పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16469

  1. పెట్టని మొక్కు ఫలితం గురించి హెచ్చార్కె అభిప్రాయం:

    01/18/2017 3:20 am

    ఒక చిన్న సంఘటన. సంఘటన దాదాపు వ్యక్తిగతం, వృత్తిగతం అయినప్పటికీ. దాన్నుంచి ఒక పాఠం, సామాజిక పాఠం తీయడం చాల బాగుంది రాజిరెడ్డి గారు!. దాన్ని చెప్పిన తీరు మరింత బాగుంది.

  2. పాకశాలలో పాణినీయం గురించి భవభూతి అభిప్రాయం:

    01/17/2017 2:45 pm

    కథ బాగుంది.

    మా భట్టోజీ దీక్షితుణ్ణి పిలిస్తే ‘విందు వెన్నెల’ అని చక్కని ప్రకరణాల్తో విభజించి చెప్పేవాడుగా!

  3. పాకశాలలో పాణినీయం గురించి Harinath అభిప్రాయం:

    01/17/2017 9:38 am

    Hi Chandu,

    Nice story. Although I was an average student in my class and do not know much Telugu grammar and literature , but loved reading this story.

    Keep it up write more and more.

  4. పెట్టని మొక్కు ఫలితం గురించి A S Murthy అభిప్రాయం:

    01/17/2017 6:18 am

    నేనెప్పుడూ ఈ ఇంటర్వ్యూలు చదవలేదే అనుకున్నాను. తరువాత చూస్తే అవి సాక్షిలో అని తెలిసేక ఓహో అనుకున్నాను. ఆ పత్రిక నేను ఎప్పుడూ చదవలేదు. biased అని తెలిసి.

  5. జనవరి 2017 గురించి స్వాతికుమారి అభిప్రాయం:

    01/16/2017 5:39 am

    కొత్తరూపం అందంగా ఉంది. అభినందనలు.

  6. రాసక్రీడాష్టకము గురించి వేలూరి వేంకటేశ్వర రావు అభిప్రాయం:

    01/15/2017 7:42 pm

    Dear eemaata readers:

    I have been privately nitpicked by a scholarly friend.

    Frances Wilson is a SHE, not a He. I should have remembered it better than others since I had a secretary by the same first name for a number of years. I sincerely regret the gender error.

    Veluri Venkateswara Rao

  7. రాసక్రీడాష్టకము గురించి వేలూరి వేంకటేశ్వర రావు అభిప్రాయం:

    01/14/2017 9:52 pm

    జెజ్జాల కృష్ణమోహన రావు గారు అనువదించిన రాసక్రీడాష్టకం చదివాను.

    కర్ణామృతంలో చాలా శ్లోకాలు, అర్థం పట్టుపడకపోయినా, వ్యాఖ్యానం అంతుపట్టకపోయినా, పైకి గొంతెత్తి పాడుకోటానికి (చదువుకోటానికి) చాలా బాగా ఉంటాయని నా అభిప్రాయం. మీరు అన్నట్టు ఎందుచేతనో ఎవ్వరూ శ్రద్ధగా పాడి ‘రికార్డ్’ చెయ్యలేదు. తప్పుల తడకగా రకరకాల స్త్రోత్రాలు మాత్రం చేసిపెట్టారు.

    మీరు చేసిన అనువాదాలలో చాలా భాగం, సంస్కృత శ్లోకాలలాగా, గొంతెత్తి పాడుకోటానికి (చదువుకోటానికి ) సులువుగా ఉన్నాయి. ఉదాహరణకి, ‘అంగనా మంగనా’ అనువాదం అద్భుతంగా ఉన్నది.

    ‘కేకి కేకాదృతానేక…’ శ్లోకం లో అనువాద లోపం ఏమీ అగుపడలేదు కాని, అనువాదం పాడుకోడానికి సులువుగా కనిపించలేదు. మొదటిచరణంలో రెండు లఘువులు గొంతుక్కి అడ్డుపడుతున్నట్టనిపించింది. అలాగే ‘చారుచామీకరా భాస భామా విభు,’ శ్లోకంలో మొదటిచరణం చివర ‘పలు’ కొరకరానిదిగా వినిపించింది.

    మిగిలిన అనువాదాలన్నీ, నామటుకు నాకు, భేషుగ్గా కని(విని)పించాయి.

    మీ శ్రమ అభినందనీయము.

    అయితే ఏవిషయానికి ఆ విషయం చెప్పుకోవాలి. నాకున్న చందోజ్ఞానం సున్న అయితే, నాసంగీత జ్ఞానం అరసున్న. ఇకపోతే, అనువాదపటిమ విసర్గ అని ఒప్పుకోక తప్పదు.

    Frances Wilson translated all three SatakA-s into English. It is published by the University of Pennsylvania Press in 1975 as “The Love of Krishna.” Of course, he has paraphrased the SlOkA-s.

    వేలూరి వేంకటేశ్వర రావు.

  8. రాగలహరి: చక్రవాకం, మలయమారుతం, కళావతి గురించి Lakshmanna Vishnubhotla అభిప్రాయం:

    01/14/2017 7:26 am

    This is in rAgaM hiMdOLaM.

    Regards,

    Lakshmanna Vishnubhotla

  9. తానొకటి తలచిన… గురించి Naga Muralidhar namala అభిప్రాయం:

    01/13/2017 11:09 pm

    Stuffed egg plant curry అని మా ఇంటిలో చేసారు. పంపమంటారా గురూజీ

  10. భర్తృహరి అభాషితం గురించి A S Murthy అభిప్రాయం:

    01/13/2017 5:08 pm

    గొప్ప కథ.