పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16470

  1. రాగలహరి: శివరంజని గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:

    03/04/2016 4:08 pm

    సిద్ధినేని భావనారాయణ గారూ:

    మీ స్పందనలు చదివాక మీకు సంగీతంలో పరిచయం బాగానే ఉన్నట్టు తోస్తోంది!

    ఇప్పటి వరకూ మీరు శాస్త్రీయసంగీతంతో తగినంతగా పరిచయం పెట్టుకోపోయినట్టయితే, ఇకనుంచి మీరు ఆ ప్రయత్నాలు చెయ్యండి. మీరు ఒప్పుకోకపోయినా మీకు తగినంత విషయ పరిజ్ఞానం ఉంది. మీరు ఉదాహరించిన పాట “జగమే మారినది…” దేశద్రోహులు సినిమా కోసం సాలురు కల్యాణి రాగంలో బాణీ కట్టిన అద్భుతమైన పాట! ఈ పాటలో “కమ్మని భావమే కన్నీరై చిందెను…” తరవాత వచ్చే వయొలిన్ నాదం పాటకి వన్నె తెచ్చింది.

    “రాగలహరి” వ్యాసాల వెనుక జరిగిన కథ ఇది:

    నేను ఉద్యోగం కోసం 1998 లో ఆష్టిన్, టెక్సాస్ కి డాలస్, టెక్సాస్ నుంచి రావటం జరిగింది. వచ్చిన కొన్ని రోజులకే ఈమాట పత్రిక స్థాపన ఆలోచనలకి, ఆచరణకి ఆద్యుడు కె.వి.ఎస్. రామారావు తో పరిచయం కలగటం (అంతకు ముందే మేం SCIT ద్వారా మిత్రులం అయినప్పటికి, ముఖాముఖి కలవటం అప్పుడే) జరిగింది. ఆ ప్రాంతాల్లోనే, మేం ఎదైనా పార్టీలలో కలవటం, అలాంటి సందర్భాలలో నేను పాటలు పాడటం జరిగేది. పాటలు పాడటమే కాకుండా, అప్పుడప్పుడు నేను సంగీతంలో రాగాల గురించి మాట్లాడేవాణ్ణి. కె. వి.ఎస్. రామారావు ప్రోత్సాహంతో నేను ఈమాట కోసం రాగలహరి వ్యాసాలు రాయటం అప్పుడు మొదలు పెట్టా! 1980 సంవత్సరంలో తెలుగు భూమిని వదిలిన నేను మళ్ళీ ఈమాట కోసం తెలుగులో రాయటం అలవాటు చేసుకున్నా! అప్పట్లో నేను తెలుగు అంత బాగా రాయలేకపోయేవాడిని. రాయగా, రాయగా తెలుగులో రాయటం కొంత అలవాటయ్యింది.

    మీరు నాతో ఈమైల్ ద్వారా ఇక్కడ కలవచ్చు! Lucky.Vishnubhotla@Globalfoundries.com

    నమస్కారాలతో,
    విష్ణుభొట్ల లక్ష్మన్న

  2. రాగలహరి: శివరంజని గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:

    03/04/2016 8:40 am

    సిద్ధినేని భావ నారాయణ గారూ:

    మీరు ఇచ్చిన శివరంజని రాగంలో బిస్మిల్లా ఖాన్ షెహనాయి లింక్ చాలా బాగుంది. హిందూస్తానీ రాగాల్లో బిస్మిల్లా ఖాన్ షెహనాయి వింటే రాగలక్షణాలు సులభంగా గుర్తుపట్టవచ్చు!

    మీరు చెప్పిన “ఇందిరా రాముని..” అన్నమయ్య కీర్తన శోభారాజు పాడగా విన్నాను. అది శివరంజని రాగమే! “విజయనగరి” రాగం అనుకోగలగటానికి కారణం, విజయనగరి రాగంలో శివరంజని రాగఛ్చాయలు ఉండటమే! కర్నాటక సంగీతంలోంచి హిందూస్తానీ సంగీతంలోకి ప్రవేశించి ప్రాచుర్యం పొందిన రాగం విజయనగరి! శివరంజని రాగంలోని అన్ని స్వరాలతో పాటు తీవ్రమధ్యమం వాడితే విజయరంజని రాగం అవుతుంది. అందుకే విజయరంజని రాగంలో – శివరంజని, ముల్తానీ వంటి రాగచ్ఛాయలు కనపడతాయి!

    నమస్కారాలతో,

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  3. రాగలహరి: శివరంజని గురించి Siddineni Bhava Narayana అభిప్రాయం:

    03/04/2016 5:43 am

    విష్ణుభొట్ల లక్ష్మన్న గారూ,

    నమస్కారం. మన్నించమని కోరుతూ మొదలు పెడతాను. మీ నైపుణ్యాన్ని ఇంకా పదునుగా వినియోగించాలనేదే నా మనవి. తెలుగులో టైపింగు రావడం లేదు. పైపెచ్చు నా విషయ పరిజ్ఞానం అల్పం. స్వల్ప పరిజ్ఞానాన్ని తెలుగు నుడికారం సమర్థవంతంగా దాచిపెట్ట లేదు.

    I dare not contradict you. I am not unaware of your mettle. I hold you in good deference as I am ever conscious of the rigorous grounding you have had. I, being uninitiated in classical genre, am consigned to indulge in light music, including film compositions.

    I emulate your appraisal of the song “ Palincharaaa Rangaa “. My untrained ears crave for more and more of Saluri and A.M Raja combination. The Hindoalam based song “Chudumade Cheliya” is quite dear to my heart. The Mohanam based song “Madhura Madheamee challani reyi”, is quite creatively tuned , and the human voice component of the male singer glides like silk on cottage cheese. Still, the song may have contained brief incompatible pieces of orchestration. The choice of instruments and the interludes somehow run against the grain of Saluri.

    With reference to Kalyani, I am awe struck at the ingenuity that has gone into the adaptation. The delicate maneuvering brings out certain dormant, heavenly grace . in contrast, Pendyala Nageswara Rao’s handling of Kalyani in “ Madi Sharadaa DeviMandiramae” settles down to plain delineation of the basic charecteristics of the raga. A certain delicate weaving of notes in the song “ Jagame Marinadi Madharamugaa Ee Velaa” ,approaching an ascension at the turn “ Kammani Bhavame kanneerai “ has been constrained by the limitations of the singer’s voice. I am not sure as to the title of the film. Here the composer must have deliberately been sarcastic by assigning the logical crescendo to be shifted from human voice to an instrument.

    The same Saluri has unleashes his imagination and succeeded in making the singer aligning her tone to the required crescendo and sing the exact, nuanced notes.

    “Deva Deva Ee Viyogmenni Dinaalo
    Inkenni Dinaalo…………………………..”

    In the song “Kaaanga Raavaa , O Sree Hari Raavaa” of ChenchuLakshmi. The composer weaves a creative “segue” as the tune glides. And singer jikki’s voice swoops into the “stretto”. Her voice here achieves a fluttering consummation by soaring to super human acclivity. Despite her lack of classical grounding, singer Jikki rose to undulate to reach the crest. We may hence be excused for lusting after the same voice, and crave for more of the same combination. But, the exigencies of cinema, obviously, keep the composer under a constant leash, curtailing his freedom to choose a singer.

    I do appreciate your approach. The essay may be said to be tilted toward light music at the expense of classical art. My appeal is that you render some enunciation of two or three classical kritis before taking up the film songs, that are based on the ragam.

    1.”Radhika krishna radhika virahe” by jaydeva
    2. “Tarunam idayya dayai puri tudikkaiya uriya “ by Papanasham Shivan
    3.” Yamanelli kananendu kelabeda yamane shri ramanu “ by Purandaradasa
    4.” Kridati vanamali ghoshte kridati vanamali” of Sadashiva Brahmendram
    5. “Andavan anbe shakti tarum andavan anbe siddhi “of Papanasham Shivan.

    But my deep rooted apprehension is that one might run the risk of taking the kernel for the fruit , should one keep a flippant medium like cinema as the pivot to govern one’s taste and judgment.

    Warm Regards.

    Yours Faithfully,

    Siddineni Bhava Narayana.

  4. ఏం జీవితం! గురించి Ramakrishna Nimmagadda అభిప్రాయం:

    03/04/2016 12:52 am

    చంద్ర గారు, ఒక పూర్తి జీవితాన్ని క్లుప్తంగా ఇంత చక్కగా అందించారు.” హేట్సాఫ్.

  5. ఇస్మాయిల్‌ గారి కవితా తత్వం గురించి Indrani Palaparthy అభిప్రాయం:

    03/03/2016 4:46 pm

    కవిత్వం ఇంకా పబలపష షపలషబదబlబసబపషకి థవవపథl చెయ్యాలనేది ఆయన ఉద్దేశ్యం కావచ్చు.

    “ఇస్మాయిల్‌ గారు విధిగా పాటించిన మరొక సూత్రం తన కవిత్వంలో ఎక్కడా షపపపషపలధపష లేకుండా జాగ్రత్త పడటం. అంటే, ఆయన వాడే బరథఫపషకిగానీ, సఫపరపషకిగానీ ఏరకమైన పౌరాణిక, చారిత్రక లేదా జానపద కధలు లేదా పాత్రలతో సంబంధం ఉండదు. ఒక పద్యానికి సంబంధించిన విషయమంతా అందులోనే ఉంటుందిగానీ, దానినర్ధం చేసుకోవటానికి వేరే ఏరకమైన పరిజ్ఞానమూ సంపాదించవలచిన అవసరం ఉండదు. షపపపషపలధపష వల్ల పాఠకుడి దృష్టి మరలిపోయే ప్రమాదం ఉంటుందనేది ఆయన ఉద్దేశ్యం కావచ్చు. షపపపషపలధపష లేకపోవటంవల్ల పద్యానికొక సలబహపషషథlబసఱ కూడా ఏర్పడుతుంది. ఐతే, ఇటువంటి షపపపషపలధపష సాధారణంగా ఒక జాతి సంస్కృతితో ముడిపడి ఉంటాయి కాబట్టి, వాటివల్ల పాఠకునికి ఇంకా దగ్గరగా వెళ్ళే అవకాశం ఉంటుందని కొందరు భావించవచ్చు. అందువల్ల, ఈ విషయంలో భిన్నాభిప్రాయాలకు ఆస్కారం ఉంది.”

    అచ్చు తప్పులా ఇవి? సరి చెయ్యరూ?

    ఇంద్రాణి.

    [యూనికోడ్ లోకి మార్చినప్పుడు ఇంగ్లీష్ పదాలు ఇలా అయ్యాయేమో. రవిశంకర్ గారి సహాయంతో వ్యాసాన్ని పూర్తిగా సరిదిద్దాము. – సం.]

  6. ఏం జీవితం! గురించి కె.వి.గిరిధరరావు అభిప్రాయం:

    03/03/2016 3:08 pm

    చంద్ర గారు,

    అద్భుతం! ఇలాంటి వెంటాడే కథను అందించినందుకు చాలా కృతజ్ఞతలు.

    అభినందనలతో,
    కె.వి.గిరిధరరావు

  7. తత్వం… గురించి S A Rahman అభిప్రాయం:

    03/03/2016 2:15 am

    తత్వం — మంచి కవిత చాలా బాగుంది.

  8. రాగలహరి: శివరంజని గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:

    03/02/2016 11:11 am

    సిద్ధినేని భావ నారాయణ గారూ:

    మీ స్పందనకు ధన్యవాదాలు!

    ముందుగా ఒక్క మాట. శాస్రీయ సంగీతం ఎప్పుడూ లలిత సంగీతం (సినీ సంగీతంతో సహా) కన్నా ఉన్నతంగానే ఉంటుంది. శాస్త్రీయ సంగీతం abstract గా ఉండటం వల్లనూ, పరిచయం లేకపోతే అస్వాదించటం కష్టం కనకనూ, జనసమ్మతమైన లలిత (సినీ) సంగీతం ద్వారా రాగాల పరిచయం నా వ్యాసాలకి మూలం.

    శాస్త్రీయసంగీతం బాగా తెలిసిన పండితులు అందరూ ఒకే రకంగా రాగాల్లోని లోతులు చూడలేరు. సినీసంగీత దర్శకులు కూడా ఈ కోవకే చెందుతారు.

    అంతే కాక, సంగీతం విని ఆనందిచే రసికుల స్థాయిల్లో కూడా తేడాలు ఉన్నాయి. అది వారి వారి అనుభవాలు, పరిణితి, రసహృహదయాలను బట్టి వేరు వేరుగా ఉంటాయి.

    నేను లలిత గీతాలు, సినిమా పాటల ద్వారా సంగీతాన్ని ఆనందిచేవాడిని నా చిన్నతనంలో! నెమ్మదిగా నాకు శాస్త్రీయసంగీతంతో పరిచయం మొదలైన తరవాత నాకు అసలైన సంగీతం ఏమిటో తెలియటం మొదలైంది.

    మీరు పంపిన లింక్ ద్వారా అన్నమయ్య కీర్తనలను విని మీకు ఎదైనా నేను చెప్పాలనుకుంటే, వచ్చే స్పందనలో తెలియచేస్తాను.

    “పాలించర రంగా… కరుణాంత రంగ…” పాటను కరుణ రస ప్రధానమైన శివరంజని రాగంలో బాణీ కట్టిన సాలూరి తెలుగువాడవటం మన అదృష్టం!

    నమస్కారాలతో,

    విష్ణుభొట్ల లక్ష్మన్న

    P.S.: ఒక్క కల్యాణి రాగాన్నే తీసుకుంటే – ఘంటసాల, సాలూరి బాణీల్లో తేడాలు నాకు స్పష్టంగా కనపడతాయి. ఘంటసాల అంటే ఎంతో గౌరవం ఉన్న నాకు, ఘంటసాల కన్నా సాలూరి కల్యాణి రాగంలో చూపగలిగే లోతులు నన్ను ఇప్పటికీ ఆశ్చర్యపరుస్తాయి.

  9. కన్నెవాన గురించి nmraobandi అభిప్రాయం:

    03/02/2016 5:04 am

    అద్భుతంగా వ్రాశారు వంశీకృష్ణ గారు…
    అభినందనలు…

  10. రాగలహరి: శివరంజని గురించి Siddineni Bhava Narayana అభిప్రాయం:

    03/02/2016 4:34 am

    విష్ణుభొట్ల లక్ష్మన్న గారూ,

    I wish you unraveled the mystery as to why certain adoptions of this raga are bristling with creative ingenuity, where as the others sound like drab echoes of the raga. “Palinchraa Rangaa” by Saluri in A.M.Raja’s voice entices you with brilliant design with aesthetic compositional units. The shift, and the crest of notes inserted at:
    “Mani mandiramulanu surabhogalanu koranuraa Dari kanraa ,
    Ee Bhavasagaramunu Datinchumura , Karuna turngaa!”
    These are especially endearing to me.

    ” Sree Ramuni charitamunu” “Jane kahaa gaye vo din’ and “O Basanth Pavan Pagal: may be termed as competent compositions allowing minimal transitions. I may be pardoned for having found the rest of the film songs in this raga as dreary mutations of the original raga[ with due apologies t o the departed souls].

    Bismillah Khan’s rendering on the Shehnai epitomizes the evocative cadences of Shivaranjani. This must have been recorded [ I am not certain. It is pure guess work based on memory of having heard on L P some twenty years back]in early eightities.
    https://www.youtube.com/watch?v=O9OpnICQ3Jw

    This Annamayya keertana ‘IIndiraa Ramanu dechchi’. Is it in Vijayanagari or in Shivaranjani?

    Being guided exclusively by popular acceptances, in case of a piece of art, may interfere with our discernment. Trying to come to grips with a classical art in the glare of a popular medium such as cinema might end up in dulling our sensibility.

    Warm Regards.
    Yours Faithfully,

    Siddineni Bhava Narayana.