మశాన పద్యాలపై శ్మశాన వాటిక అని పేరడీ ( చూ: ఈమాట, మే 2000) రాసాడు. అలాగే శ్రీశ్రీ కవితలకి కూడా పేరడీలు ( చూ: ఈమాట, సెప్టెంబర్, 2002) రాసాడు.
ఈ మాట ప్రస్తుత సంపాదకులు స్వోత్కర్షని సెన్సారు చెయ్యరనుకుంటాను. వెల్చేరు నారాయణ రావుగారు వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యంలో మెరికల్లాంటి కొన్ని పుస్తకాలకి ఇంగ్లీషు అనువాదాలే కాకుండా, ఆముఖాలు, ఆఃముఖాలు(అంటే వెనుక మాట అని నేను పెట్టిన పేరు) రాసారని మీలో చాలామందికి తెలుసు. వాటిపై ‘ఎమితిని సెపితివె నారా?’ (నారా అన్న పదం మాధవ్ చెరిపేసి అచ్చు వేసాడు!) అని నేను ఈమాటలోనే రాసాను ( చూ: ఈ మాట మార్చి 2012). నారాయణరావు గారు దానిని చదువుకొని, పొట్టచెక్కలయ్యేట్టు నవ్వి, నవ్వి, నవ్వి ఆయాసపడ్డారని విన్నాను. నవ్వుకి నాబాధ్యత; ఆయాసం ఆయన బాధ!
ఇంతగా ఎందుకు చెప్పాల్సి వచ్చిందో మళ్ళీ మరొకసారి చెప్పాలా?
ఈ సంచికలో సంపాదకుని తిరస్కరణ లేఖమీద వచ్చిన కామెంట్లు కొన్ని చదివితే, అవి పేరడిలంటే ఏహ్యభావం ఉండబట్టో, పేరడీ అర్థం కాకపోబట్టో రాసిన కామెంట్ల లా కనపడుతున్నాయి. ఆ వ్యాసం చదివింతరువాత, కుక్కచెవుల్లా ముడుచుకొపోయిన పేజీలతో కుట్లూడి చిరిగిపోతూ శిధిలావస్థలో ఉన్న మహాప్రస్థానం పుస్తకం మళ్ళీమరొకసారి మరిచిపోకుండా ఆప్యాయంగా తెరిచి చూద్దామని అనిపించటల్లేదూ! అది పేరడీ మహత్తు.
ఆఖరిగా మరొక మాట. ఈ మాట స్థాయి దిగజారిపోయింది అన్న వ్యాఖ్య అనుచిత వ్యాఖ్య. It is unfortunate.
పేరడీలు గొప్పరచయితలపైనే రాయటం ఆచారం. ఈ ఆచారం క్రొత్తదేమీ కాది. రెండు శతాబ్దాలుగా తెలుగు సాహిత్యంలో పేరడీ ఒక చక్కని ప్రక్రియగా గుర్తించబడిందని విన్నవించుకుంటున్నాను.
వేలూరి వేంకటేశ్వర రావు
అక్కరలు గురించి suprabha అభిప్రాయం:
01/03/2016 6:22 pm
జెజ్జాల వారికి …
——————
అక్కరలఁ గూర్చి తెలిపిన
చక్కని వ్యాసమును జదువ సంతసమొదవెన్
దక్కినదో కానుకనుచు
మక్కువతో దాచుకొంటి మరిమరి/మళ్లీ జూడన్
కుదురుగఁ గూర్చుని యొకచో
చదువుల తల్లికిని మ్రొక్కి సద్బుద్ధినిడన్
జదివితి విద్యార్థినిగా
నది,యిది,యెది, వదలకుండ నంతయు శ్రద్ధన్
మాసములెన్నో శ్రమపడి
వ్యాసము లీరీతిఁ గూర్చి యందించెడి మీ
కేసన్మానము తగినదొ!
యా శా/సారదయే యొసఁగుత ననువగు వేళన్!/విధమున్!
వ్రాయించు నేమొ ముదమున
నాయమ కొన్నింటినైన నాతోఁ గూడన్
తీయని తెలుఁగునఁ బాడఁగ
హాయిగ నక్కరల లోన నంబా నుతులే!
శతాధిక ధన్యవాదములతో, నమస్సులతో
సుప్రభ
5:11 PM
01-03-2016
ప్రాకృతకవనము: సేతు బంధ కావ్యము గురించి lyla yerneni అభిప్రాయం:
01/03/2016 6:16 pm
సేతువేటికిరా రామా!
హేతువే లేక
సేతువేటికిరా?
సీత
సముద్ర సంజాత
మహాబలసంపేత
గజఈత
ఆ నాతిని నీవు రక్షించ వలెనా?
ఈతకల్లు తాగి
గెంతు కిష్కింధ కోతిమూకకు
ఊరక, బండరాతి మోత పని
మీ రాజులకు న్యాయమా!
సేతువేటికిరా రామా!
Lyla
Very good essay, with admirable content. Going to enjoy it, one story at a time. Thanks.
అజంతా రెండు కవితలు గురించి lyla yerneni అభిప్రాయం:
01/03/2016 5:50 pm
One more example of poor Telugu Poetry. Don’t bother.
However ‘Ajantha caves’ are very beautiful. So glad, I have seen them. There is whole lot of art and poetry in them.- Lyla
ధూర్జటి కవిత్వంలో మాధురీమహిమ: తెనాలి రామకృష్ణుని మధురపూరణ గురించి రంగ అభిప్రాయం:
01/03/2016 2:30 pm
మాన్యులు, ఆచార్యులు మురళీధరరావు గారికి,
ప్రసిద్ధమైన చాటువు పూర్వాపరాలను విచారించి, ధూర్జటి, రామకృష్ణ, రాయల వారల వ్యక్తిత్వ వివేచనతో రంగరించి, శ్రీకాళహస్తిమాహాత్మ్య గాథలతో సమన్వయించి మీరు చేసిన కల్పన సహృదయ మనోరంజకంగా భాసిల్లుతోంది.
రంగ