వెంకటరమణగారి “శోభనాచల” బ్లాగు తరచుగానే చూస్తుంటాను కానీ వారు జూన్ నెలలో రాసిన ఈ పోస్టు ఎలానో miss అయ్యాను. ఈ రోజు చూడటం జరిగింది. వెంకటరమణగారు ఈ పద్యనాటిక గురించి మరింత సమాచారాన్ని, ముఖ్యంగా సాహిత్యాన్ని, సేకరించి యిచ్చారు. వారికి నా కృతజ్ఞతలు.
దేశికాచారిగారు, మీరు చెప్పినది సరియే. ఉత్పలమాలలోని ఈ ప్రత్యేకతను నేను గమనించియున్నాను. న-గణమునకు బదులు లగమును ఉంచితే అప్పుడు మొదటి ఎనిమిది అక్షరములు భ/ర/లగ అవుతుంది, చివరి ఎనిమిది అక్షరములు కూడ భ/ర/లగ అవుతుంది. ఈ రెంటిని మధ్య ఉండే భ-గణము వంతెనలా కలుపుతుంది. అప్పుడు అక్షరసామ్య యతిని, ప్రాసయతిని రెంటిని ఉంచి పద్యమును వ్రాయ వీలగును. భ/ర/లగ గణములతో ఉండే వృత్తమును “నాగరక” అని పిలుస్తారు. భ/ర/లగ – భ – భ/ర/లగ గణములతో ఉండే వృత్తమును నేను కల్వపూవు అని 21 ఫిబ్రవరి 2012 తారీకు కల్పించినాను. ఉత్పలమాలను మీరు చెప్పినట్లు ఇంచుమించు ఇలా విఱిచి వ్రాసిన ఉదాహరణము నొకదానిని శ్రీ పిల్లలమఱ్ఱి బృందావన రావుగారు మఱొక పిల్లమఱ్ఱివారి కావ్యమైన శృంగారశాకుంతలమునుండి ఉదాహరించినారు. ఆ పాదము “మ్రోయకుడీ శుకంబులు నె – లుంగులు – సేయకుడీ పికంబులున్”. భ/ర/య/స/స/జ/గ (భ/ర/లగ – భ – భ/ర/లగ)గణములతో ఉండే వృత్తమునకు బృందావని అని కూడ పేరుంచినాను. కల్వపూవు లేక బృందావని వృత్తమునకు, యతి, ప్రాసయతులతో ఒక ఉదాహరణము –
‘చంపకోత్పలమాలలకు కూడ మాత్రాగణముల ప్రకారము, ఇప్పటి యతికి తఱువాతి అక్షరమును యతిగ గ్రహించాలి అని నా అభిప్రాయము’
ఉత్పలమాలలో మొదటి భ ర న గణాలు చివరి భ ర వ గణాలు సమానమైన మాత్రలు కలిగి సర్వసమానముగా నుండి, మధ్యగల భగణానికి పక్షికి ఇరువైపులా ఉండే ఱెక్కలలాగా సౌష్ఠవసహితంగా ఉన్నవి. ఈవిధంగా ఉత్పలమాలాస్వరూపాన్ని గమనించినప్పుడు ఈరెండు పక్షాల మధ్యనున్న భగణాదియందు యతిని నిల్పుట సతార్కికముగా నున్నది. ఉత్పలమాలలోని మొదటి అక్షరాన్ని రెండు లఘువులుగా మార్చడంవల్ల ఈ రెండుపక్షాల మాత్రాదైర్ఘ్యము సమానముగానే యున్నది గాని యతిస్థానము 11వ అక్షరమైనది. యతిస్థాన నిర్దేశములో తర్కముగాక లక్షణమే ప్రమాణమైనను, ఉత్పలచంపకములలో సహజముగా నున్న సమానోభయపక్షములకు మధ్యగణారంభమున యతి నిల్పు లక్షణము సతార్కికముగాను ఉండుట ముదావహముగా నున్నది
మత్తేభవిక్రీడితము శార్దూలవిక్రీడితములోని మొదటి గురువును రెండు లఘువులుగా మార్చగా లభించినది. శార్దూలవిక్రీడితము ఒక పెద్ద వృత్తమునకు ఒక చిన్న వృత్తము అతికించగా లభించిన ఫలితము అని ఊహ. అందువలన విరామయతిని పెద్ద వృత్తపు చివర ఉంచినారు. దానిని అలాగే తెలుగులో అనుసరించినారు, ఆ నియమములనే మ.వి.కి కూడ పాటించినారు. అసలు శా.వి.కి ఒకటికంటె ఎక్కువ యతి ఉండాలని నేను సూచించినాను. నేను వ్రాసిన శా.వి.పైన వ్యాసమును చదవండి. చంపకోత్పలమాలలకు కూడ మాత్రాగణముల ప్రకారము, ఇప్పటి యతికి తఱువాతి అక్షరమును యతిగ గ్రహించాలి అని నా అభిప్రాయము. యతిని ఒక లాక్షణికుడు నిర్ణయిస్తాడు, అందఱు దానిని అనుసరిస్తారు. అన్ని వేళలలో యతి స్థానము logical గా ఉండదు. ఉదాహరణకు, తోటక వృత్తములో నాలుగు స-గణములు ఉన్నాయి, అనగా నాలుగు చతుర్మాత్రలు. logical గా మొదటి అక్షరమునకు, ఏడవ అక్షరమునకు అక్షరసామ్య యతి ఉండాలి. సంస్కృతములో దీనికి యతి లేదు. తెలుగులో గురువైన తొమ్మిదవ అక్షరము యతి! సామాన్యముగా తెలుగు లాక్షణికులు గురువుపైన యతిని ఉంచుతారు. – మోహన
అయ్యా! నేను మీరు రాసినటువంటి వ్యాసం పూర్తిగా చదివాను. దానిలో కన్య లగ్న జాతకునికి నీచభంగం అయ్యిందట అని మీరు అన్నారు. నిజానికి అది నిజమే, జాతకంలో లగ్నంలో నీచ పట్టిన గ్రహం ఉన్నపటికీ ఆ లగ్నాధిపతి చంద్ర లగ్నాత్తు కేంద్రములలో ఉంటే “నీచభంగ రాజయోగం” ఉంటుంది.
నిజానికి మీరు చెప్పినవన్నీ సత్యాలే. ప్రస్తుత రోజుల్లో జ్యోతిషం అంటే ఒక వ్యక్తి భయంతో చేసే వ్యాపారం అయిపోయింది. కానీ నిజానికి జ్యోతిష్య శాస్త్రాన్ని చదివి అన్వయం చేసుకున్న వారు చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ ఉన్నారు. అది మాత్రం నిజం. చెప్పకపోవడానికి ఏముంది నేను జ్యోతిష్య శాస్త్రాన్ని ఏంటో కొంత చదివిన వాడిని. నిజంగా శాస్త్రం చదివితే మనిషిని చూడకుండానే వారి జీవితం గురించి చెప్పవచ్చు. మనిషిని సన్మార్గంలొ ఉంచటానికి పెద్దలు చూపించిన మార్గాలలొ జ్యోతిషం కూడా ఒకటి.
చివరిగా ఇంత మంచి వ్యాసాన్ని అందించినందుకు కృతజ్ఞతలు. మీలాంటి వారితొ మాట్లాడటం నాకు చాలా ఆనందంగా ఉంది.
జంతువులు మనిషికన్న చాలా గొప్పవని కవి ఉద్దేశ్యము. ఆది ముమ్మాటికి నిజమని నొక్కి వక్కణించడమే కాకుండా నిజమని నిరూపించడానికి తనకు తొచిన ఉదాహరణలన్ని చెప్పి అవన్ని నిజమేనేమో అనిపించే రీతిలొ ప్రయత్నిచారు. ‘ఈమాట’ వారు చిన్న అవకాశమిస్తే ఆయన వ్రాసినదంతా తప్పని మనిషికంటె గొప్ప సంఘ జీవి (జంతువు) ఈ భూప్రపంచములొనే ఎక్కడా పుట్టలేదు పుట్టదు అని నిరూపిస్తాను.
I have enjoyed reading this remarkable paper on the Telugu language and the influences of Sanskrit, Arabic, Persian, English, etc., on it. It is an aspect of the cultural impact over the centuries taking place in the course of migrations. Cross-cultural studies make for fascinating reading not only in linguistic communication but also in the very appearance and living styles. Down the centuries, the influences are there to see and felt. Every language and culture is a synthesis of many strands and Telugu is perhaps a living example in this regard. Congratulations to the author on this excellent presentation.
దీక్షిత దుహిత గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:
10/29/2016 6:32 pm
వెంకటరమణగారి “శోభనాచల” బ్లాగు తరచుగానే చూస్తుంటాను కానీ వారు జూన్ నెలలో రాసిన ఈ పోస్టు ఎలానో miss అయ్యాను. ఈ రోజు చూడటం జరిగింది. వెంకటరమణగారు ఈ పద్యనాటిక గురించి మరింత సమాచారాన్ని, ముఖ్యంగా సాహిత్యాన్ని, సేకరించి యిచ్చారు. వారికి నా కృతజ్ఞతలు.
ఛందస్సులో గణితాంశములు – 2 గురించి మోహన అభిప్రాయం:
10/27/2016 11:02 am
దేశికాచారిగారు, మీరు చెప్పినది సరియే. ఉత్పలమాలలోని ఈ ప్రత్యేకతను నేను గమనించియున్నాను. న-గణమునకు బదులు లగమును ఉంచితే అప్పుడు మొదటి ఎనిమిది అక్షరములు భ/ర/లగ అవుతుంది, చివరి ఎనిమిది అక్షరములు కూడ భ/ర/లగ అవుతుంది. ఈ రెంటిని మధ్య ఉండే భ-గణము వంతెనలా కలుపుతుంది. అప్పుడు అక్షరసామ్య యతిని, ప్రాసయతిని రెంటిని ఉంచి పద్యమును వ్రాయ వీలగును. భ/ర/లగ గణములతో ఉండే వృత్తమును “నాగరక” అని పిలుస్తారు. భ/ర/లగ – భ – భ/ర/లగ గణములతో ఉండే వృత్తమును నేను కల్వపూవు అని 21 ఫిబ్రవరి 2012 తారీకు కల్పించినాను. ఉత్పలమాలను మీరు చెప్పినట్లు ఇంచుమించు ఇలా విఱిచి వ్రాసిన ఉదాహరణము నొకదానిని శ్రీ పిల్లలమఱ్ఱి బృందావన రావుగారు మఱొక పిల్లమఱ్ఱివారి కావ్యమైన శృంగారశాకుంతలమునుండి ఉదాహరించినారు. ఆ పాదము “మ్రోయకుడీ శుకంబులు నె – లుంగులు – సేయకుడీ పికంబులున్”. భ/ర/య/స/స/జ/గ (భ/ర/లగ – భ – భ/ర/లగ)గణములతో ఉండే వృత్తమునకు బృందావని అని కూడ పేరుంచినాను. కల్వపూవు లేక బృందావని వృత్తమునకు, యతి, ప్రాసయతులతో ఒక ఉదాహరణము –
మల్లెల మాల వేయనా – మాయక
నుల్లము సేద దీర్చనా
తెల్లగ ముగ్గు వేయనా – తేనెల
వల్లకి తంత్రి మీటనా
మెల్లగ నిన్ను దాకనా – మేఘము
త్రుళ్లగ కేకి నౌదునా
గిల్లుచు నేడిపించనా – కృష్ణుని
తల్లిగ లాలి బాడనా
పై ఉదాహరణములో అక్షరసామ్య యతితో ఉండే వంతెన పదమును తొలగిస్తే మనకు “నాగరక” వృత్తము లభిస్తుంది –
మల్లెల మాల వేయనా
ఉల్లము సేద దీర్చనా
తెల్లగ ముగ్గు వేయనా
వల్లకి తంత్రి మీటనా
మెల్లగ నిన్ను దాకనా
త్రుళ్లగ కేకి నౌదునా
గిల్లుచు నేడిపించనా
తల్లిగ లాలి బాడనా
కల్వపూవు లేక బృందావని ఉదాహరణము చిన్న మార్పులతో ఉత్పలమాలగా –
మల్లెల మాల వేసెదను – మాయక
నుల్లము సేద దీర్చెదన్
తెల్లగ ముగ్గు వేసెదను – తేనెల
వల్లకి తంత్రి మీటెదన్
మెల్లగ నిన్ను దాకెదను – మేఘము
త్రుళ్లగ కేకి నయ్యెదన్
గిల్లుచు నేడిపించెదను – కృష్ణుని
తల్లిగ లాలి బాడెదన్
విధేయుడు – మోహన
వింజమూరి శివరామారావు లలితగీతాలు గురించి venu gop-al reddy అభిప్రాయం:
10/26/2016 8:07 am
చాలా చాలా బాగున్నాయి వీటిని డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటె బాగుంటుంది ఆ సౌకర్యం కల్గించగలరని కోరుచున్నాము.
ఛందస్సులో గణితాంశములు – 2 గురించి desikachary అభిప్రాయం:
10/25/2016 11:10 am
ఉత్పలమాలలో మొదటి భ ర న గణాలు చివరి భ ర వ గణాలు సమానమైన మాత్రలు కలిగి సర్వసమానముగా నుండి, మధ్యగల భగణానికి పక్షికి ఇరువైపులా ఉండే ఱెక్కలలాగా సౌష్ఠవసహితంగా ఉన్నవి. ఈవిధంగా ఉత్పలమాలాస్వరూపాన్ని గమనించినప్పుడు ఈరెండు పక్షాల మధ్యనున్న భగణాదియందు యతిని నిల్పుట సతార్కికముగా నున్నది. ఉత్పలమాలలోని మొదటి అక్షరాన్ని రెండు లఘువులుగా మార్చడంవల్ల ఈ రెండుపక్షాల మాత్రాదైర్ఘ్యము సమానముగానే యున్నది గాని యతిస్థానము 11వ అక్షరమైనది. యతిస్థాన నిర్దేశములో తర్కముగాక లక్షణమే ప్రమాణమైనను, ఉత్పలచంపకములలో సహజముగా నున్న సమానోభయపక్షములకు మధ్యగణారంభమున యతి నిల్పు లక్షణము సతార్కికముగాను ఉండుట ముదావహముగా నున్నది
English and Telugu Lexicons: Parallel Trajectories గురించి మోహన అభిప్రాయం:
10/24/2016 11:58 am
Good analysis, what is TAPU?
ఛందస్సులో గణితాంశములు – 2 గురించి మోహన అభిప్రాయం:
10/24/2016 11:46 am
మత్తేభవిక్రీడితము శార్దూలవిక్రీడితములోని మొదటి గురువును రెండు లఘువులుగా మార్చగా లభించినది. శార్దూలవిక్రీడితము ఒక పెద్ద వృత్తమునకు ఒక చిన్న వృత్తము అతికించగా లభించిన ఫలితము అని ఊహ. అందువలన విరామయతిని పెద్ద వృత్తపు చివర ఉంచినారు. దానిని అలాగే తెలుగులో అనుసరించినారు, ఆ నియమములనే మ.వి.కి కూడ పాటించినారు. అసలు శా.వి.కి ఒకటికంటె ఎక్కువ యతి ఉండాలని నేను సూచించినాను. నేను వ్రాసిన శా.వి.పైన వ్యాసమును చదవండి. చంపకోత్పలమాలలకు కూడ మాత్రాగణముల ప్రకారము, ఇప్పటి యతికి తఱువాతి అక్షరమును యతిగ గ్రహించాలి అని నా అభిప్రాయము. యతిని ఒక లాక్షణికుడు నిర్ణయిస్తాడు, అందఱు దానిని అనుసరిస్తారు. అన్ని వేళలలో యతి స్థానము logical గా ఉండదు. ఉదాహరణకు, తోటక వృత్తములో నాలుగు స-గణములు ఉన్నాయి, అనగా నాలుగు చతుర్మాత్రలు. logical గా మొదటి అక్షరమునకు, ఏడవ అక్షరమునకు అక్షరసామ్య యతి ఉండాలి. సంస్కృతములో దీనికి యతి లేదు. తెలుగులో గురువైన తొమ్మిదవ అక్షరము యతి! సామాన్యముగా తెలుగు లాక్షణికులు గురువుపైన యతిని ఉంచుతారు. – మోహన
జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 2 గురించి నిట్టల ఫణి భాస్కర్ అభిప్రాయం:
10/18/2016 2:12 am
అయ్యా! నేను మీరు రాసినటువంటి వ్యాసం పూర్తిగా చదివాను. దానిలో కన్య లగ్న జాతకునికి నీచభంగం అయ్యిందట అని మీరు అన్నారు. నిజానికి అది నిజమే, జాతకంలో లగ్నంలో నీచ పట్టిన గ్రహం ఉన్నపటికీ ఆ లగ్నాధిపతి చంద్ర లగ్నాత్తు కేంద్రములలో ఉంటే “నీచభంగ రాజయోగం” ఉంటుంది.
నిజానికి మీరు చెప్పినవన్నీ సత్యాలే. ప్రస్తుత రోజుల్లో జ్యోతిషం అంటే ఒక వ్యక్తి భయంతో చేసే వ్యాపారం అయిపోయింది. కానీ నిజానికి జ్యోతిష్య శాస్త్రాన్ని చదివి అన్వయం చేసుకున్న వారు చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ ఉన్నారు. అది మాత్రం నిజం. చెప్పకపోవడానికి ఏముంది నేను జ్యోతిష్య శాస్త్రాన్ని ఏంటో కొంత చదివిన వాడిని. నిజంగా శాస్త్రం చదివితే మనిషిని చూడకుండానే వారి జీవితం గురించి చెప్పవచ్చు. మనిషిని సన్మార్గంలొ ఉంచటానికి పెద్దలు చూపించిన మార్గాలలొ జ్యోతిషం కూడా ఒకటి.
చివరిగా ఇంత మంచి వ్యాసాన్ని అందించినందుకు కృతజ్ఞతలు. మీలాంటి వారితొ మాట్లాడటం నాకు చాలా ఆనందంగా ఉంది.
జంతువు గురించి దడాల వెంకటెశ్వరరావు అభిప్రాయం:
10/17/2016 11:02 am
జంతువులు మనిషికన్న చాలా గొప్పవని కవి ఉద్దేశ్యము. ఆది ముమ్మాటికి నిజమని నొక్కి వక్కణించడమే కాకుండా నిజమని నిరూపించడానికి తనకు తొచిన ఉదాహరణలన్ని చెప్పి అవన్ని నిజమేనేమో అనిపించే రీతిలొ ప్రయత్నిచారు. ‘ఈమాట’ వారు చిన్న అవకాశమిస్తే ఆయన వ్రాసినదంతా తప్పని మనిషికంటె గొప్ప సంఘ జీవి (జంతువు) ఈ భూప్రపంచములొనే ఎక్కడా పుట్టలేదు పుట్టదు అని నిరూపిస్తాను.
English and Telugu Lexicons: Parallel Trajectories గురించి Prof. D. Ramakrishna అభిప్రాయం:
10/17/2016 7:13 am
I have enjoyed reading this remarkable paper on the Telugu language and the influences of Sanskrit, Arabic, Persian, English, etc., on it. It is an aspect of the cultural impact over the centuries taking place in the course of migrations. Cross-cultural studies make for fascinating reading not only in linguistic communication but also in the very appearance and living styles. Down the centuries, the influences are there to see and felt. Every language and culture is a synthesis of many strands and Telugu is perhaps a living example in this regard. Congratulations to the author on this excellent presentation.
పల్లకీ.. గురించి Akhil అభిప్రాయం:
10/16/2016 7:39 am
Katha chala bagundi. Kani ajay garu cheppinattu chivarlo ardrata taggindi . Alage chivari vakyam asalu kadalaledu ani cheppakkarledu anipistondi . Suspense Katha andanni pempomdistundi.