పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16469

  1. జిక్కి పాడిన మూడు పాటలు గురించి గొరుసు అభిప్రాయం:

    01/13/2017 12:37 pm

    శ్రీనివాస్ గారూ, ధన్యవాదాలు. మొదటి పాట నా సిస్టం లో వినిపించలేదు. మిగతావి అద్భుతం. ఒకసారి పాడుతా తీయగాలో బాలు గారు చెప్పారు – జిక్కిగారి ఇంటికి వెళితే అచ్చమైన (తెలుగు+తమిళం కలిసిన ) మాండలికం లో మాట్లాడే వారని . – ఆమెకు ఆ పలుకుబళ్ళు తప్పించి నాజూకుగా మాట్లాడ్డం వచ్చేది కాదట . “వస్తిరా .. రాండి , రాండి . బువ్వ తిని పోండన్నా ” అనేవారట . అదే జిక్కి పాట పాడితే పరవళ్ళు తొక్కాల్సిందే భాష ! గమ్మత్తుగా లేదూ 🙂

  2. అలనాటి నటి ఎస్. వరలక్ష్మితో ముఖాముఖీ గురించి GKK అభిప్రాయం:

    01/13/2017 6:16 am

    S Varalakshmi garu was a great singer with strong base in carnatic music. She should have sung more songs. Had she taken up play back singing, we would have had the fortune of many more classic songs. Nonetheless, she has left an indelible impression with the few songs sung with immaculate precision.

  3. రాగలహరి: చక్రవాకం, మలయమారుతం, కళావతి గురించి GVL SESHA SAI అభిప్రాయం:

    01/13/2017 5:03 am

    గురువుగారు,

    నమస్కారం. “మనసే అందాల బృందావనం” ఏ రాగంలో ఉంది? దయచేసి తెలుపగలరు.

    జి‌వి‌ఎల్ శేషసాయి. తెనాలి.

  4. గుర్రం జాషువా పాపాయి పద్యాలు గురించి తిరువాయిపాటి వరదయ్య అభిప్రాయం:

    01/12/2017 8:27 pm

    నేను తెలుగు పండితునిగా పనిచేయునపుడు జాషువాగారి శిశువు పద్యాలను విద్యార్థులకు చెప్పడం నా అదృష్టంగా భావిస్తాను. ఇంతబాగా చెప్పడం ఇంకొక కవికి సాధ్యపడదేమో అన్నంతగా నన్నలరించాయి. జాషువాగారు పద్యరచనలో నాకు మార్గదర్శి. నేను భగవద్గీతను ఆటవెలదిలో అనువాదం చేశాను. మచ్చుకు గీతలోని అర్జున విషాద యోగం 17వ శ్లోకం గమనిస్తే –

    కాశ్యశ్చ పరమేష్వాసః శిఖండీ చ మహారథః |
    ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకి శ్చాపరాజితః

    ఘనమగు విలుఁ గలుగు కాశిరాజు శిఖండి-
    సాత్యకియు విరాట జనపతియును
    దళపతి ద్రుపదుపతి తనయుఁ డు తమతమ-
    దరములూద రవము దరముగొలిపె.

    అని వ్రాయడం జరిగింది.

  5. తానొకటి తలచిన… గురించి dv hanumantha rao అభిప్రాయం:

    01/12/2017 2:24 am

    చాలా బాగుంది, సుబ్రహ్మణ్యంగారు. సైంటిస్ట్ గారికి మరో సైంటిఫిక్ కూర అన్నమాట. సునందగారితో ఆగిపోయాయా ప్రయోగాలు, మరెవ్వరైనా చేసి రుచి చూపారా?

  6. ఐదు కవితలు: శివలెంక రాజేశ్వరీదేవి గురించి బొల్లోజు బాబా అభిప్రాయం:

    01/11/2017 7:58 am

    good review

  7. తెగులుకి శిక్ష గురించి విన్నకోట నరసింహారావు అభిప్రాయం:

    01/10/2017 12:28 am

    వేమూరి వెంకటేశ్వరరావు గారు టీవీ తెలుగు భాష మీద బాగానే పట్టు సాధించినట్లున్నారు. పైన వంటకం వండడం గురించి ఇచ్చిన వివరణ టీవీ వంటల కార్యక్రమానికి ఎంపిక చెయ్యదగినది. ఒక చిన్న సవరణ చేస్తే టీవీ కి మరింత అనుకూలంగా ఉంటుంది. “తయారు చేసే పద్ధతి” అన్నారు. దాన్ని ఎక్కువగా “ప్రోసెస్” అంటారు టీవీ వారు.

    తెలుగు టీవీ కార్యక్రమాల్లో (ముఖ్యంగా వంటల కార్యక్రమాల్లో) భాష – మాట్లాడే వాక్యంలో క్రియ తప్ప మిగిలిన పదాలన్నీ వీలయినంత వరకు ఇంగ్లీషువే అయ్యుండాలి అనే సూత్రానికి కట్టుబడుంది అనిపిస్తుంది. అలాగే వంటకం పేరు హిందీలో ఉంటే మరింత గొప్ప అనే తపన కనిపిస్తుంటుంది.

    “చరిత్ర ఎరుగని మహా పాతకము మా దేశానికి పట్టినదా” అని ఒక పాత సినిమాలోని పాట.

  8. తెగులుకి శిక్ష గురించి Rao Vemuri అభిప్రాయం:

    01/09/2017 12:28 pm

    అయ్యా శర్మ గారూ

    నేను “వేమూరివారి పాకశాస్త్రం“ అనే బ్లాగు నడపబోతున్నాను. మొట్టమొదట “మష్‌రూం ఫ్రై“ చెయ్యడం ఎలాగో నేర్పుదామని ఈ దిగువ బ్లాగు తయారు చేసేను. చిత్రగుప్తులవారు ఏమంటారో కనుక్కుని ముందుకి వెళ్లాలని నా కోరిక.

    ఇన్‌గ్రీడియంట్సు

    బాస్మతి రైస్ – 2 కప్స్

    మష్రూంస్ – 1 పేకెట్ (లేదా ప్యాకెట్)

    అనియన్స్ – 1

    క్యాప్సికం – 1 (లేదా కేప్సికం)

    బీన్స్ – 6

    జింజిర్-గార్లిక్ పేస్ట్ – 1 స్పూన్

    సోయా సాస్ – 1 స్పూన్

    టొమేటో పేస్ట్ – 1 స్పూన్

    క్యుమిన్ – 1 స్పూన్

    పెప్పర్ పౌడర్ – 1 స్పూన్

    ఆయిల్ – ½ కప్

    గార్లిక్ ఫ్లేక్స్ – 4

    జింజిర్ – స్మాల్ పీస్

    వాటర్ – సూటబుల్ ఎమౌంట్

    సాల్ట్ – సూటబుల్ ఎమౌంట్

    తయారు చేసే పద్ధతి:

    ఆయిల్ ని హీట్ చేసి, అందులో థరవ్‌గా వాష్ చేసి డ్రెయిన్ చేసిన బాస్మతీ రైస్‌ని త్రీ మినిట్స్ ఫ్రై చెయ్యాలి. అప్పుడు సూటబుల్ ఎమౌంట్ వాటర్ పోసి బోయిల్ చేసి రైస్ మెత్తబడేవరకూ కుక్ చెయ్యాలి. కుక్డ్ రైస్‌ని కూల్ చెయ్యాలి. అనదర్ డిష్ లో ఆయిల్ పోసి అందులో డైస్ చేసిన అనియన్ పీసెస్, క్యాప్సికం, బీన్స్ వేసి వన్ మినిట్ ఫ్రై చెయ్యాలి. ఆఫ్టర్‌వర్డ్స్ సోయ సాస్, టొమేటో పేస్ట్, పెప్పెర్ పౌడర్, సాల్ట్ ఏడ్ చేసి అప్పుడు డైస్ చేసిన మష్‌రూం పీసెస్ మిక్స్ చేసి ఫైవ్ మినిట్స్ ఫ్రై చెయ్యాలి. మష్రూం పీసెస్ సాఫ్‌ట్‌గా అయిన తరువాత కుక్ చేసి, కూల్ చేసిన రైస్ మిక్స్ చేసి టెన్ మినిట్స్ ఫ్లేమ్ మీద ఉంచి అప్పుడు సెర్వ్ చెయ్యాలి. చాల టేస్టీగా ఉంటుందీ డిష్. ట్రై చెయ్యండి.

    ట్రై చేసినందుకు థేంక్సండీ.

    ఆమ! దట్సిట్!

    వేమూరి వేంకటేశ్వరరావు

  9. ఒకనాటి యువ కథ: గోల గురించి కె.వి.గిరిధరరావు అభిప్రాయం:

    01/08/2017 9:33 pm

    అసలేముందీ కథలో?! ఒక సందేశం లేదు, పాడూ లేదు. సమాజానికి ఉపయోగపడే సమాచారమేమైనా ఉందా?!?! ఇలాంటి కథలు అసలెందుకు వ్రాస్తారో, పత్రికలోళ్లు ఎందుకు అచ్చేస్తారో అస్సలర్థం కాదు!

    వర్గ చైతన్యాన్నో, వాద పోరాటాన్నో, అస్తిత్వవాద సిద్ధాంత రహస్యాల్నో, అద్వైత చింతనా క్రాంత కాంతి కెరటాల్నో, వెన్నెల్నో మల్లెల్నో మందారాల్నో మకరందాల్నో వెల్లివిరిసే సుతిమెత్తని భావ ప్రకంపనాల్నో పుట్టించి జనాన్ని చైతన్య పరవశుల్ని చెయ్యాల్సిన తెలుగు కథ ఏమై పోతోందో అన్న బాధ ఎవరెస్టులా పెరుగుతుంది ఇలాంటి కథల్ని చదువుతుంటే!

    కనీసంలో కనీసం, భిన్నమైన కథనం తోనో, విభిన్న జానర్ (జానర్ అనగా డిటెక్టివ్, జానపదం, హారర్, జాగ్రఫీ, కొరియోగ్రఫీ, ఫోటోగ్రఫీ మొదలైనవి) లోనైనా లేదు ఈ’గోల’ కథ.

    ఎందుకిలాంటి కథలతో మా ఆసక్తిని చంపేస్తారు? ఈమాట వాళ్ళ కఠిన రివ్యూ ప్రాసెస్ నుంచీ ఈ కథ ఎలా తప్పించుకుంది? ఎంత పాత కథైనా, ఎప్పుడో అచ్చులో వచ్చినదైనా పునఃప్రచురించే ముందు మరోసారి తెలుగు కథాచట్రంలో ఒదుగుతుందో లేదో చూసుకుని అచ్చేయమని నా ప్రార్థన!

  10. తానొకటి తలచిన… గురించి Lalitha TS అభిప్రాయం:

    01/08/2017 4:57 pm

    మీ సైంటిఫిక్ వేపుడు, ‘హే కృష్ణా ముకుందా ము…’ – సెల్ ఫోన్ పాట – వీటితో పాటు కథ మొత్తం బహు బాగు 🙂