రేఫ ఱకారాల ఉచ్చారణలో తేడాలకు “మఱి మఱి నిన్నే మొఱలిడ” అంటూ జేసుదాసు పాడిన ఈ త్యాగరాజ కృతి వినండి. ఇందులో “మఱి”, “మొఱ”, “మఱచియున్న” అన్న పదాలు పలికేటప్పుడు బండి-ఱ ఉచ్చారణ స్పష్టంగా వినిపిస్తుంది. అలాగే “కారణమేమి”, “సరగున”, “కరుణతో”, “సురరిపు”, “నరమృగ” మొదలైన పదాల్లో సాధురేఫ ఉచ్చారణ వినిపిస్తుంది. “కరిమొఱ” అన్నప్పుడు మాత్రం “కఱిమొఱ” అని పలికాడేమోనని నా అనుమానం. మీరు కూడా విని చెప్పండి.
ఆశనిరాశలు
గురించి బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి అభిప్రాయం:
05/02/2016
1:50 pm
ఇది కూడా కథకు పేరులాగే పనికొస్తుంది.వనజ గారూ, ధన్యవాదాలు. 🙂
చాలా బావుంది కవిత, అనువాదం! భావంలో సున్నితత్వాన్ని భాషలో చాలావరకూ జాగ్రత్తగా నిర్వహించారు. ఖయాము రుబాయీలు గుర్తుకొచ్చాయి.
రెండు మూడు చిన్న సూచనలు (బహుశా అనువాదాలు ఎప్పుడూ పూర్తికాని కవితలు, ఎంతో కొంత మెరుగుపెడుతూనే ఉండొచ్చు!):
దిక్కులు లేని అడవి – దిక్కులు తెలియని అడవి
మితంగా ఒక నవ్వు – సన్నగా ఒక చిరునవ్వు
కాసిని ఎండు పళ్ళముక్కలు – Dry fruits పదానికి అచ్చమైన తెలుగు అనువాదం లేదనుకుంటా. “కాసిని ఎండుద్రాక్షలు” అంటే బాగుంటుందేమో.
చాల బాగుంది కామేశ్వరరావు గారు! సామాన్యముగా కవులు తమ కావ్యములలో చిత్రకవిత్వాన్ని ఒక భాగముగా వ్రాస్తారు. కాని చిత్రకవిత్వమే కథలోని ఒక భాగముగా చేసిన ఘనత సూరనదే. కవికి గొల్లవానికి ఉండే పోలికలు ఉన్న ఈ పద్యమంటే కూడ నాకు ఇష్టమే –
ఇది చాలు నాకు గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:
05/02/2016 4:33 pm
చక్కటి అనువాదం, భాస్కర్!
వైరముత్తు రాసిన ఈ కవితను తమిళ సినిమా కడల్ లో వాడుకొన్నారు. ఇది తెలుగులో కడలి అని డబ్బింగ్ చేసారు. తెలుగు సినిమాలో వనమాలి చేసిన అనువాదం ఇలా సాగుతుంది.
పచ్చని తోట, పసరుల తావి
నిశీధి మౌనం, నీ ప్రేమగానం
పౌర్ణమి రేయి, పొగమంచు అడవి
ఇవి మాత్రం చాలు… ఇవి మాత్రమే
చరణాలలో వనమాలి చేసిన అనువాదం అంత గొప్పగా లేదు.
హంస గీతం గురించి sai prasad somayajula అభిప్రాయం:
05/02/2016 4:09 pm
చక్కని తత్వ గీతం. జీవన చక్ర గతిని చక్కగా కవితీకరించారు.
పలుకుబడి: తెలుగులో సాధు శకటరేఫములు – 1 గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:
05/02/2016 2:32 pm
రేఫ ఱకారాల ఉచ్చారణలో తేడాలకు “మఱి మఱి నిన్నే మొఱలిడ” అంటూ జేసుదాసు పాడిన ఈ త్యాగరాజ కృతి వినండి. ఇందులో “మఱి”, “మొఱ”, “మఱచియున్న” అన్న పదాలు పలికేటప్పుడు బండి-ఱ ఉచ్చారణ స్పష్టంగా వినిపిస్తుంది. అలాగే “కారణమేమి”, “సరగున”, “కరుణతో”, “సురరిపు”, “నరమృగ” మొదలైన పదాల్లో సాధురేఫ ఉచ్చారణ వినిపిస్తుంది. “కరిమొఱ” అన్నప్పుడు మాత్రం “కఱిమొఱ” అని పలికాడేమోనని నా అనుమానం. మీరు కూడా విని చెప్పండి.
ఆశనిరాశలు గురించి బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి అభిప్రాయం:
05/02/2016 1:50 pm
ఇది కూడా కథకు పేరులాగే పనికొస్తుంది.వనజ గారూ, ధన్యవాదాలు. 🙂
ఈ-మెయిలు గురించి sai prasad somayajula అభిప్రాయం:
05/02/2016 1:38 pm
మంచి కవిత. మంచి శైలి. అర్ధం. భావం.
ఇది చాలు నాకు గురించి కామేశ్వరరావు అభిప్రాయం:
05/02/2016 1:11 pm
చాలా బావుంది కవిత, అనువాదం! భావంలో సున్నితత్వాన్ని భాషలో చాలావరకూ జాగ్రత్తగా నిర్వహించారు. ఖయాము రుబాయీలు గుర్తుకొచ్చాయి.
రెండు మూడు చిన్న సూచనలు (బహుశా అనువాదాలు ఎప్పుడూ పూర్తికాని కవితలు, ఎంతో కొంత మెరుగుపెడుతూనే ఉండొచ్చు!):
దిక్కులు లేని అడవి – దిక్కులు తెలియని అడవి
మితంగా ఒక నవ్వు – సన్నగా ఒక చిరునవ్వు
కాసిని ఎండు పళ్ళముక్కలు – Dry fruits పదానికి అచ్చమైన తెలుగు అనువాదం లేదనుకుంటా. “కాసిని ఎండుద్రాక్షలు” అంటే బాగుంటుందేమో.
పలుకుబడి: తెలుగులో సాధు శకటరేఫములు – 1 గురించి Vasu అభిప్రాయం:
05/02/2016 12:37 pm
Good. Better if you provided readers with sound files.
-Vasu
నాకు నచ్చిన పద్యం: శుచిముఖి చెప్పిన మెటా కవిత్వం గురించి మోహన అభిప్రాయం:
05/02/2016 12:12 pm
చాల బాగుంది కామేశ్వరరావు గారు! సామాన్యముగా కవులు తమ కావ్యములలో చిత్రకవిత్వాన్ని ఒక భాగముగా వ్రాస్తారు. కాని చిత్రకవిత్వమే కథలోని ఒక భాగముగా చేసిన ఘనత సూరనదే. కవికి గొల్లవానికి ఉండే పోలికలు ఉన్న ఈ పద్యమంటే కూడ నాకు ఇష్టమే –
విశ్రామ విహతి గావింపక, సార వ-
త్సాహిత్య సౌమనశ్యంబు లెఱిగి
సమయంబు దప్పక శ్రవణకఠోరంబు
లైన శబ్దము లత్యాకులాత్మ
జేయక సత్పరిచిత సుకుమార వా-
క్సరళి తాభిత్రాయగా నొనర్చి
పదబంధ శిథిలత వాటిల్ల గానీక
యే చందములయందు నేమరిలక
పరగు కవియు దోహకరుడును, యశము దు-
గ్ధమును బడయు, నట్లు గానివాడు
కృతి దురాస మొదవు, గీర్తియు బాలు నీ
కుంట గాదు, హాసయోగ్యు జేయు … (1.008)
శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు ఎలా కావ్యాలలో ఉండాలి అనే విషయముపైన ఈ పద్యమును చదవండి –
పొసగ ముత్తెపు సరుల్ పోహళించిన లీల
దమలోన దొరయు శబ్దములు గూర్చి
యర్థంబు వాచ్య లక్ష్య వ్యంగ్య భేదంబు
లెఱిగి నిర్దోషత నెసగ జేసి
రసభావములకు నర్హంబుగ వైదర్భి
మొదలైన రీతు లిమ్ముగ నమర్చి
రీతుల కుచితంబులై తనరారెడు
ప్రాణంబు లింపుగా పాదుకొల్పి
యమర నుపమాదులును యమకాదులు నగు
నట్టి యర్థ శబ్దాలంక్రియలు ఘటించి
కవిత జెప్పంగ నేర్చు సత్కవివరునకు
వాంఛితార్థంబు లొసగనివారు గలరె … (1.082)
విధేయుడు – మోహన
ఆశనిరాశలు గురించి వనజ తాతినేని అభిప్రాయం:
05/02/2016 10:30 am
ఆలస్యం అమృతం. బావుంది.
చిరంజీవి గురించి వనజ తాతినేని అభిప్రాయం:
05/02/2016 10:21 am
ఆఖరిన కొద్దిగా బాధ. పైన చిన్నోడిని మీ చూపులో, ఈ కవనంలో చూసి మరిచిపోయా. ఇంతకీ పేరేమిటో చెప్పలేదు మానస గారు. 🙂